Karthika Deepam 2 Weekly: శ్రీధర్‌, కావేరిలకు అవమానం... దీపని నెట్టేసిన జ్యోత్స్న, దాస్‌ ఆవేశం

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకు 517 నుంచి 522వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

నవంబర్ 17వ తేదీ 517వ ఎపిసోడ్‌లో..
కాశీ ఉద్యోగం చేయడం లేదని తెలుసుకున్న స్వప్న అతని నుంచి తెలివిగా నిజం రాబడుతుంది. కాశ తనను మోసం చేయడంతో స్వప్న ఏడుస్తుంది. కూతురి ఏడుపు విన్న కావేరి ఏం జరిగిందో తెలుసుకుని షాక్ అవుతుంది. తల్లీకూతుళ్లు నానామాటలు అనగా.. నాకు ఉద్యోగం లేదన్న విషయం మావయ్య గారిక తెలుసని అంటాడు కాశీ. ఇంట్లో పరిస్థితులు బాలేకపోవడంతో అందరి జాతకాలు చూపించేందుకు గురువుగారని పిలిపిస్తాడు శివన్నారాయణ. ఈ కుటుంబానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది, కానీ ఈ ఇంటి వారసురాలికి మంచి జరగబోతోందని అంటాడు గురువుగారు. మీకు రాబోయే విపత్తు నుంచి గట్టెక్కడానికి హోమం చేయాలని ఇందుకు మీ రక్తసంబంధీకులు, ఈ ఇంటితో సంబంధం ఉన్న బంధుగణమంతా ఉండాలని చెబుతాడు. దాంతో గురువు గారు చెప్పినట్లే ఎవరెవరినీ గెస్ట్‌లుగా పిలవాలో శివన్నారాయణ చెబుతుండగా కార్తీక్ రాసుకుంటూ వెళ్తాడు. ఇంతలో వేరే పనిమీద శ్రీధర్ అక్కడికి రావడంతో కావేరి, స్వప్న, కాశీలను కూడా పిలవాలని చెబుతాడు శివన్నారాయణ. వాళ్లని పిలిస్తే మేం ఊరుకోమని పారు, జ్యోత్స్నలు అవమానించడంతో శ్రీధర్ అందరికీ క్షమాపణలు చెప్పి ఏడుస్తూ వెళ్లిపోతాడు.

నవంబర్ 18వ తేదీ 518వ ఎపిసోడ్‌లో..
ఇంటి అల్లుడు ఏడుస్తూ వెళ్లిపోవడంతో ఆ జ్యోత్స్న, పారిజాతానికి మనసు ఉండదా అంటూ కార్తీక్‌తో చెబుతుంది దీప. తాతని అడ్డుపెట్టుకుని వాళ్లిద్దరికీ నేను బుద్ధి చెబుతానని అంటాడు కార్తీక్. అత్తయ్య గారి కారణంగా జ్యోత్స్న రోజురోజుకు మొండిదానిలా మారిపోతుందని, తను ఆడపిల్లని అనే విషయం కూడా మరిచిపోతుందని దశరథ్, సుమిత్రలు బాధపడతారు. ఇంతలో దీప రావడంతో ఆమెను పక్కకి పిలిచి జ్యోత్స్నని చెల్లెలు అనుకో.. అది చేసే తప్పుల్ని క్షమించమని ప్రాధేయపడతాడు దశరథ. ఇంట్లో ఫస్ట్ టైం మన వాయిస్‌కి అందరూ తగ్గారని, ఆ శ్రీధర్ ఏడుస్తూ వెళ్లిపోయాడని జ్యోత్స్న, పారిజాతంలు సంతోషిస్తారు. ఇంతలో కార్తీక్ వచ్చి తాత పిలుస్తున్నాడని చెబుతాడు. శ్రీధర్‌ని అతని కుటుంబాన్ని హోమానికి పిలవాలని, లేకపోతే పారిజాతంను ఇంట్లో నుంచి గెంటేస్తానని తేల్చిచెబుతాడు శివన్నారాయణ. దాంతో జ్యోత్స్న, పారులు శ్రీధర్ ఇంటికి వెళ్తారు.

