Karthika Deepam 2 Weekly: సూరజ్‌పై శివన్నారాయణలో అనుమానం.. దీపపై దక్షిణామూర్తి పగ, షాక్‌లో కార్తీక్
Photo Courtesy: JioHotstar
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా జూన్ 29వ తేదీ నుంచి జూలై 04 తేదీ వరకు 709 నుంచి 713వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
జూన్ 29వ తేదీ 709వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి సీఈవో అయిన తన కోడలు దీపకి కాంచన ఖరీదైన చీరలు, బంగారు తాళిబొట్టు చేయిస్తుంది. ఇవన్నీ కొనడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడివి అని కార్తీక్ అడగ్గా.. మీ నాన్న ఇచ్చారని గతంలో శ్రీధర్ డబ్బు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తుంది కాంచన. సూరజ్‌ను ఇంట్లో నుంచి గెంటేయాలని ప్లాన్ చేసిన పారిజాతం.. ఓ అమ్మాయిని పిలిపించి సూరజ్ గదిలోకి వెళ్లి వాడితో గడిపినట్లుగా నటించమని చెబుతుంది. ఆ అమ్మాయి లోపలికి వెళ్లగానే తలుపు గడియపెట్టి శివన్నారాయణ, దశరథ, సుమిత్ర, జ్యోత్స్నలను పిలుస్తుంది పారు. సూరజ్ గదిలో అమ్మాయి ఉందని తలుపు తాళం తీసి చూపిస్తుంది. నిజంగానే అక్కడ సూరజ్‌తో అమ్మాయి కనిపించడంతో అంతా షాక్ అవుతారు. నిప్పులాంటి శివన్నారాయణ గారింట్లో ఉంటూ ఇలాంటి పనులు ఏంటీ? ఈ కుర్రాడిని ఇంట్లో నుంచి గెంటేయమని గొడవ చేస్తుంది పారు. ఇంతలో లోపలి నుంచి కార్తీక్, దీపలు రావడంతో పారు, జ్యోత్స్న షాక్ అవుతారు. ఈ అమ్మాయి మా వీధిలోనే ఉంటుంది, సూరజ్ గదిని శుభ్రం చేయడానికి మేమే తీసుకొచ్చామని దీప చెప్పడంతో అంతా అవాక్కవుతారు.
జూన్ 30వ తేదీ 710వ ఎపిసోడ్‌లో..
సూరజ్‌ని కాపాడిన తర్వాత పారుకి కార్తీక్ క్లాస్ పీకుతాడు. సూరజ్‌ని మరో రెండు మెట్లు పైకి ఎక్కించావు కానీ నా ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని పారుపై మండిపడుతుంది జ్యోత్స్న. నీ ప్లాన్‌ని తాత ముందు బయటపెట్టకుండా సైలెంట్‌గా ఉన్నాడంటే బావ మనసులో ఇంకేదో ఆలోచన ఉందని అనుకుంటుంది జ్యోత్స్న. దీప ఇచ్చిన స్వీట్స్ తిన్న సూరజ్.. చాలా బాగున్నాయి వదిన అని అనడంతో కార్తీక్, దీపలు సంతోషిస్తారు. సూరజ్ మనతోనే ఉండేలా ఏదో ఒకటి చేయమని కార్తీక్‌కు చెబుతుంది దీప. ఉదయాన్నే జ్యోత్స్నని అర్జెంట్‌గా ఆఫీస్‌కు రమ్మని ఫోన్ వస్తుంది. ఇంట్లో కార్లు లేకపోవడంతో సూరజ్ తన స్కూటీ మీద ఎక్కించుకుని తీసుకెళ్తాడు. సీఈవో చైర్‌లో దీపని కూర్చోబెట్టి ఆల్ ది బెస్ట్ చెబుతాడు శివన్నారాయణ. తర్వాత జ్యోత్స్నని పిలిచిన శివన్నారాయణ.. చేసిన తప్పుకు శిక్షగా దీపకి అసిస్టెంట్‌గా ఉండమని శిక్ష విధించడంతో పారు షాక్ అవుతుంది.

Photo Courtesy: JioHotstar
జూలై 01వ తేదీ 711వ ఎపిసోడ్‌లో..
ఈరోజు నుంచి జ్యోత్స్నకి ఎలాంటి సౌకర్యాలు ఉండవు, నెలకి జీతం వస్తుంది, దానిలోనే తన అవసరాలు తీర్చుకోవాలి. దీనికి ఒప్పుకోకపోతే ఆఫీస్‌లోనూ, ఇంట్లోనూ స్థానం ఉండదని రూల్స్ మొత్తం చదివి వినిపిస్తాడు కార్తీక్. తాత విధించిన శిక్షను గుర్తుచేసుకుంటూ రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న.. ఇంతలో సూరజ్ వచ్చి నేను శివన్నారాయణ మనవరాలిని అన్నావు కదా? శివన్నారాయణ మనవరాలివి కాకపోతే ఎందుకు పనికిరావని అంటాడు. ఓ తప్పు నీ పొజిషన్‌ను మార్చేసింది. ఒక సంతకం నీ తలరాతని మార్చేసింది, నువ్వేదో ప్రత్యేకమైన దానివని ఫీలయ్యావని సెటైర్లు వేస్తాడు. ఇంతలో కార్తీక్ వచ్చి జ్యోత్స్నని తీసుకుని ఆమె కోసం ఏర్పాటు చేసిన టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. ఆ వెంటనే జ్యోత్స్నని పిలుస్తూ దీప బెల్ కొట్టడంతో లోపలికి పిలుస్తుంది. ఆ తర్వాత కార్తీక్ కూడా మరదలిని ఆడుకుంటాడు. దీప, కార్తీక్‌లతో భోజనం చేస్తుండగా జ్యోత్స్న స్పూన్ కిందపడిపోవడంతో కార్తీక్ స్పూన్‌తో తింటుండగా దీప సీరియస్ అవుతుంది.
జూలై 02వ తేదీ 712వ ఎపిసోడ్‌లో..
కార్తీక్ స్పూన్‌తో ఫుడ్ తింటున్న జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది దీప. చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు బావ ఎంగిలి తిన్నానని చెబుతుంది జ్యోత్స్న. చిన్నప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. మరోసారి మా ఆయన ఎంగిలి తింటే పళ్లు రాలిపోతాయని వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా వింటున్న సూరజ్‌ని గమనించిన కార్తీక్.. కొన్ని పట్టించుకోకూడదని అంటాడు. ఆఫీస్ అయిపోగానే జ్యోత్స్నను స్కూటీ మీద ఇంటికి తీసుకెళ్తూ క్లాస్ పీకుతాడు సూరజ్. భోజనం చేస్తూ నువ్వు చేసిన పని ఏం బాలేదు.. కార్తీక్ గారు దీప భర్త వాళ్లిద్దరికీ జోలికి వెళ్లొద్దని చెబుతాడు. నన్ను అడగటానికి నువ్వెవరు? అని సూరజ్ చొక్కా పట్టుకుని జ్యోత్స్న నిలదీస్తుంది. నేను నీ మొగుడిని అని సూరజ్ అనడంతో ఆమె షాక్ అవుతుంది. సూరజ్ చెప్పిన మాటలను ఆలోచిస్తూ రగిలిపోతున్న జ్యోత్స్న దగ్గరికి వచ్చిన పారుకి అంతా చెబుతుంది. ఆ సూరజ్ గాడు చెప్పింది నిజం.. ఆ కార్తీక్ గాడిని వదిలేసి కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుంది పారు.

Photo Courtesy: JioHotstar
జూలై 03వ తేదీ 713వ ఎపిసోడ్‌లో..
స్కూటీపై ఆఫీస్‌కి వెళ్తుండగా నిన్న అడిగిన దాని గురించి ఏం ఆలోచించావని అడుగుతాడు సూరజ్. నేను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను, ప్రతిదీ నీకు చెప్పాల్సిన అవసరం లేదని అంటుంది జ్యోత్స్న. దాంతో ఓ చోట బైక్ ఆపించి వాటర్ బాటిల్ కావాలని అడుగుతుంది జ్యోత్స్న, ఆ వెంటనే పిన్‌తో టైర్ పంక్చర్ చేస్తుంది. సూరజ్ వచ్చి చూసేసరికి బైక్ పంక్చర్ పడటంతో జ్యోత్స్నని కూర్చోబెట్టి బైక్ నడుపుకుంటూ ఆఫీసుకి తీసుకొస్తాడు సూరజ్. నువ్వు పడిన కష్టానికి ఇదిగో 500 అని అతని చేతిలో పెడుతుంది, నీకు జరిగిన దానిని చెప్పుకుంటే నీ పరువే పోతుందని వెళ్తండగా జ్యోత్స్న లిప్‌స్టిక్ కిందపడుతుంది. దాంతో దానిని తీసుకుని జ్యోత్స్నని ఇరికించడానికి షర్ట్ వెనుక లిప్‌స్టిప్ ముద్ర వేస్తాడు. సూరజ్ షర్ట్ మీద లిప్‌స్టిక్ గుర్తుచూసిన కార్తీక్.. జ్యోత్స్నని ర్యాగింగ్ చేస్తాడు. ఆఫీస్‌కి దక్షిణామూర్తి రావడంతో దీప, జ్యోత్స్నలు షాక్ అవుతారు. నా మనవరాలు ఇలా అసిస్టెంట్‌గా ఉండటం ఏంటని శివన్నారాయణపై రగిలిపోతాడు. నీ హోటల్స్‌కి పోటీగా నా హోటల్స్ కూడా ఉంటాయని, ఇకపై నీతోనే వార్ మొదలుపెడతానని దక్షిణామూర్తి వార్నింగ్ ఇస్తాడు.
జూలై 04వ తేదీ 714వ ఎపిసోడ్‌లో..
నా ఆఫీస్‌లో దక్షిణామూర్తి మనుషులు ఎవరు అని శివన్నారాయణ ఆలోచిస్తుండగా సూరజ్ అతనితో మాట్లాడుతూ కనిపించడంతో షాక్ అవుతాడు. నీకు దక్షిణామూర్తికి సంబంధం ఏంటి? అని పెద్దాయన అడగటంతో నాకు ఆయన ఎవరో తెలియదు, మీ కుటుంబం గురించిన వివరాలు అడుగుతున్నారని సూరజ్ చెప్పడంతో శివన్నారాయణ ఫైర్ అవుతాడు. ఇది చూసిన కార్తీక్.. సూరజ్‌ను పక్కకి తీసుకెళ్లి మాట్లాడతాడు. శౌర్య స్కూల్ నుంచి బ్యాగ్ తీసుకుని ఆఫీస్‌కి రావడంతో సెటైర్లు వేస్తుంది. దీంతో శౌర్యకి చదువు చెప్పే బాధ్యతను జ్యోత్స్నకి అప్పగిస్తాడు పెద్దాయన. మధ్యలో దూరిన పారిజాతానికి శౌర్యని అప్పగించి తప్పుకుంటుంది జ్యోత్స్న. దక్షిణామూర్తి ఎవరో అతనితో శివన్నారాయణ గారికి వైరం ఏంటో సూరజ్‌కు చెబుతాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications