Karthika Deepam 2 Weekly: ఆస్తి దీప దక్కేలా దశరథ స్కెచ్.. జ్యోత్స్న కొత్త గేమ్, స్వప్నకి రెండో పెళ్లి
Photo Courtesy: JioHotstar
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా మార్చి 23వ తేదీ నుంచి మార్చి 28వ తేదీ వరకు 625 నుంచి 630వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
మార్చి 23వ తేదీ 625వ ఎపిసోడ్‌లో..
ఆపరేషన్ పూర్తి కావడంతో జ్యోత్స్న, సుమిత్రలకు ఇంటి దగ్గర దిష్టి తీస్తుంది పారిజాతం. ఆపరేషన్ జరిగాక మళ్లీ ఈ ఇంటికి తిరిగి వస్తానని అనుకోలేదని సుమిత్ర కంటతడిపెడుతుంది. నీ కూతురే నిన్ను కాపాడింది.. ఇంజెక్షన్ అంటే భయపడే జ్యోత్స్న నీకోసం ఆపరేషన్ చేయించుకుందని చెబుతుంది పారిజాతం. దాంతో సుమిత్ర వెళ్లి జ్యోత్స్న చేయి పట్టుకుని ఏడుస్తుంది. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో దశరథ బయటకు వెళ్లడంతో .. ఏదో జరుగుతుందని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. ఇంటికి వెళ్లి కాంచనతో బిడ్డ గురించి ఏం చెప్పాలో అర్ధంకాక దీప - కార్తీక్‌లు ఏడుస్తుంటారు. ఇంతలో డాక్టర్ హారిక వచ్చి.. దీప కడుపులోని బిడ్డ క్షేమంగా ఉందని చెప్పడంతో కార్తీక్- దీపలు సంతోషించి మీ రుణం తీర్చుకోలేమని అంటారు. ఇంటికి వెళ్లేసరికి కాంచన లగేజీ సర్దుకుని వెళ్లిపోవడానికి రెడీగా ఉంటుంది. కార్తీక్- దీపలకు కాంచన, అనసూయ, శ్రీధర్ క్లాస్ పీకుతుండగా... దశరథ వస్తాడు.
మార్చి 24వ తేదీ 626వ ఎపిసోడ్‌లో..
మేం నలుగురు వెళ్లాం.. నలుగురం వచ్చాం, దీప బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని, నీకిచ్చిన మాటను నిలబెట్టుకున్నానని దశరథ చెప్పడంతో అంతా సంతోషిస్తారు. ఇదంతా బయటి నుంచి వీడియో కాల్ ద్వారా జ్యోత్స్నకు చూపిస్తుంది పారిజాతం. అచ్చం తనకు మాదిరిగానే దీప నడుస్తుండటంతో జ్యోత్స్నకు తేడా కొడుతుంది. కార్తీక్ ఇంటి బయట దొంగచాటుగా వీడియో కాల్ మాట్లాడుతున్న పారుని శివన్నారాయణ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు. లోపలికి రాలేక బయటి నుంచి వాళ్ల మాటలు వింటున్నానని.. దీప బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని పారు చెప్పడంతో శివన్నారాయణ సంతోషిస్తాడు. సుమిత్ర ప్రాణాలతో బయటపడినట్లు, దీప బిడ్డ క్షేమంగా ఉన్నట్లు దాస్ చెప్పడంతో కావేరి, స్వప్న, కాశీలు సంతోషిస్తారు. అలాగే స్వప్నకి వేరే సంబంధం చూశామని, త్వరలోనే అబ్బాయి చూసుకోవడానికి వస్తున్నాడని దాస్ చెప్పడంతో కాశీ ఉలిక్కిపడతాడు. బిడ్డను వదులుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే దీప ఎందుకు అంత నీరసంగా ఉందని పారు ప్రశ్నించడంతో కాంచన, శ్రీధర్, శివన్నారాయణలు కూడా డౌట్ పడతారు. దీప హాస్పిటల్‌లో పడిపోయిందని అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు కార్తీక్. అసలు సుమిత్ర కూతురు ఎవరో తెలుసుకోవడానికి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తుంది జ్యోత్స్న. ఇంటికొచ్చిన పారు.. జ్యోత్స్నపై మండిపడుతుంది.

Photo Courtesy: JioHotstar
మార్చి 25వ తేదీ 627వ ఎపిసోడ్‌లో..
దశరథ, సుమిత్రలను జ్యోత్స్న చంపేసినట్లు పీడకల రావడంతో దీప నిద్రలో ఉలిక్కిపడి లేస్తుంది. అమ్మానాన్నలని వెంటనే చూడాలని మారాం చేయడంతో రేపొద్దున్నే తాత ఇంటికి వెళ్తున్నామని ధైర్యం చెబుతాడు కార్తీక్. సుమిత్రకు దశరథ అన్నం తినిపిస్తుండగా ఆమె కంటతడి పెడుతుంది. జ్యోత్స్నకి పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుందామని చెబుతుంది సుమిత్ర. ఇంతలో జ్యోత్స్న అక్కడికి వచ్చి డాడీ నాతో సరిగా ఉండటం లేదని బాధపడుతుంది. డాక్టర్ హారిక ఇంటికి రావడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. సుమిత్రని రెగ్యులర్ చెకప్ కోసం నేనే రమ్మన్నానని చెబుతాడు దశరథ. సుమిత్రను పరీక్షించిన హారికకు ఆమె మెంటల్ కండీషన్ ఏం బాలేదని, బాధ కలిగించే ఏ విషయాలు చెప్పొద్దని హెచ్చరిస్తుంది. జ్యోత్స్నని పర్సనల్‌గా పిలిచిన కార్తీక్.. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటీ? నీకున్న అనుమానాలు ఏంటీ? శౌర్యను ఎందుకు కిడ్నాప్ చేయించావు? హాస్పిటల్‌లో దీప రూమ్ బయట పారుని ఎందుకు కాపలా పెట్టావు? మా ఇంటికి పారుని ఎందుకు పంపించావు? అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు.
మార్చి 26వ తేదీ 628వ ఎపిసోడ్‌లో..
సుమిత్రని కాంచన, శ్రీధర్ పరామర్శిస్తారు. వీలైనంత త్వరగా జ్యోత్స్నకి పెళ్లి చేసి అత్తారింటికి పంపేయమని దశరథతో చెబుతుంది దీప. నిజం చెప్పడానికి సుమిత్ర అత్తని మానసికంగా సిద్ధం చేద్దామని కార్తీక్ చెప్పడంతో సరేనని అంటాడు దశరథ. జ్యోత్స్న ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పేసింది.. అది పెళ్లి చేసుకుని పిల్లలతో ఇంట్లో తిరుగుతుంటే చూడాలని ఉందని చెబుతుంది సుమిత్ర. జ్యోత్స్నని పెళ్లికి ఒప్పించడానికి కొంచెం కఠిన నిర్ణయం తీసుకుంటానని దశరథ చెప్పగా.. దాని జీవితం బాగుంటుంది అంటే నాకు ఇష్టమేనని అంటుంది సుమిత్ర. ఇంతలో ఇంటికి లాయర్ వచ్చి దశరథ గారు వీలునామాను మార్చి రాయించారని చెబుతాడు. దశరథ గారి రక్తం పంచుకుని కూతురికి పుట్టిన బిడ్డకు ఈ ఆస్తి చెందుతుందని, 15 నెలల్లో అలా జరగకపోతే ఆయన మేనల్లుడు కార్తీక్ కుటుంబానికి చెందుతుందని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మా నాన్నతో నువ్వు, నీ ఫ్యామిలీ కలిసి ఈ పని చేయించారని కార్తీక్‌పై విరుచుకుపడుతుంది జ్యోత్స్న.

Photo Courtesy: JioHotstar
మార్చి 27వ తేదీ 629వ ఎపిసోడ్‌లో..
లాయరు గారు వీలునామాను మార్చి రాయాల్సిందేనని జ్యోత్స్న పట్టుబట్టగా.. ఒక్క అక్షరం కూడా మార్చనని దశరథ తేల్చేస్తాడు. నువ్వు నా కూతురివి కాదా? అని దశరథ నిలదీయడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నీ చెల్లెలి కుటుంబం కోసం నాకు అన్యాయం చేస్తున్నావని జ్యోత్స్న మండిపడుతుంది. దశరథ బావకి ఆస్తి మొత్తం రాసిచ్చినప్పుడు మావయ్య గారి మీద కేసు వేద్దామని ఎంత అడిగినా కాంచన, కార్తీక్‌లు ఒప్పుకోలేదని.. అలాంటి వారిపై నిందలు వేయొద్దని వార్నింగ్ ఇస్తాడు శ్రీధర్. ఆ క్లాజు మార్చేయమని కార్తీక్ చెప్పగా.. అసలు నాకు చెప్పడానికి నువ్వు ఎవరు అంటాడు దశరథ. ఇంతలో సుమిత్ర వచ్చి వీలునామా మార్చాల్సిన అవసరం లేదు.. జ్యోత్స్న పిల్లలకు ఆస్తి దక్కాలని రాశారంటే.. అది జ్యోత్స్నకి రాసినట్లేనని అంటుంది. త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఆస్తి జ్యోత్స్నదే అంటుంది సుమిత్ర. అసలు కార్తీక్ బావని అగ్రిమెంట్ పేరుతో ఇంట్లోకి రప్పించడమే నేను చేసిన తప్పు, ఇప్పుడే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నానని చెబుతుంది జ్యోత్స్న. అందరూ వెళ్లిపోయిన తర్వాత వీలునామా గురించి ఆలోచిస్తుంది జ్యోత్స్న. ఇంతలో దీప వచ్చి ఆమెకు క్లాస్ పీకుతుంది.
మార్చి 28వ తేదీ 630వ ఎపిసోడ్‌లో..
నేను గెలిచేశాను అనుకున్న ప్రతిసారి నువ్వు వచ్చి నాకు అడ్డు పడుతున్నావని దీపపై మండిపడుతుంది జ్యోత్స్న. అమ్మానాన్నలు నీ పెళ్లి చూడాలని కలలు కంటున్నారు, ఆ విషయం గురించి ఆలోచించమని చెబుతుంది దీప. స్వప్నను చూడటానికి పెళ్లి కొడుకుని తీసుకుని దాస్ రావడంతో కాశీ, కావేరీలు షాక్ అవుతారు. తండ్రిని బయటకు తీసుకొచ్చి.. నేను స్వప్నని దక్కించుకోవడానికి ఇంత కష్టపడుతుంటే నువ్వు ఇలా చేస్తావా అని బాధపడతాడు. స్వప్న దారిలోకి రావాలంటే ఇలాంటి షాక్‌లు తప్పవని అంటాడు దాస్. ఇంతలో దాస్‌కి కార్తీక్ ఫోన్ చేసి ఓ ప్లాన్ చెబుతాడు. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఈ ఆస్తి నీదేనని జ్యోత్స్నకి చెబుతుంది పారు. నాకు మీరిద్దరే ముఖ్యం.. జ్యోత్స్నకి ఆస్తిని ఇచ్చేయమని దశరథతో చెబుతుంది దీప. వీలునామా గురించి కాంచన ఆలోచిస్తూ.. దీని వెనుక ఉన్నది నువ్వేనా అని కొడుకుని అడుగుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