Karthika deepam 2 Serial Weekly Episodes November 17th to November 22nd Here is Highlights

Photo Courtesy: JioHotstar

నవంబర్ 19వ తేదీ 519వ ఎపిసోడ్‌లో..
పెద్దాయన ఇంట్లో నుంచి గెంటేస్తానని బెదిరించడంతో శ్రీధర్ ఇంటికి వెళ్లిన పారిజాతం, జ్యోత్స్నలు అతనిని హోమానికి రమ్మని బతిమలాడుతుంది పారిజాతం. కావేరి, స్వప్నలు సెటైర్లు వేయడంతో మా ఇంటికి వచ్చిన తర్వాత మీ సంగతి చెబుతానని అనుకుంటుంది జ్యోత్స్న. స్వప్న- కాశీల మధ్య ఏదో జరిగిందని కార్తీక్ గమనించి సైలెంట్‌గా వెళ్లిపోతాడు. హోమం జరగకుండా ఏదో చేయబోతున్నావు కదా.. దానిని ఆపేయమని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అయినా ఈ ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని గురువుగారు చెప్పారు కదా? అంటే నువ్వు నీ ఇంటి వారసురాలివి కాదా ? నీకు మంచి జరగొద్దా? అని కార్తీక్ ప్రశ్నించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. వీరి మాటలను దూరం నుంచి వింటున్న పారిజాతాన్ని చూసిన శివన్నారాయణ ఆమెపై సెటైర్లు వేస్తాడు.

నవంబర్ 20వ తేదీ 520వ ఎపిసోడ్‌లో..
హోమం రోజున ఉదయమే కార్తీక్, కాంచన, శ్రీధర్, కావేరి, దీప, స్వప్న, కాశీలు శివన్నారాయణ ఇంటికి వస్తారు. వాళ్లందరినీ చూసి శివన్నారాయణ ఎంతో సంతోషిస్తాడు. కావేరిని, స్వప్నని పలకరించిన శివన్నారాయణ.. మీరంతా నా కుటుంబమే అనడంతో కావేరి ఏడుస్తూ పెద్దాయనకు నమస్కరిస్తుంది. ఇంతలో సుమిత్ర వచ్చి కావేరిని వదిన అని పిలవడంతో ఆమె సంతోషిస్తుంది. కాంచన, దీప, కావేరి, స్వప్న, మీ నాయనమ్మల కాళ్లకు పసుపు రాస్తే మంచి జరుగుతుందని జ్యోత్స్నకి చెబుతుంది సుమిత్ర. పసుపు రాయడానికి ముందు కాంచన, కావేరి, స్వప్నలను నానామాటలు అంటుంది జ్యోత్స్న. కావేరిని ఉంపుడుగత్తె అనడంతో తల్లిని తీసుకుని ఏడుస్తూ వెళ్లిపోతుంది స్వప్న. చెల్లెలు ఏడుస్తూ ఉండటంతో ఏం జరిగిందని అడుగుతాడు కార్తీక్. స్వప్న జరిగినదంతా చెప్పడంతో రగిలిపోయిన కార్తీక్.. వెంటనే నా చిన్నమ్మకు సారీ చెప్పమని వార్నింగ్ ఇస్తాడు. మేమంతా ఓకే కుటుంబం.. నీకొచ్చిన నష్టం ఏంటీ? అని నిలదీస్తాడు కార్తీక్. దాంతో జ్యోత్స్న సారీ చెబుతుంది.

