Karthika Deepam 2 Weekly: సుమిత్ర హత్యకు జ్యోత్స్న కుట్ర... తల్లి కోసం దీప నరకయాతన

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా జనవరి 5వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు 559 నుంచి 564వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

జనవరి 5వ తేదీ 559వ ఎపిసోడ్‌లో..
పాయం తినిపిస్తున్న సుమిత్ర కళ్లలోకి సూటిగా చూడలేకపోవడం, భర్త ముఖంలో బాధ కనిపించడంతో అసలు నీకేమైంది? మా అమ్మకి ఏమైంది? ఆసుపత్రికి వెళ్లొచ్చినప్పటి నుంచి వింతగా ప్రవర్తిస్తున్నావని కార్తీక్‌పై మండిపడుతుంది దీప. జ్యోత్స్న చీటింగ్‌కి సంబంధించిన తన సంపాదించిన ఫైల్స్ కనిపించకపోవడంతో కార్తీక్‌కి ఫోన్ చేసి చెబుతాడు శ్రీధర్. బెడ్‌రూంలో కాశీ బట్టలు సర్దుతుండగా ఫైల్స్, పెన్‌డ్రైవ్ కనిపించడంతో వాటిని తీసుకెళ్లి తండ్రికి ఇస్తుంది స్వప్న. నేను అరెస్ట్ కావడానికి, ఫుడ్ కల్తీ కావడానికి కారణం ఇవేనని శ్రీధర్ చెప్పడంతో స్వప్న, కావేరీలు షాక్ అవుతారు. పుట్టబోయే బిడ్డపై ఒట్టేసి మా అమ్మకి ఏం జరిగిందో నిజం చెప్పమని దీప చెప్పడంతో .. తప్పనిసరి పరిస్ధితుల్లో మీ అమ్మకి ఒంట్లో బాలేదని, ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని కార్తీక్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది.

జనవరి 6వ తేదీ 560వ ఎపిసోడ్‌లో..
శివన్నారాయణ ఇంటికి వెళ్లేసరికి ఫైల్స్ పట్టుకుని రెడీగా ఉంటాడు. నువ్వు ఫైల్స్ మరిచిపోవడంతో తెప్పించాను, డాక్టర్ హారికకు కూడా ఫోన్ చేశానని చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. నా కోడలికి ఏం జరిగింది? నా దగ్గర ఏం నిజం దాస్తున్నావని మనవడిపై చేయి చేసుకుంటాడు శివన్నారాయణ. ఇంతలో అక్కడికి వచ్చిన శ్రీధర్ కూడా షాక్ అవుతాడు. దశరథ కూడా కార్తీక్‌ని కాలర్ పట్టుకుని నిలదీస్తూ ఉండటంతో డాక్టర్ వచ్చి మండిపడుతుంది. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ ఈ విషయం మీకు తెలిస్తే తట్టుకోలేరని కార్తీక్ తన గుండెల్లో దాచుకున్నాడు. నిజం తెలియక కార్తీక్‌పై చేయిచేసుకున్నందుకు శివన్నారాయణ, దశరథలు క్షమాపణలు కోరతారు. సుమిత్ర గారిని కాపాడగలిగింది జ్యోత్స్న ఒక్కటే.. తను మాత్రమే తన తల్లికి బోన్ మారో ఇచ్చి తల్లిని కాపాడుతుందని డాక్టర్ చెప్పడంతో అంతా సంతోషిస్తారు. నిజం ఎక్కడ బయటపడుతుందోనని జ్యోత్స్న, పారిజాతంలు వణికిపోతారు.

Karthika deepam 2 Serial Weekly Episodes january 5th to january 10th Here is Highlights

Photo Courtesy: JioHotstar

జనవరి 7వ తేదీ 561వ ఎపిసోడ్‌లో..
కార్తీక్‌ నా దగ్గర ఏదో విషయం దాస్తున్నాడని కాంచనకి అనుమానం వస్తుంది. సుమిత్ర పరిస్థితి చూసి దశరథ కుమిలిపోతుండగా.. తల్లిదండ్రుల గురించి తలచుకుంటూ దీప బయటికొచ్చి ఏడుస్తుంది. దాంతో దీపని నానామాటలు అంటారు జ్యోత్స్న, పారిజాతం. దీప సైతం మాటకి మాట సమాధానం చెప్పడంతో ఇద్దరూ అవాక్కవుతారు. నేను బోన్ మారో ఇస్తే నేను అసలు కూతురిని కాదని తెలిసిపోతుంది .. ఈ గండం నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి తెగించి నిర్ణయం తీసుకుంటానని పారిజాతంతో చెబుతుంది జ్యోత్స్న. శివన్నారాయ ఇంట్లో పరిస్ధితి చూసి బాధతో ఏడుస్తుంటాడు శ్రీధర్. కార్తీక్‌ని పిలిపించి.. జ్యోత్స్న పాపాలచిట్టా బయటపెడదామని ఆవేశంతో వచ్చాను కానీ ఇప్పుడు పరిస్థితి చూసి ఏం చేయలేకపోతున్నానని కొడుకుతో అంటాడు శ్రీధర్. వీటిని నీ దగ్గర ఉంచమని శ్రీధర్‌కి చెబుతాడు కార్తీక్.

