Karthika Deepam 2 Weekly: దీప మొదటి భర్తపై జ్యోత్స్న వ్యాఖ్యలు... చావు అంచుల్లో సుమిత్ర
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా డిసెంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు 535 నుంచి 540వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
డిసెంబర్ 8వ తేదీ 535వ ఎపిసోడ్‌లో..
తాను వద్దు అంటున్నా శివన్నారాయణ గారింటికి వెళ్తానన్న దీపపై కాంచన మండిపడుతుంది. ఇంట్లో ఉంటే ఈ అవిటి దానికి సేవలు చేయాల్సి వస్తుందని నువ్వు అనుకుంటున్నావా? నా పనులు నేను చేసుకోగలను అని కసురుకుంటుంది. ఆ మాటలతో దీప అత్తగారి కాళ్లు పట్టుకుంటుంది. నేను శివన్నారాయణ గారింటికి వెళ్లడానికి ఒక బలమైన కారణం ఉంది.. అది ఇప్పుడు చెప్పలేను, కానీ మేం చేసినదానికి మీరు సంతోషిస్తారని అంటుంది దీప. కోడలి మాటలతో మెత్తబడ్డ కాంచన.. శివన్నారాయణ గారింటికి వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అమ్మ కడుపు మీద కొట్టడంతో దీపకి శౌర్య సారీ చెప్పి ఇకపై నేను నానమ్మ దగ్గరే పడుకుంటానని చెబుతుంది. శివన్నారాయణ గారింట్లో మీరిద్దరూ జాగ్రత్తగా ఉండమని కొడుకు కోడలికి చెబుతుంది కాంచన. నీ కోడలికి, నీ మనవరాలిని కంటికి రెప్పలా కాపాడతానని చెబుతాడు కార్తీక్.
డిసెంబర్ 9వ తేదీ 536వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకోవడంతో షాపింగ్‌కి ఎప్పుడు వెళ్దామని సెటైర్లు వేస్తుంది పారిజాతం. కేవలం మా నాన్న కోసమే ఒప్పుకున్నానని చెప్పడంతో పారు షాక్ అవుతుంది. ఉదయాన్నే కార్తీక్, దీపలు శౌర్యను వెంటబెట్టుకుని వస్తారు. అయితే తన ముద్దుల తాత దగ్గరికి కాకుండా పారిజాతం దగ్గరికి వెళ్లి ఆమెను శౌర్య గట్టిగా హత్తుకోవడంతో అంతా అవాక్కవుతారు. అంతలా జో గ్రానీ నీకు ఎందుకు నచ్చింది? ఏం చెప్పిందని శివన్నారాయణ అడుగుతాడు. దాంతో మా ఇంటికి వచ్చిన జో గ్రానీ ఏం చెప్పిందో అన్ని పాఠం చెప్పినట్లు చెబుతుంది. ఆ మాటలు వినగానే శివన్నారాయణ రగిలిపోతాడు. ఈరోజు దీపకి బదులు పారు పనిమనిషిగా ఉంటుందని పనిష్మెంట్ ఇస్తాడు. సాయంత్రం గుడికి వెళ్దామని త్వరగా ఇంటికి వచ్చేయమని కాశీని అడుగుతుంది స్వప్న. కానీ పనులున్నీ పూర్తయ్యే వరకు పంపనని శ్రీధర్ తేల్చిచెప్పడంతో స్వప్న మండిపడుతుంది.

Photo Courtesy: JioHotstar
డిసెంబర్ 10వ తేదీ 537వ ఎపిసోడ్‌లో..
శ్రీధర్ దగ్గర కాశీ పీఏగా చేరినట్లు తెలుసుకున్న జ్యోత్స్న, పారిజాతంలు షాక్ అవుతారు. మా పర్మిషన్ లేకుండా ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని జ్యోత్స్న నిలదీస్తుంది. సీఈవోకి ఎవరినైనా అపాయింట్ చేసుకోవచ్చని కంపెనీ రూల్స్ చెబుతున్నాయని కౌంటర్ వేస్తాడు కార్తీక్. ఈ విషయం నాకు ముందే చెప్పాడని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న నోరు మూసుకుంటుంది. శ్రీధర్ ప్రెజేంటేషన్ నాకు నచ్చలేదని, ఫుడ్ ట్రాక్స్ వర్కవుట్ కావని చెబుతుంది జ్యోత్స్న. దాంతో దీప రంగంలోకి దిగి కొత్త ప్లాన్ చెబుతుంది. దానికి అందరూ చప్పట్లు కొట్టడంతో జ్యోత్స్న, పారులు రగిలిపోతారు. ఇలాంటి బిజినెస్ స్ట్రాటజీలు రక్తంలో ఉండాలని ... ఊరికే వచ్చేయవని చెబుతాడు శివన్నారాయణ. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీప లాంటి భార్య దొరికినందుకు నాకు గర్వంగా ఉందని అంటాడు కార్తీక్. కానీ నువ్వు సెకండ్ హ్యాండ్ కదా? దీపకి ఆల్రెడీ పెళ్లి అయ్యింది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది జ్యోత్స్న. దాంతో కూతురిని సుమిత్ర కొట్టబోతుండగా కార్తీక్ అడ్డుపడతాడు.
డిసెంబర్ 11వ తేదీ 538వ ఎపిసోడ్‌లో..
