Karthika Deepam 2 Weekly: దక్షిణామూర్తికి శివన్నారాయణ ప్రాణభిక్ష.. జ్యోత్స్నని వెయిటర్‌లా మార్చిన సూరజ్
Photo Courtesy: JioHotstar
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా మే 25వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు 679 నుంచి 684వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
మే 25వ తేదీ 679వ ఎపిసోడ్‌లో..
సుమిత్ర ఒడిలో పడుకున్న దీపని చేసి జ్యోత్స్న రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తల్లి ఒడిలో పడుకున్న కూతురిని చూసి కార్తీక్, దశరథలు చాలా సంతోషిస్తారు. నువ్వు సక్రమంగా ఉండుంటే నీ కొడుకు నాకు మొగుడయ్యేవాడని చెబుతుంది జ్యోత్స్న. నీలాంటి కోడలితో నేను వేగలేనంటూ దండం పెడుతుంది కాంచన. ఉదయాన్నే గంట కొడుతున్న శబ్ధం రావడంతో జ్యోత్స్న చిరాకు పడుతూ నిద్రలేస్తుంది. ఇల్లంతా పొగ, గంటల శబ్ధం మధ్యలో దీప కనిపించగానే అందరూ మెచ్చుకుంటారు. కూతురిని చూసి దశరథ పొంగిపోతూ నోరుజారతాడు. ఇంతలో శౌర్య మాట్లాడుతూ.. సుమిత్ర అమ్మమ్మ మా అమ్మకి తల్లి, నేను మనవరాలిని అనడంతో అంతా ఉలిక్కిపడతారు. ఇక్కడున్నన్ని రోజులు దీపకి తల్లిదండ్రులు లేని లోటు తెలియకూడదని నేను, సుమిత్ర అనుకున్నామని దశరథ చెబుతాడు. అయితే దీప మీద తన కొడుకు ఎక్కువగా అభిమానం చూపించడంతో శివన్నారాయణకి అనుమానం వస్తుంది. నువ్వు, స్వప్నలు పిల్లల్ని కనాలని కాశీతో దాస్ చెబుతుండగా స్వప్న వింటుంది.
మే 26వ తేదీ 680వ ఎపిసోడ్‌లో..
గుడికి వెళ్లి వస్తున్న దీప, కార్తీక్‌లను దారిలో దక్షిణామూర్తి చూసి పరిగెత్తుతాడు. కార్తీక్ తిరిగి చూసేసరికి దక్షిణామూర్తిని లారీ ఢీకొట్టడంతో కిందపడిపోయి రక్తం కారుతుంది. దాంతో పెద్దాయనని హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పిస్తారు కార్తీక్, దీప. గుడికి వెళ్లి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కార్తీక్, దీపలకు ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. గుడి నుంచి వస్తుంటే తెలిసిన వాళ్లు ఒకరికి యాక్సిడెంట్ అయ్యింది. ఆయనని ఆసుపత్రిలో చేర్పించామని చెబుతాడు కార్తీక్. శ్రీధర్ గుండె బాగా వీక్‌గా ఉందని ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని శివన్నారాయణతో చెబుతాడు డాక్టర్. అక్కడి నుంచి బయటికొస్తున్న శివన్నారాయణ, శ్రీధర్‌లకు కార్తీక్, దీపలు కనిపించడంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఏం జరిగింది? చేతులకి రక్తం ఏంటీ? అని శివన్నారాయణ అడగ్గా.. గుడి నుంచి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. అతనిని ఇక్కడే చేర్పించామని చెబుతుండగా డాక్టర్ వచ్చి ఏ పాజిటివ్ బ్లడ్ కావాలని చెబుతాడు. నాది ఏ పాజిటివ్ గ్రూపేనని నేను ఇస్తానని అంటాడు శివన్నారాయణ. లోపలికి వెళ్లిన శ్రీధర్‌కు ఐసీయూలో దక్షిణామూర్తి కనిపించడంతో షాక్ అవుతాడు. పరుగు పరుగున ఇంటికొచ్చిన శ్రీధర్.. జరిగినదంతా కాంచనకి చెబుతుండగా జ్యోత్స్న, పారులు వింటారు.

Photo Courtesy: JioHotstar
మే 27వ తేదీ 681వ ఎపిసోడ్‌లో..
హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చిన కార్తీక్, దీపలు భయం భయంగా లోపలికి వెళ్తారు. మీరిద్దరూ చేసిన మంచి పనిని ప్రశంసించాలనే మనవాళ్లని ప్రిపేర్ చేశానని చెబుతుంది జ్యోత్స్న. ఏదైనా థ్యాంక్స్ చెప్పాలంటే దానికి తాతకే చెప్పాలి.. ఆయన బ్లడ్ ఇవ్వకపోయుంటే యాక్సిడెంట్ అయిన మనిషి బతికేవాడు కాదని అంటాడు కార్తీక్. మా అమ్మ కూడా తాతకి జీవితాంతం రుణపడి ఉండాలని జ్యోత్స్న అంటుంది. కన్నతండ్రి ప్రాణాలు కాపాడిన మనిషి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని, ముందు దక్షిణామూర్తి తాత దగ్గరికి వెళ్దామని చెబుతుంది జ్యోత్స్న. ఆ మాట వినగానే శివన్నారాయణ సీరియస్ అవుతాడు. నువ్వు హాస్పిటల్‌లో బ్లడ్ ఇచ్చింది దక్షిణామూర్తి తాతకేనని జ్యోత్స్న చెప్పడంతో రగిలిపోయిన పెద్దాయన.. కోపంతో మనవడి చెంప పగలగొట్టి జీవితంలో నీ ముఖం నాకు చూపించొద్దని గెంటేస్తాడు.
