Karthika Deepam 2 Weekly: తల్లి కాబోతున్న దీప... జ్యోత్స్న మోసాన్ని బయటపెట్టిన శ్రీధర్
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా నవంబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకు 523 నుంచి 528వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
నవంబర్ 24వ తేదీ 523వ ఎపిసోడ్‌లో..
కాశీ- స్వప్నల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటాడు కార్తీక్. వారిద్దరి దగ్గరికి వెళ్లి ఏం జరిగింది? అని అడుగుతాడు. దాంతో కాశీ ఉద్యోగం లేకుండా తనను మోసం చేసిన విషయాన్ని చెబుతుంది స్వప్న. పెద్దవాళ్లని కూడా ఎదిరించి ఒకరికోసం ఒకరు నిలబడ్డారు.. అలాంటిది చిన్న విషయానికి ఇలా చేస్తారా అని క్లాస్ పీకుతాడు కార్తీక్. తిరిగి స్వప్న, కాశీలను కలుపుతాడు. ఇదంతా చూసిన దాస్ తన అల్లుడిని మెచ్చుకుంటాడు. కుటుంబానికి నీలాంటి కొడుకు, నీలాంటి అన్నయ్య ఉండాలని ప్రశంసిస్తాడు. కాశీ, స్వప్నలను పంపేసి దీపే ఈ ఇంటి వారసురాలు అన్న విషయాన్ని ఎప్పుడు చెబుతావని కార్తీక్‌ని అడుగుతాడు దాస్. దానికి ఇంకా టైం ఉందని చెబుతాడు కార్తీక్. కావేరి, కాంచన, శ్రీధర్‌లు మాట్లాడుకుంటూ ఉండగా పారిజాతం నోరుజారడంతో కావేరి చీవాట్లు పెడుతుంది. దీపను పరీక్షించిన డాక్టర్ ఆమె తల్లి కాబోతుందని చెప్పడంతో అంతా సంతోషిస్తారు.
నవంబర్ 25వ తేదీ 524వ ఎపిసోడ్‌లో..
దీప గర్భం దాల్చినట్లు డాక్టర్ చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంటుంది. ఇకనైనా కార్తీక్ మీద పిచ్చి ప్రేమను వదిలేయ్.. వాడు ఇక ఎప్పటికీ నీవాడు కాదు.. ఇప్పటికైనా మరో పెళ్లి చేసుకోమని మనవరాలికి చెబుతుంది పారు. ఇంతలో దాస్ వచ్చి దీప ప్రెగ్నెంట్ అయినందుకు పారు, జ్యోత్స్నలకి స్వీట్లు పంచుతాడు. నువ్వు ఎంత చెడు చేయాలనుకున్నా చివరికి మంచే జరుగుతుందని అంటాడు. హోమం పూర్తి చేసి బయల్దేరుతూ... దశరథ - సుమిత్రల వైపు చూసిన గురువుగారు వాళ్లిద్దరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. హోమం చేసింది రాబోయే ప్రమాదం తీవ్రతను తగ్గించడానికే కానీ... రాకుండా చేయడానికి కాదని శివన్నారాయణతో అంటాడు గురువుగారు. ఆ మాటలతో శివన్నారాయణ షాక్ అవుతాడు. దీపే ఈ ఇంటి వారసురాలని తెలిసే రోజు త్వరలోనే ఉందని జ్యోత్స్నకి చెబుతాడు దాస్. దీప ప్రెగ్నెంట్ కావడంతో కాంచన, అనసూయలు సంతోషిస్తారు.

Photo Courtesy: JioHotstar
నవంబర్ 26వ తేదీ 525వ ఎపిసోడ్‌లో..
