Karthika Deepam 2 Weekly: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. జ్యోత్స్న స్కెచ్‌కు సూరజ్, దీప విలవిల

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా జూన్ 15వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు 697 నుంచి 702వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

జూన్ 15వ తేదీ 697వ ఎపిసోడ్‌లో..
సూరజ్ ఔట్‌హౌస్‌లో ఉంటాడని శివన్నారాయణ చెప్పడంతో నా బాధ్యతను మీరు తీసుకోవడం నాకు నచ్చలేదని అంటాడు సూరజ్. ఔట్‌హౌస్‌లో అడుగుపెట్టిన దీప.. కార్తీక్ గాడికి భార్య అయ్యింది. ఇప్పుడు ఈ సూరజ్ గాడు.. జ్యోత్స్నకి మొగుడు అవుతాడేమోనని పారు టెన్షన్ పడుతుంది. ఎలాగైనా ఆ సూరజ్ గాడిని ఇంట్లోంచి గెంటేయాలని పారుతో అంటుంది జ్యోత్స్న. అందరూ భోజనం చేస్తుండగా.. సూరజ్‌ని కూడా పిలవమని చెబుతాడు పెద్దాయన. చివరికి జ్యోత్స్నే అతనికి క్యారియర్ ఇవ్వడానికి వెళ్తుంది. లోపలికి వెళ్లేసరికి సూరజ్ డ్యాన్స్‌లు చేస్తూ వంట చేస్తుండటంతో షాక్ అవుతుంది. ఇదంతా నా ప్లాన్ .. ఈ ఇంట్లోకి రావడానికే ఇలా చేశానని సూరజ్ అనడంతో ఇప్పుడే ఇంట్లో వాళ్లందరికీ నిజం చెబుతానని అంటుంది జ్యోత్స్న. అయితే జ్యోత్స్న తన మీదకి పంపిన రౌడీ చెప్పిన మాటల్ని వీడియో తీసి సూరజ్ వినిపించడంతో ఆమె షాక్ అవుతుంది.

జూన్ 16వ తేదీ 698వ ఎపిసోడ్‌లో..
నా గురించి మీ వాళ్లకి నువ్వు చెబితే.. నీ వీడియోని నేను మీ ఫ్యామిలీకి, మన కంపెనీ గ్రూప్‌లో షేర్ చేస్తానని సూరజ్ బ్లాక్ మెయిల్ చేయడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇద్దరం జైలుకి వెళ్దాం అక్కడ కూడా సరదాగా కబుర్లు చెప్పుకుందాం. నీలాంటి తిక్కల దానికి, నా లాంటి తిక్కలోడే కరెక్ట్ అంటాడు సూరజ్. ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్తున్న శివన్నారాయణకి రోడ్డు మీద సూరజ్ కనిపించడంత కారు ఎక్కమని చెబుతాడు. అతను కారెక్కడం నాకు ఇష్టం లేదని అంటుంది జ్యోత్స్న. ఎంప్లాయిస్‌ని మన సొంత మనుషుల్లా చూసుకోవాలి, అయినా నీ ప్రాణాలు కాపాడాడన్న కృతజ్ఞత కూడా నీలో కనిపించడం లేదని మండిపడతాడు శివన్నారాయణ. సూరజ్‌తో పాటే వచ్చి అతనిని సేఫ్‌గా ఆఫీస్‌కు తీసుకురమ్మని జ్యోత్స్నకి పనిష్మెంట్ ఇస్తాడు శివన్నారాయణ. దాంతో చేసేదేం లేక సూరజ్‌తో పాటు ఆటోలో వస్తుంది జ్యోత్స్న. వచ్చే దారిలో సూరజ్ చేతికర్రని రోడ్డు మీద విసిరేయడంతో ఆఫీస్‌లో తనే మోసుకుంటూ సూరజ్‌ని లోపలికి తీసుకొస్తుంది జ్యోత్స్న. ఇది చూసి కార్తీక్, దీపలు షాక్ అవుతారు.

