Karthika Deepam 2 Weekly: జ్యోత్స్నకి షాక్, దీప కోసం రంగంలోకి సూరజ్.. శివన్నారాయణతో దక్షిణామూర్తి వార్

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా జూన్ 1వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు 685 నుంచి 690వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

జూన్ 1వ తేదీ 685వ ఎపిసోడ్‌లో..
ఆఫీస్‌లో దీపకు ఏదో మెయిల్ రావడంతో ఏంటో చూడమని మేనేజర్‌ని పిలుస్తుంది. ఓ కంపెనీ నుంచి 350 మందికి ఆర్డర్ వచ్చిందని, కానీ ప్లేట్ 60 రూపాయలకే అడుగుతున్నారని చెబుతాడు మేనేజర్. అంత తక్కువ రేటుకి ఇవ్వలేమని మెసేజ్ పెట్టమని చెబుతుంది దీప. ఇంతలో శివన్నారాయణకి ఆ కంపెనీ నుంచి ఫోన్ రావడంతో పెద్దాయన కోపంతో ఊగిపోతాడు. వెంటనే దీప, జ్యోత్స్నలని, కార్తీక్‌ని, మేనేజర్‌‌ని పిలిపిస్తాడు. కంపెనీకి వచ్చిన ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిందెవరు అని శివన్నారాయణ అడగ్గా.. నేనే అని చెబుతాడు మేనేజర్. దాంతో అతనిని లాగిపెట్టి కొడతాడు. దీప మేడం గారు చెబితేనే ఆర్డర్ క్యాన్సిల్ చేశానని అంటాడు మేనేజర్. వాళ్లు ప్లేట్ 60 రూపాయలకి అడిగారని అంత తక్కువ రేటుకి సప్లయ్ చేయలేమని నేనే క్యాన్సిల్ చేయమన్నానని అంటుంది దీప. లాప్‌టాప్ తీసుకొచ్చి చూపించగా దానిలో 160 రూపాయలు ఉండటంతో కార్తీక్, దశరథలు షాక్ అవుతారు. ఇలాంటి మనిషి సీఈవోగా వద్దని జ్యోత్స్న చెప్పడంతో ఇప్పుడే పీకేస్తున్నానని అంటాడు శివన్నారాయణ. అయితే కార్తీక్, దీపలు రిక్వెస్ట్ చేయడంతో చివరి అవకాశం ఇస్తాడు పెద్దాయన. జ్యోత్స్న, మేనేజర్‌లు నమ్మించి నిన్ను మోసం చేశారని దీపతో కార్తీక్, దశరథలు చెబుతారు. నీకు అన్ని పనులు చేసిపెట్టే ఒక నమ్మకమైన మనిషిని నీకింద ఉద్యోగిగా పెట్టుకోమని సలహా ఇవ్వడంతో సూరజ్ దగ్గరకి వెళ్లి విషయం చెబుతుంది దీప. అయితే తాను ఏ కంపెనీలోనూ పనిచేయనని తేల్చి చెబుతాడు సూరజ్. దీపను ఫాలో అవుతూ వచ్చిన జ్యోత్స్న ఇదంతా చూసి రగిలిపోతుంది.

జూన్ 2వ తేదీ 686వ ఎపిసోడ్‌లో..
సూరజ్ తన దగ్గర పనిచేయడానికి ఒప్పుకోకపోవడంతో కార్తీక్ దగ్గర చెప్పుకుని దీప బాధపడుతుంది. అర్థరాత్రి సూరజ్ తన ఫ్రెండ్‌తో కలిసి వస్తుండగా ఇద్దరు రౌడీలు అతనిని చితకబాది ఆ వీడియోను జ్యోత్స్నకి పంపిస్తారు. వాడిని ఇక వదిలేయమని పారు చెప్పగా.. ఈ జ్యోత్స్న అంటే ఏంటో తెలిసే దాకా వదిలిపెట్టనని అంటుంది. ఉదయాన్నే దశరథ కేక్ ఆర్డర్ చేస్తుండగా విన్న శౌర్య ఈరోజు అమ్మమ్మ పుట్టినరోజుని అందరికీ చెబుతుంది. దాంతో తల్లికి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్న దీప.. దక్షిణామూర్తి తాతని పిలిపించి సర్‌ప్రైజ్ చేద్దామని కార్తీక్‌తో చెబుతుంది. ఈ మాటలు విన్న జ్యోత్స్న, పారులు కొత్త స్కెచ్ వేస్తారు. అమ్మకి ఏం గిఫ్ట్ ఇవ్వాలని కార్తీక్‌ను అడుగుతూ ఉంటుంది దీప. దాంతో డెలివరీ సమయంలో పాపని చూస్తున్న తల్లి బొమ్మ వేయమని చెబుతాడు. శౌర్య చేత ఆ బొమ్మను వేయించిన దీప.. సుమిత్రకు ఇచ్చి శుభాకాంక్షలు చెబుతుంది. ఆ బొమ్మ చూసిన సుమిత్ర ఎమోషనల్ అవ్వగా.. పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు.

