Karthika Deepam 2 Weekly: జ్యోత్స్న ఎత్తులతో కార్తీక్ ఉక్కిరిబిక్కిరి.. దీప నిర్ణయంతో కాంచన మనసు ముక్కలు

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా మార్చి 9వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు 613 నుంచి 618వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

మార్చి 9వ తేదీ 609వ ఎపిసోడ్‌లో..
ఇంట్లో తల్లిదండ్రులు కనిపించకపోవడంతో అమ్మానాన్న ఎక్కడికి వెళ్లారని శౌర్య అడగ్గా.. కాంచన విసురుగా సమాధానం చెబుతుంది. దాంతో నువ్వు మారిపోయావు.. నా మీద కోప్పడుతున్నావని బాధపడుతుంది శౌర్య. చెల్లి పుట్టగానే నన్ను హాస్టల్‌లో వేసేస్తారని జో గ్రానీ చెప్పిందని అనడంతో కాంచన ఏడుస్తుంది. నీ తర్వాతే నాకు ఎవరైనా అని శౌర్యను ముద్దు చేస్తుంది కాంచన. ఇంతలో కార్తీక్ రావడంతో అమ్మ ఎక్కడ అని అడుగుతుంది శౌర్య. అమ్మమ్మకి హెల్త్ బాలేదని.. కొద్దిరోజులు అమ్మ ఇంటికి రాదని చెబుతాడు కార్తీక్. బిడ్డ క్షేమంగా ఉందా? లేదా? డాక్టర్లు ఏమన్నారని కాంచన అడగటంతో కార్తీక్ కన్నీళ్లు పెడుతూ కుప్పకూలిపోతాడు. ఇంతలో శ్రీధర్ వచ్చి నేను కొద్దిరోజులు ఇక్కడే ఉంటానని చెప్పడంతో కాంచన షాక్ అవుతుంది. దాస్‌ని కలిసిన జ్యోత్స్న.. నన్ను మీరంతా చాలా తెలివిగా లాక్ చేశారు, నేను ఓడిపోయాను అని ఒప్పుకుంటున్నానని అంటుంది. మా డాడీ దీపని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.. నిజానికి అడ్మిట్ కావాల్సింది నేను. అంటే ఈ గ్యాప్‌లో బ్యోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. అవన్నీ నాకు తెలియదని దాస్ చెప్పగా.. ఎట్టి పరిస్ధితుల్లోనూ నా స్థానం దీపకి దక్కనివ్వనని ఛాలెంజ్ చేస్తుంది. సుమిత్రకు టాబ్లెట్ వేసిన దశరథ.. దీప గురించి ఆలోచిస్తుంటాడు. నాకేం కాదు కదా అని సుమిత్ర అడగ్గా.. నీ కూతురు తన ప్రాణాలు అడ్డుపెట్టయినా నిన్ను కాపాడుతుందని చెబుతాడు దశరథ.

మార్చి 10వ తేదీ 610వ ఎపిసోడ్‌లో..
కార్తీక్ హాస్పిటల్‌కి వచ్చేసరికి ఓ గైనకాలజిస్ట్.. దీపని టెస్ట్ చేయడానికి వస్తుంది. పక్కనే ఉన్న శ్రీధర్.. బిడ్డను కాపాడమని అడగటంతో, బిడ్డను వదులుకుంటానంటే మీరు కాపాడమంటారు అని మండిపడుతుంది డాక్టర్. దాంతో పక్కనే ఉన్న హారిక సైగ చేస్తుంది. కార్తీక్ ఏదో ఒక రకంగా విషయాన్ని కవర్ చేసి శ్రీధర్‌ని, శౌర్యని ఇంటికి పంపేస్తాడు. హాస్పిటల్ వద్ద జ్యోత్స్నతో దాస్ మాట్లాడతాడు. నేను నీ కూతురిని కాదని నీ భార్య మీద ఒట్టేయమని జ్యోత్స్న అడగటంతో దాస్ షాక్ అవుతాడు. మీరంతా కలిసి నా స్థానంలో దీపని కూర్చోబెడితే నేను చచ్చిపోతాను.. అంతేకాదు నేను చనిపోయే కొద్ది క్షణాలు ముందైనా దీపని చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. దీప బతకాలంటే నేనే శివన్నారాయణ గారి వారసురాలిగా ఉండాలని .. లేదంటే ఆమె చనిపోతుందని చెబుతుంది. ఆ మాటలతో దాస్ షాక్ అవుతాడు. ఇదంతా దొంగచాటుగా విన్న దశరథ... నీ కూతురిని వదిలిపెట్టనని తాడోపేడో తేల్చేస్తానని దాస్‌తో అంటాడు. హాస్పిటల్‌లో డాక్టర్ చెప్పిన మాటలు, కార్తీక్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నాయని కాంచనతో అంటాడు శ్రీధర్.

Karthika deepam 2 Serial Weekly Episodes March 9th to March 14th Here is Highlights

Photo Courtesy: JioHotstar

మార్చి 11వ తేదీ 611వ ఎపిసోడ్‌లో..
తన కడుపులోని బిడ్డ గురించి దీప బాధపడుతుండగా కార్తీక్ ఓదారుస్తాడు. ఇంతలో కార్తీక్‌కి శివన్నారాయణ ఫోన్ చేసి రేపు ఉదయాన్నే కలవడానికి రమ్మని చెబుతాడు. దాంతో తాతకి ఏదో అనుమానం వచ్చిందని కార్తీక్ కంగారుపడతాడు. నువ్వు చెప్పమన్నట్లుగానే కార్తీక్‌ను రప్పిస్తున్నానని.. ఏదైనా తేడా జరిగితే నీకు, పారిజాతానికి పనిష్మెంట్ ఇస్తానని అంటాడు శివన్నారాయణ. దీప బిడ్డ గురించి కాంచన- శ్రీధర్ మాట్లాడుకుంటూ ఉండగా.. జ్యోత్స్న వచ్చి బావ దగ్గరి నుంచి నేను నిజం రాబడతాను, ఒక అవకాశం ఇవ్వమని అడుగుతుంది. దానికి శ్రీధర్, కాంచన ఒప్పుకుంటారు. శౌర్య స్కూల్ మెట్లపై నుంచి పడిపోయిందని హాస్పిటల్‌లో జాయిన్ చేశామని ఫోన్ రావడంతో దీప కంగారుపడుతుంది. వెంటనే కార్తీక్‌కి ఫోన్ చేయగా కారులో పక్కనే ఉన్న శివన్నారాయణ ఆ ఫోన్ లిఫ్ట్ చేయొద్దని చెబుతాడు. ఇంతలో శ్రీధర్ రావడంతో శౌర్య గురించి చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లమని అడుగుతుంది దీప. ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కి వెళ్లేసరికి అక్కడ కార్తీక్, శివన్నారాయణ, జ్యోత్స్న, కాంచన, పారిజాతం ఉండటంతో దీప షాక్ అవుతుంది. దీప కడుపులో బిడ్డ గురించి నువ్వు చెబుతున్న మాటలపై మాకు నమ్మకం లేదు.. అందుకే దీపకి టెస్టులు చేయించాలని అనుకుంటున్నామని కాంచన చెబుతుంది. దీనిపై కార్తీక్ సీరియస్ అవ్వగా.. ఏమాత్రం పట్టించుకోకుండా దీపని డాక్టర్ దగ్గరకి పంపుతుంది కాంచన.

మార్చి 12వ తేదీ 612వ ఎపిసోడ్‌లో..
హాస్పిటల్‌లో దీపకి టెస్టులన్నీ చేసిన డాక్టర్.. రిపోర్ట్స్ తర్వాత పంపిస్తానని చెబుతుంది. దాంతో అందరినీ శివన్నారాయణ తన ఇంటికి తీసుకెళ్తాడు. స్వప్న- కాశీల పెళ్లిరోజు కావడంతో గుడిలో పూజ చేయించి ఇంటికి వస్తాడు దాస్. ఏడాది క్రితం మీరిద్దరూ అమర ప్రేమికులు, కానీ ఇప్పుడు విడిపోయిన భార్యాభర్తలని దాస్ చెప్పడంతో కాశీ - స్వప్నలు షాక్ అవుతారు. ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో దశరథ కంగారుపడుతుండగా.. మొత్తం ఫ్యామిలీ అంతా ఒకేసారి ఇంటికి రావడంతో షాక్ అవుతాడు. దీపకి టెస్టులు చేయించడానికి వెళ్లామని శివన్నారాయణ చెబుతాడు. వీళ్లందరినీ రెచ్చగొట్టింది ఎవరు? అని దశరథ ప్రశ్నిస్తాడు. దానిని నేనే అని ఆన్సర్ ఇస్తుంది జ్యోత్స్న. ఇలాంటివన్నీ నువ్వే చేస్తావని నాకు తెలుసు అంటాడు దశరథ. ఇంతలో డాక్టర్ ఫోన్ చేసి దీపకి, దీప కడుపులోని బిడ్డకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదని.. తల్లీబిడ్డా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. దీప బిడ్డకు ప్రాబ్లమ్ అని ఎందుకు చెప్పావు? మా అత్త ఎమోషన్స్‌తో ఎందుకు ఆడుకున్నావని కార్తీక్‌ను జ్యోత్స్న నిలదీస్తుంది. దాంతో మండిపడిన దశరథ.. కార్తీక్ చెబుతున్నా వినిపించుకోకుండా దీపే ఈ ఇంటి వారసురాలని చెప్పేస్తాడు. సుమిత్ర బతకాలని తన కడుపులోని బిడ్డను వదులుకోవడానికి దీప సిద్ధపడిందని చెబుతాడు. జ్యోత్స్న దాస్ కూతురని.. ఇకపై దీప మనింట్లో, జ్యోత్స్న దాస్ ఇంట్లో ఉంటుందని చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఈ ఇంటికి వారసురాలు ఒక్కరే ఉండాలి.. అది నేనే అవ్వాలని దీపని గన్‌తో కాల్చేస్తుంది జ్యోత్స్న.