Karthika deepam 2 Serial Weekly Episodes June 15th to June 20th Here is Highlights

Photo Courtesy: JioHotstar

జూన్ 17వ తేదీ 699వ ఎపిసోడ్‌లో..
1000 మందికి భోజనాలు కావాలని ఓ పెద్ద మనిషి వస్తే అతనిని అవమానించి పంపేస్తుంది జ్యోత్స్న. అయితే తాను ప్లేట్ 2000కే చేస్తానని దీప ఆ ఆర్డర్ ఒప్పుకుని 10 లక్షల రూపాయల చెక్ తీసుకుంటుంది. దీపకి ఆర్డర్ రావడంతో కోపంతో రగిలిపోతుంటుంది జ్యోత్స్న. ఓ చిన్న వీడియో పెట్టుకుని నన్నేం చేయలేవని జ్యోత్స్న అనగా.. కాసేపట్లో మీ తాత నుంచి నీకు ఫోన్ వస్తుందని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి. మా తాతని, నన్ను కాపాడినట్లు బిల్డప్ ఇచ్చి ఎందుకు మా ఔట్‌హౌస్‌లో చేరావని అడుగుతుంది జ్యోత్స్న. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానని అంటాడు సూరజ్. కోపంగా ఆఫీసులోకి వెళ్తున్న జ్యోత్స్న మెట్లపై జారిపడిపోతుంది. నేను కిందపడిన విషయం ఎవ్వరికీ చెప్పొద్దని సూరజ్‌ని బతిమలాడి వెళ్తుంది. ఆఫీస్‌లోకి వెళ్లేసరికి శివన్నారాయణ, దీప, కార్తీక్‌లు వచ్చి కిందపడ్డావట కదా? దెబ్బలు ఏమైనా తగిలాయా అని అడగటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. వెంటనే సూరజ్ దగ్గరికి వెళ్లి అందరికీ ఎందుకు చెప్పావని గొడవపడుతుంది. 1000 మందికి భోజనం ఎలా తయారు చేయాలో స్టాఫ్‌కి చెబుతుండగా దీప కళ్లు తిరిగి పడిపోతుంది.

జూన్ 18వ తేదీ 700వ ఎపిసోడ్‌లో..
ఆఫీసులో కళ్లు తిరిగి పడిపోయిన దీపని ఇంటికి తీసుకెళ్లమని కార్తీక్‌తో చెబుతాడు సూరజ్. అతను ఇంటికి వెళ్తే డ్రైవర్ జాబ్ నువ్వు చేస్తావా అంటూ జ్యోత్స్న మండిపడుతుంది. దీప- కార్తీక్‌లు వెళ్లిపోవడంతో సూరజ్- జ్యోత్స్నలు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో శివన్నారాయణ వచ్చి దీప, కార్తీక్‌ల గురించి అడగ్గా.. సూరజ్ జరిగింది చెబుతాడు. ఇద్దరినీ భోజనానికి పిలవగా.. నేను మన రెస్టారెంట్ నుంచే భోజనం తెప్పించుకుని తిన్నానని అంటాడు, ఆ వెంటనే జ్యోత్స్నకి పిజ్జా డెలివరీ వస్తుంది. ఇది నేను చేయలేదని జ్యోత్స్న చెప్పగా నేనే చేశానని అంటాడు సూరజ్. మన రెస్టారెంట్‌లో ఫుడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికే ఇలా చేశానని చెప్పడంతో సూరజ్‌ని మెచ్చుకుంటాడు పెద్దాయన. ఆఫీసులో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని.. నువ్వు ఇకపై ఆఫీస్‌కి వెళ్లొద్దని దీపకి చెబుతుంది కాంచన. సూరజ్ చాలా పెద్ద ప్లాన్‌తోనే ఈ ఇంట్లో తిష్ట వేశాడని జ్యోత్స్నతో అంటుంది పారు. అతనిని మన దారిలో తెచ్చుకోమని చెప్పడంతో పాల గ్లాసు తీసుకుని సూరజ్ దగ్గరికి వెళ్లి డీల్ మాట్లాడుతుంది జ్యోత్స్న.

