Karthika Deepam 2 Weekly: మాలినితో దీప వార్.. జ్యోత్స్నని ట్రాప్ చేస్తోన్న మాలిని, ప్రమాదంలో శివన్నారాయణ

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా జూలై 6వ తేదీ నుంచి జూలై 11వ తేదీ వరకు 715 నుంచి 720వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

జూలై 06వ తేదీ 715వ ఎపిసోడ్‌లో..
ఆఫీస్‌లో పొద్దుపోయే వరకు కష్టపడుతుంది జ్యోత్స్న. సూరజ్ ఇంటికి వెళ్లబోతుండగా నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అని బ్రతిమలాడుతుంది. దాంతో జాలిపడి సూరజ్ హెల్ప్ చేస్తుండటంతో జ్యోత్స్న ఫోన్‌లో గేమ్ ఆడుకుంటూ ఉండటంతో అది చూసి అతను రగిలిపోతాడు. జ్యోత్స్నకు బుద్ధి చెప్పడానికి ఫైల్స్‌లో తప్పులు చేస్తాడు. ఉదయాన్నే ఫైల్స్ చూసిన శివన్నారాయణ కోపంతో జ్యోత్స్నని తిడతాడు. ఇంతలో రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్లు సిటీలో ఉన్న రెస్టారెంట్స్‌ అన్నింటికి ఈసారి కూడా పోటీ పెట్టి బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ ఇస్తున్నట్లు చెబుతారు. ఈసారి మన అసోసియేషన్‌లో కొత్తగా ఒకరు చేరారని దక్షిణామూర్తిని పిలవడంతో శివన్నారాయణ, కార్తీక్‌లు షాక్ అవుతారు. అందరినీ పంపించేసి సూరజ్‌ని పిలిపించిన శివన్నారాయణ.. దక్షిణామూర్తి ముందే లాగిపెట్టి కొడతాడు. దాంతో కార్తీక్, జ్యోత్స్న, దీప, సుమిత్రలు షాక్ అవుతారు. నేను దక్షిణామూర్తి గారి మనిషినని ఛైర్మన్ గారి అనుమానం.. దానిని తీర్చుకోవడానికే నన్ను కొట్టారని సూరజ్ అనడంతో శివన్నారాయణ మెచ్చుకుంటాడు.

జూలై 07వ తేదీ 716వ ఎపిసోడ్‌లో..
సూరజ్ మీద నాకు కూడా అనుమానంగానే ఉందని దీపతో అంటాడు కార్తీక్. ఇక్కడ ఇంత జరుగుతుంటే నాన్న ఎక్కడికి వెళ్లాడని దీప అడగ్గా.. రెస్టారెంట్స్ ఓనర్స్ వాళ్లు పెట్టిన టూర్‌కి వెళ్లాడని చెబుతాడు కార్తీక్. మా తాత నిన్ను కొట్టాడు కదా? మరి ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్లిపోతున్నావని సూరజ్‌ని అడుగుతుంది జ్యోత్స్న. నా అనుకున్నవాళ్లు కొడితే నేను పెద్దగా పట్టించుకోను, నమ్మకం ఉన్నచోటే అనుమానం కూడా ఉంటుందని చెబుతాడు సూరజ్. మా తాతని ఇంత అర్ధం చేసుకున్నవాడివి నన్నెందుకు అర్ధం చేసుకోవడం లేదని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నిన్ను అర్ధాంగిని చేసుకుంటానని చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. నీ రేంజ్ వేరు.. నా రేంజ్ వేరని ఆమె పొగరు చూపించడంతో.. శివన్నారాయణ గారి మనవరాలు కాకపోతే నీ బతుకు దారుణమని చెబుతాడు. నిన్ను నన్ను కలపడానికి ఒకరు వస్తారని సూరజ్ చెప్పగా.. కథలోకి మాలిని అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఓ హోటల్‌కి వెళ్లి కాఫీ తాగి నీ రెస్టారెంట్‌ని అమ్ముతావా? లేదా? అంటూ ఓనర్‌కి డెడ్‌లైన్ పెడుతుంది.

Karthika deepam 2 Serial Weekly Episodes July 6th to July 11th Here is Highlights

Photo Courtesy: JioHotstar

జూలై 08వ తేదీ 717వ ఎపిసోడ్‌లో..
సూరజ్ రెండు గంటలు పర్మిషన్ కావాలని అడగటంతో నీకు ఎవరూ లేరు అని చెప్పావు? మరి ఎవరిని కలుస్తున్నావని కార్తీక్, శివన్నారాయణలు ప్రశ్నిస్తారు. నేను దోష పరిహారం కోసం గుడికి వెళ్తున్నానని చెబుతాడు సూరజ్. అయితే మనం కూడా గుడికి వెళ్దామని సుమిత్రతో చెబుతాడు శివన్నారాయణ. మాలిని దేవిని వెతుక్కుంటూ హోటల్ ఓనర్ బాలా పరిగెత్తుకుంటూ వస్తాడు. నా హోటల్‌లో చెఫ్‌లను కొనేశారు, మనుషుల్ని పెట్టి రాళ్లు వేయిస్తున్నారు ఇక ఆ ఏరియాలో నేను వ్యాపారం చేయలేనని మీకే అమ్మేస్తానని అంటాడు. ఇంతలో దక్షిణామూర్తి రావడంతో మంచి హోటల్‌ని కొన్నావని కోడల్ని మెచ్చుకుంటాడు. తనతో సమానంగా డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తున్న సూరజ్ మీద కావాలని పప్పు పడేయటంతో అతని షర్ట్ పాడైపోతుంది. ఈ షర్ట్‌ని నేను ఉతుక్కుంటాను, జ్యోత్స్న గారిని ఏం అనొద్దని అంటాడు సూరజ్. ఆ వెంటనే జ్యోత్స్నకి వీడియో కాల్ చేసి నువ్వు నా షర్ట్ వాష్ చేయకపోతే నేను నీ కాస్ట్‌లీ చీరని తగలబెట్టేస్తానని బెదిరిస్తాడు

