For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam చావు బతుకుల్లో డాక్టర్ మోనిత.. చస్తే చావనివ్వండి అంటూ కార్తీక్

  |

  తెలుగు టెలివిజన్‌లో హయ్యెస్ట్ రేటింగ్‌తో దూసుకెళ్తున్న కార్తీకదీపం సీరియల్‌ మరో మలుపు తిరిగింది. జైలు నుంచి విడుదలైన డాక్టర్ మోనిత నేరుగా డాక్టర్ భారతీ ఇంటికి వెళ్లడం, అక్కడ ఆమెకు కార్తీక్‌కు భారీగా వాగ్వాదం జరగడం తెలిసిందే. అయితే అమెరికాకు వెళ్తున్న కార్తీక్‌ను బెదిరిస్తూ.. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నిన్ను వదిలిపెట్టను. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను అంటూ సవాల్ విసిరింది. టీవీలో లైవ్ డిబేట్స్‌తో నీ పరువు తీస్తాను. నీ ఇంటి ముందు ధర్నా చేస్తాను. నీ తల్లిదండ్రులకు నరకం చూపిస్తా. దాంతో నీవు ప్రశాంతం ఉండగలవా అంటూ ప్రశ్నించింది. ఇలాంటి బెదిరింపులకు చెక్ పెట్టడానికి కార్తీక్ సంచలన నిర్ణయం తీసుకొన్నాడు. ఇంకా 1179 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  కార్తీక్ నిన్ను ఎలాగైనా ఒప్పిస్తా

  కార్తీక్ నిన్ను ఎలాగైనా ఒప్పిస్తా

  ఇదిలా ఉండగా, జైలు నుంచి విడుదలైన డాక్టర్ మోనిత తన ఇంటిలో అడుగుపెట్టింది. ఎట్టకేలకు నా ఇంటికి వచ్చాను. కాదు కాదు.. మన ఇల్లు.. నేను, నా కార్తీక్, నా బుల్లి ఆనంద్ ముగ్గురం ఇక్కడే ఉంటున్నామన్న మాట అంటూనే గతంలో కార్తీక్ చెప్పిన మాటలతో ఆవేదనకు లోనైంది. దాంతో కార్తీక్‌ను తలుచుకొని.. ఎంత చేసినా నిన్ను ఒప్పించలేకపోతున్నాను. ఎలాగు నిన్ను ఒప్పిస్తాను. ప్రేమలో విసుగు విరామం లేదు. నిన్ను ఎలాగైనా ఒప్పిస్తాను. కార్తీక్‌కు ఇల్లు శుభ్రం లేకపోతే.. ఒప్పుకోడు అంటూ మోనిత తన ఇంటిలోకి అడుగుపెట్టింది.

  పురిటి నొప్పులతో డాక్టర్ మోనిత

  పురిటి నొప్పులతో డాక్టర్ మోనిత

  ఇంటిని శుభ్రం చేసుకొంటూ ఎప్పుడు ఇంటి వస్తావు కార్తీక్... కార్తీక్ కాదు.. నా భర్త కార్తీక్.. అనుకోవడానికే చాలా హ్యపీగా ఉంది అనుకొంటుండగానే.. కడుపులో నొప్పి మొదలైంది. నొప్పులను భరించలేకపోవడంతో సోఫాలో కూలబడింది. సోఫాలో కష్టాలు పడుతున్న మోనితను తన వెంట వచ్చిన కానిస్టేబుల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది.

  అమెరికాకు ఎందుకు వెళ్లడం లేదంటే..

  అమెరికాకు ఎందుకు వెళ్లడం లేదంటే..

