Karthika Deepam 2 Weekly: సూరజ్ దెబ్బకి జ్యోత్స్న ఉక్కిరిబిక్కిరి.. శివన్నారాయణ పరువు కాపాడిన దీప

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా జూన్ 8వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు 691 నుంచి 696వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

జూన్ 8వ తేదీ 691వ ఎపిసోడ్‌లో..
సూరజ్ జోలికి వెళ్లొద్దు అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండమని జ్యోత్స్నకి పారు చెబుతుండగా సూరజ్ ఫోన్ చేస్తాడు. రేపటి నుంచి నీకు నిద్రపట్టదని వార్నింగ్ ఇస్తాడు. మన జీవితాల్ని ఉతికి ఆరేసేవాడు ఒక్కడైనా తగులుతాడు, ఆ ఒక్కడు నీకు తగిలాడు అంటుంది పారు. వాడేం చేస్తాడో నేను కూడా చూస్తానని అంటుంది జ్యోత్స్న. దీప, శౌర్యలు దాగుడుమూతలు ఆడుకుంటూ ఉండగా శౌర్య వెళ్లి శివన్నారాయణ గదిలోని కబోర్డ్‌లో దాక్కుంటుంది. ఆ సమయంలో దక్షిణామూర్తి, శివన్నారాయణ ఫోటో చినిగిపోయి కనిపించడంతో ఈ ఫోటో ఎందుకు చినిగిపోయిందని అందరినీ అడుగుతుంది. ఇంతలో శివన్నారాయణ రావడంతో తనని కూడా అడుగుతుంది. కార్తీక్, దీపలు కూతురిని అడ్డుపెట్టుకుని దక్షిణామూర్తి గురించి వివరాలు రాబట్టాలని ఇలా ప్లాన్ చేశారని మండిపడుతుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్, జ్యోత్స్నలు గొడవపడుతుండగా.. శివన్నారాయణ గురించి మీకు తెలియాల్సిన టైం వచ్చిందని అందరికీ గతం చెబుతాడు.

జూన్ 9వ తేదీ 692వ ఎపిసోడ్‌లో..
తనను అదే పనిగా చూస్తున్న సూరజ్‌పై మండిపడుతుంది జ్యోత్స్న. నా వైపు చూస్తే వేధింపుల కేసు పెట్టి లోపల వేయిస్తానని అంటుంది. దక్షిణామూర్తి తాత గురించి ఏమంటావని దీప అడగ్గా.. ఆయన పైకి కనిపించేంత మంచివాడు కాదని అంటాడు కార్తీక్. నా తండ్రి చావుకు కోరుకున్న మనుషులు నాకు కూడా అక్కర్లేదని చెబుతుంది దీప. మన బ్రాంచ్‌కి రెండు ఆర్డర్లు వచ్చాయని దీపకి చెబుతాడు సూరజ్. ఇంతలో దీపకి ఓ ఫోన్ కాల్ రావడంతో కంగారుపడుతుంది. నా రెస్టారెంట్‌లో గొడవ జరుగుతుందని దీప చెప్పడంతో కార్తీక్, జ్యోత్స్న, సూరజ్‌లు పరుగులు తీస్తారు. రెస్టారెంట్లో ఓ వ్యక్తి బిర్యానీలో బల్లి పడిందని ఫుడ్ సేఫ్లీ డిపార్ట్‌మెంట్‌కి కాల్ చేస్తాడు. అయితే గొడవ చేస్తున్న వ్యక్తి మీద డౌట్ వచ్చిన సూరజ్.. అతని వెనుకే వెళ్లి నీకు 10 వేలు ఇస్తాను ఇంకా పెద్ద గొడవ చేయమని చెబుతాడు. ఇదంతా వీడియో రికార్డ్ చేస్తాడు సూరజ్. ఇతనితో ఒకరు డ్రామా ఆడిస్తున్నారని, మన రెస్టారెంట్ మూయించాలని చూస్తున్నాడని సూరజ్ చెప్పి వీడియోని బయటపెట్టడంతో జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి. దీప మాత్రం అతనిని క్షమించి వదిలేయమని అంటుంది

Karthika deepam 2 Serial Weekly Episodes June 8th to June 13th Here is Highlights

