Karthika Deepam 2 Weekly: జ్యోత్స్నకు మస్కా కొట్టిన కార్తీక్... దీప త్యాగంతో క్యాన్సర్‌ను గెలిచిన సుమిత్ర
Photo Courtesy: JioHotstar
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా మార్చి 16వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు 619 నుంచి 624వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
మార్చి 16వ తేదీ 619వ ఎపిసోడ్‌లో..
తనను చూడటానికి వచ్చిన దీపని కుశల ప్రశ్నలు అడుగుతుంది సుమిత్ర. ఇంతలో జ్యోత్స్న వచ్చి దీప బిడ్డను కనాలని అనుకోవడం లేదు.. వదులుకుంటోందని చెప్పడంతో సుమిత్ర సీరియస్ అవుతుంది. కడుపులోని బిడ్డను వదులుకోవడం చాలా పాపమని, మీరిద్దరూ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని మండిపడుతుంది సుమిత్ర. జ్యోత్స్న మరింత రెచ్చగొట్టడంతో కార్తీక్ సహనం కోల్పోతాడు.. నా కడుపులోని బిడ్డను చంపుకుంటాను, ఉంచుకుంటాను అడగటానికి మీరెవరు అంటాడు. ఇంతలో శివన్నారాయణ వచ్చి వాళ్లిద్దరికీ చెప్పలేమని మండిపడతాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత దీప కడుపులోని బిడ్డని ఎలాగైనా కాపాడమని దశరథని బతిమలాడుతుంది సుమిత్ర. కార్తీక్ - దీపల నిర్ణయంతో కాంచన కుమిలిపోతూ ఉంటుంది. నేను ఇక్కడ ఉండలేను, ఆ ఇంటికి రాలేనని బాధపడుతుండగా శ్రీధర్ వచ్చి ఓదారుస్తారు. వెంటనే కార్తీక్ వచ్చి పలకరించగా.. కాంచన కోప్పడుతుంది. నువ్వు నా దృష్టిలో ఆకాశం లాంటి వాడివి, నువ్వు ఈ నిర్ణయం తీసుకుని.. మాతో ఇన్ని మాటలు పడుతున్నావంటే దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని కార్తీక్‌తో అంటాడు శ్రీధర్. అదేంటే నేనే తెలుసుకుంటానని చెబుతాడు. గురువుగారిని కలిసిన దశరథకు దీప చుట్టూ మృత్యువు పొంచి ఉందని ఈమెని కాపాడటం ఆసాధ్యమని చెబుతాడు.
మార్చి 17వ తేదీ 620వ ఎపిసోడ్‌లో..
దీపని కాపాడే అవకాశం ఉంటే చెప్పమని గురువుగారిని బతిమలాడతాడు దశరథ. ఆ దైవాన్ని వేడుకోవడం తప్పించి మరో మార్గం లేదని, ఒక హోమం చేయాలని గురువుగారు తేల్చిచెప్పడంతో దశరథ సరేనని అంటాడు. నాకు నా భార్య, కూతురు, మనవరాలు ముగ్గురు క్షేమంగా ఉంటే చాలని అంటాడు. తల్లి మాటలు గుర్తొచ్చి బాధపడుతున్న దీపని కార్తీక్ ఓదారుస్తుండగా హాస్పిటల్‌కి జ్యోత్స్న, శివన్నారాయణలు వస్తారు. చివరిసారిగా అడుగుతున్నా, బిడ్డ గురించి మరోసారి ఆలోచించమని కార్తీక్, దీపలకు నచ్చచెబుతాడు శివన్నారాయణ. కార్తీక్ మాత్రం మా నిర్ణయం మార్చుకునేది లేదని తేల్చిచెబుతాడు. బిడ్డను కార్తీక్, దీపలు వద్దనడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని కావేరితో చెబుతాడు శ్రీధర్. అన్నయ్య వదినలు ఏదైనా చేస్తున్నారంటే అందరి మంచి గురించి ఆలోచించే చేస్తారని అంటుంది స్వప్న. కాశీ సైతం ఇదే మాట చెప్పడంతో మీరిద్దరూ మీ విషయంలో తప్పించి అందరి విషయాల్లో ఏకాభిప్రాయంతో ఉంటారని అంటాడు శ్రీధర్. కాశీ గురించి నా అభిప్రాయం ఎప్పటికీ మారదని కోపంగా వెళ్లిపోతుంది స్వప్న. దాస్‌ని జ్యోత్స్న కలిసి నాన్న అని కాకుండా దాస్ అని పేరు పెట్టి పిలవడంతో దాస్ షాక్ అవుతాడు. దీపని ఇబ్బంది పెట్టొద్దని దాస్ బతిమలాడినా జ్యోత్స్న పట్టించుకోదు.