Karthika deepam 2 Serial Weekly Episodes November 17th to November 22nd Here is Highlights

Photo Courtesy: JioHotstar

నవంబర్ 21వ తేదీ 521వ ఎపిసోడ్‌లో..
కార్తీక్ వార్నింగ్ ఇవ్వడంతో కావేరి కాళ్లకు పసుపు రాసి కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. ఆ అలగా దానికి నేను పసుపు రాయడం ఏంటని పారిజాతం వద్ద కోప్పడుతుంది. జ్యోత్స్న వెళ్లిపోవడంతో మిగిలిన వారికి దీప పసుపు రాస్తుంది. సుమిత్ర పాదాలకు పసుపు రాస్తూ సంతోషిస్తుంది. కాంచనను పక్కకి పిలిచిన శివన్నారాయణ.. శ్రీధర్‌ను సీఈవో చేసిన విషయం నీకు చెప్పకుండా చేశానని అనడంతో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటారని అంటుంది కాంచన. నేను శ్రీధర్‌కి ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించడం వెనుక కంపెనీ బాధ్యతలతో పాటు నీ జీవితాన్ని నిలబెట్టాలని అనుకోవడం కూడా ఒక కారణం అని చెబుతాడు. శ్రీధర్‌ను నేను క్షమించాను.. నువ్వు కూడా క్షమించు అని అడుగుతాడు శివన్నారాయణ. అది ఎప్పటికీ జరగదని.. ఆయన నన్ను మోసం చేశాడని ఏడుస్తుంది కాంచన. నేను నా భర్తను ఎప్పుడు క్షమిస్తానంటే అని చెబుతుండగా దాస్ రావడంతో ఆమె సైలెంట్ అయిపోతుంది. ఈ మాటలన్నీ వింటున్న శ్రీధర్, కార్తీక్‌లు బాధపడతారు. వారసురాలి చేతుల మీదుగానే హోమంలో పూర్ణాహుతి జరగాలని గురువుగారు చెప్పడంతో దాస్ రగిలిపోతాడు. అసలైన వారసురాలి చేతుల మీదుగా ఈ పూజ జరగాలని... జ్యోత్స్నే నా కూతురని చెబుతానని అనడంతో పారిజాతం వణికిపోతుంది. ఆవేశంగా హోమగుండం దగ్గరకి వస్తున్న దాస్‌ని చూసి జ్యోత్స్న టెన్షన్ పడుతూ పూర్ణాహుతిని వదిలేస్తుంది. అది వెళ్లి నేరుగా దీప చేతుల మీదుగా హోమంలో పడటంతో దాస్, కార్తీక్ సంతోషిస్తారు.

నవంబర్ 22వ తేదీ 522వ ఎపిసోడ్‌లో..
పూర్ణాహుతి తన చేతుల మీదుగా కాకుండా దీప చేతుల మీదుగా పడటంతో దీపపై మండిపడుతుంది. నీ చేతుల్లోంచి జారిపోతుండగా దీప పట్టుకునే యత్నంలో హోమగుండంలో పడిందని కార్తీక్ చెబుతాడు. దీపకు మద్ధతుగా స్వప్న, కాశీ మాట్లాడటంతో ఆమె నోరుమూయిస్తుంది పారిజాతం. నువ్వు, నేను తల్లీకూతుళ్లం.. కానీ మన మధ్య దీప అడ్డోస్తోందని మండిపడుతుంది జ్యోత్స్న. దీప పట్టుకోకుంటే పూర్ణాహుతి కిందపడి ఈ ఇంటికి అరిష్టం జరిగేదని గురువుగారు చెప్పడంతో దీపను కోపంతో పక్కకు నెట్టేస్తుంది జ్యోత్స్న. దీప స్పృహ తప్పడంతో ఆమెను దగ్గరుండి చూసుకుంటుంది సుమిత్ర. దీప కాకుండా ఇంకెవరు పూర్ణాహుతిని పట్టుకున్నా నేను బాధపడే దానిని కాదని పారుతో చెబుతుంది జ్యోత్స్న. దీప ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నేను ఎన్నో కోల్పోయాను.... చివరికి వారసురాలి స్థానాన్ని కూడా కోల్పోయేలా ఉన్నానని జ్యోత్స్న చెప్పడంతో పారు షాక్ అవుతుంది. కాశీకి ప్రసాదం పెట్టకుండా స్వప్న వెళ్లిపోవడాన్ని గమనిస్తాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X