Karthika Deepam 2 Weekly: దీప- దశరథలని కలిపిన కార్తీక్.. జ్యోత్స్న ప్లాన్ తిప్పికొట్టిన శివన్నారాయణ

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు 595 నుంచి 600వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

ఫిబ్రవరి 16వ తేదీ 595 ఎపిసోడ్‌లో..
గుడిలో పూజకు రానని దీప తేల్చి చెప్పడంతో కాంచన బాధపడుతుంది. అత్తయ్య మన బిడ్డ మీద ఆశలు పెంచుకుంటోందని.. ఆమెకు నువ్వే చెప్పాలని కార్తీక్‌తో అంటుంది దీప. అది నా వల్ల కాదని కంటతడి పెడతాడు కార్తీక్. ఉదయాన్నే తండ్రిని చూసి షాక్ అవుతాడు కాశీ. జరిగిన తప్పు తెలుసుకోవడానికి ఇంత టైం పట్టిందని అంటాడు కాశీ. నా జీవితాన్ని నాశనం చేసినందుకు జ్యోత్స్నని చంపేద్దామని అనుకున్నాను.. కానీ సుమిత్ర పెద్దమ్మని కాపాడాల్సింది జ్యోత్స్న అక్కేనని వదిలేశాని చెబుతాడు కాశీ. జ్యోత్స్న శాంపిల్స్... వదినతో మ్యాచ్ కాలేదు కదా అని దాస్ అడుగుతాడు.. ముందు మ్యాచ్ కాలేదు, కానీ తర్వాత డాక్టర్ గారే స్వయంగా ఇంటికొచ్చి మరి మ్యాచ్ అయ్యాయని చెప్పారని కాశీ చెబుతాడు. ఆ మాటలతో జ్యోత్స్న ఏదో మాయ చేసిందని దాస్‌కి అనుమానం వచ్చి నేరుగా హాస్పిటల్‌కి వెళ్తాడు. హాస్పిటల్‌లో డాక్టర్ హారికని జ్యోత్స్న కలిసి బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయని ప్రశ్నిస్తుంది. నీకు శాంపిల్స్ మ్యాచ్ కావడం కావాలా? వద్దా? అసలు నువ్వు సుమిత్ర కూతురివేనని డాక్టర్ కౌంటర్ వేయడంతో జ్యోత్స్నకు చెమటలు పడాయి. జ్యోత్స్న - డాక్టర్ మాట్లాడుకోవడం చూసిన దాస్.. జ్యోత్స్నతో డాక్టర్ హారిక కుమ్మక్కు అయ్యిందని ఆమెను చంపేందుకు వెళ్తుండగా కార్తీక్ ఆపుతాడు.

ఫిబ్రవరి 17వ తేదీ 596వ ఎపిసోడ్‌లో..
దాస్‌ను వెంటనే డాక్టర్ హారిక దగ్గరికి తీసుకెళ్లి.. సుమిత్ర అత్త కన్నకూతురు దీపేనన్న నిజం డాక్టర్ గారికి తెలుసని దాస్‌తో చెబుతాడు కార్తీక్. జ్యోత్స్నకి రిపోర్ట్స్ విషయంలో అనుమానం మొదలైంది.. నువ్వు జాగ్రత్తగా ఉండమని కార్తీక్‌ను హెచ్చరిస్తుంది డాక్టర్ హారిక. నిజం చెప్పడం ఒక్కటే దీనికి పరిష్కారమని దాస్ ఆవేశంగా వెళ్లబోతుండగా కార్తీక్ ఆపుతాడు. దీపని జ్యోత్స్న చంపాలనుకుందని.. ఇలాగే వదిలేద్దామా అని దాస్ చెప్పడంతో కార్తీక్‌ రగిలిపోతాడు. హడావుడిగా ఇంటికొచ్చిన జ్యోత్స్న నేను డాక్టర్ హారికను కలవడానికి వెళ్లాను.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని పారిజాతంతో అంటుంది. ఇంతలో దశరథ, శివన్నారాయణ వచ్చి ఎందుకు చెప్పకూడదు? అసలు నువ్వు డాక్టర్ గారిని ఎందుకు కలిశావని నిలదీస్తారు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది జ్యోత్స్న. శాంపిల్స్ విషయంలో ఏదో జరిగింది.. జ్యోత్స్న ఏదో తప్పు చేసిందని అనుమానం రావడంతో వెంటనే డాక్టర్‌ను కలుస్తాడు దశరథ. నాకు జ్యోత్న్న మొత్తం రిపోర్ట్స్ కావాలని అడగటంతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది. నేను ఈ ప్రెజర్ తట్టుకోలేను... కార్తీక్‌కి చెప్పాలని అనుకుంటుంది డాక్టర్. నీ కడుపులో బిడ్డ జాగ్రత్త.. దీని కోసమే మీ అత్తయ్య కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తోందని శ్రీధర్ చెప్పడంతో దీప కన్నీటి పర్యంతమవుతుంది.