Photo Courtesy: JioHotstar
మార్చి 18వ తేదీ 621వ ఎపిసోడ్‌లో..
దీపని వదిలేసి.. నువ్వు చేస్తున్నవన్నీ ఇక్కడితో ఆపేయకపోతే నువ్వు జీవితంలో చాలా నష్టపోతావని కూతురికి వార్నింగ్ ఇస్తాడు దాస్. అయితే నేను నీ కూతురిని అని ఒప్పుకోమని అడుగుతుంది జ్యోత్స్న. ఏం చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు దాస్. అయితే నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా దారుణాలు చేస్తానని చెప్పి కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. సుమిత్రను దశరథ ఆపరేషన్‌కు తీసుకెళ్తుండటంతో అందరూ కలిసి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా ఉన్నారని పారుతో చెబుతుంది జ్యోత్స్న. సుమిత్రకి ఆపరేషన్ జరగకూడదని కొత్త పథకం వేస్తుంది. హాస్పిటల్‌కు కుటుంబంతో పాటు వెళ్లకుండా తాను మళ్లీ వస్తానని దశరథ చెప్పి వెళ్లిపోవడంతో జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. నేరుగా గురువుగారితో కలిసి హోమంలో కూర్చొంటాడు దశరథ. ఈరోజు చాలా పెద్ద టాస్క్ భారం మొత్తం నీదే, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్లొద్దని కార్తీక్‌కు చెబుతుంది డాక్టర్ హారిక. కార్తీక్‌కు శ్రీధర్ ఫోన్ చేసి శౌర్య కనిపించడం లేదని చెప్పడంతో అతను కంగారుపడుతూ బయటకు వస్తుండగా.. శివన్నారాయణ, పారు, సుమిత్ర, జ్యోత్స్నలు ఆసుపత్రికి వస్తారు. శౌర్య మాయం కావడం వెనుక జ్యోత్స్న ఉందని అనుమానించిన కార్తీక్.. ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ వెంటనే దీప దగ్గరికి వచ్చిన పారిజాతం.. శౌర్య కిడ్నాప్ అయినట్లు చెప్పడంతో ఆమె కంగారు వెళ్తుండగా డాక్టర్ హారిక ఆపుతుంది.
మార్చి 19వ తేదీ 622వ ఎపిసోడ్‌లో..
శౌర్య కనిపించకపోవడంతో దీప కంగారుగా వెళ్తుండటంతో అప్పుడే గది బయట డాక్టర్ హారిక ఎదురవుతుంది. సుమిత్రగారు వచ్చేశారు.. ఆపరేషన్‌కి అన్ని ఏర్పాట్లు చేసేశాను, నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదని చెబుతుంది. కార్తీక్ ఎక్కడ అని హారిక అడగ్గా.. ఫోన్ వస్తే బయట మాట్లాడుతున్నాడని చెబుతుంది దీప. అది కాదు వాడు దీపని వెతుక్కుంటూ వెళ్లాడని పారు చెప్పడంతో హారిక టెన్షన్ పడుతుంది. అసలు సుమిత్ర ఆపరేషన్‌కి, దీప ఇక్కడే ఉండటానికి సంబంధం ఏంటని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంది. ఈ బీపీ తట్టుకోలేకపోతున్నానని.. కార్తీక్ వచ్చే వరకు లోపలే ఉండమని దీపను లోపల పెడుతుంది హారిక. పారు దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. ప్లాన్ ప్రకారం దీప బయటకు రాకుండా చూసుకోమని కాపలాగా పెట్టి వెళ్తుంది. ఆపరేషన్ థియేటర్‌లో జ్యోత్స్నకి మత్తు ఇంజెక్షన్ ఇస్తుంది హారిక. శౌర్యను వెతుక్కుంటూ వెళ్తున్న కార్తీక్‌కి దాస్ ఫోన్ చేసి శౌర్య ఎక్కడుందో చెబుతాడు. వెంటనే అక్కడికి వచ్చిన కార్తీక్‌కి శౌర్యని దీపే కిడ్నాప్ చేయించిందని ఇంటి దగ్గర ఏం జరిగిందో చెబుతాడు. ఆ వెంటనే రౌడీలను చితకబాది శౌర్యను రక్షించి ఇంటికి చేరుస్తాడు కార్తీక్. మన కొడుకు, కోడలు పెద్ద గండంలో ఉన్నారని కాంచనతో అంటాడు శ్రీధర్.

Photo Courtesy: JioHotstar
మార్చి 20వ తేదీ 623వ ఎపిసోడ్‌లో..
ఆపరేషన్ థియేటర్ బయట శివన్నారాయణ, దీప గది బయట పారిజాతం ఉండటంతో డాక్టర్ హారిక టెన్షన్ పడుతుంది. మీరేం టెన్షన్ పడొద్దు.. నేను అన్నింటికి ప్లాన్ చేశానని కార్తీక్ చెబుతాడు. ఇంతలో పారుకు దాస్ ఫోన్ చేసి నీ మనవరాలు దొరికిందని చెప్పడంతో ఆమె ఆనందంతో గాల్లో తేలిపోతుంది. కొడుకు దగ్గరికి వెళ్తూ శివన్నారాయణను కూడా గుద్ధేస్తుంది. నేను నా మనవరాలి దగ్గరికి వెళ్తున్నానని పారు నోరు జారడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. ఏదో రకంగా కవర్ చేసి శివన్నారాయణ నుంచి తప్పించుకుని దాస్ దగ్గరికి వెళ్తుంది పారు. మనం చేసిన అన్యాయానికి నీ మనవరాలు రాను అని చెప్పిందని అంటాడు దాస్. ఆ వెంటనే తల్లితో మత్తు మందు కలిపిన వాటర్ తాగించడంతో పారు పడిపోతుంది. ఆపరేషన్ కోసం దీపని తీసుకుని వస్తుంది హారిక. అప్పటికే మత్తులో ఉన్న జ్యోత్స్నకు ఎదురుగా దీప ఉన్నప్పటికీ ఏం అర్ధం కాదు. ఆ వెంటనే సక్సెస్‌ఫుల్‌గా సుమిత్రకు ఆపరేషన్ చేస్తుంది డాక్టర్ హారిక. నిద్రలేచి చూసేసరికి తాను ఆసుపత్రిలో ఉండటంతో షాక్ అవుతుంది పారిజాతం. వెంటనే దీప దగ్గరికి వెళ్లి పలకరిస్తుంది. మరోవైపు.. సుమిత్రకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత జ్యోత్స్నకు మెలకువ వస్తుంది.
మార్చి 21వ తేదీ 624వ ఎపిసోడ్‌లో..
ఆపరేషన్ జరిగి సుమిత్ర క్షేమంగా ఉందని, కానీ మన బిడ్డను మాత్రం పుట్టకముందే కోల్పోయామని దీపతో చెప్పి బాధపడతాడు కార్తీక్. జ్యోత్స్న దగ్గరికి వెళ్లిన పారిజాతం.. ఇప్పుడు ఎలా ఉందని అడగ్గా, నాకు ఆపరేషన్ చేశారని, లేవలేకపోతున్నానని చెబుతుంది జ్యోత్స్న. సుమిత్ర కూతురివి నువ్వే కాబట్టి నీకే ఆపరేషన్ చేస్తారని చెబుతుంది పారు. నువ్వు దీప గది ముందే కాపలా కాశావా అని జ్యోత్స్న అడగ్గా.. అక్కడే ఉన్నానని అబద్ధం చెబుతుంది పారు. ఇంతలో కార్తీక్ వచ్చి మేడం గారు చేసిన త్యాగం గురించి అందరికీ చెబుతానని ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. సుమిత్ర గారికి సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ జరిగిందని డాక్టర్ హారిక చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. దాంతో దశరథ నేరుగా దీప దగ్గరికి వచ్చి నీ తల్లిని కాపాడుకున్నావు.. కానీ నేనే నీ బిడ్డను కాపాడలేకపోయానని బాధపడతాడు. దశరథ ప్రవర్తన గత కొన్నిరోజులుగా తేడా ఉంటోందని శివన్నారాయణకు అనుమానం వస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











