Karthika Deepam 2 Weekly: బిడ్డను చంపుకోవడానికి కార్తీక్ సిద్ధం.. దాస్ ఎస్కేప్, జ్యోత్స్నపై పారు ఫైర్
Photo Courtesy: JioHotstar
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు 589 నుంచి 594వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
ఫిబ్రవరి 9వ తేదీ 589 ఎపిసోడ్‌లో..
కార్తీక్, దీపలు ఉదయాన్నే ఇంటికి వస్తుండగా సుమిత్ర ఎదురవుతుంది. ఎక్కడికి వెళ్తున్నావని అడగ్గా.. ఎవరు మీరు అని సుమిత్ర అడగటంతో కార్తీక్, షాక్‌లు షాక్ అవుతారు. ఆ వెంటనే దశరథ బయటికొచ్చి భార్యను లోపలికి తీసుకెళ్తుండగా అతని చేతిని పక్కకునెట్టి నన్నే పట్టుకుంటావా అని భర్తపై మండిపడుతుంది. దాంతో సుమిత్రకు ఏం జరిగిందో అర్ధం కాక కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇప్పటి వరకు తనను తన బిడ్డ కాపాడుతుందని సుమిత్రకు నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడంతో నమ్మకం పోయిందని.. అందుకే కొన్నిరోజులుగా దిగులుగా ఉంటోందని చెబుతాడు దశరథ. సుమిత్ర భోజనం చేయడం లేదని కనీసం టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదని.. నా భార్య ఎక్కువ రోజులు బతకదని భయంగా ఉందని కార్తీక్‌ను హత్తుకుని ఏడుస్తాడు దశరథ. తల్లిదండ్రుల పరిస్ధితి చూసి బాధపడిన దీప నేరుగా ఆసుపత్రికి వెళ్లి.. నా బిడ్డ చనిపోయినా పర్లేదు వెంటనే నా తల్లికి ఆపరేషన్ చేయమని అడుగుతుంది. దాంతో దీపపై డాక్టర్ హారిక కోప్పడుతుంది. కడుపులోని బిడ్డను నేను చంపలేనని, ఈ విషయం కార్తీక్‌కి తెలిస్తే నేను సమాధానం చెప్పలేనని అంటుంది డాక్టర్.
ఫిబ్రవరి 10వ తేదీ 590వ ఎపిసోడ్‌లో..
ఇల్లంతా వెతికినా దీప జాడ కనిపించకపోవడంతో తల్లికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తాడు కార్తీక్. దీప అక్కడికి రాలేదని కాంచన చెప్పడంతో కార్తీక్ కంగారుపడతాడు. ఇంతో డాక్టర్ హారిక ఫోన్ చేసి దీప తన దగ్గరే ఉందని అర్జెంట్‌గా ఆసుపత్రి దగ్గరకి రమ్మని చెబుతాడు. సుమిత్ర గారి ప్రాణాలు కాపాడటానికి దీప తన బిడ్డను వదులుకోవడానికి సిద్ధమైందని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. నాకు వేరే దారి లేదు.. నాకు మరో తల్లి పుట్టదని, నాకు అనుమతి ఇవ్వమని దీప ప్రాధేయపడటంతో కార్తీక్ కంటతడి పెడతాడు. భార్య పరిస్ధితి, సుమిత్ర అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బిడ్డను వదులుకోవడానికి అంగీకరిస్తాడు కార్తీక్. దాంతో డాక్టర్ హారిక ఆ ఇద్దరికీ దండం పెడుతుంది. మీ ఇద్దరి త్యాగం వృథా పోవడానికి వీల్లేదు.. వెంటనే దీప గురించి నిజం చెబుతానని కార్తీక్ ఎంత ఆపిన వినిపించుకోకుండా ఆవేశంగా శివన్నారాయణ ఇంటికి వెళ్తుంది డాక్టర్ హారిక. శివన్నారాయణ కుటుంబాన్ని పిలిచి జ్యోత్స్న గురించి నిజం చెబుతానని అంటుంది. దాంతో పారు లోపలికి వెళ్లి గన్‌తో డాక్టర్ కాల్చేస్తానని జ్యోత్స్నకి చెబుతుంది. సుమిత్ర గారి కూతురి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని హారిక చెప్పడంతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఆ మాటలు విని సుమిత్ర, దశరథ, శివన్నారాయణ సంతోషిస్తారు. నిజం చెప్పనందుకు కార్తీక్, దీపలు ఊపిరి పీల్చుకుంటారు.

Photo Courtesy: JioHotstar
ఫిబ్రవరి 11వ తేదీ 591వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న కన్నకూతురు కాదన్న నిజం దాచిపెట్టినందుకు డాక్టర్ హారికకు దీప, కార్తీక్‌లు థ్యాంక్స్ చెబుతారు. మీరు చేస్తోన్న త్యాగం ముందు నేను చేసింది చాలా చిన్నది.. తల్లిని కాపాడుకోవడంలో దీపకు ఎలాంటి సాయమైనా చేస్తానని చెబుతుంది హారిక. ఉదయాన్నే గుడికి వెళ్లేందుకు శ్రీధర్, స్వప్న, కావేరిలు కారులో కూర్చోగా.. దానిని డ్రైవ్ చేయడానికి కాశీ వస్తాడు. అది చూసి స్వప్న కోప్పడుతుంది. ఇకపై మనింట్లో కాశీ డ్రైవర్‌గా, ఇంట్లో మనిషిగా అన్ని సాయాలు చేస్తాడని.. అతనికి జీతం కూడా ఇస్తానని శ్రీధర్ చెబుతాడు. దాంతో స్వప్న సీరియస్‌గా వెళ్లిపోతుంది. హారిక మాటలతో జ్యోత్స్న తన మనవరాలు కాదని మండిపడుతుంది పారిజాతం. ఆ సైదులు గాడిని పిల్లల్ని మార్చమంటే నా మనవరాలినే మార్చేశాడని రగిలిపోతుంది. జరుగుతున్నది నాకు తెలియడం లేదని ఇదంతా నమ్మొద్దని పారుతో అంటుంది జ్యోత్స్న. బావ -దీపలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నేనే అసలు కూతురిని కాదని తెలిసిందా? లేక నేనే సుమిత్ర అసలైన కూతురినా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. కార్తీక్ - దీపలు బిడ్డ గురించి తలచుకుని బాధపడుతుండగా సుమిత్ర స్వీట్స్ తీసుకురమ్మని చెబుతుంది. జ్యోత్స్న విషయంలో ఏదో జరుగుతుందని దశరథకు అనుమానం వస్తుంది.
ఫిబ్రవరి 12వ తేదీ 592వ ఎపిసోడ్‌లో..
సుమిత్రతో జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కావాలని దేవుడికి మొక్కుకున్నానని పారు చెప్పడంతో .. అంటే శాంపిల్స్ మ్యాచ్ కావని అనుమానంగా ఉందని కార్తీక్ ఇరికించేస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఏదో విధంగా కవర్ చేయాలని చూసినప్పటికీ కార్తీక్ పదే పదే గుచ్చిగుచ్చి అడగటంతో పారుకి చెమటలు పడతాయి. నేను ఇకపై దేవుడికి బదులు ఉదయాన్నే జ్యోత్స్న ముఖం చూస్తానని సుమిత్ర చెప్పడంతో కార్తీక్ రగిలిపోతాడు. బిడ్డను వదులుకుని త్యాగం చేస్తోంది నువ్వు.. నీకు దక్కాల్సిన మర్యాద, ప్రేమ ఆ జ్యోత్స్నకి దక్కడం ఏంటీ అంటూ దీపతో అంటాడు. నాకు నా తల్లి సంతోషం, ఆమె ప్రాణాలతో ఉండటం ముఖ్యం. ఈ ప్రశంసలు నాకు అక్కర్లేదని చెబుతుంది దీప. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కాశీ నా దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తాడని స్వప్నకి తేల్చిచెబుతాడు శ్రీధర్. కాశీ ఉన్నచోట నేను ఉండలేను, ఇలాంటి మనిషితో బతకం కంటే ఎడారిలో బతకడం బెటర్ అంటూ కాశీని ఛీ కొడుతుంది స్వప్న. కార్తీక్- దీపలు మాట్లాడుకుంటూ ఉండగా శివన్నారాయణ ఇంటికి కాంచన - శ్రీధర్ వస్తారు. కాంచనకి స్వీట్ తినిపించి జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెబుతుంది. అందరూ సంతోషంగా ఉంటే జ్యోత్స్న, పారుల ముఖాలు డల్‌గా ఉండటంతో శ్రీధర్, దశరథలకు అనుమానం వస్తుంది.

Photo Courtesy: JioHotstar
ఫిబ్రవరి 13వ తేదీ 593వ ఎపిసోడ్‌లో..
సుమిత్ర బ్లడ్ శాంపిల్స్‌తో జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావడంతో అంతా సంతోషిస్తారు. జ్యోత్స్నను కాంచన దగ్గరికి పిలిచి నీకు జన్మనిచ్చిన తల్లి ప్రాణాలు కాపాడే అదృష్టం నీకు దక్కిందని.. ఇకపై మా వదినను కంటికి రెప్పలా కాపాడమని చెబుతుంది. ఆ మాటలతో దీప, కార్తీక్‌లు బాధపడతారు. కార్తీక్‌ను పక్కకి పిలిచిన దశరథ కారులో ఓ చోటికి తీసుకెళ్లమని చెబుతాడు. నేనే అసలు కూతురినా? లేక దీప సుమిత్ర కూతురా? అని తెలియాలంటే వెంటనే దాస్‌ని కలవాలని బయల్దేరుతుంది జ్యోత్స్న. ఆ వెంటనే ఆమెను పారిజాతం ఫాలో అవుతుంది. డాక్టర్ హారిక దగ్గరికి కార్తీక్‌తో కలిసి వెళ్లిన దశరథ.. అసలు నిజంగానే జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయా? లేదా? అని నిలదీస్తాడు. సుమిత్ర గారి ప్రాణాలను కాపాడేది కన్నకూతురేనని డాక్టర్ చెప్పడంతో దశరథ శాంతిస్తాడు. ఇంటికి వెళ్తూ బిడ్డను కాపాడటానికి ఏదైనా పరిష్కారం ఉందా? అని ప్రశ్నిస్తాడు కార్తీక్. అలాంటి ఛాన్స్ లేదని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ కంటతడి పెడతాడు. దాస్ చెప్పిన మాయమాటలకు పడిపోయిన రౌడీలు అతని కట్లు విప్పేసి మందు కొట్టి పడిపోతారు. ఇదే అదనుగా తప్పించుకుంటాడు దాస్. ఇంతలో అక్కడికి వచ్చిన జ్యోత్స్నకి దాస్ కనిపించకపోవడంతో కంగారుపడుతుంది. ఇదంతా చూసిన పారిజాతం తన మనవరాలిపై రగిలిపోతుంది.
ఫిబ్రవరి 14వ తేదీ 594వ ఎపిసోడ్‌లో..
ఉదయాన్నే గుడికి వెళ్లాలని కాంచన చెప్పగా.. నేను రాలేనని కంటతడి పెట్టుకుంటుంది దీప. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ప్రాణం చూసుకునే భర్త, అత్త ఉండగా నీ బాధేంటీ అని మండిపడుతుంది. నీ భార్యకు ఏమైంది రా? ఎందుకిలా ఏడుస్తోందని కార్తీక్‌ను అడుగుతుంది. నా బిడ్డకు ఏం కానివ్వను అని మాటిచ్చావు, దానికి కట్టుబడి ఉంటావా? అని చేతిలో చేయ్యేసి అడుగుతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి నువ్వు మా నాన్నతో కలిసుంటానని మాటివ్వు అని అడగటంతో కోడలి చేయి వదిలేస్తుంది కాంచన. నా కొడుకుని కిడ్నాప్ చేసింది నువ్వేనని జ్యోత్స్నని చితకబాదుతుంది పారిజాతం. మనిద్దరం సేఫ్‌గా ఉండాలనే ఉద్దేశంతోనే దాస్‌ని కిడ్నాప్ చేయించానని జ్యోత్స్న చెప్పడంతో మండిపడుతుంది. నీ కొడుకు ఇక్కడికి రాలేదంటే, బావని కలవడానికి వెళ్లాడని అనుకుంటుంది జ్యోత్స్న. రిపోర్ట్స్ నాకు అనుకూలంగా రావడం వెనుక ఎవరున్నారో కనుక్కోవాలని నిర్ణయించుకుంటుంది జ్యోత్స్న. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











