Karthika Deepam 2 Weekly: సీఈవో పోస్ట్ కోసం దీప- జ్యోత్స్నలకు టెస్ట్.. సూరజ్ షాప్ పీకేసిన జ్యోత్స్న
Photo Courtesy: JioHotstar
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా మే 18వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు 673 నుంచి 678వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
మే 18వ తేదీ 673వ ఎపిసోడ్‌లో..
కొత్త సీఈవో కోసం నిర్వహించిన ఓటింగ్‌లో దీప, జ్యోత్సలకు సమానంగా ఓట్లు రావడంతో శివన్నారాయణ ఒక టెస్ట్ పెడతాడు. నష్టాల్లో ఉన్న రెండు రెస్టారెంట్స్‌ని చెరొకరికి ఇస్తాం. ఇద్దరిలో ఎవరు రెండు వారాల్లోగా తమ రెస్టారెంట్స్‌ని లాభాల్లో నడిపిస్తే వారే కొత్త సీఈవో అని చెబుతాడు పెద్దాయన. ఈ ఒప్పందానికి నేను ఒప్పుకుంటున్నాను అని జ్యోత్స్న అనగా.. దీప కూడా సై అంటుంది. అయితే ఈ పోటీ జరిగినంత కాలం కార్తీక్, దీపలు విడిపోవాలి. బావ మా ఇంట్లో ఉంటాడు, దీప వాళ్లింట్లోనే ఉంటుందని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఈ ఒప్పందానికి ఒప్పుకోకపోతే పోటీలో నుంచి తప్పుకోవచ్చని జ్యోత్స్న రెచ్చగొట్టడంతో దీప రగిలిపోతుంది. కార్తీక్ చెబుతున్నా పట్టించుకోకుండా దీప సరేనని చెబుతుంది. కార్తీక్, దీపల కోసం ఎదురుచూస్తున్న కాంచనకి శ్రీధర్ కనిపించడంతో బోర్డ్ మీటింగ్‌లో ఏం జరిగింది? కొత్త సీఈవో ఎవరు? అని కాంచన అడుగుతుంది. ఇంతలో కార్తీక్, దీపలను తీసుకుని జ్యోత్స్న రావడంతో రగిలిపోతుంది. బావ ఇకపై ఇక్కడ ఉండడని మా ఇంట్లోనే ఉంటాడని కార్తీక్ చేయి పట్టుకుని జ్యోత్స్న చెప్పడంతో కాంచన షాక్ అవుతుంది
మే 19వ తేదీ 674వ ఎపిసోడ్‌లో..
నా కొడుకుని, కూతురిని విడదీయడానికి నువ్వెవరు అంటూ జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది కాంచన. ఈ విషయాన్ని మీ నాన్నతోనే తేల్చుకుంటానని దశరథకి ఫోన్ చేయబోతుండగా కార్తీక్ లాక్కుంటాడు. కొడుకుని జ్యోత్స్న తీసుకెళ్తూ ఉండటంతో తల్లి బాధపడుతుంది. ఇంటికి వెళ్లేసరికి శివన్నారాయణ కుటుంబం రగిలిపోతూ ఉంటుంది. భార్యాభర్తల్ని వేరు చేస్తావా అంటూ జ్యోత్స్నపై సీరియస్ అవుతుంది సుమిత్ర. నేనేం విడదీయలేదు.. పోటీలో నుంచి తప్పుకోమంటే తప్పుకోకుండా దీప ఇక్కడి వరకు తెచ్చుకుందని అంటుంది జ్యోత్స్న. పెద్దవాళ్లుగా మేం రేపు ముఖాలు చూసుకోలేమని తల్లి బాధపడుతుండగా నేను ఆల్రెడీ కాంచన అత్తకి జరిగినదంతా చెప్పానని అంటుంది జ్యోత్స్న. నా చెల్లికి, దీపకి నేను సంజాయిషీ ఇచ్చుకోవాలని కార్తీక్ ముందు దశరథ బాధపడుతూ కాంచనకి ఫోన్ చేస్తాడు. కూతురి బాధ చూసిన శివన్నారాయణ కూడా వెక్కి వెక్కి ఏడుస్తాడు. మీ వల్ల నా కూతురితో మాటలు పడ్డాను... మీరేం చేస్తారో తెలియదు నా బిడ్డ మళ్లీ నవ్వుతూ కనిపించాలని కార్తీక్, దశరథలపై సీరియస్ అవుతాడు. ఉదయాన్నే దీప, కాంచనలు ఇంట్లో కనిపించడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు.