Karthika deepam 2 Serial Weekly Episodes June 1st to June 6th Here is Highlights

Photo Courtesy: JioHotstar

జూన్ 3వ తేదీ 687వ ఎపిసోడ్‌లో..
దీప ఇచ్చిన గిఫ్ట్ నచ్చడంతో ఆమెను ముద్దు పెట్టుకుంటుంది సుమిత్ర. ఇదంతా చూసిన పారు, జ్యోత్స్నలు రగిలిపోతారు. ఎలాగైనా ఈ సంతోషాన్ని పాడు చేయాలనుకుని సుమిత్ర చేతిలో ఉన్న డ్రాయింగ్ కింద పడేలా చేస్తుంది. ఇంతలో ఆ పేపర్ అందుకుంటాడు దక్షిణామూర్తి. అతనిని చూడగానే శివన్నారాయణ పూనకం వచ్చినట్లు ఊగిపోతాడు. నీ పుట్టినరోజని నీ కోసం గుడిలో అర్చన చేయించాను, నిన్ను ఆశీర్వదిద్దామని వచ్చానని అంటాడు దక్షిణామూర్తి. నీ విషపు చేతులతో నా కోడలిని ఆశీర్వదించొద్దని మండిపడతాడు శివన్నారాయణ. మన రెండు కుటుంబాలు విడిపోవడానికి నేను ఎంత కారణామో, నువ్వు కూడా అంతే కారణమని కౌంటరిస్తాడు దక్షిణామూర్తి. అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావని శివన్నారాయణ అడగ్గా.. దీపే పిలిచిందని ఇరికిస్తుంది జ్యోత్స్న. నన్ను ఎవరూ పిలవలేదు, నేనే వచ్చానని దీపని కాపాడతాడు దక్షిణామూర్తి. నీ కోసం మీ అన్నయ్య, వదిన ఎదురుచూస్తున్నారని సుమిత్రతో దక్షిణామూర్తి చెప్పడంతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఆయన వెళ్లిపోగానే కోడలితో కేక్ కట్ చేయిస్తాడు శివన్నారాయణ. దీపకి సుమిత్ర కేక్ తినిపిస్తూ ఉండగా జ్యోత్స్న అడ్డుపడుతుంది.

జూన్ 4వ తేదీ 688వ ఎపిసోడ్‌లో..
దీప ఇచ్చిన గిఫ్ట్ నచ్చడంతో ఆమెను ముద్దు పెట్టుకుంటుంది సుమిత్ర. ఇదంతా చూసిన పారు, జ్యోత్స్నలు రగిలిపోతారు. ఎలాగైనా ఈ సంతోషాన్ని పాడు చేయాలనుకుని సుమిత్ర చేతిలో ఉన్న డ్రాయింగ్ కింద పడేలా చేస్తుంది. ఇంతలో ఆ పేపర్ అందుకుంటాడు దక్షిణామూర్తి. అతనిని చూడగానే శివన్నారాయణ పూనకం వచ్చినట్లు ఊగిపోతాడు. నీ పుట్టినరోజని నీ కోసం గుడిలో అర్చన చేయించాను, నిన్ను ఆశీర్వదిద్దామని వచ్చానని అంటాడు దక్షిణామూర్తి. నీ విషపు చేతులతో నా కోడలిని ఆశీర్వదించొద్దని మండిపడతాడు శివన్నారాయణ. మన రెండు కుటుంబాలు విడిపోవడానికి నేను ఎంత కారణామో, నువ్వు కూడా అంతే కారణమని కౌంటరిస్తాడు దక్షిణామూర్తి. అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావని శివన్నారాయణ అడగ్గా.. దీపే పిలిచిందని ఇరికిస్తుంది జ్యోత్స్న. నన్ను ఎవరూ పిలవలేదు, నేనే వచ్చానని దీపని కాపాడతాడు దక్షిణామూర్తి. నీ కోసం మీ అన్నయ్య, వదిన ఎదురుచూస్తున్నారని సుమిత్రతో దక్షిణామూర్తి చెప్పడంతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఆయన వెళ్లిపోగానే కోడలితో కేక్ కట్ చేయిస్తాడు శివన్నారాయణ. దీపకి సుమిత్ర కేక్ తినిపిస్తూ ఉండగా జ్యోత్స్న అడ్డుపడుతుంది.

