Karthika Deepam 2 Weekly: దీప హత్యకు జ్యోత్స్న యత్నాలు.. భార్యని కాపాడిన కార్తీక్, షాక్‌లో దాస్

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 631 నుంచి 636వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

మార్చి 30వ తేదీ 631వ ఎపిసోడ్‌లో..
డీఎన్ఏ రిపోర్ట్స్ ద్వారా దీపే సుమిత్ర కూతురని తెలుసుకున్న జ్యోత్స్న... పారుకి ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతుంది. ఇంతలో పారిజాతానికి దాస్ ఫోన్ చేసి అర్జెంట్‌గా రమ్మని చెబుతాడు. దీప ఎవరన్న సంగతి బావ, దీప, దాస్‌లకు తెలిసిపోయింది.. డాడీకి తెలుసా లేదా అన్న దాని గురించి ఆలోచిస్తుంది జ్యోత్స్న. ఆపరేషన్ టైంలో కూడా ఇలాగే మంచినీళ్లు ఇచ్చి నన్ను మత్తులో ముంచేశారు.. ఈసారి మీ ట్రాప్‌లో పడనని అంటుంది పారిజాతం. ఇంత రాత్రివేళ ఎందుకు రమ్మన్నావని పారిజాతం అడగ్గా.. నీ మనవరాలు ఎవరో? ఎక్కడుందో తెలిసిపోయిందని చెబుతాడు దాస్. కార్తీక్ భార్య దీపే నీ మనవరాలని చెప్పడంతో పారు షాక్ అవుతుంది. దీప నా మనవరాలు కాదని పారు చెప్పగా.. నా భార్య కళ్యాణి, నువ్వు శివన్నారాయణ ఇంట్లో పనిమనిషులు.. ఇప్పుడు దీప కూడా పనిమనిషే.. మన వంశానికి కరెక్ట్‌గా సెట్ అయ్యిందని దాస్ చెప్పడంతో పారు నిజమేనని నమ్ముతుంది. వెంటనే నా మనవరాలిని చూడాలని కార్తీక్ ఇంటికి పరుగులు తీస్తుంది. భోజనం చేస్తుండగా దశరథతో మాట్లాడాలని అంటుంది జ్యోత్స్న. అర్థరాత్రి కాంచన ఇంటి తలుపు కొడుతుంది పారు. కార్తీక్ తలుపు చూసేసరికి పారు ఉండటంతో అంతా షాక్ అవుతారు.

మార్చి 31వ తేదీ 632వ ఎపిసోడ్‌లో..
అర్ధరాత్రి ఇంటికొచ్చిన పారిజాతం.. దీపని అర్జెంట్‌గా చూడాలి, ఆమెను పిలవండి అంటూ నానాహంగామా చేస్తేంది. ఇంతలో దీప రావడంతో మనవరాలా అంటూ తనని హత్తుకోవడంతో కార్తీక్, కాంచన, అనసూయలు షాక్ అవుతారు. ఉదయం మిమ్మల్ని తిట్టాను కదా సారీ చెప్పాలని వచ్చానని అంటుంది పారు. కుబేర ఎంతో గొప్పవాడు.. బస్టాండ్‌లో పడివున్న దీపని కన్నకూతురిలా చూసుకున్నాడని పొగుడుతుంది. బతికుంటే గుడి కట్టేదానిని అంటుంది. ఇంతలో శౌర్య రావడంతో ఆమెను గట్టిగా హత్తుకుంటుంది పారిజాతం. మమ్మీ ఆపరేషన్ బాగా జరిగింది కాబట్టి మన బంధువులు, స్నేహితులను పిలిచి గ్రాండ్ పార్టీ ఇస్తానని అంటుంది జ్యోత్స్న. దీనికి శివన్నారాయణ, సుమిత్ర, దశరథలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అర్ధరాత్రి కావొస్తున్నా పారు రాకపోవడంతో జ్యోత్స్న, శివన్నారాయణలు ఎదురుచూస్తారు. పారు వచ్చేసరికి శివన్నారాయణ ఉండటంతో ఎక్కడికి వెళ్లొస్తున్నావని నిలదీస్తాడు. వాకింగ్‌కి వెళ్లానని అబద్ధం చెబుతుండగా.. కార్తీక్ పంపిన వీడియోను చూపిస్తాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. రేపు మా ఇంట్లో పార్టీ ఉంది మీ ఫ్యామిలీ అంతా రావాలి.. దీప ఖచ్చితంగా ఉండాలని జ్యోత్స్న చెప్పడంతో కార్తీక్‌కి అనుమానం వస్తుంది. అసలు దీప దగ్గరికి ఎందుకు వెళ్లావని పారును జ్యోత్స్న నిలదీయగా... నా ఇష్టమని వార్నింగ్ ఇస్తుంది పారు.

Karthika deepam 2 Serial Weekly Episodes March 30th to April 4th Here is Highlights

Photo Courtesy: JioHotstar

ఏప్రిల్ 1వ తేదీ 633వ ఎపిసోడ్‌లో..
దీప పార్టీ ఇస్తున్న సంగతిని ఇంట్లో వాళ్లందరికీ చెబుతాడు కార్తీక్. ఆస్తి దక్కించుకోవడానికి జ్యోత్స్న ఏదో ప్లాన్ చేసిందని కాంచనను, కార్తీక్‌ను హెచ్చరిస్తుంది అనసూయ. నాకు కూడా అదే అనుమానంగా ఉంది.. లాయర్‌ని పిలిపించి కార్తీక్‌తో సంతకం పెట్టిస్తుందేమోనని కాంచన కూడా భయపడుతుంది. కాశీని పిలిచిన స్వప్న.. రేపు ఉదయం త్వరగా వస్తే గుడికి వెళ్దామని అంటుంది. కాశీ సంతోషించేలోపే.. వచ్చేటప్పుడు వసంత్‌ని కూడా పికప్ చేసుకుని రమ్మని చెప్పడంతో అతను షాక్ అవుతాడు. స్వప్న మారిపోయి కాశీతో కలిసుంటే ఓకే.. లేదంటే నా కూతురి ఇష్టప్రకారమే చేస్తానని శ్రీధర్ తేల్చేస్తాడు. దీపకి జ్యోత్స్న ఫోన్ చేసి రేపు ఉదయం పార్టీకి ఖచ్చితంగా రావాలి, నువ్వు నా స్పెషల్ గెస్ట్‌వని చెబుతుంది. దాంతో జ్యోత్స్న ఏదో గట్టిగానే ప్లాన్ చేసిందని కార్తీక్ అనుమానిస్తాడు. ఉదయాన్నే దీప ఇంటికి రావడంతో మురిసిపోతుంది పారిజాతం. దీప మెడ బోసిగా ఉందని ఆమెకు తన నెక్లెస్ ఇవ్వబోతుండగా .. వద్దు పారిజాతం గారు అంటుంది దీప. పేరు పెట్టి పిలవకూడదు.. నానమ్మ అని పిలవాలని చెబుతుంది పారు. ఆమె ప్రవర్తనకు అంతా షాకైపోతారు. శౌర్యను ముద్దులాడుతూ ఐస్‌క్రీమ్ తెచ్చుకోమని పంపిస్తుండగా శౌర్యకి జ్యోత్స్న అడ్డుతగలడంతో పాప కిందపడిపోతుంది. .

ఏప్రిల్ 2వ తేదీ 634వ ఎపిసోడ్‌లో..
శౌర్యను ఢీకొట్టినందుకు గాను జ్యోత్స్నకి చెంప పగుల గొడుతుంది పారు. ఊహించని ఈ పరిణామంతో అంతా షాక్ అవుతారు. మర్యాదగా శౌర్యకు సారీ చెబుతావా లేదా? అంటూ పారిజాతం వార్నింగ్ ఇవ్వడంతో సారీ చెబుతుంది జ్యోత్స్న. దీప కోసం పారు జ్యూస్ తీసుకుని రాగా మరోసారి ఆమెను ఇరికిస్తాడు కార్తీక్. దీప దగ్గరికి వెళ్లిన జ్యోత్స్న నీ ఆరోగ్యం బాగానే ఉందా? పార్టీలో బాగా ఎంజాయ్ చేయ్.. అందరినీ తనివి తీరా చూసుకోమని చెబుతుంది. జ్యోత్స్న మాటలు తేడాగా ఉండటంతో దీపకి అనుమానం వస్తుంది. శౌర్యకి ఓ ప్యాకెట్ నిండా చాక్లెట్స్ ఇస్తుంది పారిజాతం. ఆడుకుందామని జ్యోత్స్న రూమ్‌కి శౌర్యని తీసుకెళ్తుంది పారు. అక్కడ ఆడుకుంటూ ఉండగా.. దిండు కింద దాచిన మెడికల్ రిపోర్ట్స్ పారుకి కనిపిస్తాయి. జ్యోత్స్న సీక్రెట్‌గా ఈ రిపోర్ట్స్ ఎందుకు దాచిందో అర్ధం కాక దానిని తీసి చూడగా అంతా ఇంగ్లీష్‌లో ఉండటంతో కార్తీక్‌తో చదివించుకుంటుంది. అవి డీఎన్ఏ రిపోర్ట్స్ కావడంతో పాటు జ్యోత్స్నకి అసలు నిజం తెలిసిపోవడంతో కార్తీక్ షాక్ అవుతాడు. జ్యోత్స్న వచ్చేలోపు రిపోర్ట్స్ తిరిగి దిండు కింద పెట్టేస్తుంది పారు. అయితే రిపోర్ట్స్ ఎవరో ఓపెన్ చేసినట్లు గ్రహించిన జ్యోత్స్న.. ఇక లేట్ చేయకూడదు కథకు వెంటనే ముగింపు వేయాలని అనుకుంటుంది.

Karthika deepam 2 Serial Weekly Episodes March 30th to April 4th Here is Highlights

Photo Courtesy: JioHotstar

ఏప్రిల్ 3వ తేదీ 635వ ఎపిసోడ్‌లో..
కంగారుపడుతూ వస్తున్న కార్తీక్‌ని ఏం జరిగిందని దాస్ ప్రశ్నిస్తాడు. దీపే సుమిత్ర అత్త కూతురని జ్యోత్స్నకి తెలిసిపోయింది.. ఆ నిజం మాకు కూడా తెలిసిందని జ్యోత్స్న పసిగట్టేసింది. ఇప్పుడు దీప ప్రమాదంలో ఉంది, తనను రక్షించాలని దాస్‌తో చెబుతాడు కార్తీక్. దీప మేడపై పూలు కోస్తుండగా వెనుక నుంచి జ్యోత్స్న ఆమెను తోసేయాలని అనుకుంటుంది. దీప కోసం ఇల్లంతా వెతికిన కార్తీక్, దాస్‌లు ఆమె మేడ మీదకి వెళ్లిందని తెలిసి పరుగు పరుగున వెళ్తారు. దీప అని కార్తీక్ గట్టిగా అరవడంతో జ్యోత్స్న తన ప్లాన్ ఫెయిలైనందుకు షాక్ అవుతుంది. నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో అది ఇక్కడితో ఆపేయమని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. నువ్వు ఊహించిన దానికంటే నేను ప్రమాదకరమైన దానిని అని చెబుతుంది జ్యోత్స్న. దీపని ఈరోజు వదిలే ప్రసక్తే లేదని ఆమె వెనుకాలే వెళ్తుంది జ్యోత్స్న. అందరూ భోజనాలు చేసేందుకు సిద్ధమవుతుండగా.. మన ఫ్యామిలీ వరకు సెపరేట్‌గా మెనూ సిద్ధం చేశానని చెబుతుంది జ్యోత్స్న. అందరికి విషం పెట్టి జ్యోత్స్న చంపాలని అనుకుంటుందని కార్తీక్‌కి అనుమానం వస్తుంది. భోజనాల దగ్గర అందరికంటే తొలి ముద్ద దీపే తినాలని చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. అయితే తొలి ముద్దని దీపే నీకు తినిపిస్తుందని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆహారం తిన్నప్పటికీ జ్యోత్స్నకు ఏం కాకపోవడంతో కార్తీక్, దాస్‌లు షాక్ అవుతారు.

ఏప్రిల్ 4వ తేదీ 636వ ఎపిసోడ్‌లో..
సుమిత్ర చేత కేక్ కట్ చేయించాలని ఏర్పాట్లు చేస్తుంది జ్యోత్స్న. ఈ కేక్‌ని నేనే దగ్గరుండి రెడీ చేశానని అంటుంది. దాంతో కేక్‌లో విషం పెట్టి అందరినీ చంపాలని అనుకుంటుందా అని కార్తీక్ అనుమానం వ్యక్తం చేస్తాడు. కేక్ కట్ చేసి సుమిత్ర తినిపిస్తుండగా జ్యోత్స్నకు చెమటలు పడతాయి. ఇంతలో దశరథ ఆమెను ఆపి జ్యోత్స్నకు బదులు దీపకి కేక్ తినిపించమని చెబుతాడు. దాంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది. దీపకి సుమిత్ర కేక్ తినిపిస్తుండగా కార్తీక్ అడ్డుకోబోతుండగా జ్యోత్స్న అడ్డు తగులుతుంది. దీప కేక్ తిన్నప్పటికీ ఏం కాకపోవడంతో జ్యోత్స్నకి ఏం అర్ధం కాదు. నువ్వు కేక్‌లో విషయం కలుపుతుండగా చూసి కేక్ మార్చేశానని చెబుతాడు కార్తీక్. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. వసంత్, స్వప్నలను కారులో గుడికి తీసుకెళ్తాడు కాశీ. మధ్యలో స్వప్న గురించి తన మనసులో మాటను చెబుతాడు. బంధువులంతా వెళ్లిపోయాక కార్తీక్. జ్యోత్స్న, దాస్‌లు మాట్లాడుకుంటారు. నువ్వు చేతకాని తండ్రివి.. నీ వల్ల మా బతుకులు ఇలా ఉన్నాయని దాస్‌పై కేకలు వేస్తుంది జ్యోత్స్న. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X