మే 28వ తేదీ 682వ ఎపిసోడ్‌లో..
చిన్నప్పటి నుంచి నువ్వు నేర్పించిన మంచి, మానవత్వం తప్పని చెబితే నేను ఇప్పుడే వెళ్లిపోతాను. కొనఊపిరితో ఉన్నది శత్రువే అయినా సరే కాపాడమని నువ్వు చెప్పినది అబద్ధమైతే ఇప్పుడే వెళ్లిపోతానని అంటాడు కార్తీక్. దాంతో మనవడిని ఆపిన శివన్నారాయణ.. నువ్వు నా ధర్మాన్ని, నా విలువలని కాపాడావని మెచ్చుకుంటాడు. మనం వేసిన ప్లాన్ ఇలా బెడిసికొట్టిందని పారుతో అంటుంది జ్యోత్స్న. ఇంత గొడవ జరగడానికి కారణం నువ్వే కాబట్టి నిన్ను కార్తీక్ గాడు వదిలిపెట్టడు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది పారు. ఇంతలో సూరజ్ ఆ ఇంట్లోకి అడుగుపెడతాడు. అతనిని చూసిన కార్తీక్.. ఎందుకొచ్చావని అడగ్గా నా నష్టపరిహారం కోసమని చెబుతాడు. మీ మనవరాలు నా పొట్ట మీద కొట్టిందని, నా స్టాల్‌ను బలవంతంగా ఖాళీ చేయించిందని వీడియోతో సహా చూపిస్తాడు సూరజ్. అది చూసిన శివన్నారాయణ షాక్ అవుతాడు.

Photo Courtesy: JioHotstar
మే 29వ తేదీ 683వ ఎపిసోడ్‌లో..
నేను ఎంతో కష్టపడి క్వాలిటీ ఫుడ్ సప్లయ్ చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంటే జ్యోత్స్నగారు దానిని నాశనం చేశారు. నాకు న్యాయం కావాలి, నష్టపరిహారం కావాలని సూరజ్ అడుగుతాడు. అతని మాటలు నమ్మొద్దు, బావ బయటివాళ్ల తరపునే మాట్లాడతాడని మండిపడుతుంది జ్యోత్స్న. జరిగిన గొడవతో మనవరాలిపై మండిపడుతుంది పారు. అసలు సూరజ్‌కి, నీకు గొడవ ఏంటీ? అని శివన్నారాయణ అడగ్గ.. కార్తీక్ గిఫ్ట్ షాపులో జరిగిన గొడవ నుంచి సూరజ్‌ను అర్థరాత్రి పూట నడిపించిన విషయం వరకు చెబుతాడు. జరిగిన దానిలో నీదే పొరపాటు కనిపిస్తోందని మండిపడతాడు పెద్దాయన. నీ వల్ల నా కుటుంబం తలదించుకుంటోంది.. మర్యాదగా ఆ సూరజ్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడగమని దీప చెప్పడంతో అది చచ్చినా చేయనని తేల్చేస్తుంది. సూరజ్ రాగానే అతనికి 10 లక్షల రూపాయలు ఇచ్చినా సరిపోదని చెబుతాడు. అయితే ఏం కావాలో నువ్వే చెప్పమని కార్తీక్ అడగటంతో పోయిన నా పరువు, మర్యాదలు కావాలని అంటాడు. నా షాపు దగ్గర జ్యోత్స్న మేడం గారు పనిచేయాలని కండీషన్ పెట్టడంతో అంతా షాక్ అవుతారు.
మే 30వ తేదీ 684వ ఎపిసోడ్‌లో..
జ్యూస్ షాపు ముందు మన పిల్ల ఫ్లెక్సీ పెట్టడానికి నేను ఒప్పుకోనని అంటుంది పారు. మేడం గారి వల్ల నా మర్యాద పోయింది కాబట్టి ఆమె ఫ్లెక్సీతో పాటు తను కూడా నా షాప్ దగ్గర పనిచేయాలని చెబుతాడు సూరజ్. జ్యోత్స్న ఒప్పుకోనని మొండికేయడంతో సోషల్ మీడియాలో నీకు బాగా పేరొస్తుందని చెబుతాడు కార్తీక్. జ్యోత్స్నతో పని చేయించాల్సిన బాధ్యతని కార్తీక్ చేతికి అప్పగిస్తాడు శివన్నారాయణ. దాంతో చేసేదేం లేక ఫోటోలకు ఫోజులిస్తుంది జ్యోత్స్న. నువ్వు నోరు జారడం వల్ల నాకు ఈ గతి పట్టిందని పారుపై మండిపడుతుంది జ్యోత్స్న. నేను వాడి షాపు దగ్గరికి వెళ్లను, నా ఫ్లెక్సీలు పెట్టడానికి అసలు సూరజ్ ఉండాలి కదా అంటుంది జ్యోత్స్న. అల్లుడుగారిని ఏదో ఒక పనిచేయమని స్వప్నతో కావేరి చెబుతుండగా కాశీ విని బయటికొస్తాడు. నేను ఫుడ్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను. త్వరలోనే పెడదామని చెబుతాడు కాశీ. సూరజ్ ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్లనని జ్యోత్స్న మొండికేస్తుంది. నువ్వు నా ఆస్తులకి వారసురాలికి ఉంటావో? నా మనవరాలిగా ఉంటావో నిర్ణయించుకోమని చెబుతాడు శివన్నారాయణ. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications