Karthika Deepam 2 దీప విషయంలో కార్తీక్ చేసిన తప్పేంటి? అసలు ఈ శౌర్య ఎవరి కూతురు?

ఎన్నో ఏళ్లుగా కార్తీక దీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు ఆ ధారావాహికకు సీక్వెల్ గా కార్తీక దీపం ఇది నవవసంతం పేరుతో టెలివిజన్ ముందుకు వచ్చింది. ఇక ఈసారి వంటలక్క, కార్తీక్ బాబు డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నారు. ఈ సీరియల్ తమిళంలో చెల్లెమ్మగా టెలికాస్ట్ కాగా.. దానికి రీమేక్ గా ఇది తెరకెక్కుతుంది. ఇక మొదటి వారం ఆసక్తికరంగా, ట్విస్టులతో సాగింది. అసలు మార్చి 25వ తేదీ నుంచి మార్చి 30వరకు జరిగిన హైలెట్స్ ఓసారి చూద్దాం.

కార్తీక దీపం 2.. కొత్త నటీనటులతో ప్రారంభం అయింది. మొదటి ఎపిసోడ్ సినిమాను తలపించింది. కట్ చేయగానే... ఓ ఆసుపత్రిలో సుమిత్ర (దీప తల్లి) ఓ బిడ్డకు జన్మను ఇస్తుంది. అయితే ఆ బిడ్డ ప్లేసులోకి మరో బిడ్డను మార్చుతుంది పారిజాతం(కార్తీక్ నానమ్మ). దీపను చంపమని ఓ వ్యక్తి ఇచ్చి పంపిస్తుంది. ఆ వ్యక్తి పసి బిడ్డను చంపలేక బయట వదిలేసి వెళ్లిపోతాడు. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండేందుకు ఇక ఆ వ్యక్తిని పారిజాతం చంపేంచేస్తుంది.

Karthika Deepam 2 Telugu Serial Weekly Roundup 2023 March 25th to March 30th episode Story

ఇక దీప స్థానంలోకి తన మొదటి భర్త కొడుకు కూతురిని పెడుతుంది. అయితే ఇదంతా చేసింది తన రెండో భర్త శివనారాయణ మీద ఉన్న కోపంతోనే. దీంతో తన మనవరాలు ఈ ఆస్తికి యువరాణిని చేయొచ్చనే పన్నాగంతో పారిజాతం ఇలా చేస్తుంది. ఇక దీప గోప్ప ఇంట్లో పెరగాల్సింది. అయితే ఓ నిరుపేద కుబేరా అనే వ్యక్తికి దొరుకుతాడు. దీంతో ఆ వ్యక్తి తెచ్చుకుని పెంచుకుంటాడు. ఆయనకు ఓ అక్క ఉంటుంది. ఆ అక్క దీపను వేదిస్తూ ఉంటుంది.

చిన్నప్పుడే చదువు మానిపించి.. వంటలక్కగా మార్చుకుంది. మరోవైపు జ్యోత్న్స దీప స్థానంలో పెరుగుతూ ఉంటుంది. ఓ రోజు జ్యోత్స్న తన బావను కలువ పువ్వు తీసుకురమ్మని అడుగుతుంది. అయితే నీళ్లంటే భయం నేను వెళ్లను అనికార్తీక్ అంటే బలవంతంగా నీటిలో దించుతుంది. కార్తీక్ నీళ్లలో పడిపోతాడు. అటుగా వెళ్తున్న దీప చూసి.. కార్తీక్ ను కాపాడుతుంది. అలా తన తల్లి సుమిత్రను కూడా కలుసుకుంటుంది. ఆరోజే కార్తీక్ నీకు ఏదో ఒక రోజు సాయం చేస్తాను అని మాట ఇస్తాడు.

కట్ చేస్తే.. దీప తన కూతురుతో ఎంట్రీ ఇస్తుంది. తన భర్త ఎవరు.. అసలు ఈ కూతురు ఎలా వచ్చిందనే వివరాలు ఇంకా బయటకు చెప్పలేదు కానీ.. దీప తన అత్త అనసూయ కొడుకు నర్సింహను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. వారికి పుట్టిన బిడ్డనే శౌర్య అని తెలుస్తోంది. ఇక నర్సింహ ఊర్లో అప్పులు చేసి పారిపోతాడు. ఇక అప్పులు తీర్చుతూ దీప తన కూతురిని అత్తను వంటలు చేసి పోషిస్తూ ఉంటుంది. ఇక దీప సైకిల్ పోటీల్లో పాల్గొనగా.. అక్కడికి కార్తీక్ వస్తాడు.

Karthika Deepam 2 Telugu Serial Weekly Roundup 2023 March 25th to March 30th episode Story

అతన్ని చూసి.. దీప సిరీయస్ అవుతుంది. నేను ఆ తప్పు చేయలేదు దీప అంటూ కార్తీక్ చెప్తాడు. అసలు దీప విషయంలో కార్తీక్ చేసిన తప్పేంటి అనేది సస్పెన్స్ లో పెట్టారు. మరోవైపు దీప కోసం వెతుక్కుంటూ వెళ్తాడు కార్తీక్. ఇక దీప ఇంటకి ఓ అప్పులోడు వచ్చి.. రచ్చ చేస్తాడు. తప్పుగా ప్రవర్తిస్తే.. లాగి పెట్టి కొడుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి దగ్గరకు కార్తీక్ వచ్చి దీప ఇల్లు ఎక్కడ అడుగుతాడు. దీంతో ఆ వ్యక్తి దీప గురించి తప్పుగా మాట్లాడుతాడు. దీంతో రెచ్చిపోయిన కార్తీక్ అతన్ని కొడుతాడు.

ఇక దీప.. ఎవరితోనో కొట్టించిందని పగపడుతాడు. ఆమె ఇంటికి పోయి తప్పుగా ప్రవర్తించబోతుంటే.. అప్పుడే అతని భార్య వచ్చి బుద్ది చెప్పి తీసుకుపోతుంది. మరోవైపు జ్యోత్స్న మిస్ హైదరాబాద్ పోటీల్లో గెలిచినందుకు పార్టీ ఏర్పాటు చేస్తారు. ఆమె క్లాస్ మేట్ గౌతమ్ వచ్చి ప్రపోజ్ చేస్తే.. నాకు నా బావంటేనే ఇష్టం అని చెప్తుంది. దీంతో ఇంట్లోని వారంతా సంతోషిస్తారు. ఇక కార్తిక్ కు జ్యోత్స్న అంటే ఇష్టమా అనేది తెలియాలి. ఇవండి మొదటి వారం హైలెట్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X