Karthika Deepam 2 Weekly: జ్యోత్స్నకి సూరజ్ గుణపాఠం.. సుమిత్ర కళ్లు తెరిపించిన దీప, కార్తీక్

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా మే 4వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు 661 నుంచి 666వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

మే 4వ తేదీ 661వ ఎపిసోడ్‌లో..
అవమాన భారంతో రగిలిపోతున్న జ్యోత్స్నని భోజనం చేయమని శివన్నారాయణ, దశరథ, సుమిత్ర, పారులు ఓదారుస్తారు. కార్తీక్ ఆలస్యంగా ఇంటికి రావడంతో మండిపడుతుంది కాంచన. నాన్నకి ఆసుపత్రిలో టెస్టులు చేయించామని కార్తీక్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మనసులో ఇంత బాధపెట్టుకుని ఆ మనిషిని ఎందుకు క్షమించలేకపోతున్నావని అడుగుతాడు కార్తీక్. ఉదయాన్ని కార్తీక్‌ డ్యూటీకి వెళ్తుండగా.. కొడుకుని పక్కకి పిలిచి లాగిపెట్టి కొడుతుంది కాంచన. మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిన విషయం నా దగ్గర ఎందుకు దాచావంటూ సీరియస్ అవుతుంది. ఆ మాటలు విన్న అనసూయ, దీపలు షాక్ అవుతారు. చిన్నప్పుడు మా నాన్న కూడా మా అమ్మకి గుండెపోటు వచ్చిన విషయం దాచాడని, మీ తాత చేసిన తప్పు నువ్వు చేయొద్దని ఏడుస్తుంది కాంచన. ఆ వెంటనే తల్లిని తీసుకుని ఆసుపత్రికి వెళ్తాడు కార్తీక్. శ్రీధర్‌కి టెస్టులు చేసిన డాక్టర్.. వచ్చే 15 రోజులు ఆయనకి చాలా బెడ్ రెస్ట్ కావాలి, ఏ మాత్రం అశ్రద్ధ చేసినా శ్రీధర్ గారి ప్రాణాలకే ప్రమాదమని చెబుతాడు. ఆ మాటలతో కార్తీక్, కాంచన, కాశీ, స్వప్నలు ఉలిక్కిపడతారు.

మే 5వ తేదీ 662వ ఎపిసోడ్‌లో..
శ్రీధర్‌ని డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెబుతుండగా.. జ్యోత్స్న రెస్టారెంట్ ఆఫీస్ నుంచి పదే పదే ఫోన్లు వస్తుండటంతో కాంచన సీరియస్ అవుతుంది. మీరు ఈ పరిస్దితికి రావడానికి కారణం మీ పిల్లలేనని మండిపడుతుంది. స్వప్నని కూడా కాశీ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి.. కార్తీక్, శ్రీధర్‌లను తీసుకుని శివన్నారాయణ దగ్గరికి వెళ్తుంది కాంచన. ఒకేసారి ముగ్గురు రావడంతో జ్యోత్స్న వెటకారంగా మాట్లాడుతుంది. నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పడంతో శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది. ఇకపై మా ఆయన సీఈవోగా ఉండడు, అలాగే నా కొడుకుని కూడా అగ్రిమెంట్ నుంచి రిలీజ్ చేయమని అడుగుతుంది కాంచన. శ్రీధర్‌ని సీఈవోగా నేను తప్పిస్తాను కానీ, అగ్రిమెంట్ విషయం జ్యోత్స్న చేతుల్లోనే ఉందని శివన్నారాయణ తేల్చేస్తాడు. నా మెడలో మూడు ముళ్లు పడే వరకు బావ అగ్రిమెంట్ క్యాన్సిల్ కాదని కుండబద్ధలు కొడుతుంది జ్యోత్స్న. కార్తీక్ కూడా తన అగ్రిమెంట్‌కి కట్టుబడే ఉంటానని చెప్పడంతో కాంచన సైలెంట్ అయిపోతుంది. నెక్ట్స్ సీఈవో ఎవరో బోర్డ్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుందామని అంటాడు శివన్నారాయణ.

Karthika deepam 2 Serial Weekly Episodes May 4th to April 9th Here is Highlights

Photo Courtesy: JioHotstar

మే 6వ తేదీ 663వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న మనందరితో మూడు చెరువుల నీళ్లు తాగిస్తోందని దీప దగ్గర బాధపడతాడు కార్తీక్. ఇంతలో కార్తీక్‌కి జ్యోత్స్న ఫోన్ చేసి మాట్లాడాలని చెబుతుంది. నా కొడుకు అభిమన్యుడిలా జ్యోత్స్న వేసిన పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడని కాంచనతో అంటాడు శ్రీధర్. దీప కోసమే కార్తీక్ ఈ అగ్రిమెంట్ నుంచి బయటకు రావడం లేదని అనుమానపడతాడు. దీప, కార్తీక్, జ్యోత్స్న మధ్య జరుగుతున్న మనకి తెలియకుండా జరుగుతున్న కథను తెలుసుకోవాలని అనుకుంటాడు శ్రీధర్. అగ్రిమెంట్ ఉన్నంత వరకు బావ నా బానిసే... నాకు పెళ్లయితేనే నువ్వు ఈ ఇంటి వారసురాలివని తెలుస్తుంది, బావ సీఈవోగా ఉంటాడని అంటుంది జ్యోత్స్న. నువ్వు, వైరా కలిసి కిడ్నాప్ డ్రామా ఆడారని మా తాతతో చెబుతా.. మా బావ ఫోన్ నెంబర్ నుంచి మాట్లాడిస్తానని వార్నింగ్ ఇస్తుంది దీప. నువ్వు సీఈవో కాదు కదా? ఆఫీస్ క్లర్క్ కూడా కాలేవని మరదలికి సవాల్ విసురుతాడు కార్తీక్. దశరథ, శివన్నారాయణలతో కంపెనీ సీఈవోగా ఉన్న వ్యక్తే జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటాడని తన ప్లాన్ చెబుతాడు కార్తీక్. ఇంతలో బోర్డ్ మెంబర్స్ వచ్చి.. మీ కుటుంబం నుంచి కాకుండా బయటి నుంచైతే సీఈవోని ఒప్పుకోమని తేల్చిచెబుతారు. ఇదంతా జ్యోత్సే వెనుకుండి నడిపిస్తుందని కార్తీక్‌కి అనుమానం వస్తుంది.

మే 7వ తేదీ 664వ ఎపిసోడ్‌లో..
అర్ధరాత్రి క్యాబ్‌లు దొరకకపోవడంతో ఎదురుచూస్తున్న సూరజ్‌ని చూసిన జ్యోత్స్న అతనికి ఎలాగైనా బుద్ది చెప్పాలని కారులో లిఫ్ట్ ఇచ్చి నిర్మానుష్య ప్రదేశంలో దించుతుంది. కనీసం మెయిన్ రోడ్ మీద దించమని సూరజ్ బతిమలాడగా వినిపించుకోదు. కారులో కూర్చోగానే తాళాలు, ఫోన్ కనిపించకపోవడంతో ఇది సూరజ్ పనేనని గ్రహించి జ్యోత్స్న షాక్ అవుతుంది. క్యాబ్స్ దొరకకపోవడంతో నడుచుకుంటూ వెళ్తుంది. కార్తీక్, దీపలు శివన్నారాయణ ఇంటి నుంచి వచ్చేయాలని కాంచన, శ్రీధర్‌లు కండీషన్ పెడతారు. నెల రోజుల్లో ఆ ఇంటితో బంధం తెంచుకుంటానని మాట ఇవ్వమని కాంచన అడగటంతో దీప ఒట్టు వేస్తుంది. ఆ వెంటనే కార్తీక్ కూడా ఒట్టు వేస్తాడు. నెల రోజుల్లో నిన్ను పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న అందరినీ మెంటల్‌గా ప్రిపేర్ చేస్తోందని, మనం జాగ్రత్తగా ఉండాలని కార్తీక్‌తో దీప చెబుతుంది. నడుచుకుంటూ వెళ్తున్న జ్యోత్స్నకి ఒక ఆటో కనిపించడంతో ఎంతైనా ఇస్తాను నన్ను ఇంటి దగ్గరికి తీసుకెళ్లమని అడుగుతుంది. ఆటోలో సూరజ్ ఉండటంతో ఎక్కనని మారాం చేస్తుంది. జ్యోత్స్న ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కంగారులో కార్తీక్‌కి దశరథ కాల్ చేస్తాడు.

