Karthika Deepam 2 Weekly: దక్షిణామూర్తితో శివన్నారాయణ గొడవ.. జ్యోత్స్న సీఈవో ఛైర్ లాగేసిన కార్తీక్

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా మే 11వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు 667 నుంచి 672వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

మే 11వ తేదీ 667వ ఎపిసోడ్‌లో..
కార్తీక్, దీపలు వచ్చేసరికి శివన్నారాయణ ఇంటి గేటు ముందు ఓ పెద్దాయన నిలబడి చూస్తుంటాడు. ఆయనను పలకరించి లోపలికి తీసుకెళ్తుండగా పారు చూసి అతనిని దక్షిణామూర్తి అని గుర్తుపట్టి, వాళ్లు లోపలికి వస్తే ఇంట్లో రక్తపాతం అని భయపడుతుంది. కార్తీక్‌ను ఆపాలని పరిగెత్తుకుంటూ వచ్చి శివన్నారాయణను గుద్దుకుంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి నీకొక సర్‌ప్రైజ్ అని చెప్పి దక్షిణామూర్తిని లోపలికి పిలవగా శివన్నారాయణ కోపంతో రగిలిపోతాడు. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ వచ్చావు? బయటికి పో అని రంకెలు వేస్తాడు. నేనొచ్చింది నీకోసం కాదు.. నా కూతురు సుమిత్ర కోసమని దక్షిణామూర్తి చెబుతాడు. తండిని నట్టింటిలో చూసి షాకైన సుమిత్ర.. నేను చనిపోయానని, కర్మకాండలు జరిపించి మళ్లీ ఎందుకు వచ్చావని రగిలిపోతుంది. మర్యాదగా వెళ్తావా? తలబాదుకుని చావమంటావా అంటూ గోడకేసి కొట్టుకుంటుంది సుమిత్ర. దాంతో నేను ఇప్పుడు వెళ్లిపోతున్నాను, కానీ ఏదో ఒకరోజు మీరే వెతుక్కుంటూ వస్తారని చెప్పి దక్షిణామూర్తి వెళ్లిపోతాడు. అసలు ఆయన ఎవరు? తాతతో గొడవలేంటీ? అని కార్తీక్, దీపలు అనుకుని పారును అడుగుతుండగా శివన్నారాయణ చూసి అతని పేరెత్తడానికి వీల్లేదు, గతం గురించి చెప్పడానికి వీల్లేదని పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు.

మే 12వ తేదీ 668వ ఎపిసోడ్‌లో..
దక్షిణామూర్తి గురించి ఈ ఇంట్లో మాట్లాడటానికి వీల్లేదని శివన్నారాయణ ఆర్డర్ వేస్తాడు. తాత దగ్గర నన్నెందుకు ఇరికించావని పారుపై మండిపడుతుంది జ్యోత్స్న. నా మనవడు, మనవరాలిని ఎందుకు ఇరికిస్తాను, అందుకే నిన్నే ఇరికించానని అంటుంది పారు. అయితే నీకు కళ్లు తెరిపించే టైం వచ్చిందని చెప్పి పారును ఓ చోట దాక్కోమని దాస్‌కి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. కూతురికి ఏమైందోనని కంగారుగా వస్తాడు దాస్. నేను చేసిన తప్పులన్నీ బయటపడిపోతే నాకు ఏదైనా అవుతుందని ఏడుపు నటిస్తుంది జ్యోత్స్న. దాంతో నీకేం కాదు.. నిన్ను యువరాణిలా చూసుకోవడానికి ఈ తండ్రి ఉన్నాడు కదా అంటాడు దాస్. ఆ మాటలు విన్న పారు షాక్ అవుతుంది. అంటే జ్యోత్స్నే నా అసలు మనవరాలని తెలుసుకుంటుంది. ఇప్పటికైనా నీకు నిజం తెలిసిందా? బావ, దీప నిన్ను ఆడుకున్నారని అంటుంది జ్యోత్స్న. నా కన్నకొడుకే నన్ను మోసం చేశాడని ఫైర్ అవుతుంది పారు. దీపకి అన్నం తినిపిస్తున్న కార్తీక్ దగ్గరికి వెళ్లి నీ భార్య అన్నం తింటుందిలే అంటూ రగిలిపోతుంది. పెళ్లయి, పిల్లల్ని కంటే నీకు కూడా ఈ బాధ తెలిసేదని అంటాడు కార్తీక్. అయితే చేసుకో.. పిల్లల్ని కంటానని జ్యోత్స్న అనడంతో దీప మండిపడుతుంది. పారు అక్కడ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంతో కార్తీక్‌కి అనుమానం వస్తుంది. సుమిత్ర ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెబుతాడు. దాంతో నీకు ఈ శివన్నారాయణ కుటుంబం మాత్రమే ఉంది. నీకు ఏం కావాలంటే అది చేసి పెడతామని అంటాడు శివన్నారాయణ.

Karthika deepam 2 Serial Weekly Episodes May 11th to May 16th Here is Highlights

Photo Courtesy: JioHotstar

మే 13వ తేదీ 669వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్నే తన మనవరాలని తెలుసుకున్న పారిజాతం.. మరి సుమిత్రకు బ్యోన్‌మారో ఎవరిచ్చారు? ఆమెను ఎవరు కాపాడారని ప్రశ్నిస్తుంది. కన్నకూతురే కాపాడిందని జ్యోత్స్న చెప్పగా.. ఆ కన్నకూతురు ఎవరో? ఎక్కడుందో నీకు తెలుసా అని అడుగుతుంది పారు. ఎవరది.. నాలో పగ అలాగే ఉంది, అప్పుడు తప్పించుకుంది ఈసారి మాత్రం చంపేస్తానని అంటుంది పారు. నేను చెబితే నీ గుండె పగిలిపోతుందని అంటుంది జ్యోత్స్న. ఏం పర్లేదు చెప్పమని పారు అనగా.. సుమిత్ర - దశరథల కూతురు, శివన్నారాయణ మనవరాలు ఎవరో కాదు దీప అని జ్యోత్స్న చెప్పగా పారు గుండె పట్టుకుంటుంది. ఇన్నాళ్లూ దాస్, కార్తీక్, నువ్వు, దీపలకు ఈ నిజం తెలిసే కథ నడిపించారా అని మండిపడుతుంది పారు. అసలు కార్తీక్ గాడి ప్లాన్ ముందు మనమంతా పాత్రధారులుగా మిగిలిపోయామని రగిలిపోతుంది. నీకు ఏం తెలియనట్లే ఉండు.. ఇకపై గేమ్ నేను ఆడతాను, ఆస్తి మొత్తం కొట్టేయాలని అంటుంది జ్యోత్స్న. నెల్లూరు బ్రాంచిలో స్కామ్ జరిగినట్లు ఫోన్ రావడంతో శివన్నారాయణ పూనకంతో ఊగిపోతాడు. అక్కడేం జరిగిందో తెలుసుకోవడానికి దశరథ బయల్దేరతాడు. అయితే బోర్డ్ మీటింగ్‌లో దశరథను లేకుండా చేయడానికే జ్యోత్స్న ఇలా చేసిందని కార్తీక్, దీపలు అనుమానిస్తారు. ఇంటికెళ్లిన తర్వాత దక్షిణామూర్తి గురించి కార్తీక్, దీపలు అడగగానే కాంచన కోపంతో ఊగిపోతుంది.

మే 14వ తేదీ 670వ ఎపిసోడ్‌లో..
దక్షిణామూర్తి గురించి ఎవరినీ ఏం అడగొద్దని కార్తీక్, దీపలకు కాంచన క్లాస్ పీకుతుంది. మనం ఇక మూర్తి తాత గురించి ఆలోచించడం మంచిది కాదని దీపతో అంటాడు కార్తీక్. మా అమ్మ పుట్టింటి వాళ్లు బతికే ఉన్నారని తెలిసిన తర్వాత వదిలేయడం సరికాదని చెబుతుంది దీప. జ్యోత్స్నకి పెళ్లి చేసి, నిన్ను ఆ ఇంటికి వారసురాలిని చేయడమే నా లక్ష్యం.. ఈ పనుల తర్వాతే ఏదైనా అని తేల్చేస్తాడు కార్తీక్. సీఈవో కుర్చీపై కన్నేసిన జ్యోత్స్న పారు సాయంతో సుమిత్రను బుట్టలో పడేస్తుంది. కూతురు సీఈవో అవుతుందని, తన కోసం చేయమని సుమిత్ర అడగటంతో శివన్నారాయణ సరేనంటాడు. తమ పథకం వర్కవుట్ అయినందుకు పారు- జ్యోత్స్నలు చాలా సంతోషిస్తారు. ఉదయాన్నే బోర్డ్ మీటింగ్‌లో కార్తీక్, జ్యోత్స్నలు కారులో వెళ్తుండగా తనను పెళ్లి చేసుకుంటే కంపెనీకి సీఈవోగా, నాకు భర్తగా ఉంటావని అంటుంది జ్యోత్స్న. నెల రోజుల్లో నీ పైత్యం, నీ పొగరు అంతా దించేస్తానని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. బోర్డ్ మీటింగ్ మొదలు కావడానికి ముందు కార్తీక్‌ను అక్కడి నుంచి బయటికి పంపడానికి జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. తన ఫోన్ కారులో ఉండిపోయిందని దానిని తీసుకురమ్మని చెబుతుంది. కార్తీక్ ఫోన్ కోసం వెతికేలోపు.. బోర్డ్ మెంబర్స్‌ని రెచ్చగొట్టి తానే సీఈవోగా ఉండేలా శివన్నారాయణ నిర్ణయం తీసుకునేలా చక్రం తిప్పుతుంది జ్యోత్స్న. కార్తీక్ లోపలికి వచ్చేసరికి నిర్ణయం జరిగిపోవడంతో షాక్ అవుతాడు. దీపకి ఫోన్ చేసిన జ్యోత్స్న తన తల్లికి ఫోన్ ఇవ్వమని చెప్పి.. నేను సీఈవోని అయ్యానని చెప్పడంతో పారు, సుమిత్రలు సంతోషిస్తారు.

