Karthika Deepam 2 Weekly: సీఈవోగా శ్రీధర్... భర్తని క్షమించని కాంచన, రగిలిపోతోన్న జ్యోత్స్న
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా నవంబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు 511 నుంచి 516వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
నవంబర్ 10వ తేదీ 511వ ఎపిసోడ్‌లో..
కొత్త సీఈవో ఎంపిక కోసం ఆఫీస్‌లో గొడవ జరగుతుంటుంది. భోజనం చేశాక కొత్త సీఈవో ఎవరో చెబుతానని శివన్నారాయణ చెప్పడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆఫీసుకి సుమిత్ర, పారిజాతం రావడంతో కార్తీక్, దీప షాక్ అవుతారు. సొంత మనవరాలిని కాదని పనిమనిషి దీపను సీఈవోగా చేయడానికి నేను ఒప్పుకోనని గొడవ చేస్తుంది పారు. దీపను సీఈవోగా చేయాలని ఆలోచన మాకు లేదని, కానీ నువ్వు చెప్పిన తర్వాత ప్లాన్ మారిపోయిందని అంటాడు శివన్నారాయణ. దీపను కనుక సీఈవోగా అనౌన్స్ చేస్తే దానిని ఇక్కడే పొడిచి పొడిచి చంపుతానని జ్యోత్స్నకి చెబుతుంది పారు. నీ నిర్ణయం ఏంటో చెప్పమని సుమిత్రను అడుగుతాడు శివన్నారాయణ. కంపెనీ కొత్త సీఈవోగా సమర్ధులైన వారికే బాధ్యతలు అప్పగించమని చెబుతుంది సుమిత్ర. ఆమె మాటలతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. ప్రస్తుతానికి తాను సీఈవోగా కొనసాగలేనని నాకు బదులుగా దీపను సీఈవోగా ప్రపోజ్ చేస్తున్నానని కార్తీక్ చెప్పడంతో బోర్డు మెంబర్స్, జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు.
నవంబర్ 11వ తేదీ 512వ ఎపిసోడ్‌లో..
కొత్త సీఈవోగా తనను ప్రపోజ్ చేయడాన్ని ఊహించని దీప.. బోర్డ్ మీటింగ్ నుంచి అలిగి వెళ్లిపోతుంది. ఈ కుటుంబం బాగుండటానికి ఏమైనా చేస్తానని చెప్పి ఇలా వెళ్లిపోతావా? అని కార్తీక్ ఆమెను ఒప్పించి తిరిగి తీసుకొస్తాడు. సీఈవో అవ్వడానికి అర్హత కావాలని జ్యోత్స్న చెప్పడంతో.. దీప తెలివితేటల్ని, గతంలో సత్యరాజ్ రెస్టారెంట్‌ను నెంబర్ వన్‌గా నిలబెట్టడానికి ఆమె ఎలా సాయం చేసిందో చెబుతాడు కార్తీక్. వంట చేయడంతో పాటు బిజినెస్‌ను ఎలా డెవలప్ చేయాలో దీపకు ఐడియా ఉందని అంటాడు. కార్తీక్ ఎంత చెప్పినా జ్యోత్స్న, పారులు ఒప్పుకోకపోవడంతో కొత్త సీఈవో ఎంపిక కోసం జ్యోత్స్న, దీపలకి ఓటింగ్ పెడతాడు శివన్నారాయణ. బోర్డ్ మెంబర్ల ఓట్లన్నీ దీపకే పడటంతో కొత్త సీఈవోగా ఆమెను ప్రకటిస్తారు. అయితే తనకు ఈ బాధ్యతలు వద్దని.. మా బావ డ్రైవర్‌గా ఉంటే, నేను సీఈవోగా ఉండలేనని పదవిని తిరస్కరిస్తుంది దీప.

Photo Courtesy: JioHotstar
నవంబర్ 12వ తేదీ 513వ ఎపిసోడ్‌లో..
బావ, దీప, నేను కాకుండా ఈ కంపెనీకి కొత్త సీఈవోగా ఎవరినీ ఎంపిక చేశావని శివన్నారాయణని నిలదీస్తుంది జ్యోత్స్న. ఇంతలో సూట్ బూట్‌లో స్టైల్‌గా శ్రీధర్ ఎంట్రీ ఇవ్వడంతో అంతా షాక్ అవుతారు. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌కి కొత్త సీఈవోగా శ్రీధర్‌ని నియమించానని, నువ్వు రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. మావయ్యని సీఈవో చేయడానికి అర్హత ఏంటీ? అని జ్యోత్స్న ప్రశ్నించగా.. సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌గా శ్రీధర్ నిరూపించుకున్నాడని చెబుతాడు పెద్దాయన. బయటకు వెళ్తున్న శివన్నారాయణకు పారు సీటు దగ్గర కత్తి దొరకడంతో దానిని జాగ్రత్తగా దాయమని కార్తీక్‌తో చెబుతాడు. శ్రీధర్‌ను సీఈవో చైర్‌లో కూర్చోబెట్టి ఆల్ ది బెస్ట్ చెబుతాడు శివన్నారాయణ. నన్ను నా కొడుకు గెలిపించాడని కార్తీక్‌ని మెచ్చుకుంటాడు శ్రీధర్. జ్యోత్స్నకి కూడా ఈ కంపెనీలో ఏదో ఒక పోస్ట్ ఉండాలని.. నేనే వచ్చి స్వయంగ నా మేనకోడలితో చెబుతానని అంటాడు శ్రీధర్. అందరి ముందు తనకు ఘోర అవమానం జరగడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి జ్యోత్స్న సిద్ధమవుతుంది.
నవంబర్ 13వ తేదీ 514వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న ఇంట్లో నుంచి వెళ్లిపోతుండగా అందరూ ఆపుతారు. ఇంతలో అక్కడికి శ్రీధర్ వచ్చి.. నువ్వు సీఈవోగా లేకపోయినా కంపెనీలోనే ఉండాలని చెబుతాడు. నా మీద ఎవ్వరూ జాలి చూపించొద్దు.. జరిగిన అవమానం చాలని నేను ఇంట్లో ఉండనని అంటుంది జ్యోత్స్న. అయితే నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లిపో అని తేల్చేస్తాడు శివన్నారాయణ. జ్యోత్స్న భవిష్యత్ గురించి సుమిత్ర పడుతున్న బాధ చూడలేక నాన్న ఈ నిర్ణయం తీసుకున్నాడని చెబుతాడు దశరథ. జ్యోత్స్నే సీఈవోగా ఉండాలంటే తాతని నేను ఒప్పిస్తానని, నీ నిర్ణయం చెప్పమని కార్తీక్ అడగ్గా.. జ్యోత్స్న పెళ్లి చేసుకుంటే చాలని అంటుంది సుమిత్ర. శ్రీధర్‌ని సీఈవో చేయాలన్నది నా నిర్ణయమేనని చెబుతాడు శివన్నారాయణ. ఇంట్లో గొడవ సద్దుమణిగాక కార్తీక్‌తో పర్సనల్‌గా మాట్లాడతాడు పెద్దాయన. కాంచన- శ్రీధర్‌లని కలపాలనే నేను ఇదంతా చేశానని చెబుతాడు. బోర్డ్ మీటింగ్‌లో దీప సీఈవో పోస్ట్ వద్దు అనడం, శ్రీధర్‌ను సీఈవోగా చేయడం గురించి తల్లికి చెబుతాడు కార్తీక్. ఇది మనం సెలబ్రెట్ చేసుకోవాల్సిన విషయమని నాన్నకి ఫోన్ చేసి విష్ చేయమని అంటాడు.

Photo Courtesy: JioHotstar
నవంబర్ 14వ తేదీ 515వ ఎపిసోడ్‌లో..
బోర్డ్ మీటింగ్‌లో తనకు జరిగిన అవమానంపై రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. బోర్డ్ మీటింగ్‌లో నన్ను ఓడించిన ఎవ్వరినీ వదిలిపెట్టనని పారుతో జ్యోత్స్న చెబుతుంది. ఇంతలో పాలు తీసుకొచ్చిన దీపపై కార్తీక్ అలుగుతాడు. మీ అమ్మానాన్న బాగుండాలని నువ్వెంత తాపత్రయపడ్డావో.. మా అమ్మానాన్న కూడా బాగుండాలని అనుకున్నానని చెబుతాడు కార్తీక్. నాన్నని తాత క్షమించాడు.. అమ్మ కూడా క్షమించాలని చెబుతాడు. శ్రీధర్, కాంచన ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తుంటారు. నేరుగా కాంచనకి ఫోన్ చేసిన శ్రీధర్.. నా కాల్ గురించి వెయిట్ చేస్తున్నావా? అని అడుగుతాడు. సీఈవో అయినా ఎంతో సాధించినా.. నువ్వు లేవనే బాధ వెంటాడుతోందని చెబుతాడు శ్రీధర్. మీతో బతకాలని ఆశపడుతున్నానని ఈ జన్మకి నన్ను క్షమిస్తావా? అని అడుగుతాడు. అది ఎప్పటికీ జరగదని కాంచన తేల్చేయడంతో శ్రీధర్ కంటతడి పెట్టుకుంటాడు. వారిద్దరి మాటల్ని విన్న కార్తీక్.. తల్లిని ఓదార్చి, నాన్న గురించి ఒకసారి ఆలోచించమని చెబుతాడు. మీ నాన్న నా పరువుని, నా గౌరవాన్ని సమాధి చేసేశాడని అంటుంది కాంచన. నీకు ఎవరున్నా లేకపోయినా నేను ఉన్నానని అంటాడు కార్తీక్.
నవంబర్ 15వ తేదీ 516వ ఎపిసోడ్‌లో..
ఉదయాన్నే తనకు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టడంతో శ్రీధర్‌కు కాల్ చేసి మండిపడుతుంది. ఇంతలో కార్తీక్ రావడంతో ఫోన్‌ని పక్కనపెట్టేస్తుంది. దీప- కార్తీక్‌లు కంపెనీని ఎలా డెవలప్ చేయాలా? అని మాట్లాడుతూ ఉండగా శ్రీధర్ వింటాడు. జ్యోత్స్న రెస్టారెంట్స్ పేరు మీదే అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీస్ వద్ద ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తే తక్కువ ధరకు నాణ్యమైన ఫుడ్ దొరుకుతుందని దీప అదిరిపోయే ఐడియా చెబుతుంది. ఇది విన్న శ్రీధర్.. కోడల్ని మనసులోనే మెచ్చుకుంటాడు. కాశీ ఉద్యోగం చేయకుండా నన్ను, నా ఫ్యామిలీని మోసం చేస్తున్నాడని స్వప్ని అనుమానం వస్తుంది. ఉదయాన్నే శివన్నారాయణ ఇంటికి వెళ్లిన శ్రీధర్.. తన వద్ద కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చే ప్లాన్ ఉందని దీప చెప్పిన విషయాన్నే చెబుతాడు. దాంతో శివన్నారాయణ ఫ్యామిలీ మెచ్చుకోగా.. తన ప్లాన్ ఎలా లీక్ అయ్యిందా? అని దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఈ ఐడియా నాది కాదు.. దీపదేనని చెప్పడంతో అంతా ఆమెను మెచ్చుకుంటారు. మీ నాన్నని సీఈవోని చేశాక మీ అమ్మ రియాక్షన్ ఎలా ఉంది? అని కార్తీక్‌ను అడుగుతాడు శివన్నారాయణ. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications










