Karthika Deepam 2 Weekly: శ్రీధర్‌పై పగ తీర్చుకున్న కాశీ... జ్యోత్స్నకి చెక్ పెట్టే పనిలో కార్తీక్

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీ నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు 547 నుంచి 552వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

డిసెంబర్ 22వ తేదీ 547వ ఎపిసోడ్‌లో..
శ్రీధర్ అరెస్ట్ అయిన వీడియోను కాంచనకు పంపిస్తుంది పారిజాతం. నా భర్త పరువు తీయాలని మీ ఫ్యామిలీ అంతా డిసైడ్ అయ్యిందా? నువ్వు, నీ భర్త, నీ కొడుకు, నీ కోడలు మాట తప్పడమే పనిగా పెట్టుకున్నారా అని నానామాటలు అంటుంది పారిజాతం. ఆమె అన్న మాటలకు కాంచన కంటతడి పెడుతుంది. కిచెన్‌లో వంట చేసుకుంటున్న దీపని కూడా వదలకుండా పారిజాతం, జ్యోత్స్నలు మాటలతో వేధిస్తారు. వైరాకి జ్యోత్స్న కాల్ చేసి థ్యాంక్స్ చెబుతుంది. నేను సీఈవో అయిన వెంటనే నా కంపెనీలో 50 శాతం షేర్స్ మీకే ఇస్తానని అంటుంది. నేను సీఈవో అయ్యాకా.. ఆ వైరా గాడిని, కాశీ గాడిని విసిరి పారేస్తానని అనుకుంటుంది. పోలీస్ స్టేషన్‌‌లో ఉన్న శ్రీధర్ దగ్గరికి కార్తీక్, శివన్నారాయణలు విడిపించడానికి వెళ్తారు. అయితే స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదని, హాస్పటల్‌లో కొందరు చావుబతుకుల్లో ఉన్నారని చెబుతాడు ఎస్ఐ. అలాగే శ్రీధర్‌తో మాట్లాడిన మాటల తాలూకా ఆడియో క్లిప్‌ను కాశీ ఇవ్వడంతో కార్తీక్, శివన్నారాయణలు షాక్ అవుతారు. కాశీని ఏమి అనొద్దని కార్తీక్‌తో చెబుతాడు శ్రీధర్.

డిసెంబర్ 23వ తేదీ 548వ ఎపిసోడ్‌లో..
శ్రీధర్ అరెస్ట్ కావడం, బెయిల్ ఇవ్వకపోవడం, కార్తీక్ తనను అనుమానిస్తూ ఉండటంతో కాశీ వణికిపోతాడు. నాకు చాలా భయంగా ఉందని వైరాకి ఫోన్ చేసి చెబుతాడు. అలాంటిదేమీ ఉండదని, నిన్ను చెప్పులా చూసిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకున్నావని అంటాడు వైరా. త్వరగా వచ్చి నా కంపెనీలో జీఎంగా జాయిన్ అవ్వమని చెబుతాడు. ఇంతలో కార్తీక్ వెనుక నుంచి పట్టుకోవడంతో కాశీకి ముచ్చెమటలు పడతాయి. పనిగట్టుకుని మా నాన్న కాల్స్ ఎందుకు రికార్డ్ చేసి పోలీసులకు ఇచ్చావు అని నిలదీస్తాడు కార్తీక్. దాంతో ఏం చెప్పాలో తెలియక.. నాకు తెలిసింది పోలీసులకు ఇచ్చానని చెప్పి వెళ్లిపోతాడు. కార్తీక్, శివన్నారాయణలు ఇంటికి రాగా.. మావయ్య గారు ఎక్కడ అని అడుగుతుంది దీప. హాస్పటల్‌లో కొందరు చావు బతుకుల్లో ఉన్నారు.. వాళ్లు సేవ్ అయితేనే నాన్నకి బెయిల్ ఇస్తారని కార్తీక్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. శ్రీధర్ విషయంపై శివన్నారాయణ ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా.. జ్యోత్స్న రెస్టారెంట్స్‌పై ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ రైడ్ చేసిందని, భారీగా ఫైన్ వేసిందని మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి చెబుతాడు. దాంతో శ్రీధర్‌ని పారిజాతం, జ్యోత్స్నలు నానామాటలు అంటారు.

