Karthika Deepam 2 Weekly: కాంచన దగ్గర దీపని ఇరికించిన పారిజాతం.. డాక్టర్‌పై జ్యోత్స్న నిఘా
Photo Courtesy: JioHotstar
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా మార్చి 2వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు 607 నుంచి 612వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
మార్చి 2వ తేదీ 607వ ఎపిసోడ్‌లో..
కార్తీక్ ఎంత చెప్పినా దీప కడుపులోని బిడ్డను వదులుకోవడానికి దశరథ ఒప్పుకోడు. బిడ్డను చంపాలని అనుకుంటున్న నీకు, పారిజాతం పిన్నికి తేడా ఏంటని ప్రశ్నిస్తాడు దశరథ. అత్త ప్రాణాలు కాపాడటానికి మరో దారి ఉంటే బిడ్డను ఎందుకు వదులుకుంటానని కార్తీక్ ప్రశ్నిస్తాడు. భార్య ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఆ బిడ్డను ఎప్పుడెప్పుడు చూడాలి? ఎప్పుడెప్పుడు గుండెలకు హత్తుకోవాలని తండ్రి వేయి కళ్లతో ఎదురుచూస్తుంటాడు. అత్త కడుపుతో ఉన్నప్పుడు నువ్వు కూడా ఇదే అనుభూతిని చూసి ఉంటావని చెబుతాడు కార్తీక్. నా కూతురి కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపొద్దని వేడుకుంటాడు. అయితే అత్త చనిపోయినా పర్లేదా? అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. ఆ మాటలతో దశరథ షాక్ అవుతాడు. నా భార్య లేకుండా నేను బతకలేను.. నాకు సుమిత్ర కావాలని అడుగుతాడు. అయితే ఇంటికి వెళ్లి అత్త పరిస్ధితి ఒకసారి చూసి నీ నిర్ణయం ఏంటో చెప్పమని అంటాడు కార్తీక్. దశరథ ఇంటికి వెళ్లేసరికి సుమిత్ర విపరీతంగా దగ్గుతూ, నోటి వెంట రక్తం వస్తుంది. అది చూసి దశరథ తల్లడిల్లిపోతాడు. ఇంతలో పారిజాతం, శివన్నారాయణ, జ్యోత్స్నలు పరుగు పరుగున అక్కడికి వస్తారు. జ్యోత్స్న హెల్ప్ చేస్తానని చెప్పగా దశరథ కోప్పడతాడు. తల్లి పరిస్ధితి చూసి దీప కంటతడి పెడుతుంది.
మార్చి 3వ తేదీ 608వ ఎపిసోడ్‌లో..
సుమిత్ర ఆరోగ్య పరిస్థితి గురించి తలచుకుంటూ బాధపడతాడు దశరథ. కార్తీక్, దీపలు వచ్చి ఓదారుస్తారు. నా కూతురి బాల్యాన్ని నా మనవరాలి ద్వారా తిరిగి పొందాలని అనుకుంటున్నా.. నా కూతురి అల్లరి చిన్నారిలో చూడాలని కలలు కన్నా. అన్నింటికి మించి దీప కడుపులో పెరుగుతున్నది తన తల్లేనని కాంచన నమ్ముతోందని చెబుతాడు దశరథ. అత్తను కాపాడాలంటే బిడ్డను వదులుకోవడం తప్పించి మరో పరిష్కారం లేదని తేల్చిచెబుతాడు కార్తీక్. ఇంతలో అక్కడికి వచ్చిన జ్యోత్స్న, పారిజాతంలు.. అలు ప్రాబ్లమ్ ఏంటీ? పరిష్కారం ఏంటీ? అని నిలదీస్తారు. కార్తక్ ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. మరోవైపు.. కాశీ- స్వప్నలు విడిపోతున్నారని తెలిసి, ఏం చేయలేకపోతున్నానని బాధపడతాడు దాస్. నేను స్వప్నని వదిలిపెట్టనని, ఆమె ఈగో చల్లారేలా చేస్తున్నానని చెబుతాడు కాశీ. విడాకులు ఇచ్చినా నేను స్వప్నని మళ్లీ ప్రేమించి ఆమెతో తిరిగి కలుస్తానని అంటాడు. ఆ మాటలతో దాస్ సంతోషిస్తాడు. దీపను ఆసుపత్రిలో చేర్చేందుకు గాను రేపటి నుంచి నెల రోజుల పాటు మేం పనిలోకి రామని చెబుతాడు కార్తీక్. నా పర్మిషన్ లేకుండా ఈ నిర్ణయం తీసుకోకూడదని.. మీరిద్దరూ నెలరోజులు ఇక్కడే ఉండాలని ఆర్డర్స్ వేస్తుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్ కట్టాల్సిన 10 కోట్ల రూపాయలు నేనే కట్టేస్తానని కార్తీక్‌ను వదిలేయమని చెబుతాడు శివన్నారాయణ. కార్తీక్, దీప, దశరథ మధ్య ఏదో జరుగుతుందని పారుకు అనుమానం వచ్చి దశరథను ఫాలో అవుతుంది.