Karthika deepam 2 Serial Weekly Episodes February 16th to February 21st Here is Highlights

Photo Courtesy: JioHotstar

ఫిబ్రవరి 18వ తేదీ 597వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్నని ఇలాగే వదిలేస్తే ఎన్నో దారుణాలు చేస్తుంది.. అవసరమైతే సుమిత్ర వదినను కూడా చంపేస్తుందని కార్తీక్‌ను దాస్ హెచ్చరిస్తాడు. ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేసి దశరథగారిలో రోజు రోజుకు అనుమానం పెరిగిపోతోంది.. ఇవాళ నన్ను కలిసి జ్యోత్స్న రిపోర్ట్స్ అడిగారు.. ఈ ప్రెజర్ నేను తట్టుకోలేకపోతున్నానని చెబుతుంది. దాంతో జ్యోత్స్న రిపోర్ట్స్‌ని మావయ్యకి మెయిల్ చేసేయమని చెబుతాడు కార్తీక్. ఆ మాటలతో దాస్, డాక్టర్ షాక్ అవుతారు. నువ్వు యుద్దానికి సిద్ధమయ్యామని అర్ధమైంది.. ఏదైతే అదే జరుగుతుంది ముందడుగు వేయమని అంటాడు దాస్. రేపు దీపతో కలిసి గుడికి వెళ్తున్నానని చెప్పడంతో కాంచన సంతోషించగా.. భర్త మాటలతో దీప షాక్ అవుతుంది. శివన్నారాయణతో మాట్లాడుతుండగా దశరథకు డాక్టర్ హారిక.. రిపోర్ట్స్‌ని మెయిల్ చేస్తుంది. అవి చూసిన దశరథకు జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ కాలేదని అర్ధమై షాక్ అవుతాడు. ఇంతలో కార్తీక్ ఫోన్ చేసి రేపు నీకు అన్ని నిజాలు చెబుతానని అంటాడు. సుమిత్రతో జ్యోత్స్న మాట్లాడుతుండగా రేపు ఉదయంతో చాలా విషయాలకు సమాధానాలు దొరుకుతాయని చెబుతాడు దశరథ. ఆ మాటలు విన్న జ్యోత్స్నకు తనకు ఏదో ప్రమాదం పొంచి ఉందని టెన్షన్ పడుతుంది. ఉదయాన్నే దశరథను గుడిలో కలిసిన కార్తీక్ .. దాస్‌, దీప, శౌర్యలపై జ్యోత్స్న అటాక్ చేయించినప్పటి నుంచి రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వని విషయం వరకు చెబుతాడు.

ఫిబ్రవరి 19వ తేదీ 598వ ఎపిసోడ్‌లో..
ఎన్నిసార్లు శాంపిల్స్ టెస్ట్ చేసినా జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావని దాస్ అనగా... ఎందుకు అని దశరథ ప్రశ్నిస్తాడు. ఎందుకంటే జ్యోత్స్న నీకూతురు కాదు.. దాస్ మావయ్య కూతురని కార్తీక్ అనడంతో దశరథ షాక్ అవుతాడు. శివన్నారాయణ గారు తనను అవమానించారని, చిన్నచూపు చూస్తున్నారని.. దాస్‌ని ఇంట్లోంచి గెంటేశారని పారుకి కోపం. అందుకే తాత మీద పగ సాధించడానికి పారు బిడ్డల్ని మార్చేసిందని.. ఇప్పుడు నీ దగ్గర పెరుగుతున్న జ్యోత్స్న ఎవరో కాదు.. స్వయంగా దాస్ మావయ్య కూతురు అని కార్తీక్ చెప్పడంతో దశరథ నిర్ఘాంతపోతాడు. ఎక్కడ ఈ నిజం బయటపడుతుందోనని దాస్ మావయ్యని జ్యోత్స్న చంపాలని అనుకుందని, దీప మీద అటాక్ చేయించిందని చెబుతాడు కార్తీక్. ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తూ కాశీకి కూడా టిఫిన్ వడ్డించమని చెబుతాడు శ్రీధర్. కాశీని చూడగానే లేచి వెళ్లిపోతుంది స్వప్న. దాంతో కూతురికి గట్టిగా క్లాస్ పీకుతాడు శ్రీధర్. కాశీని వెంటపెట్టుకుని ఏదో పని మీద శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు శ్రీధర్. కాశీని చూసిన పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. మా నాన్న నన్ను కలిశాడు బాగానే ఉన్నాడని కాశీ చెప్పగా.. జ్యోత్స్నకి తనకి ఏదో ప్రమాదం ముంచుకురాబోతోందని డౌట్ వస్తుంది. నా కూతురు బతికే ఉందా? ఉంటే ఎక్కడుందని దశరథ కుమిలిపోతాడు. నీ కూతురు ఇక్కడే ఉంది.. ఆమెను నీ కోసమే తీసుకొచ్చామని చెబుతాడు కార్తీక్.

