Karthika Deepam 2 Weekly: దాస్‌ని కిడ్నాప్ చేసిన జ్యోత్స్న.. తనకు క్యాన్సర్ అని తెలుసుకున్న సుమిత్ర

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా జనవరి 12వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు 565 నుంచి 570వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

జనవరి 12వ తేదీ 565వ ఎపిసోడ్‌లో..
సుమిత్రకు ఏం జరుగుతుందోనని దశరథ బాధపడుతుంటాడు. ఆమెకు నిజం ఎలా చెప్పాలా అని కార్తీక్, దీపలు ఆలోచిస్తుంటారు. సుమిత్ర అత్త నాకు అమ్మ.. ఆమెను ఎలాగైనా కాపాడుకుంటానని అంటాడు కార్తీక్. వదినకు ఏం కాదు, ఆమెతో నువ్వు నిండు నూరేళ్లు బతుకుతావు.. మనవళ్లు పుట్టడం, వాళ్ల ఎదుగుదలను కూడా ఇద్దరూ చూస్తారని దశరథకు ధైర్యం చెబుతంది కాంచన. సుమిత్ర కారణంగా జ్యోత్న్స పుట్టుక గురించి నిజం బయటపుడుతుందని భయపడ్డ పారిజాతం... ఈ సమస్య నుంచి తమను రక్షించగలిగేది దాస్ మాత్రమేనని భావించి వెంటనే కొడుకుని ఇంటికి పిలిపిస్తుంది. సుమిత్ర అసలు కూతురిని తీసుకొస్తే ఆమెకు డబ్బులిచ్చి.. బోన్‌మారో ఇప్పించి ఆమెను వదిలించుకుందామని, జ్యోత్స్నకు ఏ ఇబ్బంది ఉండదని దాస్‌కి చెబుతుంది పారిజాతం. అమ్మ చెప్పినట్లు చేయమంటావా? అని దాస్ అడగ్గా.. జ్యోత్స్నకు ముచ్చెమటలు పడతాయి. దాస్, జ్యోత్స్న, పారిజాతంలు మాట్లాడుకుంటూ ఉండగా శివన్నారాయణ అటుగా రావడంతో ముగ్గురూ షాక్ అవుతారు.

జనవరి 13వ తేదీ 566వ ఎపిసోడ్‌లో..
శివన్నారాయణ కనిపించడంతో మీకు ఓ నిజం చెప్పాలని అంటాడు దాస్. దాంతో ఇక్కడ కాదని లోపల కూర్చొని మాట్లాడుకుందామని చెబుతాడు పెద్దాయన. అందరూ ఉన్నా సుమిత్ర లేకపోవడంతో వదినను పిలిపించమని చెబుతాడు దాస్. దాస్ ఏం చెబుతాడోనని కార్తీక్, జ్యోత్స్న, పారిజాతం, దశరథలు వణికిపోతారు. ఇంతలో కార్తక్ జోక్యం చేసుకుని దాస్‌ మాటలకు అడ్డొస్తాడు. కాశీ బెయిల్ గురించి మావయ్య చెప్పాలని అనుకున్నాడని కార్తీక్ అనగా... నీ ముఖం చూసి కాశీని క్షమించి వదిలేస్తామని.. రేపే శ్రీధర్‌తో మాట్లాడి కాశీని బెయిల్‌ మీద తీసుకొస్తామని చెబుతాడు పెద్దాయన. నిజం బయటకు రాకపోవడంతో జ్యోత్స్న, పారిజాతంలు ఊపిరి పీల్చుకుంటారు. కాశీ బెయిల్‌పై ఇంటికి వస్తుండగా.. గుమ్మంలోనే ఆగమని మండిపడుతుంది స్వప్న. ఇలాంటి మనిషితో కలిసి బతకాలని నాకు లేదు... విడాకులు తీసుకుంటానని స్వప్న చెప్పడంతో కాశీ, కావేరి, శ్రీధర్, దాస్‌లు షాక్ అవుతారు. స్వప్న మాటలతో కాశీ కోపంగా వెళ్లిపోతాడు.