Photo Courtesy: JioHotstar
మే 20వ తేదీ 675వ ఎపిసోడ్‌లో..
ఉదయాన్నే ఇంట్లో దీప, కాంచన కనిపించడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. మా అబ్బాయి క్యాంప్‌కి వెళ్లాడు.. అతను వచ్చే వరకు నేను, నా కోడలు నా పుట్టింటిలోనే ఉంటామని కాంచన చెప్పడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. దీపతో నాకు పోటీ జరుగుతోంది.. నువ్వు ఒకే కానీ, తను ఉండటానికి వీల్లేదని అంటుంది జ్యోత్స్న. నా కూతురు, ఆమె కోడలు ఇక్కడే ఉండటానికి నేను ఒప్పుకుంటున్నానని శివన్నారాయణ అంటాడు. కాంచన ముఖంలో తిరిగి ఆనందం తీసుకొచ్చినందుకు దశరథకు థ్యాంక్స్ చెబుతాడు పెద్దాయన. ఇదంతా కార్తీక్ గాడి ప్లాన్.. ఎవరికి ఎలా చెప్ాపలో వాడికి తెలుసని అంటాడు దశరథ. ఆఫీస్‌కి వెళ్తూ వెళ్తూ.. కాంచన, సుమిత్ర, దశరథల ఆశీర్వాదాలు తీసుకుంటుంది దీప. ఆమెను చూసి జ్యోత్స్న కూడా సుమిత్ర ఆశీస్సులు తీసుకుంటుంది. కార్తీక్- జ్యోత్స్న కారులో వెళ్తుండగా జ్యోత్స్నకి సూరజ్ కనిపిస్తాడు. వెంటనే అతనికి బుద్ధి చెప్పాలని అనుకుని ఆఫీసర్లకు ఫోన్ చేసి అతని ఫుడ్ స్టాల్‌ని పీకేయిస్తుంది. కార్తీక్ ముందే ఇదంతా జరుగుతున్నా ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు.
మే 21వ తేదీ 676వ ఎపిసోడ్‌లో..
ఆఫీసులో పోటీకి ఒప్పుకుంటూ ఫైల్స్ మీద సంతకం చేస్తారు దీప, జ్యోత్స్న. అయితే దీప తెలుగులో సంతకం చేయడంతో ఆమెను ఎగతాళి చేస్తుంది జ్యోత్స్న. అప్పుడు దీప చదువుకోవడానికి ఎలా కష్టపడింది? తండ్రి కోసం తనకు ఎంతో ఇష్టమైన చదువుని ఎలా వదులుకున్నది చెబుతాడు. ఆఫీసులో ఎదురెదురుగా దీప, జ్యోత్స్న కూర్చొంటారు. దీపకి కార్తీక్ సైట్ కొట్టడంతో ఆమెపై మండిపడుతుంది జ్యోత్స్న. దీంతో భార్యను తీసుకుని గార్డెన్‌లో కాఫీ తాగుతూ పోటీ గురించి మాట్లాడతాడు కార్తీక్. ఇంతలో జ్యోత్స్న వచ్చి నా ప్రత్యర్ధితో నువ్వు మాట్లాడటానికి వీల్లేదని అంటుంది. శ్రీధర్, కాంచన, శౌర్య ఆడుకుంటూ ఉండటంతో ముగ్గురిని బయటకు గెంటాలని అనుకుంటుంది పారు. శ్రీధర్ దగ్గరికి వెళ్లి నానామాటలు అనడంతో కాంచన క్లాస్ పీకుతుంది. ఎలాగైనా సరే ఈ గ్యాంగ్‌ని బయటకు పంపాలని అనుకుంటుంది. ఆఫీసులో ఫైల్స్, మెనూ ఇతర వివరాలన్నీ లాప్‌టాప్‌లో పెట్టి దీప ముందు పెడతాడు మేనేజర్. తనకు కంప్యూటర్ వాడటం రాదని దీప చెప్పగా.. మెయిల్ ఐడీతో ఇవన్నీ ఓపెన్ చేయాలని చెబుతాడు. అయితే దీప తన దగ్గర ఓటర్ ఐడీ మాత్రమే ఉందని చెప్పడంతో స్టాఫ్ ముందు ఆమె పరువు తీసేస్తుంది జ్యోత్స్న.

