Karthika Deepam 2 Weekly: కొత్త సీఈవోగా దీప...జ్యోత్స్న కోసం పారిజాతం కుట్ర, చక్రం తిప్పిన కార్తీక్

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు 505 నుంచి 510వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

నవంబర్ 3వ తేదీ 505వ ఎపిసోడ్‌లో..
సుమిత్ర, దశరథల కోసం ఇంత ఎందుకు చేశావని శివన్నారాయణ అడగ్గా.. కన్నతల్లిలా నాకు ప్రేమను పంచిన అత్తకు కొంతైనా రుణం తీర్చుకుంటానని చెబుతాడు కార్తీక్. ఆ తర్వాత దశరథ- సుమిత్రలతో దండలు మార్పించి, కేక్ కట్ చేయిస్తాడు. మా ఇద్దరినీ కలిపినందుకు మీ ఇద్దరికి ఈ సంతోష సమయంలో ఏమైనా ఇవ్వాలని ఉందని అడుగుతాడు దశరథ. ఆ మాటలతో రగిలిపోయిన జ్యోత్స్న.. ఎప్పుడూ మా ఇంటి గురించి ఆలోచించండి కాదు, ముందు అత్తయ్య, మావయ్యలని కలపమని అంటుంది. దాంతో శివన్నారాయణ తన మనవరాలికి క్లాస్ పీకుతారు. ఆ తర్వాత జ్యోత్స్నతో సుమిత్ర మాట్లాడుతూ.. బోర్డ్ మీటింగ్ తర్వాత ఇంట్లో జరిగిన గొడవ వల్లే నేను వెళ్లిపోయానని, నేను ఇల్లు వదిలేటప్పుడు కనీసం ఆపాలని కూడా నువ్వు చూడలేదని సుమిత్ర చెప్పడంతో జ్యోత్స్నకు ముచ్చెమటలు పడతాయి. ఎవరు నా వాళ్లో? ఎవరు పరాయి వాళ్లో? నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుందని అంటుంది.

నవంబర్ 4వ తేదీ 506వ ఎపిసోడ్‌లో..
సుమిత్ర మాటలతో షాకైన జ్యోత్స్నకు ఏం చేయాలో అర్ధం కాదు.. ఆ వెంటనే పారిజాతంతో ఈ విషయం గురించి మాట్లాడుతుంది. నువ్వు సుమిత్ర - దశరథల కూతురివి కాదని తెలిసేరోజు త్వరలోనే ఉందని పారిజాతం అనడంతో జ్యోత్స్న వణికిపోతుంది. బిడ్డల్ని మార్చినందుకు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు.. నిన్ను అయితే దాసుగాడిని పిలిచి నీ కూతురిని నువ్వు తీసుకెళ్లు అని చెబుతారని అంటుంది. ఆ తర్వాత అసలైన వారసురాలిని వెతికేందుకు వేట మొదలవుతుందని పారిజాతం జోస్యం చెబుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర దీపని సుమిత్ర, దశరథలు తమ ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకుని భోజనం వడ్డిస్తారు. అది చూసిన జ్యోత్స్న ఇంకా టెన్షన్ పడుతుంది. భోజనాలు ముగిసిన తర్వాత శ్రీధర్, కాంచన, కార్తీక్, దీపలకు శివన్నారాయణ బట్టలు పెడతాడు. త్వరలోనే ఈ ఇంట్లో పెద్ద పార్టీ జరుగుతుందని దానికి మీరంతా రావాలని చెబుతాడు. నీ చిన్న ఫ్యామిలీని కూడా తీసుకురమ్మని చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతారు.

Karthika deepam 2 Serial Weekly Episodes November 3rd to November 8th Here is Highlights

Photo Courtesy: JioHotstar

నవంబర్ 5వ తేదీ 507వ ఎపిసోడ్‌లో..
నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పుడు, నేను కంటికి కనిపించినప్పుడు ఒక కూతురు తల్లికి ఎంత చేస్తుందో? అంత చేశావని దీపతో అంటుంది సుమిత్ర. నీకు మాకు ఏ రక్త సంబంధం లేదు కదా? పైగా నేను మీ అమ్మని అని ఎందుకు అన్నావు? అని ప్రశ్నిస్తుంది. ఇంతలో కార్తీక్ వచ్చి మీ ఇద్దరిదీ ఏదో రుణమని చెబుతాడు. దీప అంటే ఏంటో నీకు ఒక క్లారిటీ వచ్చిందా అని అడగ్గా.. దీప గురించి ఓ మచ్చ అలాగే ఉందని చెబుతుంది సుమిత్ర. దీప ఆ రోజు గన్ కాల్చలేదని.. బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో నేను కనుక్కుంటానని, నిజం నిరూపిస్తానని చెబుతాడు కార్తీక్. ఇంట్లో నాకు రెస్పెక్ట్ లేకుండా పోయిందని, దీప దేవతలా, కార్తీక్ బావ హీరోలా అయ్యారని పారిజాతంతో చెబుతుంది జ్యోత్స్న. పాత పారిజాతం మళ్లీ బయటికి రావాలని ఏదో ఒక మాయ చేసి నన్ను తాత సీఈవోగా తీయకుండా చూడమని అడుగుతుంది జ్యోత్స్న. శివన్నారాయణ కుటంబం సంతోషంగా ఉండటంతో కాంచన ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు. అందరూ కలిసిపోయారు కానీ నువ్వు, నేను మాత్రం కలవలేదని కాంచనతో చెప్పుకుని బాధపడతాడు శ్రీధర్.

