twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నా క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగిస్తే.. నీ జీవితం అంతే.. దీపకు మోనిత వార్నింగ్

    |

    కార్తీకదీపం సీరియల్ ఎప్పటిలానే ట్విస్టులు, సాగదీతతో ముందుకెళ్తున్నది. మోనిత జైల్లో ఉంటూ కార్తీక్ గురించి పేపర్లో ఇంటర్వ్యూలు ఇస్తూ కథనాలు ప్రచురించడం ట్విస్టుగా మారిపోయింది. దాంతో డైరెక్టుగా జైలుకు వెళ్లి మోనితకు దీప నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. అయితే దీప సూచనకు మోనిత అడ్డుపడింది. కార్తీక్ మెడలో తాళి కట్టిస్తే తప్ప నేను నా కుట్రలు ఆపను అంటూ తెగేసి చెప్పింది. జైలులో దీప, మోనిత మధ్య హాట్ హాట్ వాదనలు ఏం జరిగాయంటే..

    Photo Courtesy: Star మా and Disney+Hotstar

    జీవిత కాలం శిక్ష పడేలా చేస్తా..

    జీవిత కాలం శిక్ష పడేలా చేస్తా..

    నేనుండగా నా భర్తను పెళ్లి చేసుకోవడం అసాధ్యం అని దీప అంటే.. అయో దీపక్క చంద్రుడి మీదకు మనిషి వెళ్తున్న రోజులివి దీపక్క. ఒక మనిషిని కలుకోవడం, కలుపుకోవడం ఉండటం అసాధ్యమని నీవు అంటున్నావా? అని మోనిత అంటే.. సెల్‌ఫోన్‌లో సాక్ష్యాలను మాయం చేయడం చాలా తేలిక కావొచ్చు. హిమ కేసు తిరగదోడిస్తా. అంజిని ఎక్కడున్నా పట్టుకొని జీవితకాలం శిక్ష పడేలా చేస్తాను అని దీప హెచ్చరించింది. మంగమ్మ శపథంలా.. దీపక్క శపథాలు నా ముందు చేస్తున్నావా. అవన్నీ సాధ్యం కావు. అధారాలు లేకుండాపోయాయి. సాక్ష్యాలు సుదూరంపోయాయి. అంజిగాడిని మాయం చేశా. వాడిని పట్టుకోవడం నీ వల్ల కాదు. నాది క్రిమినల్ బ్రెయిన్ అన్నావు కదా.. అదే క్రిమినల్ బ్రెయిన్‌తో ఆలోచిస్తే.. నీవు, నీ పిల్లల భవిష్యత్ దారుణమైపోతుంది. మానవ కల్యాణం కోసం నేను దయతలచి వదిలేశా అని మోనిత వార్నింగ్ ఇచ్చింది.

    రాతలు ఆపేయ్ అంటూ మోనితకు వార్నింగ్

    రాతలు ఆపేయ్ అంటూ మోనితకు వార్నింగ్

    మోనిత మాటలతో దీపకు చిర్రెత్తుకొచ్చింది. మోనిత నీతో గొడవపడటానికి రాలేదు అని దీప అంటే.. మనం ఫ్రెండ్స్ అయిపోతా అంటే.. అది కాదు.. ఆ రాతలు ఆపేయ్. పిల్లలు చూస్తే కార్తీక్‌ను నిలదీస్తారు అని దీప అంటే... అయితే నిజం చెప్పేయండి. ఎలాంటి సమస్య ఉండదు. వాళ్లకు చెప్పండి. మీకు బుల్లి తమ్ముడు వస్తాడని చెప్పు అంటూ మోనిత తనదైన శైలిలో దీపను ఉడికించే ప్రయత్నం చేసింది. దాంతో వెటకారం ఆపు. కార్తీక్ పడిన కష్టాలు చాలు. మోసిన నిందలు చాల అని దీప అంటే.. అవమానాలు, కష్టాలు నాకే ఎక్కువ, నీ అత్త, పిన్ని, నువ్వు, డ్రైవర్ దారుణంగా తిట్టారు. కానీ కార్తీక్ కోసం పడ్డాను. మన కార్తీక్ కోసం భరించాను. ఎందుకంటే కార్తీక్ అంటే నాకు ప్రేమ. పిచ్చి ప్రేమ. కానీ ఇప్పుడు మాకు గ్యాప్ వచ్చింది. నా ఇంటికి ఎడాపెడా వచ్చాడు. మందుకొట్టాడు. కానీ ఎప్పుడు తప్పు చేయలేదు. కానీ మీరంతా నన్ను విలన్‌లా చిత్రీకరించాడు. నా క్యారెక్టర్‌ను తప్పుగా చెప్పారు. కానీ నేను గొప్ప ప్రేమికురాలిని. అది మీకు అర్ధం కాదు. అందుకే నేను పేపర్లో రూపంలో చెప్పాను అని మోనిత చెప్పింది.

    కార్తీక్‌తో తాళి కట్టించు అంటూ మోనిత

    కార్తీక్‌తో తాళి కట్టించు అంటూ మోనిత

    నేను పేపర్లో రాయించకపోతే.. దాని పాపం పండింది. సొంతంగా కడుపు తెచ్చుకొన్నది అని నాపై నిందలు మోపేవారు. అందుకే పేపర్‌లో వార్తలను నీకు గిఫ్టుగా అందించాను అని మోనిత అంటే.. ఇక చాలూ.. అన్నీ ఆపేస్తాను. నీవు అడుగుతున్నావు కాబట్టి.. ఆపేస్తాను. కార్తీక్ పాపం మంచివాడు. కానీ నీవు చెప్పినట్టు అన్నీ ఆపేస్తాను. అయితే కార్తీక్‌తో నా మెడలో తాళి కట్టించు. ఇంత మంచి డీల్ ఎవరు ఇవ్వరు. ఎప్పుడు నీ కాపురం, నీ పిల్లలు అంటూ స్వార్ధమేనా? నా కార్తీక్ కాదు.. మన కార్తీక్ అని చెప్పు. రేపు నా కడుపులో పుట్టే బిడ్డ డాడీ ఎక్కడ అంటే.. ఏం సమాధానం చెప్పాలి. నీలా నేను పదేళ్లు వెయిట్ చేయను అంటూ మోనిత వార్నింగ్ ఇచ్చింది. అంతలోనే కానిస్టేబుల్ వచ్చి సమయం అయిపోయిందంటూ లోనికి తీసుకెళ్లింది.

     తండ్రి గురించి శౌర్య, హిమ బాధపడుతూ

    తండ్రి గురించి శౌర్య, హిమ బాధపడుతూ

    ఇక తన తండ్రి గురించి పేపర్‌లో వచ్చిన వార్తను చూసి బాధపడింది. మీ డాడీ బ్యాడ్ బాయ్ అంటూ స్కూల్‌లో తన స్నేహితురాలు చెప్పిన విషయం గుర్తు తెచ్చుకొని నాన్న చేసింది నిజమేనా? అంటూ తనలో అనుకొంటూ ఉంటే.. శౌర్య వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు. అంటే నాన్న గురించి షైనీ చెప్పిన విషయం బాధ కలిగిస్తుంది అంటే.. అవన్నీ మరిచిపోయి.. సంతోషంలో ఉన్నప్పుడు ఆనందంగా ఉన్న క్షణాలను గుర్తు చేసుకోవాలంట.. ఇప్పుడు అదే చేద్దాం. కాబట్టి అమ్మ, నాన్నలతో కలిసి ఉన్నాం. కాబట్టి ఆనందంగా ఉంది. మిగితావన్నీ పక్కన పెడుదాం అని శౌర్య చెప్పడంతో హిమ అక్కడ నుంచి ఏడుస్తూ వెళ్లిపోయింది.

     ఇంట్లో సమస్యలపై సౌందర్య ఆందోళన

    ఇంట్లో సమస్యలపై సౌందర్య ఆందోళన

    ఇంట్లో సమస్యల గురించి సౌందర్య తన కుమారుడు ఆదిత్యతో చర్చించింది. ఒక్కో సమస్య తీరుతుంది కదా అని ఆదిత్య అంటే.. ఒక్క సమస్య తీరుతే.. రెండు సమస్యలు వచ్చి పడుతున్నాయి అని సౌందర్య అంటే.. అక్కయ్య వద్దకు వెళ్లి వచ్చి డిస్ట్రబ్ అవుతున్నావా? అంటే.. సౌందర్యకు ప్రశాంతత, మనశ్శాంతి లేకుండా ఉండేలా భగవంతుడు రాత రాశాడు అంటూ సౌందర్య ఆవేదన వ్యక్తం చేసింది.

    పేపర్ కనిపించడం లేదంటూ..

    పేపర్ కనిపించడం లేదంటూ..

    ఇక మోనిత ఇంటర్వ్యూ ప్రచురించిన పేపర్ ఇంట్లో కనపడకపోవడంతో ఆదిత్య, సౌందర్య కంగారు పడిపోయారు. అయితే పిల్లల కంట్లో పడకుండా చేయాలి అంటే.. పిల్లల వద్ద దాచడం ఎందుకు? వాళ్లు పెద్దవాళ్లు అవుతున్నారు కదా. చెప్పేయడం మంచింది అని ఆదిత్య అంటే.. వాళ్లు అపార్థం చేసుకోరా అని సౌందర్య ప్రశ్నించింది. ఇలా పేపర్ పిల్లల కంట పడి ఉంటుందా అనే ఆందోళనలో కార్తీక్ కుటుంబ సభ్యులు మునిగిపోయారు.

    English summary
    Karthika Deepam 2nd October Episode preview. Deepa arguement with Monita in the Jail.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X