Photo Courtesy: JioHotstar

జూన్ 10వ తేదీ 693వ ఎపిసోడ్‌లో..
మాణిక్యం చేత నిజం చెప్పకుండా ఎందుకు అడ్డుపడ్డారని దీపని నిలదీస్తాడు సూరజ్. శివన్నారాయణ గారి సొంత మనవరాలే తన సొంత రెస్టారెంట్‌పై దుష్ప్రచారం చేయించిందని తెలిస్తే జనం ఒకటికి నాలుగు పుకార్లు పుట్టిస్తారు. అప్పుడు శివన్నారాయణ కుటుంబం తలదించుకోవాలని, అందుకే వాడిని అక్కడే వదిలేశానని అంటుంది దీప. తప్పు చేసినవారికి శిక్ష పడాలి కదా అని సూరజ్ అనగా.. తప్పుకు శిక్ష ఖచ్చితంగా ఉంటుందని అది ఇంట్లో వాళ్ల ముందే ఉంటుందని చెబుతాడు కార్తీక్. రెస్టారెంట్‌లో జరిగిన దానిపై దశరథ, శివన్నారాయణ రగిలిపోతుంటారు. మనపై ఇంత ద్వేషం ఎవరు చూపిస్తున్నారని దశరథ అడుగుతుండగా కార్తీక్ వస్తాడు. తప్పు చేసినవాడికి కాదు, అసలు వాడితో తప్పు చేయించిన వారికి శిక్ష పడాలని మాణిక్యంను తీసుకుని రమ్మని సూరజ్‌కి చెబుతాడు. నీతో ఈ పని చేయించిందెవరు? అనేది చెబుతావా? లేక పోలీస్ స్టేషన్‌కి వెళ్దామా అని కార్తీక్ బెదిరించడంతో జ్యోత్స్న మేడమే ఇదంతా చేయించారని మాణిక్యం చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. రెస్టారెంట్‌లోనే ఈ విషయం బయటపెట్టొచ్చు కదా అని పారు అడగ్గా.. అక్కడ నిజం బయటపెడితే శివన్నారాయణ గారి పరువు పోతుందని అలా చేశానని అంటుంది దీప. నీ ముఖం చూస్తేనే అసహ్యంగా ఉంది.. కడుపున పుట్టిన నీకంటే, ఏ రక్త సంబంధం లేని దీపే నా అసలు కూతురని అంటుంది సుమిత్ర. నా కుటుంబంలో నా వాళ్లు మాత్రమే ఉండాలి, నీకు స్థానం లేదని జ్యోత్స్నతో అంటాడు శివన్నారాయణ.

జూన్ 11వ తేదీ 694వ ఎపిసోడ్‌లో..
నా కుటుంబంలో ఇకపై జ్యోత్స్న ఉండదని, నా మనవరాలు ఎవరు అంటే దీపేనని చెబుతానని అంటాడు శివన్నారాయణ. మావయ్య గారు మంచి నిర్ణయమే తీసుకున్నారు ఎవరూ దీనితో మాట్లాడొద్దని చెబుతుంది సుమిత్ర. తనకు ఇంతటి అవమానం జరగడానికి కారణమైన సూరజ్‌ని లాగిపెట్టి కొడుతుంది జ్యోత్స్న. నా వాళ్ల ముందే నన్ను ఫూల్‌ని చేస్తావా? నిన్ను వదిలిపెట్టను రోజులు లెక్కపెట్టుకో నీకు ఎటు వైపు నుంచి చావు వస్తుందో కూడా తెలియదని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. ఇంతలో ఆమెకు ఐ లవ్ యూ అని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కానీ అంతలోనే మాట మార్చేసి థ్యాంక్స్ చెబుతాడు సూరజ్. ఇంట్లో జరిగిన దాని గురించి కార్తీక్, దీపలు మాట్లాడుకుంటూ ఉండగా జ్యోత్స్న వస్తుంది. నీ వల్లే నేను మా అమ్మకు దగ్గర అవుతున్నానని జ్యోత్స్న బుగ్గ గిల్లుతుంది దీప. నేను అనుకున్నది సాధించాలంటే దీప ఈ ఇంట్లో ఉండకూడదని అనుకుంటుంది జ్యోత్స్న.