  డాక్టర్ భారతీ ఇంటిలో తనకు, మోనిత జరిగిన వాగ్వాదం గురించి తల్లి సౌందర్యకు పూసగుచ్చినట్టు వివరించారు. అమెరికాకు వెళ్తున్నామని మోనితకు సవాల్ చేశాను. కానీ ఆమెకు భయపడి పారిపోయామనే నింద పడకూడదనే నేను అమెరికా వెళ్లడం మానుకొన్నాను. మోనితకు, నాకు ఉన్న బంధాన్ని పిల్లలకు చెప్పి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా చేస్తాను. ఇక మోనితతో తాడో పేడో తెల్చుకొంటాను. మోనిత అన్న మాటలు తలచుకొంటూనే ఒళ్లు మండిపోతుంది. టీవీలో లైవ్ డిబేట్స్ ఇస్తా. ధర్నా చేస్తానని బెదిరిస్తున్నది. ఇక మోనితను సహించలేదు అంటూ ఏదో అనబోతుండగా.. దీప రావడంతో ఆమాటను మార్చేశాడు. అయితే ఆ కార్తీక్, సౌందర్య మాట మార్చడాన్ని దీప గుర్తించింది.

   మోనిత పురిటి నొప్పుల గురించి భారతీ ఫోన్

  మోనిత పురిటి నొప్పుల గురించి భారతీ ఫోన్

  అయితే తల్లి సౌందర్యతో మాట్లాడుతుంటే.. డాక్టర్ భారతీ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కట్ చేయడంతో మళ్లీ మళ్లీ ఫోన్ చేసింది. అయితే ఎవరి నుంచి ఫోన్ అంటే.. డాక్టర్ భారతీ నుంచి అని కార్తీక్ సమాధానం చెప్పారు. దాంతో విసుక్కొంటూ కార్తీక్ ఫోన్ ఎత్తాడు. మోనిత నొప్పులతో భరించలేకపోతున్నది. తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మీరు వచ్చి సంతకం పెడితే ఆపరేషన్ చేస్తాను. లేకపోతే ప్రాణాలకే ముప్పు అంటూ భారతీ చెప్పితే.. నాకు ఎందుకు చెబుతున్నారు. నువ్వు, మోనిత కొత్త నాటకం మొదలుపెట్టారా అంటూ కార్తీక్ కోపంతో ఊగిపోయారు.

   చస్తే చావనివ్వండి.. నాకు సంబంధం లేదంటూ..

  చస్తే చావనివ్వండి.. నాకు సంబంధం లేదంటూ..

  కార్తీక్ ఫోన్ కట్ చేయకు అని భారతీ అంటే.. దయచేసి ఫోన్ కట్ చేయొద్దు. ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ముప్పు అని భారతీ అన్నారు. దాంతో చచ్చిపోతే చనిపోని.. నాకే సంబంధం అంటూ కార్తీక్ ఆవేశంగా సమాధానం చెప్పాడు. అయితే తల్లి బలవంతం మేరకు కార్తీక్ హస్పిటల్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాజా ప్రోమోలో మరో ట్విస్ట్‌కు తెరలేపారు.

  Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
  కార్తీకదీపం రేటింగ్ ఇలా..

  కార్తీకదీపం రేటింగ్ ఇలా..

  కార్తీక దీపం సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. గతంలో ఎవరికి అందనంత దూరంలో రేటింగ్ నమోదు చేసుకొన్నది. అయితే కొద్ది వారాలుగా ఈ సీరియల్ టాప్ రేటింగ్ కోల్పోతున్నది. 40వ వారంలో అర్బన్‌లో 12.80, రూరల్‌లో 14.52 రేటింగ్‌ను నమోదు చేసుకోగా, 41వ వారంలో అర్బన్‌లో 11.98 రేటింగ్, రూరల్‌లో 12.91 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. అయితే కంటెంట్‌లో వైవిధ్యం లేకపోవడం, సాగదీత అంశాలు ఈ సీరియల్‌కు సంబంధించిన అభిమానులను నిరాశకు గురిచేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

  English summary
  Karthika Deepam 7th October Episode number 1179: Doctor Monita joined in hospital for delivery of baby. But Karthik refused to sign the papers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X