Karthika deepam 2 Serial Weekly Episodes March 9th to March 14th Here is Highlights

Photo Courtesy: JioHotstar

మార్చి 13వ తేదీ 613వ ఎపిసోడ్‌లో..
దీపను జ్యోత్స్న కాల్చేసిందని ఉలిక్కిపడి నో అని గట్టిగా అరుస్తాడు దశరథ. దాంతో ఏం జరిగిందని అంతా అడుగుతారు. కడుపులో బిడ్డకు అంతా బాగున్నప్పటికీ ఎందుకు వదలుకోవాలని అనుకుంటున్నారని దీప, కార్తీక్‌లను అంతా ప్రశ్నిస్తారు. దీప సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. దీపని ఏమి అనొద్దు.. ఏం జరిగినా నా నిర్ణయంతోనే జరిగిందని చెబుతాడు కార్తీక్. బిడ్డను వదులుకోవడం చిన్న విషయమా? మీ అత్త ప్రాణాలను కాపాడటానికి మేమంతా యుద్ధం చేస్తున్నాం.. అలాంటిది ఒక ప్రాణాన్ని ఎలా తీసేస్తారని నిలదీస్తాడు శివన్నారాయణ. మరోవైపు.. దాస్ ఇచ్చిన సింధూరాన్ని పాపిట్లో నుంచి తీసేయమని కావేరి చెప్పడంతో స్వప్న షాక్ అవుతుంది. మనిద్దరం ఇక్కడే ఉంటే వీళ్లు కొట్టుకుంటూ ఉంటారని.. వీరిద్దరికీ ప్రైవసీ ఇద్దామని చెబుతాడు దాస్. మీ ప్రేమ నుంచి పెళ్లయ్యాక జరిగిన ప్రతి ఘటనను గుర్తుచేసుకుని కలిసిపోమని అంటాడు. ఎంతగా నిలదీస్తున్నా కార్తీక్- దీపలు నోరెత్తకపోవడంతో డాక్టర్ పెట్టిన వాయిస్ మెసేజ్‌ని వినిపిస్తుంది జ్యోత్స్న. ఈ బిడ్డను వద్దు అనుకుంటే జీవితంలో దీప బిడ్డల్ని కనలేదని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంత జరుగుతున్నా మాతో ఒక్క మాట కూడా చెప్పలేదని కాంచన మండిపడుతుంది. బిడ్డను కనడం నాకు ఇష్టం లేదు.. నేను వద్దు అనుకుంటున్నానని దీప చెప్పడంతో కాంచన కంటతడి పెడుతుంది. ఇదంతా దశరథకి ఎప్పుడో తెలుసని పారిజాతం అనడంతో కొడుకుని శివన్నారాయణ నిలదీస్తాడు.

మార్చి 14వ తేదీ 614వ ఎపిసోడ్‌లో..
దీప బిడ్డని వదులుకుంటున్న విషయం మీ అన్నయ్యకి తెలుసని పారిజాతం అనడంతో కాంచన షాక్ అవుతుంది. అంతా తెలిసినా ఏం తెలియనట్లు నన్ను బాగా మోసం చేశావని దశరథపై సీరియస్ అవుతుంది కాంచన. దశరథ ఏదో చెప్పాలని ప్రయత్నించినా కాంచనా చేతిని విసిరి పక్కకు నెట్టేస్తుంది. దాంతో తన ప్లాన్ ఫెయిల్ అవుతుందని టెన్షన్ పడి దశరథను రెచ్చగొట్టాలని చూస్తుంది జ్యోత్స్న. దాంతో ఈ కుట్ర వెనుక ఉన్నది జ్యోత్స్నే అని.. మావయ్యని రెచ్చగొట్టి నిజం చెప్పించాలని చూస్తోందని కార్తీక్ అనుకుంటాడు. పుట్టింటిలోనే అందరూ తనను మోసం చేశారంటూ కాంచన ఏడుస్తూ వెళ్లిపోతుంది. స్వప్న - కాశీలు ఏకాంతంగా మాట్లాడుకుంటూ తమ ప్రేమ, పెళ్లి తర్వాత రోజుల్ని గుర్తుతెచ్చుకుంటారు. కాశీ ఇచ్చిన గులాబీ పువ్వుని స్వప్న నేలకేసి కొడుతుంది. మనం ఇచ్చిన షాక్‌కి కార్తీక్ ఒంటరివాడు అయిపోయాడని జ్యోత్స్నతో అంటుంది పారు. అప్పుడే ఏమైంది.. ఇంకా ముందు చాలా ఉందని చెబుతుంది జ్యోత్స్న. దీప, కార్తీక్, దశరథలు మాట్లాడుకుంటూ ఉండగా జ్యోత్స్న వినడంతో ముగ్గురు అలర్ట్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X