పెళ్లిపై జ్యోత్స్న ట్విస్ట్.. కార్తీక్‌ను వదులుకోనుందా? కార్తీక దీపం 2లో నెక్ట్స్ ఏం జరగనుంది?

స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీక్ దీపం 2 సీరియల్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. టాప్ రేటింగ్‌తో ఇప్పటికే ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదిస్తోంది. గతంలో వచ్చిన కార్తీక దీపంకి సీక్వెల్ అని మేకర్స్ ప్రకటించినప్పటికీ ఈ కథకి, ఈ కథకి చాలా సంబంధం ఉంది. అయితే ఇద్దరు అమ్మాయిలు ఒకరినే కోరుకోవడం అనే కామన్ పాయింట్‌ని మాత్రం మిస్ చేయకుండా కథను అద్భుతంగా నడిపిస్తున్నారు. కార్తీక్‌ని ఎలాగైనా దక్కించుకోవాలని ఇన్నేళ్లుగా ప్లాన్ చేస్తోన్న జ్యోత్స్నకి ఈరోజు ఎపిసోడ్‌లో పారు మైండ్ వాష్ చేయడంతో.. ఆమె ఏ నిర్ణయం తీసుకోబోతోందనే దానిపై ఆసక్తి నెలకొంది.

కార్తీక్‌ను చిన్నప్పటి నుంచి భర్తగా భావిస్తూ, అతనినే ఆరాధిస్తూ వచ్చిన జ్యోత్స్నకి.. దీప ఎంట్రీతో కథ అడ్డం తిరుగుతుంది. అనుకోని పరిస్ధితుల్లో దీపని కార్తీక్ పెళ్లి చేసుకోవడంతో దీపని అడ్డుతొలగించుకోవాలని అనుకుంటుంది జ్యోత్స్న. ఇదే సమయంలో దీపే.. సుమిత్ర- దశరథల అసలు కూతురని, తాను దాస్ కూతురని తెలిసినప్పటి నుంచి కథ ఊహించని మలుపు తిరుగుతుంది. శివన్నారాయణ గారి ఆస్తికి, జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి ఏకైక వారసురాలిగా తానే ఉండాలని.. కార్తీక్‌ను ఎలాగైనా దక్కించుకుని తన భర్తను చేసుకోవాలని ఎత్తుల మీద పై ఎత్తులు వేస్తుంటుంది జ్యోత్స్న.

Karthika Deepam 2 Twist Will Jyotsna Marry Suraj for Property and Finally Give Up Karthik

దీపే శివన్నారాయణగారి మనవరాలని కాంచన, శివన్నారాయణ, సుమిత్ర, శ్రీధర్‌లకు తెలియదు. వీరందరికీ తెలిసేలా చేసి, దీపను తన పుట్టింటికి చేర్చాలని కార్తీక్ ప్లాన్ చేస్తూ ఒక్కో అడ్డంకినీ దాటుకుంటూ వెళ్తాడు. ఈలోపు హార్ట్ సర్జరీ కోసం శ్రీధర్ అమెరికా వెళ్లడంతో జ్యోత్స్న రెస్టారెంట్‌కి కొత్త సీఈవోని ఎంపిక చేయాల్సిన పరిస్ధితులు ఏర్పడతాయి. జ్యోత్స్న ఇక్కడే తన తెలివితేటలు ఉపయోగించి బోర్డ్ మెంబర్స్‌తో గేమ్ ఆడిస్తుంది. కాబోయే సీఈవో శివన్నారాయణ కుటుంబం నుంచే రావాలని, బయటి వ్యక్తులు వద్దని చెబుతారు. అయితే జ్యోత్స్నని సీఈవోని చేయడం కార్తీక్, శివన్నారాయణ, దశరథలకు ఇష్టం ఉండదు.

దాంతో కార్తీక్.. దీపని పిలిపించి, కొత్త సీఈవో కోసం దీప- జ్యోత్స్నలకు ఓటింగ్ పెట్టగా ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో ఎంపిక కష్టమవుతుంది. దాంతో లాభాల్లో లేని రెండు రెస్టారెంట్స్‌ని జ్యోత్స్న, దీపలకు అప్పగించి ఎవరైతే తమ బ్రాంచ్‌ని లాభాల్లోకి తీసుకొస్తారో వారినే సీఈవోని చేస్తానని గేమ్ పెడతాడు. ఎలాగైనా పోటీలో గెలవాలని జ్యోత్స్న దొడ్డిదారుల్లో వెళ్తుంది. కొత్తగా కథలోకి వచ్చిన సూరజ్, భర్త కార్తీక్ సాయంతో అన్ని అడ్డంకులను దాటుకుని దీప పందెంలో గెలిచి సీఈవో అవుతుంది. దాంతో చేసిన తప్పులకు శిక్షగా జ్యోత్స్నకు అసిస్టెంట్‌గా నియమిస్తాడు శివన్నారాయణ.

ఇంత జరిగినప్పటికీ కార్తీక్‌ను వదులుకోవాలనే తన బుద్ధి మాత్రం జ్యోత్స్న మార్చుకోకపోవడంతో సూరజ్ వార్నింగ్ ఇస్తాడు. నువ్వు కార్తీక్‌ను భర్తగా అనుకుంటే.. నేను నిన్ను భార్యగా అనుకుంటానని మండిపడతాడు. ఇంటి దగ్గరికి వెళ్లి జరిగినదంతా పారుకి చెప్పగా.. కార్తీక్‌ను వదిలేసి పెద్ద కోటీశ్వరుడిని పెళ్లి చేసుకుంటే నీకు రెండు వైపులా ఆస్తులు వస్తాయి. కార్తీక్‌ని పట్టుకుని వేలాడితే నీకు మిగిలేది చిప్పేనని, నీ పెళ్లి జరగడమే అన్ని సమస్యలకు పరిష్కారమని చెబుతుంది. దాంతో జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది.

దశరథ రాసిన వీలునామా ప్రకారం.. ఆస్తి తనకు దక్కాలంటే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనాలి. ఇందుకు గడువు దగ్గరపడుతుండటం తోడు కార్తీక్‌ని పెళ్లి చేసుకోవడానికి దీప, సూరజ్‌తో పాటు మొత్తం తన కుటుంబం వ్యతిరేకంగా ఉండటంతో జ్యోత్స్న కొత్త ప్లాన్ గీస్తున్నట్లుగా సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఆస్తిని ముందు దక్కించుకోవడానికి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని జ్యోత్స్న అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తన మైండ్ సెట్‌కు సరిగా సెట్ అయ్యే సూరజ్‌ని పెళ్లి చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే సూరజ్ గతం ఏంటో అన్నది తెలియరాలేదు.. ఇతను కూడా శివన్నారాయణ కుటుంబం మీద పగ సాధించేందుకు వచ్చాడని, దక్షిణామూర్తి మనవడని సోషల్ మీడియా టాక్. ఈ నేపథ్యంలో కార్తీక్ దీపం 2 సీరియల్ ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో జ్యోత్స్న ప్లాన్ ఏంటి? కార్తీక్‌ను వదులుకుంటుందా అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X