Karthika Deepam 2 Weekly: శ్రీధర్ విడుదల.. బ్లడ్ క్యాన్సర్ బారినపడ్డ సుమిత్ర, కుమిలిపోతోన్న కార్తీక్

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా డిసెంబర్ 29వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు 553 నుంచి 558వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

డిసెంబర్ 29వ తేదీ 553వ ఎపిసోడ్‌లో..
శ్రీధర్ అరెస్ట్, కాశీకి ఉద్యోగం వెనుక జ్యోత్స్న ప్రమేయం గురించి తెలుసుకోవడానికి జ్యోత్స్న గదిలో కెమెరా పెడుతుంది దీప. దానిని గమనించిన జ్యోత్స్న... వైరాకి కాల్ చేసి కట్ చేస్తుంది. వెంటనే వైరా కాల్ చేయడంతో అతనితో అస్సలు సంబంధం లేనట్లుగా మాట్లాడుతుంది. ఆ మాటలతో వైరా షాక్ అవుతాడు. జ్యోత్న్స మాటలను విన్న కార్తీక్‌కి అనుమానం వస్తుంది. నాన్న అరెస్ట్‌కి, కాశీకి వైరా దగ్గర ఉద్యోగానికి జ్యోత్స్నకి సంబంధం ఉందని దీపతో చెబుతాడు. నేరుగా కాశీని కలిసి నిలదీయగా అతను సంబంధం లేకుండా మాట్లాడటంతో లాగిపెట్టి కొడతాడు కార్తీక్. కూతురి నుంచి ప్రేమ లేక, సుమిత్ర హెల్త్ విషయంగా బాధపడుతున్న దశరథని దీప ఓదారుస్తుంది.

డిసెంబర్ 30వ తేదీ 554వ ఎపిసోడ్‌లో..
సుమిత్రమ్మ గారికి ఏం కాదని దీప ఓదారుస్తుండగా సుమిత్ర వచ్చి నా ఆరోగ్యానికి ఏం కాలేదు.. మీ చిన్నయ్య గారికి ఏమైందో కనుక్కోమని చెబుతుంది సుమిత్ర. వైరా ఇంటికి కాశీతో కలిసి వెళ్లిన కార్తీక్.. అతనికి బుద్ధి చెప్పి శివన్నారాయణ ఇంటికి తీసుకొచ్చి మీడియాని పిలిపిస్తాడు. జ్యోత్స్న రెస్టారెంట్స్ ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఈ వైరా ఇదంతా చేయించాడని చెబుతాడు కార్తీక్. ఇదంతా చేయించింది జ్యోత్స్నే అని వైరా చెప్పడంతో ... జ్యోత్స్న గతంలో వైరాతో మాట్లాడిన మాటలను ఫోన్‌లో వినిపించి తప్పించుకుంటుంది. దాంతో అసలు జ్యోత్స్నకి ఇందులో సంబంధం ఉందా? లేదా అని కాశీని కార్తీక్ నిలదీస్తాడు. అతను కూడా జ్యోత్స్నకి ఇందులో సంబంధం లేదని చెప్పడంతో ఆమె ఊపిరి పీల్చుకుంటుంది. ఇంటి పరువు, కంపెనీ పరువు కాపాడినందుకు కార్తీక్‌ని శివన్నారాయణ మెచ్చుకుంటాడు.

Karthika deepam 2 Serial Weekly Episodes December 29th to january 3rd Here is Highlights

Photo Courtesy: JioHotstar

డిసెంబర్ 31వ తేదీ 555వ ఎపిసోడ్‌లో..
తన తండ్రిని విడిపించడానికి వెళ్తూ దారిలో జ్యోత్స్నకి క్లాస్ పీకుతాడు కార్తీక్. దమ్ముంటే నేనేం చేశానో నిరూపించమని సవాల్ విసురుతుంది. మా నాన్న సీఈవో అయినప్పటి నుంచి నేటి వరకు జరిగిన ప్రతి ఉదంతం తాలూకూ లెక్కలు నేను తీయగలను. కానీ నీకు ఏమైనా జరిగితే సుమిత్ర అత్త తట్టుకోలేదు. ఆవిడని చూసి నేను మౌనంగా ఉండిపోతున్నానని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్నకి చెమటలు పడతాయి. పోలీస్ స్టేషన్‌లో శ్రీధర్‌ను విడిపిస్తారు కార్తీక్, జ్యోత్స్న. తనను జైళ్లో వేసినందుకు జ్యోత్స్నపై రగిలిపోతాడు వైరా. జైలు నుంచి వస్తూ కాశీతో మాట్లాడిన శ్రీధర్.. నిన్ను జీవితంలో క్షమించనని అంటాడు. ఇంటికి కాశీ రాకపోవడంతో మనవడి కోసం టెన్షన్ పడుతుంది పారిజాతం. శ్రీధర్‌కు కార్తీక్ ఉన్నాడు.. మరి నా మవనడికి దిక్కెవరు? అని ప్రశ్నిస్తుంది పారిజాతం. తప్పు చేసినవాడికి శిక్ష తప్పదని, ఇకపై ఇంటి గుమ్మం కూడా తొక్కనీయనని శివన్నారాయణ సీరియస్ అవుతాడు. శ్రీధర్ వల్లే నా మనవడు ఇలా అయిపోయాడని పారు మండిపడుతుంది. కాశీని మావయ్య గారు కన్న తండ్రిలా దారిలో పెట్టాలని చూశారని కానీ ఆయనను మోసం చేశాడని దీప చెబుతుంది.