నవంబర్ 6వ తేదీ 508వ ఎపిసోడ్‌లో..
సీఈవో పదవి నుంచి నన్ను తీయకుండా చేయమని జ్యోత్స్న చెప్పడంతో శివన్నారాయణని బుట్టలో వేసుకునేందుకు పారిజాతం పాల గ్లాసుతో వస్తుంది. అది చూసిన పెద్దాయనకు డౌట్ వచ్చి నీకేం కావాలో అడగమని చెబుతాడు. జ్యోత్స్నను సీఈవో పోస్ట్ నుంచి తీయొద్దని అంటుంది పారిజాతం. వీరి మాటలను దొంగచాటుగా వింటున్న జ్యోత్స్నపై శివన్నారాయణ సీరియస్ అవుతాడు. ఉదయాన్నే దశరథ దగ్గరికి వెళ్లిన జ్యోత్స్న.. నాకు అన్యాయం జరుగుతుంటే తండ్రిగా ఇలా ఉంటారేంటీ అని అడుగుతుంది. నా తర్వాత ఈ ఆస్తి మొత్తం నీదే.. ఆస్తి పోతే నేను ఒక్కడినే రోడ్డునపడతాను, అదే కంపెనీ లేకపోతే కొన్ని వందల మంది రోడ్డున పడతారని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ ఇంట్లో ఆడవాళ్లకి ఏ నిర్ణయం తీసుకునే హక్కు లేదా? నా గురించి కాదు సుమిత్ర గురించి అని లాజిక్ తీస్తుంది పారిజాతం. తల్లిగా సుమిత్రకు కూడా అవకాశం ఉండాలని అనడంతో శివన్నారాయణ ఆలోచనలో పడతాడు. నీ కూతురు సీఈవోగా ఉండాలా? వద్దా అని సుమిత్రను అడుగుతాడు శివన్నారాయణ.

Karthika deepam 2 Serial Weekly Episodes November 3rd to November 8th Here is Highlights

Photo Courtesy: JioHotstar

నవంబర్ 7వ తేదీ 509వ ఎపిసోడ్‌లో..
తన గురించి తల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని జ్యోత్స్నలో టెన్షన్ పెరిగిపోతుంది. నా కూతురిని పెళ్లి కూతురిగా చూడాలని అనుకుంటున్నానని సుమిత్ర చెప్పడంతో పారిజాతం, జ్యోత్స్నలు షాక్ అవుతారు. అత్త ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదని దీపతో అంటాడు కార్తీక్. బావే కాబోయే సీఈవో అని దీనిని ఎలాగైనా ఆపాలని పారుతో ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న. ఈ విషయంలో సాయం చేయమని దీపని అడుగుతుంది జ్యోత్స్న. నేను సీఈవో కావడానికి నువ్వు హెల్ప్ చేస్తే బావతో నా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని ఆఫర్ ఇస్తుంది. నేను ఏం చేసినా మా బావ నాట వినడని తేల్చేస్తుంది దీప. కంపెనీ ఆఫీస్ బయట కార్తీక్‌తో జ్యోత్స్న మాట్లాడుతూ.. నేనే సీఈవోగా ఉండేలా చేయమని అంటుంది. మా ఆవిడతో మాట్లాడటం చూశానని, దీనినే దిగజారిపోవడం అంటారని కార్తీక్ మండిపడతాడు. నాకు ఆ పదవిపై ఎలాంటి ఆశలేదని.. కానీ తాతయ్య పిలిస్తే మాత్రం కాదనలేనని చెబుతాడు. బోర్డ్ మీటింగ్‌లో జ్యోత్స్న గారు సీఈవోగా ఉంటే మేం ఈ కంపెనీలో ఉండలేమని తేల్చిచెబుతారు బోర్డు మెంబర్స్. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

నవంబర్ 8వ తేదీ 510వ ఎపిసోడ్‌లో..
కార్తీక్‌ను బోర్డ్ మీటింగ్‌లోకి పిలిపిస్తాడు శివన్నారాయణ. నువ్వు బావని సీఈవోగా చేయాలని అనుకుంటున్నావా? అని నిలదీస్తుంది జ్యోత్స్న. బోర్డ్ మెంబర్స్ కూడా కార్తీక్ గారే సీఈవోగా ఉండాలని చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. మా ఇద్దరి మధ్య ఓ అగ్రిమెంట్ జరిగిందని.. దీని ప్రకారం నా పర్మిషన్ లేకుండా బావ ఏం చేయలేడని అంటుంది. జ్యోత్స్నకి ఇచ్చిన మాటకి, అగ్రిమెంట్‌కి కట్టుబడి ఉంటానని కార్తీక్ కూడా చెబుతాడు. నువ్వు ఇలాంటిదేదో చేస్తావని మేం ముందే అనుకున్నామని.. అందుకే కొత్త సీఈవోగా ఒకరిని అనుకున్నామని చెబుతాడు శివన్నారాయణ. అది ఎవరో నేను తెలుసుకోవచ్చా అని జ్యోత్స్న అడగ్గా... ఇంతలో దీప ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. వెంటనే పారిజాతానికి ఫోన్ చేసి దీపను సీఈవోగా కాకుండా ఆపమని చెబుతుంది. దాంతో సుమిత్రను రెచ్చగొట్టిన పారిజాతం. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X