Karthika Deepam 2 Weekly: శాంపిల్స్‌పై జ్యోత్స్న డ్రామా... దశరథలో అనుమానం, దీపపై హత్యాయత్నం

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా జనవరి 26వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు 577 నుంచి 582వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

జనవరి 26వ తేదీ 577వ ఎపిసోడ్‌లో..
ఇంట్లో తన కళ్ల ముందు పడిపోయిన కొడుకు వెళ్లి చూసేసరికి లేకపోవడంతో దాస్ మాయం వెనుక జ్యోత్స్న ఉందని పారిజాతానికి అనుమానం వస్తుంది. నువ్వు బావ ట్రాప్‌లో పడి మనిద్దరం గొడవలు పడుతున్నామని పారుతో అంటుంది జ్యోత్స్న. ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి బయటకు రావాలని జ్యోత్స్న బయటకు వెళ్తుండగా డాక్టర్ హారిక రావడంతో ఆమెకు ముచ్చెమటలు పడతాయి. డాక్టర్ హారిక సరాసరి ఇంటికి వచ్చినట్లు పారుకు చెప్పడంతో ఆమె కూడా వణికిపోతుంది. నేను రేపు రావాల్సింది.. కానీ కార్తీక్ ఫోన్ చేసి ఇవాళే రమ్మన్నారని హారిక అంటుంది. సుమిత్ర గారి బ్లడ్ శాంపిల్స్‌కు జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఈరోజుతో తమ పని అయిపోయిందని పారుకు ముచ్చెమటలు పడతాయి. కానీ ఇంతలో జ్యోత్స్న తెలివిగా నాటకం ఆడుతుంది. నేను మా అమ్మకి కన్నకూతురిని బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదంటే మీరు, మీ హాస్పిటల్‌లో ఏదో తప్పు జరిగిందని ఆరోపిస్తుంది. నువ్వు ఈ రిపోర్ట్స్ తప్పని నిరూపిస్తే డాక్టర్ వృత్తిని వదిలేస్తానని సవాల్ చేస్తుంది డాక్టర్ హారిక. నాకు ఇక్కడ ట్రీట్‌మెంట్ నచ్చడం లేదు.. వెంటనే మా మమ్మీని కెనడా తీసుకెళ్తానని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

జనవరి 27వ తేదీ 578వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కావని ముందు రోజు రాత్రి కార్తీక్ - దీపలు మాట్లాడుకుంటున్న విషయం గుర్తొచ్చి కాంచనకు అనుమానం వస్తుంది. ఇంటికి రాగానే కొడుకు, కోడలిని ఇదే విషయంపై నిలదీస్తుంది. తల్లికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు కార్తీక్. శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడంతో జ్యోత్స్న ఇంకా జాగ్రత్తపడుతుందని.. ఆమె తప్పించుకోవడానికి ఉన్న ఏకైక దారి మా అమ్మని అడ్డు తొలగించుకోవడమేనని కార్తీక్‌కి చెబుతుంది దీప. శాంపిల్స్ విషయంలో ఎక్కడ దొరికిపోతామోనని అనుకున్నాం.. కానీ నీ బుర్ర పాదరసంలా పనిచేసి చివరి నిమిషంలో తప్పించుకున్నామని మనవరాలిని మెచ్చుకుంటుంది పారు. కానీ కార్తీక్ గాడికి అనుమానం వచ్చిందని పారిజాతం చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దాస్ దగ్గరికి వచ్చి భోజనం పెడుతుంది జ్యోత్స్న. నీకు రోజులు దగ్గరపడ్డాయని.. నా అల్లుడు కార్తీక్ నీ కథకు ముగింపు పలుకుతాడని దాస్ చెప్పడంతో జ్యోత్స్న వణికిపోతుంది. దీపే అసలైన వారసురాలని ఒప్పుకుంటే మంచిదని దాస్ అనడంతో జ్యోత్స్న సీరియస్ అవుతుంది. వెంటనే రౌడీలకు 10 లక్షల రూపాయలు సుపారి ఇచ్చి దీపని చంపమని పంపిస్తుంది. కుట్రలో భాగంగా అర్ధరాత్రి రౌడీ కార్తీక్ ఇంటికి వెళ్లి దీపను కత్తితో పొడవబోతుండగా ఆమె గట్టిగా అరుస్తుంది. దాంతో కార్తీక్ ఉలిక్కిపడి లేచి దీపని రక్షిస్తాడు.

Karthika deepam 2 Serial Weekly Episodes january 26th to january 31st Here is Highlights

Photo Courtesy: JioHotstar

జనవరి 28వ తేదీ 579వ ఎపిసోడ్‌లో..
దీపని చంపేందుకు ప్రయత్నించిన రౌడీని పట్టుకుందామని కార్తీక్ ఎంత ప్రయత్నించినా అతను చీకటిలో కలిసిపోతాడు. ఇంట్లో అలికిడికి కాంచన, శౌర్యలు నిద్రలేస్తారు. దీప మీద ఇలా హత్యాయత్నం జరగడం ఇది మూడోసారి.. నా కోడలిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని కార్తీక్‌ను అడుగుతుంది కాంచన. ఉదయాన్నే దీపపై రాత్రి హత్యాయత్నం జరిగినట్లు శ్రీధర్‌కు చెబుతుంది కాంచన. దాంతో శ్రీధర్ నేరుగా వెళ్లి శివన్నారాయణకు ఈ విషయం చెప్పడంతో పెద్దాయన షాక్ అవుతాడు. వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేయండి నేనే మాట్లాడతాను, వాళ్ల అంతు చూస్తానని శివన్నారాయణ చెబుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్, దీపలు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని చెబుతారు. దీపపై హత్యాయత్నం ఎవరు చేశారో? ఎందుకు చేశారో? త్వరలోనే తెలిసిపోతుందని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న, పారులు వణికిపోతారు. అర్ధరాత్రి జ్యోత్స్న దాస్‌తో మాట్లాడి వస్తుండగా ఆమె మాటలు, కంగారుకు దశరథకు అనుమానం వస్తుంది. దీప, దాస్, జ్యోత్స్నలకు ఏదో కనెక్షన్ ఉందని డౌట్ వస్తుంది. తల్లిని కాపాడుకోవడానికి వెంటనే కార్తీక్‌ను తీసుకుని డాక్టర్ హారికను కలుస్తుంది దీప. సుమిత్ర గారి బ్లడ్ రిలేషన్ ఒకరు ఉన్నారని చెబుతాడు కార్తీక్. అది ఎవరు? అని డాక్టర్ అడగ్గా దీప అని అంటాడు. ఆ మాటలతో డాక్టర్ షాక్ అవుతుంది.

జనవరి 29వ తేదీ 580వ ఎపిసోడ్‌లో..
నీ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కానీ రోజే సగం దొరికిపోయామని ఇప్పటికే అందరికీ అనుమానం మొదలైందని పారిజాతం చెప్పడంతో జ్యోత్స్న‌కు చెమటలు పడతాయి. నా కొడుకు దాస్ ఉండుంటే అసలై వారసురాలిని తీసుకొచ్చేవాడు.. కానీ వాడి జాడ తెలియడం లేదని అంటుంది పారు. ఇంతలో జ్యోత్స్నకి దాస్ ఫోన్ చేయడంతో పక్కకి వెళ్లి మాట్లాడుతుంది. దీపను చంపాలని అనుకున్నావట.. మూడు సార్లు తప్పించుకుందంటే దీప మహర్జాతకురాలు. ఆమెను నువ్వు ఏం చేయలేవని.. నీకు రోజులు దగ్గరపడ్డాయని వార్నింగ్ ఇస్తాడు దాస్. కార్తీక్, దీపలు రిక్వెస్ట్ చేయడంతో దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి డాక్టర్ హారిక ఒప్పుకుంటుంది. గుడిలో నుంచి వస్తున్న కాంచనకు పిచ్చివాడిగా, దిక్కుమొక్కు లేనివాడిలా ఉన్న కాశీ కనిపిస్తాడు. ఆమెను చూడగానే ఏడ్చేసిన కాశీ... తనను స్వప్నని కలపాలని అడుగుతాడు. దాంతో కాశీని తీసుకుని ఇంటికి వెళ్తుంది కాంచన. దాస్ మావయ్య కనిపించకుండా పోవడం వెనుక జ్యోత్స్న ప్రమేయం ఉందని కార్తీక్ చెప్పడంతో పారు షాక్ అవుతుంది. కార్తీక్ చెప్పిన ప్లాన్ ప్రకారం మనవరాలి దగ్గరికి వెళ్తుంది పారిజాతం.

Karthika deepam 2 Serial Weekly Episodes january 26th to january 31st Here is Highlights

Photo Courtesy: JioHotstar

జనవరి 30వ తేదీ 581వ ఎపిసోడ్‌లో..
కార్తీక్ చెప్పిన పథకం ప్రకారం జ్యోత్స్న దగ్గరికి వెళ్లి.. నా కొడుకు దాస్ కనిపించడం లేదని పోలీస్ కంప్లయంట్ ఇద్దామని, తోడు రమ్మని పారు అడగటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మనవరాలి ముఖంలో రంగులు మారడం, కంగారు చూసిన పారుకి అనుమానం వస్తుంది. నేను ఇబ్బందుల్లో ఉంటే నా తండ్రి నన్ను పట్టించుకున్నాడా? నేను కూడా పట్టించుకోనని కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. ఇదే విషయాన్ని కార్తీక్‌కి చెప్పగా... దాస్ మావయ్య కనిపించకుండా పోవడానికి, జ్యోత్స్నకి ఏదో సంబంధం ఉందని కార్తీక్ చెప్పడంతో పారు షాక్ అవుతుంది. కాశీని స్వప్నని కలపడానికి శ్రీధర్‌ను ఇంటికి పిలిపిస్తుంది కాంచన. స్వప్న క్షమిస్తే కాశీ నా ఇంటికి వస్తాడు.. అంతా బాగానే ఉంది. ఇక్కడ నేను, కాశీ ఒకటే ప్రాబ్లమ్‌‌లో ఉన్నాం. స్వప్న నన్ను క్షమించినట్లే నువ్వు కూడా నన్ను క్షమించి భర్తగా అంగీకరించాలని చెబుతాడు శ్రీధర్. ఇంతలో కార్తీక్, దీప రావడంతో న్యాయం చెప్పమంటాడు శ్రీధర్. నా తల్లి నిర్ణయాన్ని నేను కాదనలేను.. కానీ మీ కొడుకుగా మీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నానని వెళ్లిపోతాడు. ఆ మాటలతో కాంచన బాధపడుతుంది.

జనవరి 31వ తేదీ 582వ ఎపిసోడ్‌లో..
కాశీని స్వప్న భర్తగా అంగీకరించేలా మాట్లాడమని శ్రీధర్‌కు చెబుతుంది కాంచన. దీప చేతికి బ్యాండేజ్ ఉండటంతో నువ్వు బ్లడ్ ఇచ్చావా? అని అడుగుతుంది కాంచన. దాంతో దీపని టెస్ట్‌ల కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లానని బిడ్డ బాగుందని కవర్ చేస్తాడు కార్తీక్. నేను బతికి ఉండాలన్నా, ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలన్నా నువ్వు బతికి ఉండకూడదని సుమిత్రకు వేయాల్సిన టాబ్లెట్స్‌ను డస్ట్ బిన్‌లో పడేస్తుంది జ్యోత్స్న. అది చూసిన దశరథ, శివన్నారాయణ, పారులు ఆమెను నిలదీస్తారు. ఇకపై నువ్వు మీ అమ్మ దగ్గరికి రావొద్దని, నా భార్యను నేను చూసుకుంటానని చెబుతాడు దశరథ. ఏ ప్లాన్ వేసినా వర్కవుట్ కావడం లేదు. అర్జెంట్‌గా దాస్‌ని కలిసి నా ప్లాన్‌ని అమలు చేయాలని అనుకుని అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లబోతుండగా జ్యోత్స్నని పట్టుకుంటారు కార్తీక్, పారు. ఆ వెంటనే దశరథ, శివన్నారాయణలు బయటికి వచ్చి కార్తీక్‌కి థ్యాంక్స్ చెబుతారు. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి.. జ్యోత్స్నకి మరోసారి టెస్ట్‌లు చేయించాలని కార్తీక్‌తో చెబుతాడు దశరథ. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X