దాస్ మాటలతో జ్యోత్స్న వణికిపోతుంది. దీప కోటీశ్వరరాలిగా పుట్టి పేదింట్లో బతుకుతుందని, కానీ దీప కూతురు మాత్రం గొప్పింటి బిడ్డలాగే ఈ ఇంట్లో తిరిగి అడుగుపెడుతుందని చెబుతాడు దాస్. నేను మళ్లీ ఈ ఇంట్లో అడుగుపెట్టే పరిస్థితులు తీసుకురావొద్దని వార్నింగ్ ఇస్తాడు దాస్. కార్తీక్ బావ కలిపినా తనతో స్వప్న మాట్లాడకపోవడంతో కాశీ హర్ట్ అవుతాడు. మా అన్నయ్య మీద గౌరవంతోనే ఆరోజు సైలెంట్ అయ్యానని చెబుతుంది స్వప్న. కార్తీక్ బావ ఆప్టరాల్ డ్రైవర్ అని కాశీ నోరు జారడంతో శ్రీధర్ సీరియస్ అవుతాడు. నా కొడుకు రాజ్యాన్ని వదులుకున్న రారాజు.. వాడితో నీకు పోలికా అంటూ అల్లుడిని నానామాటలు అంటాడు శ్రీధర్. ఉదయాన్నే డ్యూటీకి వచ్చిన దీపను రెస్ట్ తీసుకోమని చెబుతుంది శివన్నారాయణ కుటుంబం. ఇక్కడ పనులు చేయాల్సి ఉంటుందని, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కాదని సుమిత్ర అంటుంది. దీపకు ఆల్రెడీ పెళ్లయి, ఒక పాప కూడా ఉంది. ఆమెకు ప్రెగ్నెన్సీపై అనుభవం ఉందని జ్యోత్స్న నోరు జారడంతో సుమిత్ర లాగిపెట్టి కొడుతుంది. గురువుగారు ప్రమాదం గురించి చెప్పిన విషయాన్ని కార్తీక్‌కు చెప్పి బాధపడతాడు శివన్నారాయణ.
నవంబర్ 27వ తేదీ 526వ ఎపిసోడ్‌లో..
ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా నీ ఇంటి ముందు పోతురాజులా నేను నిలబడతానని చెబుతాడు కార్తీక్. అయితే జ్యోత్స్న రూపంలోనే ఈ ఇంట్లో పెద్ద ప్రమాదం పొంచి ఉందని మనసులో భయపడతాడు కార్తీక్. దీప కారణంగా సుమిత్ర తనను కొట్టడంతో రగిలిపోతుంది జ్యోత్స్న. ఆ దీప వల్ల జీవితంలో నేను చాలా కోల్పోయాను, ఆ బిడ్డను భూమ్మీదకు రానివ్వనని చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. జ్యోత్స్న అవమానించడంతో బాధపడుతున్న దీపను సుమిత్ర ఓదారుస్తుంది. ఇంట్లో జరిగిన గొడవని కాంచన వదినకు చెప్పొద్దని కార్తీక్‌ను బతిమలాడుతుంది సుమిత్ర. సీఈవో హోదాలో శివన్నారాయణ ఇంటికి వచ్చి జ్యోత్స్నని పిలవమంటాడు శ్రీధర్. ఏం జరిగింది? జ్యోత్స్న ఎందుకు అని శివన్నారాయణ అడగ్గా.. నేను నా మేనకోడలితోనే తేల్చుకోవాలని చెబుతాడు శ్రీధర్. ఆయన రాగానే కనీసం విష్ చేయకపోవడంతో దశరథ సీరియస్ అవుతాడు. కంపెనీకి సంబంధించిన 2.34 కోట్ల రూపాయల డబ్బు మాయమైందని, అంత డబ్బు ఏమైంది? అని జ్యోత్స్నని నిలదీస్తాడు శ్రీధర్. కంపెనీ ఖాతా నుంచి మాజీ సీఈవో పర్సనల్ అకౌంట్‌కి డబ్బు ట్రాన్స్‌ఫర్ అయ్యిందని శ్రీధర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నేను మా మమ్మీ పేరు మీద ల్యాండ్ కొన్నానని జ్యోత్స్న చెప్పగా కార్తీక్ సీరియస్ అవుతాడు.