Photo Courtesy: JioHotstar
మే 22వ తేదీ 677వ ఎపిసోడ్‌లో..
దీపకి లాప్‌టాప్ గురించి తెలియకపోవడంతో స్టాఫ్ ముందు అవమానిస్తుంది జ్యోత్స్న. దాంతో ఓ ఆఫీస్ బాయ్‌ని పిలిచిన కార్తీక్.. నీకు మెయిల్ ఐడీ ఉందా? అని అడుగుతాడు. ఉంది సార్ నాకు నా ఫ్రెండ్ చెప్పాడని అంటాడు ఆ కుర్రాడు. మనకి ఏదైనా తెలియకపోతే ఫ్రెండ్స్ ఫోన్ చేసి మెయిల్ ఐడీ మెసేజ్ చేస్తారని గట్టిగా చెబుతాడు. ఇది అర్ధం చేసుకున్న దీప వెంటనే తన ఫోన్ చెక్ చేసుకోగా మెయిల్ ఐడీ ఉంటుంది. దాని సాయంతో ఫైల్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తుంది దీప. నువ్వు పోటీలో ఓడిపోయి.. మోకాలిపై కూర్చోని నన్ను వదిలేయమని బతిమలాడే రోజు వస్తుందని దీపకి వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. ఇంటిలో శ్రీధర్, శౌర్య, కాంచన ఆడుకుంటూ ఉండగా పారు చూసి ఈ బ్యాచ్‌ని ఎలాగైనా గెంటేయాలని అనుకుంటుంది. ఇంతలో అక్కడికొచ్చిన జ్యోత్స్నని శౌర్య పిన్ని అని పిలవడంతో అంతా షాక్ అవుతారు. ఆఫీస్‌లో దీపకి అవమానం జరిగిందని తెలుసుకున్న సుమిత్ర.. కన్నవాళ్లనే దూరం పెట్టాను, నిన్ను కూడా దూరం పెడతానని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు పోటీలో గెలవాలని నీ మామగారిగా కోరుకుంటున్నానని అంటాడు శ్రీధర్.
మే 23వ తేదీ 678వ ఎపిసోడ్‌లో..
దీప, కార్తీక్, కాంచన అత్తలు మనతో భోజనం చేయడానికి ఒప్పుకోనని అంటుంది జ్యోత్స్న. శివన్నారాయణ గడ్డి పెట్టడంతో నోరు మూసేస్తుంది. వీళ్లంతా కలిసిపోయేలా ఉన్నారని పారు, జ్యోత్స్నలు కొత్త స్కెచ్ వేస్తారు. నువ్వు ఎక్కడ పడుకుంటావని శౌర్యని అడుగుతుంది జ్యోత్స్న. అమ్మానాన్నల దగ్గర పడుకుంటానని చిన్నారి చెప్పడంతో మీ అమ్మానాన్న ఈరోజు వేర్వేరుగా పడుకుంటారని అంటుంది జ్యోత్స్న. అయితే దీప, శౌర్యలు నా దగ్గర పడుకుంటారని సుమిత్ర చెప్పడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. నువ్వు ఏం చేసినా నాకు మంచే జరుగుతుందని జ్యోత్స్న బుగ్గ గిల్లుతుంది దీప. మనిద్దరం హనీమూన్‌కి వెళ్దామని కాశీలో అంటుంది స్వప్న. ప్రస్తుతం మావయ్య గారికి హెల్త్ బాగుండటం లేదు.. ఇంకెప్పుడైనా వెళ్దామని అంటాడు కాశీ. సుమిత్ర ఒడిలో పడుకున్న శౌర్యని చూసి సంబరపడిపోతుంది దీప. నేనే నీ కన్నతల్లిని అనుకో నీకేం కావాలని అడుగుతుంది సుమిత్ర.. నీ ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలని దీప చెప్పడంతో సుమిత్ర సరేనని అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications