Karthika Deepam.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన డాక్టర్ మోనిత.. మళ్లీ సమస్యల్లో దీప కాపురం
తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ రేటింగ్‌తో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ పలు ట్విస్టులతో ముందుకెళ్తున్నది. ప్రసవవేదన పడుతూ చావు బతుకుల్లో ఉన్న మోనిత వ్యవహారం మళ్లీ కార్తీక్ కాపురంలో సమస్యలు తెచ్చిపెట్టేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మోనిత డెలివరీ అప్లికేషన్‌పై కార్తీక్ సంతకం పెట్టడం, ఆ విషయం దీపకు తెలియడం మరో ట్విస్టుగా కనిపిస్తున్నది. తాజా ఎపిసోడ్ 1181లో చోటుచేసుకొన్న హైలెట్స్ ఏమిటంటే..
Photo Courtesy: Star మా and Disney+Hotstar

కార్తీక్ సంతకం చేస్తేనే అంటూ మోనిత
హాస్పిటల్‌లో పురిటి నొప్పులతో చావు బతుకుల్లో ఉన్న మోనిత చికిత్స చేయించుకోవడానికి మొండికేసింది. డాక్టర్ కార్తీక్ వచ్చి సంతకం చేస్తేనే తాను డెలివరీ చేయించుకోవడానికి అంగీకరిస్తాను. నా కార్తీక్ వస్తున్నాడా? భర్తగా సంతకం చేస్తేనే నేను ప్రసవం చేయించుకోవడానికి ఒప్పకొంటాను అంటూ మోనిత బెట్టు చేసింది. అయితే కార్తీక్ వస్తున్నాడు. అప్పటి వరకు ఇంజెక్షన్ తీసుకో. పల్స్ రేట్ పడిపోతున్నాయి. అలానే పడిపోతే ప్రాణాలకు ముప్పు అంటూ డాక్టర్ భారతీ సముదాయించే ప్రయత్నం చేసింది.

మోనిత కపట నాటకంలో నీకు భాగం ఉందా?
అయితే నా కార్తీక్ వస్తేనే నేను ట్రీట్‌మెంట్ చేయించుకొంటాను. కార్తీక్‌కు నిజం చెప్పి చచ్చిపోతాను. నా గర్బ విషయంలో అసలు విషయం బయటపెట్టాలి. కార్తీక్‌ను నిజం చెప్పాలి అంటూ మోనిత తనకు ఇంజెక్షన్లు చేయడానికి వచ్చిన భారతీకి చెప్పింది. ఇంజెక్షన్లను విసిరికొట్టి ట్రీట్‌మెంట్ నిరాకరించింది. పల్స్ రేట్ పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అంతలోనే కార్తీక్, సౌందర్య అక్కడికి చేరుకొన్నారు. దాంతో మీరు సంతకం చేస్తే ట్రీట్ మెంట్ చేస్తాను అని భారతీ చెప్పింది. అయితే భారతీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నాటకంలో నీకు భాగం ఉందా అంటూ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీతో సహజంగానే గర్బం అంటూ
కార్తీక్, సౌందర్య ఇద్దరు హాస్పిటల్‌కు రావడంతో నిద్ర నుంచి భారతీ లేపే ప్రయత్నం చేశారు. కార్తీక్ వచ్చారు ఇక ట్రీట్‌మెంట్ చేయించుకో అని భారతీ అంటే.. ట్రీట్‌మెంట్ చేయించుకోవడానికి ముందు కార్తీక్‌కు ఓ నిజం చెప్పాలి. నాకు గర్బం వచ్చింది కృత్రిమ గర్బం పద్దతితో కాదు. నీతో సహజంగానే గర్బం వచ్చింది అంటూ మోనిత బాంబు పేల్చింది. దాంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే మోనిత మాటలతో కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక నీ కపట నాటకాలు ఆపండి అంటూ కార్తీక్ అరిచాడు.

చచ్చిపోనివ్వండి అంటూ
అయితే పురిటి నొప్పులను ఆపుకొని నీకు నిజం చెప్పడానికి ప్రయత్నించాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నీవే తండ్రి కృత్రిమ గర్భం కాదు అని మోనిత అంటే.. ఆపు నీ కట్టుకథలు.. ఏంటమ్మా.. ఈ దరిద్రం.. పద ఇక్కడ నుంచి అంటూ తన తల్లితో కార్తీక్ అన్నాడు. అయితే మోనిత చనిపోతుంది.. ఆమె పరిస్థితి బాగాలేదు అంటూ భారతీ చెప్పింది. అయితే చచ్చిపోనివండి.. రోజుకు ఎంతో మంది చస్తున్నారు. అందులో ఒకరిగా మోనిత చస్తుంది అని కార్తీక్ అసహనం వ్యక్తం చేశారు.

నా క్యారెక్టర్‌పై మచ్చ పడకూడదనే ఉద్దేశంతో
అయితే నాది కృత్రిమ గర్బం కాదు. నీతో సహజ సిద్దంగా వచ్చింది అని మోనిత అంటే.. మరి కృత్రిమ గర్బం అంటూ ప్రచారం చేసుకొన్నావు కదా అని కార్తీక్ అన్నాడు. అయితే పెళ్లికాకుండా గర్బం తెచ్చుకొన్నారని, నా క్యారెక్టర్‌పై మచ్చ పడుతుందని అలా నేను చెప్పాను. కానీ నీవు ఆరోజు తాగినప్పుడు అలా జరిగిపోయింది అంటూ మోనిత అనడంతో ఇక ఆపు నీ కట్టుకథలు అన్నారు. తల్లిని అక్కడి నుంచి పోదాం అంటే భారతీ ఆపింది. దాంతో నేను చచ్చిపోయినా పర్వాలేదు. కానీ నా కడుపులో బిడ్డను బతికించండి అంటూ కార్తీక్‌తో మోనిత చెప్పింది.

కార్తీక్‌తో బలవంతంగా సంతకం
అయితే తాజా ప్రోమో ప్రకారం.. మోనిత డెలివరికి సంబంధించిన ఫారమ్‌పై బలవంతంగా కార్తీక్‌తో సౌందర్య సంతకం చేయించింది. అయితే అయిష్టంగానే సంతకం పెట్టడంతో మోనితకు భారతీ ట్రీట్‌మెంట్ చేసింది. దాంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిందనే విషయాన్ని వంటలక్క దీపకు పనిమనిషి ప్రియమణి చెప్పడం తాజా ప్రోమోలో కనిపించింది. ఇలా ట్వీస్టులతో కార్తీకదీపం సీరియల్ కొనసాగుతున్నది.
Recommended Video

కార్తీక దీపం సీరియల్ రేటింగ్
గతంలో కార్తీక దీపం సీరియల్ ఎవరికి అందనంత దూరంలో రేటింగ్ నమోదు చేసుకొన్నది. అయితే కొద్ది వారాలుగా ఈ సీరియల్ టాప్ రేటింగ్ కోల్పోతున్నది. 40వ వారంలో అర్బన్‌లో 12.80, రూరల్‌లో 14.52 రేటింగ్‌ను నమోదు చేసుకోగా, 41వ వారంలో అర్బన్‌లో 11.98 రేటింగ్, రూరల్‌లో 12.91 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. అయితే కంటెంట్‌లో వైవిధ్యం లేకపోవడం, సాగదీత అంశాలు ఈ సీరియల్‌కు సంబంధించిన అభిమానులను నిరాశకు గురిచేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