జనవరి 1వ తేదీ 556వ ఎపిసోడ్‌లో..
నీ వల్ల నా మనవడు జైలు పాలయ్యాడని జ్యోత్స్నని లాగిపెట్టి కొడుతుంది పారిజాతం. నీ పాపాలపుట్ట ఎక్కడ బయటపడుతుందోనని వాడిని బలిచేశావని ఫైర్ అవుతుంది. నేను నా తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాను, కానీ కార్తీక్ బావ, దీప కలిసి కాశీని జైళ్లో పడేశారని పారిజాతాన్ని జ్యోత్స్న రెచ్చగొడుతుంది. జైళ్లో ఉన్న వైరా రగిలిపోతాడు.. నన్ను జైలు పాలు చేసినవాడిని కూడా జైల్లోకి తోస్తానని తన అసిస్టెంట్‌తో చెప్పగా మా బావ జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు కాశీ. సుమిత్ర రిపోర్ట్స్ వచ్చాయని, మీరొక్కరే ఆసుపత్రికి రావాలని డాక్టర్ ఫోన్ చేసి చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. శ్రీధర్ జైలు నుంచి విడుదల కావడంతో కార్తీక్ ఇంటికి శ్రీధర్, స్వప్న, కావేరిలు భోజనానికి వస్తారు. నా నిర్ణయం వల్ల, నేను కాశీని పెళ్లి చేసుకోవడం వల్ల మీ అందరూ బాధపడ్డారని ఏడుస్తుంది స్వప్న. కాశీ తప్పు చేశాడు కాబట్టే నువ్వు క్షమించనని చెబుతున్నావు కదా అని శ్రీధర్‌ను చూస్తూ అంటుంది కాంచన. ఆ మాటలు విన్న కార్తీక్ షాక్ అవుతాడు.

Karthika deepam 2 Serial Weekly Episodes December 29th to january 3rd Here is Highlights

Photo Courtesy: JioHotstar

జనవరి 2వ తేదీ 557వ ఎపిసోడ్‌లో..
కార్తీక్‌ను తీసుకుని ఆసుపత్రికి వస్తాడు దశరథ. నా భార్య రిపోర్ట్స్ వచ్చాయా? నన్ను ఒక్కడినే ఎందుకు రమ్మని పిలిచారు? ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? అని దశరథ బాధపడుతూ ఉండటంతో డాక్టర్ అతనిని బయటకు వెళ్లి టెస్టులు చేయించుకోమని చెబుతుంది. కాశీని ఎలా బయటకు తీసుకొస్తావని జ్యోత్స్నని అడిగిన పారిజాతం.. దీపని కొట్టాలి, తిట్టాలని కాఫీ తీసుకురమ్మని చెప్పి కాఫీ కప్పు పగులగొడుతుంది. దీపపై చెయ్యేత్త బోతుండగా శివన్నారాయణ వచ్చి పారుపై సీరియస్ అవుతాడు. కాఫీ కప్ నువ్వే శుభ్రం చేయాలంటూ పనిష్‌మెంట్ ఇస్తాడు. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అని ఆవిడని ట్రీట్‌మెంట్‌కి తీసుకొస్తే నయం చేయడానికి వీలుందని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ బాధపడతాడు. ఇంట్లో వాళ్లకి ఎలా చెప్పాలో తెలియక ఆలోచిస్తుంటాడు. ఇంతలో దశరథ వచ్చి నా భార్యకు ఏమైందని అడగ్గా.. ఏం కాలేదని అత్తకి చిన్న టెస్టులు రాసి మందులు ఇచ్చారని చెబుతాడు కార్తీక్.

జనవరి 3వ తేదీ 558వ ఎపిసోడ్‌లో..
కాశీ అరెస్ట్ కావడానికి తానే కారణమని కాంచన అన్న మాటలతో శ్రీధర్ బాధపడతాడు. ఇంతలో స్వప్న రావడంతో నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు. తండ్రి ఒడిలో పడుకుని స్వప్న ఏడుస్తుంది. మనిషి మీద మనం పెట్టుకున్న నమ్మకం, మనం మోయలేనంత బరువుగా ఉంటుందని అన్నయ్య ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు. అది కాశీ దించేసుకున్నాడు.. నువ్వు మోస్తూనే ఉన్నావని చెబుతుంది స్వప్న. తండ్రి, కూతుళ్ల మాటలు విన్న కావేరి కూడా బాధపడుతుంది. కార్తీక్, దశరథలు ఆసుపత్రి నుంచి రావడంతో ఏం జరిగింది? రిపోర్ట్స్ ఎలా వచ్చాయని అడుగుతుంది దీప. కార్తీక్ మౌనంగా లోపలికి వెళ్లిపోవడంతో దీపకి అనుమానం వస్తుంది. దశరథ, సుమిత్రలకు టెస్టులు చేయించిన విషయం తెలుసుకున్న శివన్నారాయణ.. ఒకసారి రిపోర్ట్స్ ఇవ్వమని అడగ్గా కార్తీక్ ఏదేదో చెబుతాడు. ఆ వెంటనే సుమిత్ర పాయసం తీసుకొచ్చి మేనల్లుడికి తినిపిస్తుంది. నా మనవడిని బాధపెట్టి మీరెంత కాలం సంతోషంగా ఉంటారో నేను కూడా చూస్తానని పారు మనసులో అనుకుంటుంది. మరోవైపు.. జ్యోత్స్న చేసిన మోసం తాలూకా ఫైల్స్ కనిపించకపోవడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. నెక్ట్స్ ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X