Karthika deepam 2 Serial Weekly Episodes january 12th to january 17th Here is Highlights

Photo Courtesy: JioHotstar

జనవరి 14వ తేదీ 567వ ఎపిసోడ్‌లో..
శివన్నారాయణ గారింటికి వెళ్లొద్దని దీపకు చెబుతుంది కాంచన. నేను వెళ్లకపోతే ఆ ఇంట్లో వాళ్లకు అన్నం పెట్టేవారు కూడా లేరని దీప బాధపడుతుంది. తాతయ్య గారు, దశరథ గారు నేను పెడితేనే తింటున్నారని.. లేకపోతే ఏడుస్తూ కూర్చొంటున్నారని అంటుంది దీప. ఆ మాటలతో కాంచన మౌనం వహిస్తుంది. జ్యోత్స్న ఆలోచనలు, బుద్ధులు చూస్తుంటే అసలు ఆమె మా అన్నయ్య కూతురేనా అని కాంచన అనడంతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. స్వప్న మాటలతో బాధపడుతున్న కాశీని మాయమాటలు చెప్పి తన మాయలో పడేలా చేస్తుంది జ్యోత్స్న. నా ఫైల్స్ అన్నీ ఎక్కడ అని అడగ్గా.. అవి మావయ్యగారి దగ్గరే ఉన్నాయని కాశీ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్నతో మాట్లాడి వస్తుండగా కాశీకి దాస్ ఎదురవుతాడు. ఆ వెంటనే కొడుకుని లాగిపెట్టి కొడతాడు దాస్. నువ్వు మా గురించి అస్సలు పట్టించుకోలేదు.. నువ్వు చేతగాని అసమర్ధుడివి అని నానామాటలు అంటాడు కాశీ. జ్యోత్స్న ఇంకెన్ని దారుణాలకు పాల్పడుతుందోనని భయపడ్డ దాస్... వెంటనే కార్తీక్‌కి ఫోన్ చేసి నిజం చెప్పేస్తానని అనడంతో కార్తీక్ ఉలిక్కిపడతాడు. శివన్నారాయణ ఇంటి దగ్గర దాస్‌కి జ్యోత్స్న ఎదురవుతుంది.

జనవరి 15వ తేదీ 568వ ఎపిసోడ్‌లో..
నీకిచ్చిన టైం అయిపోయింది.. నువ్వు నేరాలు చేసే స్థితి నుంచి పాపాలు చేసే స్థాయికి చేరుకున్నావని మండిపడతాడు దాస్. ఇప్పుడే నీ కథకు ముగింపు ఇస్తానని ఆవేశంగా ఇంట్లోకి వెళ్తాడు. ఈ టైంలో దాస్‌ని చూడగానే శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది. జ్యోత్స్న నీ కూతురు కాదని నా కూతురని సుమిత్రకు దాస్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. బిడ్డలు మారిపోయారని.. నీ కూతురిగా ఉన్నది నా కూతురని, నీ కూతురిని చంపాలని అనుకున్నానని.. కానీ ఆమె తప్పించుకుని ఎక్కడో అనాథగా బతుకుతోందని అంటాడు. ఆ మాటలు విన్న శివన్నారాయణ.. అసలు బిడ్డల్ని మార్చింది ఎవరు? అని ప్రశ్నించగా... నా తల్లి పారిజాతం అని చెప్పడంతో పెద్దాయన తుపాకీ తీసుకొచ్చి కాల్చేపారేస్తానని అంటాడు. అసలు పాపాత్మురాలు మా అమ్మ కాదని.. జ్యోత్స్న అని... తన పుట్టుక గురించి రహస్యం బయటపడుతుందని నన్ను చంపాలని చూసింది. దశరథ అన్నయ్యే లేకపోతే ఈపాటికి చచ్చిపోయేవాడినని అంటడు దాస్. ఆ మాటలు విన్న పారిజాతం.. నీకు జీవితాంతం తోడుగా ఉన్నందుకు నా కొడుకునే చంపాలని అనుకున్న నిన్ను చంపేస్తానని జ్యోత్స్నని కాల్చేస్తుంది. దాంతో జ్యోత్స్న ఉలిక్కిపడి లేస్తుంది. కలలో జరిగింది నిజం కాకూడదని దాస్‌ ముఖంపై స్ప్రే కొట్టి తన మనుషులతో కిడ్నాప్ చేయిస్తుంది.

Karthika deepam 2 Serial Weekly Episodes january 12th to january 17th Here is Highlights

Photo Courtesy: JioHotstar

జనవరి 16వ తేదీ 569వ ఎపిసోడ్‌లో..
దాస్‌ను వెతుక్కుంటూ కార్తీక్ రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అతనికి ఏదో చెప్పి పారిజాతం, జ్యోత్స్నలు పంపించేస్తారు. ఇంటి దగ్గర కార్తీక్ కోసం దీప, కాంచనలు ఎదురుచూస్తుంటారు. దాస్ మావయ్య జాడ లేకపోవడంతో జ్యోత్స్నపై డౌట్ పడతాడు కార్తీక్. సుమిత్ర అత్తను త్వరగా ఆసుపత్రిలో అడ్మిట్ చేయకుంటే చాలా ప్రమాదమని ఆమెకు నిజం చెప్పాలని దీప, కార్తీక్‌లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సుమిత్ర మెట్లు దిగుతూ జారిపడిపోతుండగా దీప పట్టుకుంటుంది. నాకేం జరిగింది? ఎందుకు ఇంట్లో వాళ్లంతా అలా ఉంటున్నారని అడుగుతుంది. ఎవ్వరూ నిజం చెప్పకపోవడంతో జ్యోత్స్నతో తన మీద ఒట్టు పెట్టించుకుని నాకు ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. నీకు బ్లడ్ క్యాన్సర్ అని జ్యోత్స్న చెప్పడంతో సుమిత్ర సోఫాలో కుప్పకూలుతుంది. నేను త్వరలో చనిపోతానా అని బాధపడుతుండగా అందరూ ఏం కాదని ఓదారుస్తారు.

జనవరి 17వ తేదీ 570వ ఎపిసోడ్‌లో..
డాక్టర్‌ను పిలిపించి సుమిత్రకు టెస్టులు చేయిస్తాడు దశరథ. మీ కోసం ఇంతమంది ఉన్నారు.. మీకు ఏం కాదని, భయం మనిషిని చంపేస్తుందని డాక్టర్ ధైర్యం చెబుతుంది. మిమ్మల్ని కాపాడే మీ అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది.. మీకు ఏం కాదని అంటుంది. దీపను చూడగానే నాకు మీ కూతురే అనిపించింది అని చెబుతుంది. బోన్‌మారో ఇవ్వాల్సింది మీ కూతురే కాబట్టి... ఆమెకు కొన్ని టెస్టులు చేయాలని డాక్టర్ చెప్పడంతో జ్యోత్స్న, పారిజాతంలు నిజం ఎక్కడ బయటపడుతుందోనని టెన్షన్ పడతారు. కార్తీక్‌తో కలిసి హాస్పిటల్‌కు వెళ్లమని దశరథ చెప్పడంతో జ్యోత్స్న, పారిజాతంలు ఉలిక్కిపడతారు. హాస్పిటల్‌కు వెళితే మన గుట్టు బయటపడిపోతుందని... ఏం చేయాలని ఆలోచిస్తుంది జ్యోత్స్న. స్వప్నకు కాశీ ఫోన్ చేసి మన కోసం ఇల్లు చూశాను... అక్కడికి వచ్చేయమంటాడు. దాంతో ఆమె సీరియస్‌గా ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X