Photo Courtesy: JioHotstar
నవంబర్ 28వ తేదీ 527వ ఎపిసోడ్‌లో..
కంపెనీ డబ్బుతో మా అమ్మ పేరుతో ల్యాండ్ కొన్నానని జ్యోత్స్న చెప్పిన మాటలు పచ్చి అబద్దమని కార్తీక్ అంటాడు. ఓ తల్లి కోసం కూతురుపడే తాపత్రాయాన్ని అవమానిస్తున్నారని పారిజాతం మండిపడుతుంది. అయినా ఛైర్మన్‌గా నా పర్మిషన్ లేకుండా కంపెనీ అకౌంట్ నుంచి జ్యోత్స్న ఖాతాకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన అకౌంటెంట్‌పై కేసు పెట్టమని శివన్నారాయణ ఆదేశిస్తాడు. ల్యాండ్‌ని కంపెనీ ఆస్తిగా చూపిస్తే సరిపోతుందని శ్రీధర్ అనగా.. అది చాలా కష్టమైన పని, దానికి ఎంతో ప్రాసెస్ ఉందని చెబుతాడు దశరథ. నిజంగానే నువ్వు సుమిత్ర పేరుతో ల్యాండ్ కొన్నావా? అని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. నేను తప్పించుకోవడానికి మా మమ్మీ పేరు వాడుకున్నానను రేపు నేను అసలు వారసురాలిని కాదని తెలిస్తే నా జీవితం ఏం కావాలి? నేను ఎలా బతకాలి? అందుకే మందుజాగ్రత్తగా అకౌంటెంట్‌కు లంచం ఇచ్చి నా పేరు ల్యాండ్ కొన్నానని చెబుతుంది జ్యోత్న్న. తనను, కాంచనను కలపాల్సిందిగా దశరథ సాయాన్ని అడుగుతాడు శ్రీధర్. ఈ మాటలు విన్న పారిజాతం, జ్యోత్స్నలు శ్రీధర్‌ను నానామాటలు అంటారు. దాంతో కార్తీక్ వాళ్లిద్దరికీ క్లాస్ పీకుతాడు. నా బాధలేవో నేను పడతానని నా కారణంగా మీరు మీరు కొట్టుకోవద్దని శ్రీధర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో దీప వస్తుండగా జ్యోత్స్న కాళ్లు అడ్డు పెడుతుంది. దాంతో దీప పడిపోతుండగా సుమిత్ర కాపాడుతుంది.
నవంబర్ 29వ తేదీ 528వ ఎపిసోడ్‌లో..
కిందపడిపోతున్న దీపని సుమిత్ర కాపాడటంతో తన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని జ్యోత్స్న రగిలిపోతుంది. ఈసారి ఆ బిడ్డను ఎవరూ కాపాడలేరని మనసులో అనుకుంటూ ఉండగా కార్తీక్ వస్తాడు. కడుపులోని బిడ్డను కూడా చంపాలని చూస్తే ఒక పెద్ద కర్ర తీసుకుని వెనుక నుంచి కొడతానని అంటాడు. ఆ మాటలతో దాస్‌ని తాను కొట్టిన విషయం గుర్తొచ్చి జ్యోత్స్న వణికిపోతుంది. నా బిడ్డ జోలికి, నా భార్య జోలికి వస్తే.. డ్రైవర్‌గా ఉన్న నేను.. కార్తీక్‌గా మారతానని అప్పుడే కురుక్షేత్రమేనని వార్నింగ్ ఇస్తాడు. కాంచనతో తాడోపేడో తేల్చుకోవాలని ఇంటికి వస్తాడు శ్రీధర్. ఆమె భర్త జీవితంలో నిన్ను క్షమించనని అనడంతో శ్రీధర్ బాధపడతాడు. నువ్వు కిందపడిపోవడం అనుకోకుండా జరిగిందా? లేక ఎవరైనా కాలు అడ్డుపెట్టారా? అని శివన్నారాయణ అడగటంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











