Karthika Deepam 2 Weekly: దీపని సీఈవోని చేసిన సూరజ్.. పనిమనిషిగా పారు, అవమానంతో జ్యోత్స్న
Photo Courtesy: JioHotstar
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా జూన్ 22వ తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు 703 నుంచి 708వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
జూన్ 22వ తేదీ 703వ ఎపిసోడ్‌లో..
బాలరాజు ఇచ్చిన 1000 భోజనాలు ఎలా సేల్ చేయాలన్న దానిపై శివన్నారాయణకి ఐడియా ఇస్తారు సూరజ్, దీప. ఫ్లాష్ సేల్‌లా దీనిని అమ్మడంతో పాటు లక్కీ డ్రా పెట్టి గెలిచిన వారికి గోల్డ్ కాయిన్, 10 రోజుల పాటు తిన్నంత ఫ్రీ టిఫిన్ పెడదామని చెబుతారు. ఈ మాటలన్నీ విన్న జ్యోత్స్న.. అప్పుడు కంపెనీ మూతపడిపోతుందని అంటుంది. అయితే శివన్నారాయణ మాత్రం మీకు ఇదే లాస్ట్ ఛాన్స్.. సాయంత్రం తర్వాత ఒక్క మెతుకు మిగిలినా జ్యోత్స్నే సీఈవో అవుతుందని చెబుతాడు. పెద్దాయనకి చెప్పినట్లే ఒక్కొక్క బ్రాంచ్‌కి భోజనాలు పంపినా కస్టమర్లు వెళ్లకపోవడంతో దీప, సూరజ్‌లపై సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. ఇదంతా చూసిన సూరజ్.. ఆఫీస్ బాయ్ నానితో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ చేయిస్తాడు. అది చూసిన దశరథ, శివన్నారాయణలు షాక్ అవుతారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా క్లిక్ కావడంతో అన్ని బ్రాంచ్‌లకు కస్టమర్లు ఎగబడతారు. ఈ విషయం తెలుసుకున్న సూరజ్, దీపలు చాలా సంతోషిస్తుండగా.. దీప గెలవకూడదని జ్యోత్స్న రగిలిపోతుంది.
జూన్ 23వ తేదీ 704వ ఎపిసోడ్‌లో..
భోజనాలు సేల్ చేయడానికి దీప పెట్టిన గోల్డ్ కాయిన్ స్కీమ్ బాగా వర్కవుట్ కావడంతో గెలిచిన వారికి గోల్డ్ కాయిన్స్‌ని శివన్నారాయణ చేతుల మీదుగా ఇప్పిస్తారు సూరజ్, కార్తీక్. మీరందరూ నా పరువు నిలబెట్టడంతో పాటు కంపెనీకి లాభాలు తీసుకొచ్చారని మెచ్చుకుంటాడు శివన్నారాయణ. దీప పోటీలో గెలవడం, భోజనాలు మొత్తం సేల్ అయిపోవడంతో జ్యోత్స్న తలపట్టుకుని కూర్చొంటుంది. ఇంతలో సూరజ్ వచ్చి కాఫీ కప్పు ఇచ్చి.. గతంలో జ్యోత్స్న తనని ఎలా హేళన చేసిందో అలాగే మాట్లాడి రెచ్చగొడతాడు. పోటీలో గెలిచిన దీపకి దిష్టి తీస్తుంది కాంచన. ఇంతలో సుమిత్ర ఫోన్ చేసి దీపకి కంగ్రాట్స్ చెబుతుంది. వాకింగ్ చేస్తున్న సూరజ్ దగ్గరికి వెళ్లి నీకు, దీపకి టైం దగ్గరపడింది, పోటీలో గెలిచేది నేనే, సీఈవో అయ్యేది నేనే అని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలు విన్న సూరజ్.. దీప గారు నిజాయితీతో కష్టపడుతున్నారు కాబట్టి ఎప్పటికైనా విజయం ఆమెదేనని అంటాడు.

Photo Courtesy: JioHotstar
జూన్ 24వ తేదీ 705వ ఎపిసోడ్‌లో..
దీపకి ఫేక్ చెక్ ఇచ్చింది ఎవరు? ఆ వైరాగాడా లేక దక్షిణామూర్తా అనేది తెలుసుకోవాలని కాంచన చెప్పడంతో కార్తీక్ కూడా దాని గురించే ఆలోచిస్తూ తన ఫోన్‌లో తల్లికి ఇష్టమైన సీరియల్ పెట్టిస్తాడు. అందులో ఉన్న నటుడు అచ్చం బాలరాజులా ఉండటంతో దొరికాడని సంబరపడిపోతాడు. నేరుగా సెట్‌కు వెళ్లి తనను తాను ప్రొడ్యూసర్‌గా పరిచయం చేసుకుని, తాను తీయబోయే సినిమాలో మీరే హీరో అని ఆఫర్ ఇస్తాడు. దాంతో బాలరాజు సంబరపడిపోతాడు. ఉదయాన్నే కార్తీక్, దీపలు రావడంతో ఇంటికి రావొద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చారని నిలదీస్తుంది జ్యోత్స్న. మా మావయ్య దోసకాయ పచ్చడి అడిగాడని వచ్చిందని చెబుతాడు కార్తీక్. ఏ పోటీలో అయినా న్యాయం జరగాలి, నిజాయితీగా గెలిచిన వాళ్లే విజేతలు కావాలని.. తప్పు చేస్తే ఎవరినీ క్షమించొద్దని శివన్నారాయణకి చెబుతుంది సుమిత్ర. తప్పు చేస్తే ఎవరినీ క్షమించనని, వాళ్లని ఇంటికి రానివ్వనని చెబుతుంది సుమిత్ర.
జూన్ 25వ తేదీ 706వ ఎపిసోడ్‌లో..
బోర్డ్ మీటింగ్ కోసం వెళ్తున్న శివన్నారాయణకి మీకొక వర్ధమాన నటుడిని పరిచయం చేస్తానని చెబుతాడు కార్తీక్. బాలరాజు దగ్గరికి వెళ్లి నువ్వొక లైవ్ పర్ఫార్మెన్స్ చేయాలని కళ్లకు గంతలు కట్టి పెద్దాయన దగ్గరికి తీసుకెళ్లగా వాడిని చూసి జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. నాకు 1000 భోజనాలు కావాలి, ప్లేట్ 2 వేలు ఉండాలి.. 10 లక్షల రూపాయల అడ్వాన్స్‌కి చెక్ అని బాలరాజు చెప్పగా కోపంతో లాగిపెట్టి కొడతాడు శివన్నారాయణ. అసలు నీతో ఈ పని ఎవరు చేయించారని శివన్నారాయణ అడగ్గా.. పారిజాతమని బాలరాజు చెబుతాడు. నేను, దీప గారు కంపెనీ నుంచి వెళ్లిపోతామని ఇలాంటి వాళ్లతో మేం పోటీపడలేమని సూరజ్ అనడంతో అంతా షాక్ అవుతారు. తప్పు చేసినవాళ్లే ఆఫీసును వదిలి వెళ్లిపోతారని అంటాడు శివన్నారాయణ. కాబోయే సీఈవో ఎవరంటే అని పెద్దాయన చెబుతుండగా.. జ్యోత్స్న లేచి దీప అని అనౌన్స్ చేస్తుంది. మీరు సీఈవో పోస్ట్ త్యాగం చేస్తున్నారా అని బోర్డ్ మెంబర్స్ అడగ్గా ఇది త్యాగాలతో కాదు.. పోటీలో లెక్కల ప్రకారమే చూద్దామని చెబుతాడు పెద్దాయన. జ్యోత్స్నకి ఇచ్చిన బ్రాంచ్ 40 శాతం గ్రోత్, దీపకి అప్పగించిన బ్రాంచ్ 80 శాతం గ్రోత్ సాధించాయని చెబుతాడు.

Photo Courtesy: JioHotstar
జూన్ 26వ తేదీ 707వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న రెస్టారెంట్ సీఈవోగా దీపను శివన్నారాయణ అనౌన్స్ చేయడంతో పారు, జ్యోత్స్నలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. చేయాల్సినదంతా చేసి ఎక్కడికి వెళ్లిపోతున్నావని పారు పీక పట్టుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ వచ్చి పార్టీ మార్చేశావా అని సెటైర్లు వేయడంతో పారు షాక్ అవుతుంది. మీ ఇద్దరినీ వదిలిపెట్టనను తాతని పిలుస్తాడు. తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడాల్సిందేనని శివన్నారాయణని రెచ్చగొడతాడు సూరజ్. నీ పని దీపని సీఈవోని చేయడమే ఇక నువ్వు వెళ్లిపోవచ్చని పారు మండిపడుతుంది. నేను వచ్చిన పని అయిపోయింది ఇక నేను బయల్దేరతానని సూరజ్ అనగా నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు.. నువ్వు ఈ కంపెనీలోనే దీపతో పాటే ఉంటావు. తప్పు చేసిన వాళ్ల సంగతి నా కోడలే చూసుకుంటుందని అంటాడు శివన్నారాయణ. మమ్మీతో ఈ విషయం చెప్పొద్దని జ్యోత్స్న బతిమలాడటంతో సరేనని ఇంటికి వెళ్తారు. సీఈవోగా గెలిచిన వెంటనే సుమిత్ర ఆశీర్వాదం తీసుకుంటుంది దీప. పోటీలో దీప గెలవకుండా చేసినందుకు గాను నెలరోజుల పాటు పారు నేత చీరలు కట్టుకుని, నేల మీద పడుకోవాలని ఈ బాధ్యతను కార్తీక్‌కి అప్పగిస్తాడు. దాంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు.
జూన్ 27వ తేదీ 708వ ఎపిసోడ్‌లో..
శివన్నారాయణ తీర్పు మేరకు పనిమనిషి గెటప్‌లో వచ్చిన పారును చూసి కార్తీక్, దీప, జ్యోత్స్నలు షాక్ అవుతారు. పారు పగలంతా బయటే ఉండి.. రాత్రవ్వగానే తన రూమ్‌లోకి వెళ్తుందని కార్తీక్ చెప్పడంతో ఆ రూమ్‌కి సీలు వేస్తాడు శివన్నారాయణ. మళ్లీ మీ తాత లోపలికి రానిచ్చే వరకు ఈ కొప్పు ముడి వేసుకోనని శపథం చేస్తుంది పారు. దీప సీఈవో అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని, కానీ నిన్ను ఆ జ్యోత్స్న ప్రశాంతంగా పనిచేసుకోవనివ్వదని అంటుంది కాంచన. జ్యోత్స్న రెస్టారెంట్‌కి సీఈవోలంతా మన ఆఫీస్ నుంచే అవుతున్నారని చెబుతుండగా శౌర్య వచ్చి నేను కూడా అవుతానని చెబుతుంది. కూతురి ప్రవర్తనపై అనుమానం వచ్చిన సుమిత్ర... జ్యోత్స్న తప్పు చేస్తే అస్సలు క్షమించొద్దని శివన్నారాయణకి చెబుతుంది. ఈ మాటలన్నీ విన్న జ్యోత్స్న టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తుంది. సూరజ్ ఉన్నంత వరకు దీపని ఏం చేయలేమని, వాడిని మీ తాత చేత్తోనే బయటికి గెంటిస్తానని జ్యోత్స్న అంటుంది పారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications