Karthika Deepam 2 Weekly: దీప కడుపులోని బిడ్డకు గండం.. జ్యోత్స్నపై దశరథలో అనుమానం

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు 583 నుంచి 588వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

ఫిబ్రవరి 2వ తేదీ 583వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న మరోసారి తప్పించుకోవాలని చూసిందని మావయ్య, తాతకి దొరికిపోయిందని దీపకి చెబుతాడు కార్తీక్. మావయ్యకి జ్యోత్స్న మీద అనుమానం మొదలైంది.. ఆమెకు రెండోసారి బ్లడ్ టెస్ట్ చేయించాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. దాస్‌కి ఫోన్ చేసిన జ్యోత్స్న తనతో చేతులు కలపమని అడగ్గా.. అది నా వల్ల కాదని తేల్చేస్తాడు దాస్. ఉదయాన్నే శివన్నారాయణ దగ్గరికి దశరథ వచ్చి జ్యోత్స్నకి మరోసారి బ్లడ్ టెస్ట్ చేయించాలని అనుకున్నట్లు చెబుతాడు. ఈ మాటలు విన్న పారిజాతం షాక్ అవుతుంది. జ్యోత్స్నతో కలిసి తండ్రీ కొడుకులు ఆసుపత్రికి బయల్దేరతారు. తనపై భర్త చూపిస్తోన్న ప్రేమకు పొంగిపోతుంది దీప. ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేసి ఆసుపత్రికి అర్జెంట్‌గా రమ్మని చెప్పడంతో ఇద్దరూ కంగారుగా వెళ్తారు. దీప బ్లడ్ శాంపిల్స్ సుమిత్రగారితో మ్యాచ్ అయ్యాయి. అంటే దీపే సుమిత్రగారి కన్నకూతురా అని డాక్టర్ హారిక ఆశ్చర్యపోతుంది. అయితే సుమిత్రను కాపాడటం దీప వల్ల కాదని.. అది జరగాలంటే తన కడుపులోని బిడ్డను వదులుకోవాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు.

ఫిబ్రవరి 3వ తేదీ 584వ ఎపిసోడ్‌లో..
డాక్టర్ హారిక రూమ్‌లో నుంచి బయటకు వస్తున్న కార్తీక్, దీపలకు దశరథ, జ్యోత్స్న, శివన్నారాయణలు ఎదురవుతారు. మీరిద్దరికి డాక్టర్ హారికతో ఏం పని? మీరు కలవాల్సింది గైనకాలజిస్ట్‌ను కదా అని జ్యోత్స్న అనుమానం వ్యక్తం చేస్తుంది. దానికి కార్తీక్ ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తారు. లోపలికి వెళ్లిన జ్యోత్స్నకి టేబుల్ మీద దీప పేరుతో రిపోర్ట్స్ కనిపించగా వెంటనే ఫైల్ దాచేస్తుంది డాక్టర్ హారిక. అది చూసిన జ్యోత్స్నకు అనుమానం ఎక్కువవుతుంది. బ్లడ్ శాంపిల్స్ ఇవ్వకుండా తప్పించుకోలేనని జ్యోత్స్న కంగారుపడుతుంది. దీప- కార్తీక్‌లు హాస్పిటల్‌కు ఎందుకు వచ్చారు? వాళ్లిద్దరి కళ్లలో నీళ్లు ఎందుకున్నాయని డౌట్ పడుతుంది. కాశీని తీసుకుని శ్రీధర్ ఇంటికి వస్తుంది కాంచన. భర్తను చూడగానే రగిలిపోతుంది స్వప్న. ఈ మనిషి వల్ల మనమంతా ఎంతో బాధపడ్డాం.. ఇతనిని క్షమించే ప్రసక్తే లేదు, కలిసి బతకలేను.. విడాకులు ఇచ్చేస్తానని స్వప్న తేల్చిచెప్పడంతో కాశీతో పాటు అంతా షాక్ అవుతారు. బిడ్డ గురించి డాక్టర్ హారిక చెప్పిన మాటలో కార్తీక్, దీపలు కుమిలిపోతుంటారు. అటుగా కారులో వెళ్తున్న దశరథ్.. వాళ్లిద్దరినీ చూసి ఆపి ఏం జరిగిందని అడుగుతాడు. మీరిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారని చెప్పమని ప్రశ్నిస్తాడు. నేను, నా చెల్లి దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించే మాట్లాడుకుంటున్నామని దశరథ చెప్పడంతో కార్తీక్, దీపలకు మరింత దు:ఖం తన్నుకొస్తుంది.

Karthika deepam 2 Serial Weekly Episodes February 2nd to February 7th Here is Highlights

Photo Courtesy: JioHotstar

ఫిబ్రవరి 4వ తేదీ 585వ ఎపిసోడ్‌లో..
కార్తీక్, దీపలు ఏడుస్తుండటంతో వారిని ఓదార్చి బిడ్డ జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతాడు దశరథ. డాక్టర్ చెప్పిన మాటలు, దశరథ తమ మీద చూపిస్తున్న అభిమానంతో కార్తీక్, దీపలు వెక్కి వెక్కి ఏడుస్తారు. ఆసుపత్రి నుంచి వచ్చిన జ్యోత్స్నని బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావా? అని అడుగుతుంది పారు. శాంపిల్స్ ఇచ్చాను కానీ ఏం చేయాలో అర్ధం కావడం లేదు అంటుంది జ్యోత్స్న. ముందు దాస్ ఎక్కడున్నాడో చెప్పమని పారు అడగటంతో జ్యోత్స్న డ్రామాలు ఆడుతుంది. గ్రానీకి నా మీద అనుమానం ఎక్కువ అవుతోంది. జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది జ్యోత్స్న. స్వప్నని ఎలాగైనా ఒప్పించి మా ఇద్దరినీ కలపమని బతిమలాడతాడు కావీ. ఎవరు ఏం చెప్పినా సరే.. కాశీతో బతకడం తనకు ఇష్టం లేదని, విడాకులు ఇచ్చేస్తానని అంటుంది స్వప్న. ఆమె మాటలతో కాంచన కోపంగా వెళ్లిపోతుంది. స్వప్న మీద కోపంతో కాశీ కూడా వెళ్లిపోతాడు. అల్లుడిని నేను ఒప్పిస్తానని కావేరితో చెప్పి శ్రీధర్ వెళ్తాడు. పదే పదే బిడ్డ గుర్తుకొస్తుండటంతో కార్తీక్, దీపలు ఇంటికి బయల్దేరతారు.

ఫిబ్రవరి 5వ తేదీ 586వ ఎపిసోడ్‌లో..
కాశీ - స్వప్నలకు కలపమని శ్రీధర్‌ను అడుగుతుంది కాంచన. నా ఇద్దరు బిడ్డలకు తల్లులు వేరైనా బుద్ధులు మాత్రం ఒకటే వచ్చాయని అంటాడు శ్రీధర్. కార్తీక్‌తో స్వప్నను పోల్చొద్దని వాడి కోపం, ఆవేశం అంతా అయినవాళ్ల మంచి కోసమే వాడతాడని అంటుంది కాంచన. ఇంతలో శివన్నారాయణ వచ్చి నా కోడలి గురించే కాదు.. నా కూతురి గురించి కూడా ఆలోచించాలని అంటాడు. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మరోసారి ఇచ్చింది.. కానీ మీ గురించే భయంగా ఉందని, ఇకనైనా శ్రీధర్‌ను భర్తగా అంగీకరించమని చెబుతాడు పెద్దాయన. ఇంతలో కార్తీక్, దీపలు రావడంతో వీళ్లు డాక్టర్ హారిక దగ్గర కనిపించారని శివన్నారాయణ చెప్పగా.. అంతా షాక్ అవుతారు. నిన్న కూడా వెళ్లారని కాంచన చెప్పడంతో శివన్నారాయణకు అనుమానం వస్తుంది. సుమిత్ర అత్త గురించి కనుక్కోవడానికి వెళ్లామని కార్తీక్ కవర్ చేస్తాడు. ఉదయాన్నే అనసూయ వచ్చి కార్తీక్ బాబుకు అండగా ఉంటుందని ఊళ్లో ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టానని చెబుతుంది. ఆ మాటలతో కాంచన ఎమోషనల్ అవుతుంది. అనసూయ ఇచ్చిన పాప బొమ్మని తీసుకుని శౌర్య తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లగా అది చూసి కార్తీక్ - దీపలు కంటతడి పెడతారు.

