Karthika Deepam 2 Weekly: కార్తీక్ ప్లాన్‌ని తిప్పికొట్టిన జ్యోత్స్న... దాస్‌ని చూసిన పారిజాతం

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా జనవరి 19వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు 571 నుంచి 576వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

జనవరి 19వ తేదీ 571వ ఎపిసోడ్‌లో..
సుమిత్ర కళ్లు తిరిగి పడిపోవడంతోపాటు ఆమె నోటివెంట రక్తం రావడంతో శివన్నారాయణ ఇంటికి వచ్చి పరీక్షలు చేస్తుంది డాక్టర్ హారిక. సుమిత్రకు ధైర్యం చెప్పి కన్నకూతురు రూపంలో ప్రాణదాత ఈ ఇంట్లోనే ఉందని అంటుంది. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అవసరమైన టెస్టులు చేయాలని జ్యోత్స్నను ఆసుపత్రికి రావాలని చెబుతుంది డాక్టర్ హారిక. బ్లడ్ శాంపిల్స్ ఇస్తే ఎక్కడ తాను అసలు కూతురిని కాదన్న నిజం బయటపడుతుందోనని జ్యోత్స్న వణికిపోతుంది. హాస్పిటల్‌లో శాంపిల్స్ ఇప్పుడే ఇవ్వాలా? రేపైనా ఇవ్వొచ్చా అని రకరకాలుగా తప్పించుకోవాలని చూస్తుంది. జ్యోత్స్న తీరుతో అనుమానం వచ్చిన డాక్టర్ హారిక కాసేపటి తర్వాత జ్యోత్స్నకు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం ఇష్టం లేనట్లుగా ఉందని అనడంతో నేను మాట్లాడతానని కార్తీక్ భరోసా ఇస్తాడు. బ్లడ్ శాంపిల్స్ ఇస్తావా? లేకపోతే తాతకు ఫోన్ చేసి విషయం చెప్పమని కార్తీక్ బెదిరించడంతో జ్యోత్స్న శాంపిల్స్ ఇస్తుంది. ఇంట్లో పరిస్థితిని చూసి గురువుగారిని పిలిపిస్తాడు శివన్నారాయణ. మా మేడం గారి జాతకం ఎలా ఉందని కార్తీక్ అడగ్గా.. ఆమె సాలెగూడులో నుంచి బయటపడే రోజులు దగ్గరపడ్డాయని చెప్పడంతో జ్యోత్స్న, పారిజాతంలు వణికిపోతారు. అలాగే నువ్వు సొంత గూటికి చేరుకుంటావని.. కానీ బిడ్డ జాగ్రత్త అని దీపని హెచ్చరిస్తాడు గురువుగారు. ఆ మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు.

జనవరి 20వ తేదీ 572వ ఎపిసోడ్‌లో..
బిడ్డ జాగ్రత్త అని గురువుగారు ఎందుకు చెప్పారు? ఏం జరగబోతోంది? అని గురువు గారు చెప్పిన మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. మా అమ్మ కూడా రోజూ నీకు ఇదే విషయం చెబుతుందని దీపతో అంటాడు కార్తీక్. మా అమ్మకు నిజం చెప్పేద్దామని కార్తీక్‌తో అంటుంది దీప. అయితే కార్తీక్ మాత్రం రిపోర్ట్స్ బయటికి వస్తే నిజం అదే బయటపడుతుందని నచ్చచెబుతాడు. జ్యోత్స్నకి ఓ మంచి కుర్రాడితో పెళ్లి చేసి చూసుకోవాలని కార్తీక్‌తో చెబుతుంది. దాస్ ఏమయ్యాడు? రెండ్రోజులుగా ఫోన్ తీయడం లేదని పారిజాతాన్ని అడుగుతాడు కార్తీక్. దాస్ బాబాయ్ గురించి మాకేం తెలుసని జ్యోత్స్న తప్పించుకోవాలని చూస్తుంది. అయితే దాస్ తాయెత్తుని కార్తీక్ తీసి చూపించడంతో జ్యోత్స్న‌కు చెమటలు పడతయి. దాస్ బాబాయ్ ఇక్కడికి వచ్చినప్పుడు జారిపడిపోయి ఉండొచ్చని తప్పించుకోవాలని చూస్తుంది. దాస్ బాబాయ్ ఆచూకీ కనుక తెలియకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబుతాడు కార్తీక్. సుమిత్ర ఆరోగ్యం గురించి శివన్నారాయణ ఏడుస్తుండగా దశరథ ఓదారుస్తాడు.

Karthika deepam 2 Serial Weekly Episodes january 19th to january 24th Here is Highlights

Photo Courtesy: JioHotstar

జనవరి 21వ తేదీ 573వ ఎపిసోడ్‌లో..
మా అమ్మ ముఖంలో, ఈ ఇంట్లో నవ్వులు వినిపించాలని కార్తీక్‌కి దీప చెప్పడంతో అత్తను నవ్వించడానికి ఓ ప్లాన్ వేస్తాడు కార్తీక్. చిన్నప్పుడు తాను అమ్మాయిలా రెడీ అయిన ఫోటోను సుమిత్రకు పంపించడంతో ఆమె పడి పడి నవ్వుతుంది. మిగిలినవారు కూడా అది చూసి నవ్వుతారు. దాంతో అసలు ఆ ఫోటో ఎవరిది? ఎందుకు మీరంతా నవ్వుతున్నారని దీప అడగ్గా.. సుమిత్ర అసలు విషయం చెబుతుంది. ఆ ఫోటోలో ఉన్నది మీ ఆయనే అని అంటుంది. దాస్ కనిపించకపోవడంతో నీ మీదే అనుమానంగా ఉందని పారిజాతం చెప్పడంతో జ్యోత్స్న వణికిపోతుంది. జ్యోత్స్న శాంపిల్స్.. అత్త శాంపిల్స్‌తో మ్యాచ్ కాకపోతే అసలు నిజం తెలుస్తుందని దీపతో కార్తీక్ అంటుండగా కాంచన వస్తుంది. దాంతో కార్తీక్ ఏదో చెప్పి కవర్ చేస్తాడు. సుమిత్ర భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకోకపోవడంతో జ్యోత్స్నపై శివన్నారాయణ మండిపడతాడు. సుమిత్ర బాగోగులు చూసుకోవాలంటే కాంచన ఇక్కడే ఉండాలని దశరథ చెప్పడంతో శివన్నారాయణ నేరుగా కార్తీక్‌కి ఫోన్ చేసి రేపు అమ్మను తీసుకుని రమ్మని చెబుతాడు.

జనవరి 22వ తేదీ 574వ ఎపిసోడ్‌లో..
మా ఇంటికి వెళ్లడం నాకు ఇష్టం లేదని కాంచన చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. నాకు అంత ధైర్యం లేదని, మా వదిన ముఖాన్ని చూడలేనని అంటుంది కాంచన. ఉదయాన్నే తన ఇంటికి కార్తీక్, దీప, శౌర్యలు మాత్రమే రావడం... కాంచన కనిపించకపోవడంతో శివన్నారాయణ బాధపడతారు. అమ్మ ఎందుకు రాలేదని పెద్దాయన, దశరథలు అడగ్గా... ఇక్కడికి రావడానికి అమ్మకి ధైర్యం సరిపోవడం లేదని చెబుతాడు కార్తీక్. ఆ మాటలు విన్న సుమిత్ర.. నా వల్ల వదిన ఎంతో బాధపడుతోందని కంటతడి పెడుతుంది. ఇంట్లో నుంచి జ్యోత్స్న బయటకు వెళ్లబోతుండగా కార్తీక్ అడ్డుకుంటాడు. నా పరిస్ధితి అంతంత మాత్రంగా ఉంది.. ఎప్పుడు కన్నుమూస్తానా తెలియడం లేదు. ఈ టైంలో నువ్వు నా పక్కనే ఉండమని సుమిత్ర అడగటంతో జ్యోత్స్న చేసేది ఏం లేక తల ఆడిస్తుంది. సుమిత్ర పరిస్ధితి చూసి దీప కంటతడి పెడుతుండటంతో పారిజాతానికి అనుమానం వస్తుంది. జ్యోత్స్న చెరలో బందీగా ఉన్న దాస్‌ టిఫిన్ చేస్తుండగా పక్కనే ఫోన్ కనిపించడంతో కార్తీక్‌కి ఫోన్ చేస్తాడు. ఇది గమనించిన రౌడీలు దాస్ దగ్గర ఫోన్ లాక్కుంటారు. అయితే దాస్ చాకచక్యంగా తప్పించుకుని శివన్నారాయణ ఇంటికి పరుగులు తీస్తాడు.

Karthika deepam 2 Serial Weekly Episodes january 19th to january 24th Here is Highlights

Photo Courtesy: JioHotstar

జనవరి 23వ తేదీ 575వ ఎపిసోడ్‌లో..
ఉదయాన్నే పూజ చేసుకుంటున్న కాంచన దగ్గరికి శ్రీధర్ వచ్చి సుమిత్ర దగ్గరికి వెళ్దామని నచ్చచెప్పి తీసుకెళ్తాడు. తల్లి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ ఉండటంతో కంటతడి పెట్టుకుంటుంది దీప. ఇంతలో శౌర్య వచ్చి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ కోసం నానమ్మ, తాతయ్య వచ్చారు అని చెప్పడంతో దీప షాక్ అవుతుంది. సుమిత్రను చూడగానే కాంచన ఎంతో సంతోషిస్తుంది. అత్తకి ఏం కాదు.. తన ప్రాణాలను కాపాడే కన్నకూతురు ఇక్కడే ఉంది కదా అని అంటాడు కార్తీక్. రౌడీల బారి నుంచి తప్పించుకున్న దాస్ పరిగెత్తుకుంటూ వచ్చి శివన్నారాయణ ఇంటి ముందు కుప్పకూలిపోతాడు. అది చూసిన జ్యోత్స్న వెంటనే రౌడీలకు ఫోన్ చేసి దాస్‌ని అక్కడి నుంచి తరలిస్తుంది. దాస్ రావడం కిందపడిపోవడం చూసిన పారిజాతం పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. ఆమె మాటలు విని కార్తీక్, దశరథలు కూడా బయటకు వెళ్తారు. అయితే అక్కడ దాస్ కనిపించకపోవడం... పై నుంచి జ్యోత్స్న టెన్షన్ పడుతుండటం చూసిన కార్తీక్‌కి అనుమానం వచ్చి మరదలిని నిలదీస్తాడు.

జనవరి 24వ తేదీ 571వ ఎపిసోడ్‌లో..
సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అసలు దాస్ ఇక్కడికి వచ్చాడో లేదో కార్తీక్ చెక్ చేస్తుండగా ఒక కెమెరా మాత్రమే పనిచేస్తుంది. మరో కెమెరా పనిచేయడం లేదని దశరథ చెప్పడంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది. అసలు దాస్ రాలేదని.. వస్తే ఇంట్లోకి రాకుండా ఉంటాడా అని అంటుంది. అందరూ అదే మాట అనడంతో కార్తీక్ సైలెంట్ అయిపోతాడు. దాస్ రావడం నేను చూశానని జ్యోత్స్నతో అంటుంది పారిజాతం. ముందు నువ్వు కళ్లజోడు మార్చు అంటూ నాయనమ్మ మీద అరుస్తుంది జ్యోత్స్న. భోజనాల దగ్గర దీపను దశరథ, సుమిత్రలు ప్రేమగా చూసుకోవడంతో జ్యోత్స్న రగిలిపోతూ నానామాటలు అంటుంది. దాంతో శివన్నారాయణ గడ్డిపెడతాడు. నేను ఉన్న నాలుగు రోజులైనా నా బిడ్డతో ఉండాలని అనుకుంటున్నానని సుమిత్ర అనడంతో నీ కన్నకూతురు బతికి ఉండగా.. నీకు ఏం కాదని అంటుంది జ్యోత్స్న. మరోవైపు.. దాస్‌కి ఫోన్ చేసిన జ్యోత్స్న తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X