Karthika Deepam 2 Weekly: శివన్నారాయణని ఎదిరించిన దీప.. పారు ట్రాప్‌లో శౌర్య, నలిగిపోతోన్న కార్తీక్

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు 529 నుంచి 534వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

డిసెంబర్ 1వ తేదీ 529వ ఎపిసోడ్‌లో..
కార్తీక్, కాంచనలతో మాట్లాడాలని ఇంటికి వచ్చిన శ్రీధర్‌కి కావేరి రావడంతో షాక్ తగిలినట్లుగా ఉంటుంది. దీప గర్భవతి కావడంతో ఆమె కోసం తాటి బెల్లంతో చేసిన సున్నుండలు చేసి తీసుకొచ్చానని చెబుతుంది కావేరి. కార్తీక్, దీపలు ఇంటికి వచ్చిన వెంటనే శ్రీధర్ క్లాస్ తీసుకుంటాడు. మీ నాన్న ఇంట్లో ఏం జరిగిందో తెలుసా... దీప కాలు జారి కిందపడపోయిందని, సమయానికి సుమిత్ర కనుక పట్టుకోకపోతే ఈరోజు అందరం ఏడవాల్సి వచ్చేదని చెబుతాడు శ్రీధర్. ఆ మాటలు విన్న కాంచన షాక్ అవుతుంది. నీ కోడలి మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా... ఇక నుంచి దీపను శివన్నారాయణ గారింటికి వెళ్లొద్దని చెప్పమంటాడు. భర్త మాటలతో సీరియస్ అయిన కాంచన.. రేపటి నుంచి కార్తీక్ ఒక్కడే పనికి వెళతాడు నువ్వు వెళ్లొద్దని దీపకి తేల్చిచెబుతుంది. దాంతో కార్తీక్, దీపలు బాధపడతారు. కాశీకి తన పీఏగా ఉద్యోగం ఇస్తాడు శ్రీధర్. అపాయింట్‌మెంట్ లెటర్ చూడగానే మామగారిపై సీరియస్ అవుతూ తాను ఆ ఉద్యోగం చేయనని తేల్చిచెబుతాడు. దాంతో కాశీని స్వప్న బ్లాక్‌మెయిల్ చేసి ఒప్పిస్తుంది.

డిసెంబర్ 2వ తేదీ 530వ ఎపిసోడ్‌లో..
శివన్నారాయణ గారింటికి వెళ్లొద్దని కాంచన మరోసారి కొడుకు కోడలికి క్లాస్ పీకుతుంది కాంచన. తల్లి, భార్యల మధ్యలో నలిగిపోతున్న కార్తీక్... దీపను ఓదార్చడానికి వస్తాడు. కానీ దీప చాలా కూల్‌గా ఉంటుంది. మావయ్య గారికి అత్తయ్యని ఎలా దారిలో తెచ్చుకోవాలో తెలియక నా విషయం బయటకు తీసుకొచ్చారని చెబుతుంది. దాంతో భార్యను దగ్గరకి తీసుకుని మురిసిపోతాడు కార్తీక్. ఇంతలో కాంచనకి పారిజాతం ఫోన్ చేసి చెప్పుడు మాటలు చెబుతుంది. శౌర్య నీ రక్తం కాదు, దానిని ఏ అనాధ శరణాలయంలోనో చేర్పించమని బ్రెయిన్ వాష్ చేస్తుంది. నాకు నువ్వు సున్నుండ పెట్టలేదని కాంచన మీద అలిగిన శౌర్య తన అమ్మానాన్నల దగ్గర పడుకుంటుంది. అయితే నిద్రపోతుండగా.. శౌర్య కాలు పొరపాటున దీప కడుపుకు తగలడంతో ఆమె నొప్పితో విలవిలలాడిపోతుంది. కొడుకు గది నుంచి ఏడుపు వినిపించడంతో కాంచన తలుపు కొడుతుంది. ఆసుపత్రికి తీసుకెళ్లమని కార్తీక్‌కు చెప్పగా .... నాకు నొప్పి తగ్గిపోయిందని దీప పంటిబిగువున భరిస్తుంది. కార్తీక్ ఎంత చెబుతున్నా ఆసుపత్రికి వెళ్లడానికి దీప ఒప్పుకోదు. భార్య పరిస్ధితి చూసి కార్తీక్ కంటతడి పెడతాడు.

Karthika deepam 2 Serial Weekly Episodes December 1st to December 6th Here is Highlights

Photo Courtesy: JioHotstar

డిసెంబర్ 3వ తేదీ 531వ ఎపిసోడ్‌లో..
కార్తీక్, దీపలు డ్యూటీ రాకపోవడంతో వాళ్లపై విసుక్కుంటుంది పారిజాతం. అది గమనించిన శివన్నారాయణ వెంటనే కార్తీక్‌కు ఫోన్ చేయగా అతను లిఫ్ట్ చేయడు. దాంతో కాంచనకి ఫోన్ చేస్తాడు. రాత్రి దీపకు కడుపులో నొప్పి రావడంతో వాళ్లిద్దరూ పడుకోలేదని చెబుతుంది కాంచన. ఆ మాట వినగానే భయపడ్డ శివన్నారాయణ.. వెంటనే సుమిత్ర, పారిజాతంలతో కలిసి డాక్టర్‌ను తీసుకుని కార్తీక్ ఇంటికి వస్తాడు. దీపని చెక్ చేసిన డాక్టర్.. మరోసారి ఇది రిపీట్ అయితే తల్లికి, బిడ్డకి చాలా కష్టమని వార్నింగ్ ఇస్తుంది. శౌర్యను నా దగ్గర పడుకోమంటే అది మీ దగ్గరకి వచ్చి ఇలా చేసిందని కాంచన మండిపడుతుంది. శౌర్య మనసు ముక్కలు చేసి కార్తీక్‌కు ప్రశాంతత లేకుండా చేయాలని డిసైడ్ అయిన పారిజాతం.. శౌర్య దగ్గరకి వెళ్లి చెప్పుడు మాటలు చెబుతుంది. మీ నానమ్మ మారిపోయిందని, మీ అమ్మకి బిడ్డ పుట్టబోతోంది కదా? మీ నానమ్మ ప్రేమంతా ఆ బిడ్డ మీదే ఉందని అంటుంది. నిన్ను బాగా చూసుకోవాలంటే నువ్వు అన్నింటికి అల్లరి చేయాలి, మారాం చేయాలి, ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టాలని చెబుతుంది పారిజాతం. ఆ మాటలతో శౌర్య ఆలోచనలో పడుతుంది. కాంచన, శౌర్యలు నా బుట్టలో పడిపోయారు.. ఇక కార్తీక్‌కి నరకమే అని సంబరపడిపోతుంది పారిజాతం.

డిసెంబర్ 4వ తేదీ 532వఎపిసోడ్‌లో..
జ్యోత్స్నని దశరథ తన కారులో దీప ఇంటికి తీసుకెళ్తుండగా నేను రానని మొండిపట్టు పడుతుంది. దాంతో దశరథ కారు దిగి కూతురికి ఐస్‌క్రీమ్ తినిపించి.. నా కూతురు ఒకప్పుడు ఎంతో సరదాగా, అల్లరి చేసేదని ఇప్పుడు ఆమె మనసు నిండా స్వార్ధం నిండిపోయిందని చెబుతాడు. పెళ్లి చేసుకుంటేనే నీ జీవితం బాగుంటుందని దశరథ చెప్పడంతో పెళ్లికి జ్యోత్స్న గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దాంతో దశరథ ఎంతో సంతోషిస్తాడు. శ్రీధర్‌ను క్షమించమని కాంచనను కోరగా.. నా ప్రాణాలు పోయే వరకు ఆయన చేసిన మోసాన్ని మరిచిపోనని కాంచన అంటుంది. ఆ మాటలతో శివన్నారాయణ కంటతడి పెడతాడు. ఇంతలో జ్యోత్స్న, దశరథలు కార్తీక్ ఇంటికి రావడంతో అందరూ షాక్ అవుతారు. దీప నా కూతురని ఆమెకు పుట్టింటి తరపున సారె తీసుకొచ్చామని దశరథ, సుమిత్రలు పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదిస్తారు. అలాగే రేపటి నుంచి నువ్వు మా ఇంటికి రానక్కర్లేదని సుమిత్ర చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. నువ్వు ఈ ఇంటికి వచ్చావేంటీ? అని జ్యోత్స్నని పారిజాతం అడగ్గా.. జరగబోయేది చూడమని తన నానమ్మకి చెబుతుంది జ్యోత్స్న.