Karthika deepam 2 Serial Weekly Episodes February 2nd to February 7th Here is Highlights

Photo Courtesy: JioHotstar

ఫిబ్రవరి 6వ తేదీ 587వ ఎపిసోడ్‌లో..
తను దశరథ కూతురిని కాదనే నిజం ఎక్కడ బయటపడిపోతుందోని దాస్ దగ్గర టెన్షన్ పడుతున్నట్లు నటిస్తుంది జ్యోత్స్న. నేను నీలాగా బతకలేను.. నాకు స్టేటస్, డబ్బు, అధికారం కావాలని చెబుతుంది. నువ్వు ఎప్పటికీ నా కూతురిగానే ఉంటావని దాస్ చెప్పడంతో తండ్రి మీద ఫైర్ అవుతుంది జ్యోత్స్న. అర్దరాత్రి ఇంట్లోకి దొంగచాటుగా వస్తోన్న జ్యోత్స్నని చూసి మండిపడతాడు దశరథ. ఆరోగ్యం బాలేని తల్లిని వదిలేసి నువ్వు ఫ్రెండ్స్‌తో షికారు చేస్తున్నావా? అని ఫైర్ అవుతాడు. దశరథను కూల్ చేసిన శివన్నారాయణ.. జ్యోత్స్నని తీసుకుని వెళ్లిపోమ్మని పారుతో చెబుతాడు. దీప- కార్తీక్‌లు మౌనంగా ఏడుస్తుండటం చూసిన కాంచనకు అనుమానం వస్తుంది. ఏం జరిగిందో కనుక్కోమని అనసూయకు చెబుతుంది. దీపని ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పకపోవడంతో అనసూయ సీరియస్ అవుతుంది. దీప కోసం భోజనం తీసుకుని రాగా.. దానిని శౌర్యకి ఇచ్చి పంపుతుంది కాంచన. పాప ఎన్నిసార్లు భోజనం చేయమని చెబుతున్నా దీప పట్టించుకోకపోగా.. శౌర్య మీద అరవడంతో పాప భయపడి ఏడుస్తుంది. ఇదంతా చూసిన కాంచన, కార్తీక్, అనసూయలు షాక్ అవుతారు. అసలు సుమిత్ర గురించి బాధపడాల్సిన అవసరం నీకు ఏంటని మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 7వ తేదీ 588వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

ఫిబ్రవరి 7వ తేదీ 588వ ఎపిసోడ్‌లో..
కాంచన చెప్పినట్లు స్వప్నని, కాశీని కలిపేందుకు గాను కూతురితో మాట్లాడతాడు. కాశీ అక్కర్లేనప్పుడు అతను కట్టిన తాళి ఎందుకు అని శ్రీధర్ అడగటంతో స్వప్న, కావేరిలు షాక్ అవుతారు. నువ్వు పెద్దమ్మని ఇలాగే అడగగలవా అని కోప్పడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న. నేను మీ జీవితంలో నుంచి వెళ్లిపోతాను అప్పుడు అక్కా మీరు కలిసిపోవచ్చని కావేరి చెప్పగా ఆమెపై కోప్పడతాడు శ్రీధర్. సుమిత్రను కాపాడాలంటే బిడ్డను వదులుకోవాలని డాక్టర్ చెప్పడంతో ఏం చేయాలో అర్ధం కాక దీప, కార్తీక్‌లు ఏడుస్తుంటారు. దీప ముఖం చూస్తే భయం వేస్తోందని ఏం జరిగిందని అడుగుతుంది కాంచన. మరోవైపు.. జ్యోత్స్నకి పారు భోజనం తినిపిస్తుండగా శివన్నారాయణ వచ్చి దశరథ ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఏం జరుగుతుందో కూడా తెలియదని వార్నింగ్ ఇస్తాడు. దాంతో సుమిత్రను చంపేయాలని జ్యోత్స్నతో పారు అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X