Karthika deepam 2 Serial Weekly Episodes May 11th to May 16th Here is Highlights

Photo Courtesy: JioHotstar

మే 15వ తేదీ 671వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్నని సీఈవో చేయడంపై శివన్నారాయణ, కార్తీక్, శ్రీధర్‌లు మాట్లాడుకుంటారు. సుమిత్ర కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని కార్తీక్‌కి చెబుతాడు శివన్నారాయణ. నెల్లూరు నుంచి వచ్చిన దశరథ.. అక్కడ ఏ ప్రాబ్లమ్ లేదని చిన్న సమస్యేనని తండ్రికి చెబుతాడు. నువ్వు వెళ్లిన తర్వాత అత్తని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి, బోర్డ్ మెంబర్స్‌ని తనవైపుకు తిప్పుకుందని అంటాడు కార్తీక్. జ్యోత్స్న పెళ్లి కావడమే వీటన్నింటికీ సొల్యూషన్ అని చెబుతాడు. సీఈవో కావడంతో పారు, జ్యోత్స్నలు ఎంజాయ్ చేస్తుంటారు. నా టార్గెట్ సీఈవో పోస్ట్ కాదు.. ఛైర్మన్ కుర్చి. నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే కంపెనీతో పాటు ఈ ఆస్తి మొత్తం నీదేనని చెబుతుంది పారు. ఈ కంపెనీని, ఈ ఆస్తినే కాదు బావని కూడా వదలను అంటుంది జ్యోత్స్న. ఇవన్నీ జరగాలంటే దీప ఉండకూడదు.. నా నెక్ట్స్ టార్గెట్ అదేనని అంటుంది. కార్తీక్, దీపలు ఇంటికి వెళ్తుండగా నేను డ్రాప్ చేస్తానని చెబుతుంది జ్యోత్స్న. నెల రోజుల్లోగా నాకు పెళ్లి చేయకపోతే మీరిద్దరూ ఏం చేస్తారని జ్యోత్స్న అడగ్గా.. నువ్వు అడిగింది ఇస్తానని చెబుతుంది దీప. ఈ మాటలన్నీ విన్న శ్రీధర్ షాక్ అవుతాడు. ఇంటికొచ్చి జరిగినదంతా కాంచనకు చెబుతాడు. దీనిపై కార్తీక్‌ని తండ్రి నిలదీయగా.. వీటి గురించి ఏదో ఒకరోజు నీకే తెలుస్తుందని అంటాడు కార్తీక్.

మే 16వ తేదీ 672వ ఎపిసోడ్‌లో..
బోర్డ్ మీటింగ్‌లో కార్తీక్‌ని సీఈవోగా ఉండమని బోర్డ్ మెంబర్స్ అడగటంతో తాను ఉండలేనని తిరస్కరిస్తాడు. సీఈవోగా జ్యోత్స్న పేరును అనౌన్స్ చేయబోతుండగా దశరథ అడ్డుపడతాడు. నేను మీతో పర్సనల్‌గా మాట్లాడాలని శివన్నారాయణని పక్కకి తీసుకెళ్తాడు. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. జ్యోత్స్నని కనుక సీఈవోని చేస్తే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోదని శివన్నారాయణకు చెబుతాడు దశరథ. కార్తీక్ కూడా అదే మాట చెప్పి నా దగ్గర ఓ ప్లాన్ ఉందని అంటాడు. బోర్డ్ మీటింగ్ మొదలవ్వగానే జ్యోత్స్న రెస్టారెంట్‌కి కాబోయే సీఈవో ఎవరన్న దానిపై ఇప్పుడే నిర్ణయం తీసుకుంటున్నాం. ఒకరికి ఫోన్ చేశాం.. వచ్చేస్తున్నారని దశరథ అనగానే పారు ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూడగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ వెనకాలే దీప ఉండటంతో పారు, జ్యోత్స్నలు ఉలిక్కిపడతారు. జ్యోత్స్న, దీపలలో ఒకరు సీఈవో అవుతారని, ఓటింగ్ పెడతాడు. ఓటింగ్‌లో దీపకి ఎక్కువ ఓట్లు రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X