జూలై 09వ తేదీ 718వ ఎపిసోడ్‌లో..
మర్యాదగా నా షర్ట్ ఉతుకుతావా లేకపోతే నా గదిలోకి అమ్మాయిని ఎవరు పంపారో? ఎవరు క్యారియర్ పంపారో? ఎవరు తలుపుని లాక్ చేశారో అన్ని ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయని సూరజ్ చెప్పడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. అర్ధరాత్రి వరకు ఆఫీస్ పనులు చేసుకుంటూ ఉండటంతో దీపపై సీరియస్ అవుతుంది కాంచన. ఇంతలో శ్రీధర్ నుంచి వీడియో మెసేస్ వస్తుంది.. నాకు ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. రేపే ఇండియాకు వస్తున్నామని చెబుతాడు శ్రీధర్. సూరజ్ దెబ్బకు జ్యోత్స్న షర్ట్ ఉతుకుతుంది. అయితే షర్ట్ ఉతికినట్లే ఉతికి దానికి బొక్క పెడుతుంది జ్యోత్స్న. నీ పొగరే నీ ఐడెంటిటీ.. నీ మెడలో మూడు ముళ్లు వేసే వరకు నేను వదిలిపెట్టనని అనుకుంటాడు సూరజ్. ఉదయాన్నే కుటుంబంతో సహా గుడికి వెళ్తాడు శివన్నారాయణ. అక్కడ దక్షిణామూర్తి, మాలినిలు కనిపించడంతో శివన్నారాయణ ఫ్యామిలీ షాక్ అవుతుంది.

Karthika deepam 2 Serial Weekly Episodes July 6th to July 11th Here is Highlights

Photo Courtesy: JioHotstar

జూలై 10వ తేదీ 719వ ఎపిసోడ్‌లో..
గుడిలో తనను చూసి వెళ్లిపోతున్న శివన్నారాయణను అతని కుటుంబాన్ని ఆపుతాడు దక్షిణామూర్తి. ఇంతలో మాలిని జోక్యం చేసుకుని ఎలా ఉన్నావని సుమిత్రని అడుగుతుంది. ఆమె దక్షిణామూర్తి గారి కోడలు మాలిని అని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. జ్యోత్స్నని, కార్తీక్‌ని ఎలా ఉన్నారని అడుగుతుంది మాలిని. జ్యోత్స్న, సూరజ్‌లు పూజ చేస్తుండగా మీ ఇద్దరు భార్యాభర్తల్లా ఉన్నారని పంతులు అనడంతో జ్యోత్స్న మండిపడుతుంది. ఇద్దరూ కలిసి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తుండగా సూరజ్‌పై పడుతుంది జ్యోత్స్న. ఇదంతా చూసిన పారు రగిలిపోతుంది, అది గమనించిన కార్తీక్.. ఆమెను పక్కకి తీసుకొచ్చేస్తాడు. దీపం పెడుతున్న మాలినికి ప్రసాదం పెడుతుంది దీప. ఆ ప్రసాదం చాలా రుచిగా ఉండటంతో తన దగ్గర చెఫ్‌గా చేరితే ఎంతైనా ఇస్తానని ఆఫర్ ఇస్తుంది మాలిని. తను చెఫ్ కాదు.. నా భార్య దీప.. జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి సీఈవో అని కార్తీక్ చెబుతాడు.

జూలై 11వ తేదీ 720వ ఎపిసోడ్‌లో..
మాలినికి దీప ఎవరో తెలుసు.. అన్నీ తెలిసే ఆ మనిషి ఇలా మాట్లాడుతుందని అంటాడు శివన్నారాయణ. ఈవిడ ఎవరు అని దీప అడగ్గా.. నాకు కోడలు, సుమిత్రకు వదిన అని దక్షిణామూర్తి చెబుతాడు. మాలిని, దక్షిణామూర్తి, శివన్నారాయణ మధ్య మాటల యుద్ధం జరుగుతుండటంతో కార్తీక్ ఆపుతాడు. ఈ కుటుంబం కారణంగానే నా కోడలు అని దక్షిణామూర్తి చెప్పబోతుండగా మాలిని అడ్డుపడుతుంది. చాలారోజుల తర్వాత మీ కుటుంబాన్ని చూశాను కానీ ఈ అబ్బాయి ఎవరు అని సూరజ్ గురించి అడుగుతుంది. అతను సూరజ్ నా కుటుంబానికి సంబంధం లేదు, కానీ మా కుటుంబంలో ఒకడు అని అంటాడు శివన్నారాయణ. మాలిని కనిపించడంతో దీప ఎమోషనల్ అవుతుంది. నాకు కూడా ఒక అత్త ఉందని కార్తీక్ దగ్గర బాధపడుతుంది. మీ కూతురిని మీ దగ్గరకు చేరుస్తానని దక్షిణామూర్తికి మాట ఇస్తుంది మాలిని. బైక్‌కి ఆఫీస్‌కి వెళ్తున్న జ్యోత్స్నను సూరజ్ పెళ్లి పేరుతో విసిగిస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X