Karthika deepam 2 Serial Weekly Episodes February 16th to February 21st Here is Highlights

Photo Courtesy: JioHotstar

ఫిబ్రవరి 20వ తేదీ 599వ ఎపిసోడ్‌లో..
దాస్ ఎక్కడికి వెళ్లాడు? ఏం చేయబోతున్నాడు తెలుసుకోవడానికి కాశీ నుంచి నిజాలు రాబట్టాలని అనుకుంటుంది జ్యోత్స్న. దాస్ బాబాయ్ నీ దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు అని కాశీని అడుగుతుంది జ్యోత్స్న. మా నాన్న గురించి నీకెందుకు అని మండిపడతాడు కాశీ. ఇన్నిరోజులు బాబాయ్ కనిపించలేదు కదా అందుకే అడిగానని అంటుంది జ్యోత్స్న. నన్ను కలిసి బావ దగ్గరికి వెళ్తానని చెప్పాడని అంటాడు కాశీ. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నా కూతురు ఎక్కడుందని దశరథ అడగ్గా.. దీపే నీ కన్నకూతురని చెబుతాడు కార్తీక్. ఈ విషయం దీపకి కూడా తెలుసని అంటాడు. దీపని గుండెలకు హత్తుకుని కంటతడి పెడతాడు దశరథ. దీప, శౌర్యల మీద అటాక్ చేయించింది జ్యోత్స్నేనని.. మీరు కూడా ప్రమాదంలో ఉన్నారని మిమ్మల్ని కాపాడదామని అనుకున్నానని చెబుతాడు కార్తీక్. దీపకి ఆపరేషన్ కోసం నా దగ్గర డబ్బులు లేకపోవడంతో దానిని ఆసరాగా తీసుకున్న జ్యోత్స్న అగ్రిమెంట్ మీత సంతకం చేయించుకుంది. ఆ తర్వాత మీ ఇంట్లోనే పనివాళ్లలాగా చేరి మిమ్మల్ని కాపాడుకున్నామని అంటాడు కార్తీక్. బావని కలవకుండా దాస్‌ని మధ్యలోనే చంపేయాలని అనుకుని కోపంగా వెళ్తున్న జ్యోత్స్నని ఆపుతుంది పారిజాతం.

ఫిబ్రవరి 21వ తేదీ 600వ ఎపిసోడ్‌లో..
నేను నీ మనవరాలిని అవునో, కాదో తర్వాత సంగతి ముందు దాస్‌ని ఆపాలని పారుతో గొడవ పడుతుంది జ్యోత్స్న. దాస్, దశరథలు కనిపించడం లేదు.. దీప, కార్తీక్‌లు ఇంకా డ్యూటీకి రాలేదు. ఏదో జరగబోతోందని జ్యోత్స్న చెప్పడంతో వెంటనే కాంచనకు ఫోన్ చేసి దీప, కార్తీక్‌ల గురించి అడుగుతుంది పారు. వాళ్లిద్దరూ గుడికి వెళ్లారని కాంచన చెప్పడంతో .. అంతా గుడిలో కలుసుకున్నారా అని మనం కూడా వెళ్లాలని చెబుతుంది జ్యోత్స్న. వాళ్లిద్దరూ గడప దాటుతుండగా శివన్నారాయణ చూసి ఇద్దరినీ లోపలికి వెళ్లమని చెబుతాడు. జ్యోత్స్న అంతు చూస్తానని ఆవేశంగా వెళ్తున్న దశరథను దాస్, కార్తీక్, దీపలు ఆపుతారు. అమ్మకు ఆపరేషన్ జరిగే వరకు ఈ నిజం ఎవరికీ చెప్పొద్దని దశరథ దగ్గర ఒట్టు వేయించుకుంటుంది దీప. దాస్‌ మావయ్య నీకోసం ఎంతో తపన పడ్డాడని కార్తీక్ చెప్పడంతో దాస్‌ని క్షమిస్తాడు దశరథ. తర్వాత నలుగురూ కలిసి సంతోషంగా దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తారు. అయితే కడుపులోని బిడ్డను వదులుకోబోతున్నట్లు దశరథకు చెప్పబోతుండగా కార్తీక్‌ని దీప ఆపుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X