Karthika deepam 2 Serial Weekly Episodes December 22nd to December 27th Here is Highlights

Photo Courtesy: JioHotstar

డిసెంబర్ 24వ తేదీ 549వ ఎపిసోడ్‌లో..
శ్రీధర్‌పై నాకు అనుమానం లేదు.. అలాగని నమ్మకం కూడా లేదని శివన్నారాయణ అనడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. మన కంపెనీని ఈ స్థితికి తీసుకొచ్చేందుకు కారణమైంది ఇంట్లో వాళ్లయినా సరే, బయటి వాళ్లయినా సరే క్షమించే ప్రసక్తే లేదని శివన్నారాయణ వార్నింగ్ ఇవ్వడంతో అంతా వణికిపోతారు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికొచ్చిన కాశీని గుమ్మంలోనే కడిగిపారేస్తారు కావేరి, స్వప్న. నీ కారణంగా మా నాన్న జైలుకి వెళ్లాడని, నిన్ను గొప్ప స్థితిలో చూడాలనుకున్న వ్యక్తిపై ద్వేషం నింపుకున్నావని చీవాట్లు పెడుతుంది. ఆసుపత్రికి వెళ్లిన అమ్మానాన్న ఇంటికి రాకపోవడంతో దీప టెన్షన్ పడుతుంది. కన్న కూతురిని నాకే ఏం లేదు, పనిమనిషివి మా అమ్మానాన్నల గురించి నీకెందుకు అని మండిపడుతుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ వచ్చి.. అత్తయ్య మావయ్యలు దీపను సొంత కూతురిలాగే చూసుకుంటున్నారని అంటాడు. ఇంతలో దశరథ, సుమిత్రలు ఇంటికొస్తారు. శ్రీధర్ అరెస్ట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ రైడ్ గురించి కొడుక్కి చెబుతాడు శివన్నారాయణ. శ్రీధర్ బావ ఏ తప్పూ చేసుండడని దశరథ అనడంతో జ్యోత్స్న రగిలిపోతూ నానామాటలు అంటుంది. నా తండ్రి ఏ తప్పూ చేయలేదు.. అసలేం జరిగిందో నేను కనుక్కుంటానని కార్తీక్ సవాల్ విసరడంతో జ్యోత్స్న వణికిపోతుంది.

డిసెంబర్ 25వ తేదీ 550వ ఎపిసోడ్‌లో..
సుమిత్రకు అంతా బాగానే ఉందని రిపోర్ట్స్ రావడం లేట్ అవుతుందని కార్తీక్‌కి చెబుతాడు దశరథ. నిజం చెప్పమని కార్తీక్ నిలదీయగా.. ఆసుపత్రిలో డాక్టర్ గారు చెప్పిన విషయాన్ని కార్తీక్‌‌తో అంటాడు. ఎప్పుడు ఏం వినాల్సి వస్తోందని భయంగా ఉందని చెబుతాడు. వీరి మాటల్ని గుట్టుగా విన్న దీప.. కార్తీక్ దగ్గర బాధపడుతుంది. కాంచనకి కావేరి ఫోన్ చేసి శ్రీధర్ అరెస్ట్ అయిన విషయం గురించి మాట్లాడుతుంది. పోలీస్ స్టేషన్‌లో ఉన్నా ఆయన నీ గురించే ఆలోచిస్తూ ఉంటారని చెబుతుంది కావేరి. స్టేషన్‌కి వెళ్లి ఒక్కసారైనా ఆయనని పలకరించి రమ్మని అంటుంది. ఇంతలో శౌర్య వచ్చి నానమ్మని పోలీస్ స్టేషన్‌లో ఉన్న తాతయ్య దగ్గరికి తీసుకెళ్లమని కార్తీక్‌తో అంటుంది. తన కోసం ఎవ్వరూ రారని ఒంటరిగా శ్రీధర్ బాధపడుతుండగా.. కార్తీక్, కాంచనలు రావడంతో ఎంతో సంతోషిస్తాడు. నువ్వు నన్ను క్షమించేసినట్లేనని శ్రీధర్ చెప్పగా.. నేను కార్తీక్ తల్లిగానే ఇక్కడికి వచ్చానని కాంచన చెప్పడంతో శ్రీధర్ కంటతడి పెడతాడు. అది చూసిన కార్తీక్ తన తండ్రికి భోజనం తినిపిస్తాడు.

Karthika deepam 2 Serial Weekly Episodes December 22nd to December 27th Here is Highlights

Photo Courtesy: JioHotstar

డిసెంబర్ 26వ తేదీ 551వ ఎపిసోడ్‌లో..
నేను నీ భార్యగా కాకుండా కార్తీక్ భార్యగా వచ్చానని కాంచన చెప్పడంతో శ్రీధర్ కంటతడి పెడతాడు. చేయని తప్పుకి కుంగిపోతున్న నా తండ్రికి ఓదార్పుగానైనా నీకోసమే వచ్చానని చెప్పొచ్చుగా అని బాధపడతాడు కార్తీక్. ఇంటికొచ్చిన కార్తీక్, కాంచనలను మావయ్య గారు ఎక్కడ అని దీప ప్రశ్నిస్తుంది. నాన్నకి బెయిల్ రాకపోవడంతో ఇంకా స్టేషన్‌లోనే ఉంచారని చెబుతాడు కార్తీక్. భోజనం దగ్గర కాశీ- స్వప్నలకు షాక్ గొడవ జరుగుతుంది. మా నాన్న మీద నీకు ఎంత కోపం లేకపోతే ఆయన మీద సాక్ష్యం చెబుతావని మండిపడుతుంది. కుటుంబం గురించి, బంధాల గురించి నీకు తెలియదని కాశీపై ఫైర్ అవుతుంది. ఆ వెంటనే వైరాకి కాశీ ఫోన్ చేసి నాకు జీఎం పోస్ట్ కావాలని అడుగుతాడు. రేపే వచ్చి జాయిన్ అయిపో.. జాయినింగ్ బోనస్ కింద ఇస్తానన్న 10 లక్షల రూపాయల్లో 5 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫన్ చేస్తున్నట్లు చెబుతాడు వైరా. ఆ మెసేజ్‌ని స్వప్నకి చూపించి ఇది నా రేంజ్.. పెద్ద కంపెనీలో జీఎంగా జాయిన్ అవుతున్నా, త్వరలోనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోదామని చెబుతాడు. ఆ మాటలతో కంగారుపడిన స్వప్న వెంటనే పరిగెత్తుకుంటూ కార్తీక్ దగ్గరకి వెళ్తుంది. నాన్న అరెస్ట్‌కు, కాశీ ఉద్యోగానికి ఏదో సంబంధం ఉందని డౌట్ పడుతుంది స్వప్న.

డిసెంబర్ 27వ తేదీ 552వ ఎపిసోడ్‌లో..
కాశీ ప్రవర్తన వింతగా ఉందని పగ తీర్చుకున్నవాడిలా మాట్లాడుతున్నాడని స్వప్న చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. అర్ధరాత్రి పూట నువ్వు వచ్చేశావని స్వప్నని ఇంటి దగ్గర దించుతాడు కార్తీక్. అక్కడ కాశీ మాటలుతో కార్తీక్‌కి అనుమానం వస్తుంది. ఇంటికొచ్చాక కాశీ- జ్యోత్స్నల వెనుక ఎవరో ఉన్నారని దీపతో అంటాడు కార్తీక్. వాళ్లెవరో కనిపెట్టి నాన్నని బయటకు తీసుకురావాలని చెబుతాడు. శ్రీధర్‌ని అరెస్ట్ చేయించింది, కంపెనీలో ఫుడ్ పాయిజిన్ చేయించింది జ్యోత్స్నే అని తెలియడంతో పారిజాతంకు చెమటలు పడతాయి. నువ్వు చేసిన పని వల్ల నా మనవడి జీవితం నాశనమైందని అంటుంది. దాంతో కాశీకి ఫోన్ చేసి మాట్లాడిస్తుంది జ్యోత్స్న. నీ వల్లే నాకు మంచి జాబ్, శాలరీ వస్తున్నాయని కాశీ అనడంతో పారిజాతం పొంగిపోతుంది. ఉదయాన్నే జ్యోత్స్న, పారిజాతంలు మాట్లాడుకుంటూ ఉండగా కాశీ వచ్చి మా నాన్నని అరెస్ట్ చేయించడం వెనుక ఎవరున్నారో తెలిసిపోయిందని కార్తీక్ చెబుతాడు. ఆ మాటలతో ఇద్దరూ వణికిపోతాడు. జ్యోత్స్న గదిలో సీక్రెట్ కెమెరా ఫిక్స్ చేస్తుంది దీప. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X