Karthika deepam 2 Serial Weekly Episodes May 4th to April 9th Here is Highlights

Photo Courtesy: JioHotstar

మే 8వ తేదీ 665వ ఎపిసోడ్‌లో..
ఎదుటివాళ్లని ఇబ్బంది పెడితే నువ్వే బాధపడతావని జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చి కారు తాళాలు, ఫోన్ ఇచ్చి చేతిలో 100 రూపాయలు పెడతాడు సూరజ్. జీవితంలో రెండు సార్లు దెబ్బకొట్టావు.. నీ కళ్లలో రక్తం తెప్పిస్తానని రగిలిపోతుంది జ్యోత్స్న. అర్ధరాత్రి ఇంటికొచ్చిన జ్యోత్స్నకి దీప కాల్ చేసి ఎక్కడున్నావని అడుగుతుంది. నేను ఎక్కడ తిరిగితే నీకెందుకు? ఎప్పుడొస్తే నీకెందుకు? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. మీ బావ భార్యగా కాల్ చేశానని అంటుంది దీప. దానికి ముందు మా బావ మాజీ భార్య అనే పదం చేర్చమంటూ లోపలి రాగా.. ఇంట్లో అందరినీ చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న. అప్పటికే జరిగినది మొత్తం స్పీకర్ ఫోన్‌లో శివన్నారాయణ కుటుంబం వింటుంది. ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారడం లేదు. ఈసారి కార్తీక్ జోలికి వెళితే నిన్ను వదిలేస్తానని సుమిత్ర తన కూతురికి వార్నింగ్ ఇస్తుంది. జ్యోత్స్న ఏమైపోతే నీకెందుకు? అసలు ఆ ఫ్యామిలీని వదిలేయమని కార్తీక్‌పై మండిపడుతుంది కాంచన. దీప, కార్తీక్‌ల జోలికి వెళ్లొద్దని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తుంది పారు.

మే 9వ తేదీ 666వ ఎపిసోడ్‌లో..
డ్యూటీకి వెళ్తున్న కార్తీక్, దీపలకు దారిలో సూరజ్ కనిపించడంతో పలకరిస్తారు దీప, కార్తీక్. మా మావయ్య గారి ప్రాణాలు కాపాడినందుకు మా కుటుంబం నుంచి పెద్ద థ్యాంక్స్ అంటుంది దీప. నేను మాస్ కానీ, బ్రదర్ మాత్రం చాలా క్లాస్ అని సూరజ్‌ని ప్రశంసిస్తాడు కార్తీక్. మీరు గతంలో సత్యరాజ్ రెస్టారెంట్‌కి సీఈవో అని నాకు తెలుసని సూరజ్ చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. తన తండ్రిని కాపాడటం వల్లే సూరజ్‌కి మంచి అవకాశం మిస్ అయ్యిందని బాధపడ్డ కార్తీక్ .. అతని రుణం తీర్చుకోవాలని అనుకుంటాడు. మావయ్య గారు చెప్పిన దాని గురించి ఆలోచించావా? లేదా అని స్వప్నని అడుగుతాడు కాశీ. మా నాన్న ఆరోగ్యాన్ని అడ్డుపెట్టుకుని నాతో తిరిగి కలిసిపోవాలని చూస్తున్నావా అని కాశీని అరేయ్ ఒరేయ్ అని మాట్లాడుతుంది స్వప్న. ఈ మాటలు విన్న కావేరి వచ్చి కూతురిని లాగిపెట్టి కొడుతుంది. ఇంట్లో పరిస్థితి చూసిన శ్రీధర్.. వెంటనే కార్తీక్‌ని పిలిచి పంచాయతీ పెట్టిస్తాడు. మీరిద్దరూ కలిసుంటే ఓకే లేదంటే మా నాన్నని, పిన్నిని మా ఇంటికి తీసుకెళ్లిపోతామని కార్తీక్ వార్నింగ్ ఇవ్వడంతో కాశీ, స్వప్నలు కలిసిపోతారు. ఈ విషయాన్ని కాంచనకు కార్తీక్ చెప్పడంతో అంతా సంతోషిస్తారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X