Karthika deepam 2 Serial Weekly Episodes December 1st to December 6th Here is Highlights

Photo Courtesy: JioHotstar

డిసెంబర్ 3వ తేదీ 531వ ఎపిసోడ్‌లో..
ఎంత టైమ్ అవుతున్నా కార్తీక్, దీపలు డ్యూటీకి రాకపోవడంతో వాళ్లపై కారాలు మిరియాలు నూరుతుంది పారిజాతం. అది గమనించిన శివన్నారాయణ వెంటనే కార్తీక్‌కు ఫోన్ చేయగా అతను లిఫ్ట్ చేయడు. దాంతో కాంచనకి ఫోన్ చేస్తాడు. రాత్రి దీపకు కడుపులో నొప్పి వచ్చిందని కాంచన చెప్పడంతో శివన్నారాయణ.. వెంటనే సుమిత్ర, పారిజాతంలతో కలిసి డాక్టర్‌ను తీసుకుని కార్తీక్ ఇంటికి హుటాహుటిన బయల్దేరతాడు. దీపకి రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్.. అసలు సంగతిని తెలుసుకుంటుంది. ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదని కానీ మరోసారి రిపీట్ అయితే మాత్రం తల్లికి, బిడ్డకి చాలా కష్టమని వార్నింగ్ ఇస్తుంది. శౌర్యను నా దగ్గర పడుకోమంటే అది మీ దగ్గరకి వచ్చి దీప కడుపులో తన్నిందని కాంచన మండిపడుతుంది. ఇంతలో శౌర్య దగ్గరకి వెళ్లిన పారిజాతం పసిమనసును గాయపరుస్తుంది. మీ నానమ్మ, మీ నాన్న, మీ అమ్మ అందరూ మారిపోయారని... మీ అమ్మకి బిడ్డ పుట్టబోతోంది కదా? అందరికీ ఆ బిడ్డ మీదే ఉంటుందని నిన్ను పట్టించుకోరని నూరిపోస్తుంది. నిన్ను బాగా చూసుకోవాలంటే నువ్వు అన్నింటికి అల్లరి చేయాలి చెబుతుంది పారిజాతం. ఆ మాటలతో శౌర్య ఏడుస్తుంది.

డిసెంబర్ 4వ తేదీ 532వఎపిసోడ్‌లో..
జ్యోత్స్నని దశరథ తన కారులో దీప ఇంటికి తీసుకెళ్తుండగా నేను రానని కారు వేగంగా పోనిస్తుంది జ్యోత్స్న. దాంతో దశరథకి ఓ ఆలోచన వస్తుంది. వెంటనే కారు దిగి కూతురికి ఐస్‌క్రీమ్ తినిపించి కూల్ చేస్తాడు. నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం.. అది ఒకప్పుడు ఎంతో సరదాగా, అల్లరి చేసేదని ఇప్పుడు ఎవరు నూరి పోశారో కానీ ఆమె మనసు నిండా స్వార్ధం నిండిపోయిందని చెబుతాడు. పెళ్లి చేసుకుంటేనే నీ జీవితం బాగుంటుందని దశరథ చెప్పడంతో పెళ్లికి జ్యోత్స్న గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దాంతో దశరథ ఎంతో సంతోషిస్తాడు. వెంటనే ఈ విషయాన్ని నాన్నకి ఫోన్ చేసి చెబుతానని అనగా.. ఇంటిలో సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకుందామని తండ్రిని ఆపుతుంది జ్యోత్స్న. శ్రీధర్‌ను క్షమించి తిరిగి మీరిద్దరూ ఒక్కటి కావాలని కాంచనను అడుగుతాడు శివన్నారాయణ. నా ప్రాణాలు పోయే వరకు ఆయన చేసిన మోసాన్ని మరిచిపోనని కాంచన కరాఖండీ తేల్చేస్తుంది. ఆ మాటలతో శివన్నారాయణ వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఇంతలో జ్యోత్స్న, దశరథలు కార్తీక్ ఇంటికి రావడంతో అందరూ షాక్ అవుతారు. దీపకి దశరథ, సుమిత్రలు సారె పెట్టి ఆశీర్వదిస్తారు. ఈ శుభ సమయంలో నీకొక గుడ్‌న్యూస్ చెబుతున్నాం.. రేపటి నుంచి నువ్వు మా ఇంటికి రానక్కర్లేదని సుమిత్ర చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు.

Photo Courtesy: JioHotstar

డిసెంబర్ 5వ తేదీ 533వ ఎపిసోడ్‌లో..
దీప మనింటికి రాకుండా ఇక్కడే ఉంటే నేను దాని కడుపులోని బిడ్డను చంపడం కుదరదని ఎలాగైనా అది ఇంటికి వచ్చేలా చేయమని పారిజాతంను అడుగుతుంది జ్యోత్స్న. మనవరాలి కోసం అప్పటికప్పుడే కథ అల్లేస్తుంది పారిజాతం. మా ఇంట్లో అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయి.. ఏం కావాలన్నా వెంటనే దొరుకుతుందని మా ఇంటికే వచ్చేయమని దీపతో పారిజాతం అంటుంది. అయితే కార్తీక్ కూడా నిర్ణయం దీప మీద వదిలేయడంతో అందరూ షాక్ అవుతారు. సుమిత్ర- దశరథలకు దూరంగా ఉండటం భరించలేని దీప.. మా బావ ఎక్కడుంటే అక్కడే ఉంటానని చెబుతుంది. అయితే నువ్వు కూడా మా ఇంటికి రావొద్దని కార్తీక్‌కి చెబుతాడు శివన్నారాయణ. దీప ప్రెగ్నెంట్ కాబట్టి ఆమె విషయం నాకు అనవసరం.. కానీ నువ్వు మాత్రం నా పర్మిషన్ లేకుండా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని కార్తీక్‌కి తేల్చి చెబుతుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్ నేను ఇంటికి వస్తానని చెబుతాడు. నీ ఇష్టం వచ్చినట్లే చేయమని శివన్నారాయణ కుటుంబం వెళ్లిపోగానే కొడుకు కోడలికి క్లాస్ తీసుకుంటుంది కాంచన. నీకు ఒక బిడ్డ ఉంది కాబట్టి.. ఈ బిడ్డ ఉంటే ఎంత? పోతే ఎంత అన్నట్లుగా ప్రవర్తిస్తున్నావని కాంచన నానామాటలు అనడంతో దీప బాధపడుతుంది.

డిసెంబర్ 6వ తేదీ 534వ ఎపిసోడ్‌లో..
నువ్వు కూతురికి చెప్పుకోలేవు.. భార్యకు చెప్పుకోలేవని కార్తీక్‌పై మండిపడుతుంది కాంచన. నా చెల్లెలు ఎందుకలా చెబుతుందో ఒకసారి ఆలోచించమని దీపకి సలహా ఇస్తుంది అనసూయ. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకోవడంతో శివన్నారాయణ ఫ్యామిలీ సంతోషిస్తుంది. మీరు నన్ను ఎలా బయటికి పంపాలో తెలియక పెళ్లి పేరుతో గెంటేస్తున్నారని మండిపడుతుంది జ్యోత్స్న. మీరు కాంచన అత్తయ్య కోసం ఏమైనా చేసుకోండి.. కానీ ఆ దీప కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారని ఫైర్ అవుతుంది. దీప కడుపులోని బిడ్డపై కాంచనకి ఓ నమ్మకం ఉంది.. నా కూతురి కోడలి కోసం నేను ఏమైనా చేస్తానని తేల్చిచెబుతాడు శివన్నారాయణ. జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ సుమిత్ర, దశరథలు బాధపడతారు. కార్తీక్ ఉన్నంత వరకు మన రెండు కుటుంబాలకు ఏం కాదని సుమిత్రకు ధైర్యం చెబుతాడు దశరథ. సుమిత్రకు కళ్లు తిరిగినట్లుగా ఉండటంతో దశరథ టెన్షన్ పడతాడు. శౌర్యను నానమ్మ దగ్గర పడుకోమని చెప్పడంతో కార్తీక్‌పై కోప్పడుతుంది చిన్నారి. అంతా జో గ్రానీ చెప్పినట్లుగానే జరుగుతుందని శౌర్య నోరుజారడంతో ఏం జరిగిందో కార్తీక్‌కి అర్ధమవుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X