Photo Courtesy: JioHotstar
మార్చి 4వ తేదీ 609వ ఎపిసోడ్‌లో..
బిడ్డను వదులుకోవడం తప్పించి ఈ సమస్యకు పరిష్కారం లేదని దశరథతో కార్తీక్ చెబుతుండగా పారిజాతం దొంగచాటుగా వింటుంది. ఈ విషయాన్ని వెంటనే కాంచనకు చెప్పాలని అనుకుంటుంది. స్వప్నకి యాపిల్ తినిపిస్తూ ప్రేమగా చూసుకుంటూ ఉన్న శ్రీధర్‌పై కావేరి మండిపడుతుంది. కూతురు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి జీవితాన్ని నాశనం చేసుకుంది.. దానిని మందలించకుండా యాపిల్స్ తినిపిస్తున్నారా? అని ఫైర్ అవుతుంది కావేరి. ఏ కూతురికైనా నాన్నే హీరో.. కూతురు తప్పు చేసిందని వదిలేసుకోడు, ఆమెకు కొండంత ధైర్యంలా ఉంటాడని చెబుతాడు. ఆ మాటలతో తండ్రిని హత్తుకుంటుంది స్వప్న. కాంచనకు పారిజాతం ఫోన్ చేసి దీప కడుపును వద్దు అనుకుంటోందని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. దశరథ, దీప, కార్తీక్‌లు మాట్లాడుకుంటూ ఉండటంతో నేను స్వయంగా చూశానని చెబుతుంది. పారిజాతం మాటలతో దీప ప్రవర్తనపై కాంచనకు అనుమానం వస్తుంది. హాస్పిటల్‌లో అడ్మిట్ ఎలా అవ్వాలి? అత్తయ్యకి ఏం చెప్పాలని అడుగుతుంది దీప. అంతా నేను చూసుకుంటానని కార్తీక్ అంటాడు. ఉదయాన్నే శ్రీధర్‌ని, అనసూయని పిలిపించిన కాంచన.. దీప తన కడుపును వద్దు అనుకుంటోందని చెప్పడంతో వారిద్దరూ షాక్ అవుతారు. ఇంతలో కార్తీక్- దీపలు లగేజ్‌తో అక్కడికి వచ్చి మేం కొద్దిరోజులు బయటకు వెళ్లొస్తామని చెబుతారు.
మార్చి 5వ తేదీ 610వ ఎపిసోడ్‌లో..
పెళ్లయినప్పటి నుంచి దీపను ఎక్కడికి తీసుకెళ్లలేదు.. అందుకే తనని కొద్దిరోజులు బయటకు తీసుకెళ్దామని అనుకుంటున్నానని తల్లితో చెబుతాడు కార్తీక్. నువ్వు అబద్ధం చెబుతున్నావు.. నీ భార్యకు నా వారసత్వాన్ని మోయం ఇష్టం లేదు. అందుకే నిన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్తోందని మండిపడుతుంది కాంచన. ఆ మాటలతో దశరథ కుమిలిపోతాడు. అసలు దీప ఎందుకు ఈ పని చేస్తుందో తెలిస్తే మీరంతా తనకు దండం పెడతారని నిజం చెప్పబోతుండగా కార్తీక్ అడ్డుపడతాడు. అసలు నా భార్య గురించి మాట్లాడటానికి నీకు ఏం అర్హత ఉంది? అని అనడంతో అంతా షాక్ అవుతారు. మరోవైపు.. ఇంట్లో దశరథ, శివన్నారాయణలు కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లారని పారుని అడుగుతుంది జ్యోత్స్న. దీప బిడ్డను చంపుకోవాలని అనుకుంటోందని పారు చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీప, బావ, డాడీ మధ్య ఏదో జరుగుతోంది.. అదేంటో తెలుసుకోవాలని అనుకుని బయటకు వెళ్తుంది. కాశీకి ఉదయాన్నే కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది స్వప్న. ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు.. చాలా హ్యాపీగా ఉందని అంటుంది స్వప్న. ఆ మాటలు విన్న కావేరి తన కూతురిపై మండిపడుతుంది. నీకు విలువైన దాని విలువ ఉన్నప్పుడు తెలియదు.. తర్వాత తెలుస్తుందని చెప్పి వెళ్లిపోతాడు కాశీ. కాంచన మాటలు విన్న అనసూయ, శ్రీధర్‌లు కడుపు ఎందుకు తీయాలని అనుకుంటున్నావని నిలదీస్తారు.