Karthika deepam 2 Serial Weekly Episodes June 8th to June 13th Here is Highlights

Photo Courtesy: JioHotstar

జూన్ 12వ తేదీ 695వ ఎపిసోడ్‌లో..
తన తల్లికి దగ్గరవుతున్న దీపని ఇంటి నుంచి పంపేయడానికి జ్యోత్స్న స్కెచ్ వేస్తుంది. ఫ్యామిలీ మొత్తాన్ని సమావేశపరిచి.. నా తప్పు వల్లే ఇదంతా జరిగింది, దీప మీద గెలవడానికే ఇలా చేశానని అంటుంది జ్యోత్స్న. ఇందుకు దీపకు క్షమాపణలు చెబుతుంది. అత్తని, దీపని తీసుకుని బావ వాళ్లింటికి వెళ్లిపోవచ్చని జ్యోత్స్న చెప్పడంతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. మరి అగ్రిమెంట్ సంగతి ఏంటని కాంచన అడగ్గా.. నా పెళ్లి బాధ్యతల్ని బావే తీసుకున్నాడు, నా పెళ్లయిన వెంటనే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని చెబుతుంది జ్యోత్స్న. మీ అమ్మకి నువ్వు దగ్గరైపోతున్నానని సంబరపడిపోతున్నావు కదా? ఈ ఇంటికి వారసురాలి స్థానంలో నేనే ఉంటాను, నిన్ను ఈ ఇంటి గడప కూడా తొక్కనివ్వనని అంటుంది జ్యోత్స్న. దీపే మా అత్త కూతురని కార్తీక్ చెబుతుండగా ఆ మాటలు విన్న శివన్నారాయణ ఏం జరిగిందని అడుగుతాడు. దాంతో ఏదో ఒకటి కవర్ చేస్తాడు కార్తీక్. సూరజ్‌ని చంపేయమని రౌడీలకు చెబుతుంది జ్యోత్స్న. కారులో శివన్నారాయణ, జ్యోత్స్న వెళ్తుండగా.. సూరజ్‌ని చంపడానికి పంపిన రౌడీలు జ్యోత్స్న దగ్గరికి వచ్చి వాడిని చంపేశాం, 50 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తారు. జ్యోత్స్న ఇవ్వనని చెప్పడంతో ఆమెను కిడ్నాప్ చేయాలని కారు ఎక్కిస్తుండగా అది చూసిన శివన్నారాయణ మనవరాలిని కాపాడటానికి వెళ్లగా ఆయన్ని పక్కకి తోసేస్తారు. ఇంతలో సూరజ్ వచ్చి రౌడీలతో ఫైట్ చేసి జ్యోత్స్నని, శివన్నారాయణని కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా దెబ్బతింటాడు.

జూన్ 13వ తేదీ 696వ ఎపిసోడ్‌లో..
దీపకి ఓ మెయిల్ రావడంతో దానికి ఎలా రిప్లయ్ ఇవ్వాలో తెలియదు. ఆమెకు సాయం చేయాలని కార్తీక్ అనుకున్నా జ్యోత్స్న వెనక్కి లాగేస్తుంది. ఇంతలో కాలికి కట్టుతో ఆఫీస్‌కి వస్తాడు సూరజ్. రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికెందుకు వచ్చావని అడుగుతాడు కార్తీక్. జ్యోత్స్నని, సూరజ్‌ని వదిలేసి కార్తీక్, దీపలు కాఫీ తాగడానికి వెళ్తారు. జ్యోత్స్న టేబుల్ మీద ఐ లవ్ యూ అని రాసున్న పేపర్ కనపడటంతో ఆమె షాక్ అవుతుంది. వెంటనే వెళ్లి నిలదీస్తుండగా శివన్నారాయణ వస్తాడు.. ఈ సూరజ్ చెత్త పనులన్నీ చేస్తున్నాడని పేపర్ తీసి తాతకి చూపించగా అక్కడ థ్యాంక్యూ అని రాసుంటుంది. నువ్వు ఎక్కడ ఉంటున్నావని పెద్దాయన అడగ్గా.. ఆఫీస్‌కి దగ్గరలో ఇళ్లు చూసుకుంటూ ఉండగా మిమ్మల్ని కాపాడానని చెబుతాడు సూరజ్. కార్తీక్‌కి చెప్పి సూరజ్‌ని ఇంటికి తీసుకురమ్మంటాడు పెద్దాయన. కొన్నాళ్లు సూరజ్ ఇక్కడే ఉంటాడని కుటుంబ సభ్యులకు శివన్నారాయణ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X