జనవరి 8వ తేదీ 562వ ఎపిసోడ్‌లో..
దీప ఏడుస్తూ వచ్చి కుప్పకూలడంతో ఏం జరిగిందోనని కాంచన కంగారుపడుతుంది. సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని శ్రీధర్ చెప్పడంతో అనసూయ, కాంచనలు ఉలిక్కిపడతారు. మా వదిన అదృష్టం చేసుకుంది. కూతురు కాకపోయినా నువ్వు బాధపడుతున్నావని కోడలిని మెచ్చుకుంటుంది కాంచన. నేనే అసలు కూతురినని దీప లోలోపల మదనపడుతుంది. తన పుట్టుక గురించి నిజం తెలిసే రోజు దగ్గరిలోనే ఉందని కంగారుపడిన జ్యోత్స్న ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అర్ధరాత్రి గడప దాటుతుండగా కార్తీక్‌ని చూసి షాక్ అవుతుంది. ఇంతలో శివన్నారాయణ, దశరథలు వచ్చి మమ్మల్ని, మీ అమ్మని ఈ పరిస్ధితుల్లో వదిలేసి వెళ్లిపోతావా? అని మండిపడతారు. జ్యోత్స్న వెళ్లిపోవడానికి సలహా ఇచ్చింది నువ్వేనా అని పారిజాతంపై సీరియస్ అవుతాడు పెద్దాయన.

Karthika deepam 2 Serial Weekly Episodes january 5th to january 10th Here is Highlights

Photo Courtesy: JioHotstar

జనవరి 9వ తేదీ 563వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న కన్నకూతురు కాదు.. ఆ విషయాన్ని పారిజాతం, జ్యోత్స్నలు బయటపెట్టరు. మరి మా అమ్మని ఎలా కాపాడుకోవాలని కార్తీక్‌ని నిలదీస్తుంది దీప. ఏదో ఒక దారి దొరుకుతుందని కార్తీక్ తన భార్యకు ధైర్యం చెబుతాడు. నిజం బయటపడుతుందనే భయంతో జ్యోత్న్స ఇంట్లో నుంచి వెళ్లిపోతూ నాకు దొరికిపోయిందని దీపతో అంటాడు. శివన్నారాయణ మనవరాలివి అయ్యుండి భయపడి పారిపోతావా? అని జ్యోత్స్నపై సీరియస్ అవుతుంది. ఈ నిజం బయటకు రాకూడదంటే సుమిత్రను భయపెట్టి చంపాలని అనుకుంటుంది జ్యోత్స్న. పారు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా సుమిత్రకి టాబ్లెట్ ఇచ్చి నీకు బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం చెప్పేస్తుంది. అయితే అప్పటికే సుమిత్ర నిద్రలోకి జారుకోవడంతో తమ ప్లాన్ ఫెయిలైనందుకు బాధపడతారు. వీరిద్దరిని శివన్నారాయణ, కార్తీక్, కాంచన, దీపలు చూసి రగిలిపోతుంటారు.

జనవరి 10వ తేదీ 564వ ఎపిసోడ్‌లో..
తల్లి మీద కొంచెమైనా ప్రేమ ఉందా? తల్లి మీద అభిమానం ఉందా? అసలు నువ్వు మా వదిన కూతురివేనా అని జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది కాంచన. ఇప్పుడు కాకపోయినా రేపయినా అమ్మకి నిజం చెప్పాలి కదా అని కవర్ చేసుకోవాలని జ్యోత్స్న ట్రే చేయగా కార్తీక్ మండిపడతాడు. చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయని.. కానీ ఒకేసారి చెబితే మా అత్త పరిస్ధితి ఏంటని సీరియస్ అవుతాడు. ఇంతలో దశరథ వచ్చి నా కూతురిని ఎవరూ ఏమి అనొద్దు... తల్లిదండ్రులను గాలికి వదిలేసి తప్పించుకోవాలని నా కూతురు చూస్తోందని బాధపడతాడు. మనం ఈ గండం నుంచి బయటపడేలా నేను ఏదో ఒక మార్గం ఆలోచిస్తానని జ్యోత్స్నకి చెబుతుంది పారు. అసలు కూతురు ఎవరన్న నిజం తెలిసిపోతుందని అమ్మని పారు, జ్యోత్స్నలు చంపాలని అనుకున్నారని దీప అనుమానిస్తుంది. మరోవైపు శ్రీధర్ ఇంటికి వచ్చిన దాస్.. కాశీ చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి నా కొడుకుని నువ్వే దారిలో పెట్టమని అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X