Karthika deepam 2 Serial Weekly Episodes June 15th to June 20th Here is Highlights

Photo Courtesy: JioHotstar

జూన్ 19వ తేదీ 701వ ఎపిసోడ్‌లో..
దీప కోసం పనిచేస్తూనే తన మనిషిగా ఉంటే సీఈవో అయ్యాక నీకు సెటిల్ చేస్తానని సూరజ్‌కి ఆఫర్ ఇస్తుంది జ్యోత్స్న. నాకు డీల్ బాగా నచ్చిందని చెబుతాడు సూరజ్. నిన్ను ఎలా నమ్మడం అని జ్యోత్స్న అడగ్గా.. నా ఫోన్‌లో ఉన్న నీ వీడియోలని డిలీట్ చేసుకోమని ఇస్తాడు. ఇదే అదనుగా తన వీడియోలన్నీ డిలీట్ చేసుకుంటుంది జ్యోత్స్న. నీ దగ్గర వీడియోలు లేవు, ఇప్పుడు నువ్వేం చేయలేవని జ్యోత్స్న చెప్పగా.. అయితే అటు పక్క చూడమని ఫోన్‌లో రికార్డ్ అవుతున్న వీడియోని చూపిస్తాడు సూరజ్. అది చూడగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. సూరజ్ నిద్రపోగానే.. అతని రెండు ఫోన్లు దాచేసి, రూమ్‌కి లాక్ చేసి వెళ్లిపోతుంది జ్యోత్స్న. డెలివరీకి పంపించాల్సిన ఫుడ్‌ని టేస్ట్ చేసి చాలా బాగున్నాయని సూరజ్‌ని మెచ్చుకుంటుంది దీప. రూమ్‌కి లాక్ చేయడంతో సూరజ్.. ఫుడ్ డెలివరీ చేయలేడని సంతోషపడుతుంది జ్యోత్స్న. ఇంతలో సూరజ్ వీడియో కాల్ చేయడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

జూన్ 20వ తేదీ 702వ ఎపిసోడ్‌లో..
దీప ఇచ్చిన అడ్రస్‌కి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన సూరజ్‌కి అక్కడ ఎలాంటి ఫంక్షన్ లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి షాక్ అవుతాడు. 20 లక్షల రూపాయల భోజనం ఆర్డర్ తీసుకుని మోసపోవడంతో దీప మీద శివన్నారాయణ ఫైర్ అవుతాడు. నువ్వు జీవితంలో ఈ కంపెనీలోకి, మా ఇంటికి రావొద్దని తేల్చేస్తాడు. ఆ మాటలతో పెద్దాయన కాళ్ల మీద పడిన దీపకి ఒక అవకాశం ఇస్తాడు. సాయంత్రం లోగా 20 లక్షల రూపాయల భోజనంలో ఒక్క మెతుకు కూడా లేకుండా ఖర్చు అయిపోవాలని లేదంటే కంపెనీని వదిలేసి వెళ్లిపోవాలని కండీషన్ పెడతాడు. సూరజ్ దగ్గరికి వెళ్లిన జ్యోత్స్న.. ఇకనైనా ఆ వంటలక్కని వదిలేసి నాతో చేతులు కలపమని సూరజ్‌కి ఆఫర్ ఇస్తుంది. కోపంతో దీప దగ్గరికి వెళ్లిన సూరజ్.. ఇంతకు ముందు ఇడ్లీ కొట్టు ఉన్నప్పుడు వేస్ట్ అయిన ఫుడ్‌ని ఎలా హ్యాండిల్ చేసిందో వివరాలు కనుక్కుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X