దీప వ్యక్తిగత జీవితం, ఆమె మొదటి పెళ్లిపై చేసిన వ్యాఖ్యలపై జ్యోత్స్నకి అదిరిపోయే కౌంటర్ ఇస్తాడు కార్తీక్. దీప రెండో పెళ్లి చేసుకుంటే నీకొచ్చిన నష్టమేంటీ? ఒకవేళ దీపను నేను పెళ్లి చేసుకోకపోయినా నిన్ను మాత్రం చేసుకునే వాడిని కాదని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కేవలం మన కుటుంబాలు కలవాలనే ఒప్పుకున్నానని చెబుతాడు కార్తీక్. దాస్ మావయ్య తన భార్య కోసం, అనసూయ పెద్దమ్మ తన భర్త కోసం ఒంటరిగా మిగిలిపోయారని.. పారు, తాతయ్యలు వారి పిల్లల కోసమే మళ్లీ పెళ్లి చేసుకున్నారని చెబుతాడు. నువ్వు ఆడదాని మనసు అర్ధం చేసుకుని మాట్లాడావని పారిజాతం చెప్పడంతో శివన్నారాయణ సంతోషించి ఏం కావాలని అడుగుతాడు. గులాబ్ జామ్‌ని మీ చేతితో తినిపించమని పారు అడగ్గా.. అలాగే అని తినిపిస్తాడు. దాంతో పారు సిగ్గుతో మొగ్గలేస్తుంది. ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలబడదని జ్యోత్స్న రగిలిపోతుంది. జ్యోత్స్న అన్న మాటలతో వంటగదిలో దీప బాధపడుతుంది. భార్యను ఓదార్చి ఆమెకు గులాబ్‌జామ్ తినిపిస్తాడు కార్తీక్. కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన ఫుట్ ట్రక్స్ దగ్గరికి వెళ్లి పరిస్ధితి ఎలా ఉందో చూడమని కాశీకి చెబుతాడు శ్రీధర్. దాంతో కాశీలో సహనం నశిస్తుంది.

Photo Courtesy: JioHotstar
డిసెంబర్ 12వ తేదీ 539వ ఎపిసోడ్‌లో..
కాంచన ఇంటికి కావేరి వచ్చి కార్తీక్, దీపలను మా ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కి పంపించమని అడుగుతుంది. అయితే నా కొడుకు, కోడలు వస్తారని చెబుతుంది కాంచన. నువ్వు కూడా అని కావేరి నోరు తెరిచేలోగా వాళ్లిద్దరూ తప్పకుండా వస్తారని తేల్చేస్తుంది. కాశీ ప్రవర్తన రోజు రోజుకు మారిపోతుండటంతో శ్రీధర్, స్వప్నలు క్లాస్ తీసుకుంటారు. భార్యాభర్తలిద్దరూ ఒకొరినొకరు నానామాటలు అనుకుంటూ ఉండటంతో కావేరి చిరాకు పడుతుంది. మీ సంతోషం కోసం మీ నాన్న ఈ వయసులో కష్టపడుతున్నారు.. ఆయనకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని ఫైర్ అవుతుంది. నీ భర్తను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మంటుంది కావేరి. దాంతో శ్రీధర్ ఇద్దిరికీ నచ్చజెప్పి లోపలికి పంపిస్తాడు. అమ్మను కూడా మనతో పాటు తీసుకెళ్లాలని కార్తీక్, దీపలు అనుకుంటారు. ఇంతలో శౌర్య ఆడుకుంటూ వచ్చి నానమ్మని తాతయ్య దగ్గరికి పంపించమని చెబుతుంది. ఆ మాటలు నీతో ఈ మాటలు ఎవరు అనమని చెప్పారంటూ దీపపై సీరియస్‌గా చూస్తుంది కాంచన. అత్తాకోడళ్లు ఇద్దరూ గొడవ పడుతుండటంతో కార్తీక్ నలిగిపోతాడు.
డిసెంబర్ 13వ తేదీ 540వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్నని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కల రావడంతో ఉలిక్కిపడి లేస్తుంది పారిజాతం. నువ్వు నాకు తెలియకుండా మళ్లీ ఏ తప్పు చేయలేదు కదా అని మనవరాలిని నిలదీస్తుంది. ఎంత పొద్దెక్కినా సుమిత్ర లేవకపోవడంతో దశరథ కంగారుపడతాడు. వెంటనే శివన్నారాయణ దగ్గరికి వెళ్లి విషయం చెప్పగా ఇద్దరూ లేపి చూసినా సుమిత్ర లేవదు. ఈ ఏడుపులు విన్న జ్యోత్స్నకి చెమటలు పడతాయి. అమ్మ చచ్చిపోయిందని పారుకు చెప్పగా ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా కుదుపుతుంది. ఆ దెబ్బకు సుమిత్ర కళ్లు తెరుస్తుంది. రాత్రి నిద్రపట్టకపోవడంతో స్లిపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నానని చెబుతుంది సుమిత్ర. అంత టెన్షన్ నీకు ఎందుకు? అని పారు నిలదీయగా.. ఆడపిల్ల పెళ్లికి మించి కన్నవాళ్లకి ఏ టెన్షన్ ఉంటుందని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్నకి సంబంధాలు సెట్ కావడం లేదని సుమిత్ర బాధపడుతుందని చెబుతాడు. కార్తీక్, దీపలు శ్రీధర్ ఇంటికి వస్తారు.. కాంచన రాకపోవడంతో అతను బాధపడతాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కాశీ కనిపించకపోవడంతో కార్తీక్‌కి అనుమానం వస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