Karthika deepam 2 Serial Weekly Episodes June 1st to June 6th Here is Highlights

Photo Courtesy: JioHotstar

జూన్ 5వ తేదీ 689వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న, దీపలు ఆఫీసులో పనిచేసుకుంటూ ఉండగా మేనేజర్ వచ్చి దీపకి ఫైల్ ఇస్తాడు. అదంతా ఇంగ్లీష్‌లో ఉండటంతో చదివి వినిపించమని చెబుతుంది దీప. నా వల్ల కాదు.. మళ్లీ నన్ను ఇరికిస్తారని అంటాడు మేనేజర్. దీపకి హెల్ప్ చేయాలని కార్తీక్ వెళ్తుండగా అతనిని చేయి పట్టుకుని ఆపుతుంది జ్యోత్స్న. అయినప్పటికీ ఈ యాప్ ఎలా వాడాలో నేర్పిస్తాడు కార్తీక్. జ్యోత్స్న, దీపలకి పెట్టిన పరీక్షలో తొలివారం జ్యోత్స్న 10 శాతం గ్రోత్ సాధించిందని, దీప బ్రాంచ్ మాత్రం 10 శాతం మైనస్‌లో ఉందని చెబుతాడు దశరథ. దాంతో దీపను తప్పించి జ్యోత్స్నకే సీఈవో బాధ్యతలు అప్పగించాలని ఒక బోర్డ్ మెంబర్ చెబుతాడు. పోటీ ఇంకా అయిపోలేదని ఈలోపు ఏదైనా జరగొచ్చని అంటాడు కార్తీక్. నాకు ఇంగ్లీష్‌ రాక ఇబ్బంది పడుతున్నానని దీప చెప్పడంతో నీకు అసిస్టెంట్‌గా ఎవరినైనా నియమించుకోవచ్చని చెబుతాడు శివన్నారాయణ. ఆ వెంటనే కాళ్లు చేతులకు కట్లు కట్టించుకుని సూరజ్ ఎంట్రీ ఇస్తాడు. అతనిని చూడగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. నాతో కలిసి సూరజ్ పనిచేస్తాడని దీప చెప్పడంతో అందరూ ఒప్పుకుంటారు. వర్క్ విషయంలో దీపకి సూరజ్ హెల్ప్ చేస్తుండటం చూసి జ్యోత్స్న రగిలిపోతుంది.

జూన్ 6వ తేదీ 690వ ఎపిసోడ్‌లో..
నేను ఇలా ఆఫీస్‌కి వస్తానని ఊహించలేదు కదా అని జ్యోత్స్నతో అంటాడు సూరజ్. పగ తీర్చుకోవడానికే కదా నువ్వు నన్ను కొట్టించావని ఫైర్ అవుతాడు. నేనే నిన్ను కొట్టించాను అనడానికి ఆధారం ఏంటీ? రెండ్రోజుల్లో నువ్వు ఆఫీస్ వదిలి వెళ్లిపోయేల చేస్తానని సవాల్ విసురుతుంది జ్యోత్స్న. నీ పతనం మొదలైపోయింది.. ఎవరెస్ట్ శిఖరం మీద కోతిలా గెంతులు వేస్తున్నావు, నీ అహంకారం దించడానికి నేనొచ్చానని అంటాడు సూరజ్. వాళ్లిద్దరినీ చూసిన కార్తీక్.. మేడంగారికి సరైన మొగుడు దొరికాడని అనుకుంటాడు. కానీ మా ఇద్దరినీ నువ్వే కాపాడాలని చెబుతుంది దీప. ఇంతలో శ్రీధర్‌కు హార్ట్ అటాక్ వచ్చినట్లు ఫోన్ రావడంతో కార్తీక్, దీపలు ఆసుపత్రికి వెళ్తారు. శ్రీధర్ గారి హెల్త్ కండీషన్ క్రిటికల్‌గా ఉంది.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినా బతుకుతారన్న నమ్మకం లేదని డాక్టర్ చెప్పడంతో శివన్నారాయణ, కార్తీక్, దశరథ, దీపలు షాక్ అవుతారు. శ్రీధర్‌కి అమెరికాలో ఆపరేషన్ చేయిస్తామని తోడుగా కావేరి వెళ్తుందని శివన్నారాయణ చెబుతాడు. ఇంటికొచ్చిన శ్రీధర్ తాను బాగానే ఉన్నానని అందరితో నవ్వుతూ మాట్లాడి ఒంటరిగా ఏడుస్తుంటాడు. కాంచన దగ్గరికి వెళ్లగా ఆమెకు క్షమాపణలు చెబుతాడు. అమెరికాకు వెళ్తూ శ్రీధర్ నీకు వాచ్ ఇవ్వమన్నాడని శివన్నారాయణ ఇస్తాడు. అది పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది కాంచన. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X