Photo Courtesy: JioHotstar
మార్చి 6వ తేదీ 611వ ఎపిసోడ్‌లో..
డాక్టర్ హారికను జ్యోత్స్న కలిసి బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎక్కడి వరకు వచ్చింది? దాని ప్రోసీజర్ ఏంటీ? అని తెలుసుకుందాని వచ్చానని చెబుతుంది. అలాగే బోన్‌మారోని నేను కూడా ఇంకా ఎవరెవరు ఇవ్వొచ్చు అని అడుగుతుంది. ఆ మాటలతో హారిక షాక్ అవుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్లు ఇవ్వొచ్చా? ఇస్తే ఏదైనా ప్రాబ్లమా అని జ్యోత్స్న అడగ్గా.. హారిక షాక్ అవుతుంది. జ్యోత్స్నకి ఎలాంటి సమాధానం చెప్పకుండా బయటకు వచ్చేస్తుంది. అయినా జ్యోత్స్న వెంటాడటంతో నువ్వు ప్రెగ్నెంటా? నీకెందుకు ఇలాంటి డౌట్ అని హారిక మండిపడుతుంది. తనను విసిగిస్తే దశరథ గారికి చెబుతానని బెదిరించడంతో జ్యోత్స్న వెళ్లిపోతుంది. మరోవైపు.. తల్లి, బిడ్డల్లో ఒకరినే కాపాడుకోగలమని ఇద్దరిలో ఎవరిని కాపాడమంటావని కార్తీక్ అడగటంతో కాంచన సహా అందరూ షాక్ అవుతారు. దీని జాతకమే అంత.. కావాలని అనుకున్నది దూరమైపోతుంది. కన్నతల్లిదండ్రులు కూడా దీపకి కనిపించకూడదు.. కనిపిస్తే వాళ్లను దేవుడు తీసుకెళ్లిపోతాడని అనసూయ అనడంతో దశరథ షాక్ అవుతాడు. అందరూ దీపని అనేవాళ్లే కానీ.. తను ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోరా అంటాడు. ఎంత ఖర్చయినా పర్లేదు.. దీపని, కడుపులోని బిడ్డను కాపాడమని దశరథకు చెబుతాడు శివన్నారాయణ. ఆసుపత్రికి వెళ్తుండగా.. దీపని దశరథ చేతుల్లో పెట్టి బిడ్డను ఎలాగైనా కాపాడమని బతిమలాడుతుంది. ఆ మాటలతో దశరథ ఎమోషనల్ అవుతాడు
మార్చి 7వ తేదీ 612వ ఎపిసోడ్‌లో..
దీప, కార్తీక్, దశరథలు మాట్లాడుకుంటూ ఉంటారు. నా చెల్లికి నేను ఏమని సమాధానం చెప్పాలి.. దీప కడుపులోని బిడ్డ దూరమవుతుందని అంటే తట్టుకోలేదని బాధపడతాడు దశరథ. దాంతో కార్తీక్ ధైర్యం చెప్పి హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. ఆసుపత్రిలో దీపని పరీక్షించిన హారిక.. సుమిత్ర గారికి ఆపరేషన్ అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండాలని చెబుతుంది. సుమిత్ర గారిని ఎప్పుడు అడ్మిట్ చేయాలో చెబుతానని, కానీ జ్యోత్స్నతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. ఉదయం జ్యోత్స్న నన్ను కలిసి ప్రెగ్నెంట్‌గా ఉన్నవాళ్లు బోన్‌మారో ఇవ్వొచ్చా అని అడిగిందని డాక్టర్ హారిక చెప్పడంతో కార్తీక్, దశరథలు షాక్ అవుతారు. బూజు దులుపుతున్న స్వప్న కిందపడిపోతుండగా కాశీ వచ్చి పట్టుకుంటాడు. అయితే తనను వదిలేయమనడంతో స్వప్నని కిందపడేస్తాడు కాశీ. ఇదంతా చూసిన కావేరి నవ్వుకుంటుంది. దశరథను రెచ్చగొట్టి ఎలాగైనా నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంటికి వచ్చిన తండ్రిని మీరెందుకు దీప కోసం ఆసుపత్రికి వెళ్లారు.. ఆవిడ ఈ ఇంటి పనిమనిషి అని అంటుంది. దీప పనిమనిషి కాదని దశరథతో వాదిస్తుండగా శివన్నారాయణ వచ్చి ఇద్దరికీ సర్దిచెబుతాడు. తన ప్లాన్ ఫెయిల్ కావడంతో జ్యోత్స్న నిరాశ పడుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











