Karthika Deepam మోనిత కడుపులో బిడ్డ నేరుగా ఇంటికి వస్తే.. దీపకు షాకిచ్చిన కారు డ్రైవర్

అత్యంత ప్రేక్షకదాదరణ ఉన్న కార్తీకదీపం సీరియల్‌ అనేక ట్విస్టులతో ముందుకెళ్తున్నది. జైల్లో ఉంటున్న మోనిత మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో కార్తీక్ కుటుంబంలో కలకలం రేపింది. ఆ ఇంటర్వ్యూను కార్తీక్ కూతుళ్లు హిమ, శౌర్య చూసి బాధపడ్డారు. కార్తీక్ కుటుంబ సభ్యులు ఈ విషయంపై ఆందోళన చెందుతూ కనిపించారు. ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని మోనితకు జైల్లో దీప వార్నింగ్ ఇచ్చింది. అయినా ఆమె తన కుట్రలకు మరింత పదును పెడుతూ కనిపించింది. ఇలా అక్టోబర్ 10వ తేదీన ప్రసారమైన 1161 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

మోనితతో జాగ్రత్తగా ఉండు అంటూ

మోనితతో జాగ్రత్తగా ఉండు అంటూ


జైలులో మోనితతో జరిగిన వాగ్వాదాన్ని దీప జీర్ణించుకోలేకపోయింది. నా మెడలో కార్తీక్‌తో తాళి కట్టిస్తే... మీడియాకు ఇంటర్వ్యూలతోపాటు అన్నీ ఆపేస్తాను అంటూ మోనిత చెప్పడంపై అసహనానికి గురైంది. ఈ క్రమంలో డ్రైవర్ వారణాసి మాట్లాడుతూ.. అక్కా జైలులో మోనిత ఏం చెప్పింది. నీ ముఖం చూస్తే మంచి జరిగినట్టు కనిపించడం లేదనిపిస్తున్నది. ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి అక్క అంటూ వారణాసి హెచ్చరించాడు. అంతేకాకుండా మోనిత రూపంలో పెద్ద ముప్పు ఉందని హింట్ ఇచ్చారు.

మోనిత గర్బంలో ఉన్న బిడ్డ

మోనిత గర్బంలో ఉన్న బిడ్డ

జైలులో ఉన్న మోనిత గర్బంలో బిడ్డ పెరుగుతున్నది. ఆ బిడ్డను నేరుగా ఇంటికి పంపిస్తే ఏం చేస్తావు అక్క. ఇవన్నీ నాకు వచ్చిన ఆలోచనలు కావు. సరోజక్క చెప్పిన విషయాలు ఇవి. బస్తీలో ఇలాంటి చర్చ జరుగుతున్నది అని వారణాసి చెప్పారు. దాంతో వారణాసికి సమాధానం చెబుతూ.. ముందుకు చూసి డ్రైవ్ చేయి. అలాగే మా గురించి సరోజను ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పండి. అలాగే బస్తీలో కూడా మా గురించి మాట్లాడకోకపోతే మంచిదని చెప్పండి. ఇక నీవు కూడా వారి మాటలను వినకపోతే మీర మంచింది అంటూ దీప చెప్పింది.

మోనిత మీరు ఎవరికీ అర్థం కారు

మోనిత మీరు ఎవరికీ అర్థం కారు

ఇక జైలులో కానిస్టేబుల్‌తో మోనిత మాట్లాడుతూ.. కార్తీక్ నా మనసులో ఉన్నంత వరకు నేను చాలా హ్యాపీగానే ఉంటాను అని అంటే.. మిమ్మల్ని ఎప్పుడు చూసిన కొత్తగానే అనిపిస్తారు. మీరు అసలు ఎవరికీ అర్ధం కారు. కార్తీక్ సార్ నిజంగా అదృష్టవంతులు అని కానిస్టేబుల్ అంటే.. కాదు సుకన్య.. కార్తీక్ లాంటి వాడు నా అదృష్టం. కార్తీక్ బిడ్డకు తల్లి కావడం మరీ అదృష్టం అని మోనిత మురిసిపోయింది.

దీప అదో టైపు అంటూ మోనిత

దీప అదో టైపు అంటూ మోనిత

దీప, మోనిత మధ్య వాగ్వాదం జరిగిన విషయాన్ని చూసిన కానిస్టేబుల్ సుకన్య.. మీ కోసం వచ్చింది ఎవరు? మీరు అక్క అని పిలుస్తున్నారు అని అడిగితే.. ఆమె నాకు దేవుడు ఇచ్చిన అక్క అని మోనిత అంటే.. మీకు, ఆమెకు అసలు పోలీకలు లేవు అని కానిస్టేబుల్ సుకన్య ప్రశ్నించింది. దాంతో ఆమె సహనంలో భూదేవి లాంటిది. నేను ప్రేమలో ఆకాశం అంత. ఆమె ఓ టైపు అంటూ మోనిత చెప్పింది. అంటే వచ్చిన ఆమె భర్తే కార్తీక్ కదా మేడమ్ అంటే.. కాదు.. నేను ప్రేమించిన కార్తీక్‌కు ఆమె భార్య అయింది అంటూ తనదైన శైలిలో చెప్పింది. అయితే మోనిత చెప్పిన మాటలు విని అర్ధం కానట్టు ముఖం పెడితే.. రెండు కాఫీలు తీసుకురా.. ఒకటి నీకు.. మరోటి నీకు. అప్పుడు నేను చెప్పే ప్రేమకథ బాగా అర్ధమవుతుంది అని మోనిత చెప్పింది.

మీరు డాక్టరా? డిటెక్టివ్‌వా?

మీరు డాక్టరా? డిటెక్టివ్‌వా?

మోనిత వాలకం చూసి.. మీరు డాక్టరా? లేక డిటెక్టివా? అని కానిస్టేబుల్ సుకన్య అంటే.. కార్తీక్ ప్రేమలో పడిన తర్వాత నేను చాలా షార్ప్ అయ్యాను. ఇది నా కార్తీక్ ప్రేమ గొప్పతనమే అని మోనిత చెబుతూ... నాకు ఒక సహాయం చేయాలి.. అంటూ చెవిలో గుసగుసలు పెట్టింది. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి ఇవ్వు అని మోనిత అంటే.. పిన్ నంబర్ ఇవ్వండి. ఆ పని చేసిపెడుతా అంటూ పిన్ ఇవ్వండి అని సుకన్య అంటే.. ఈ విషయం ఎవరికి చెప్పకు అని మోనిత చెప్పింది. దాంతో నేను చెప్పను. నేను మీకు వీర ఫ్యాన్‌ను అంటూ కానిస్టేబుల్ సుకన్య ఆనందంతో చెప్పింది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
నాన్న మంచివాడే కదా అంటూ దీపతో హిమ

నాన్న మంచివాడే కదా అంటూ దీపతో హిమ


ఇదిలా ఉండగా, పేపర్‌లో మోనిత ఇంటర్వ్యూ చూసిన హిమ, శౌర్య చాలా బాధపడిపోయారు. హిమ బాధలో ఉంటే.. దీప వచ్చి.. ఆరోగ్యం బాగాలేదా అంటూ ప్రశ్నిస్తే.. బాగానే ఉంది. కానీ నాన్నకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటూ హిమ ఆవేదన వ్యక్తం చేసింది. డాడీ మంచివాడు. మంచి వాళ్లకే ఎక్కువ కష్టాలు వస్తాయి అని దీప అంటే.. అలా ఎలా వస్తాయి అంటూ హిమ ప్రశ్నించింది. అందరూ బాగుండాలని కోరుకొనే నాన్నకు ఇలా కష్టాలు వస్తే ఎలా అంటూ హిమ అడిగింది. మోనిత వల్ల కష్టాలు వచ్చాయి? మోనిత మంచిదా? చెడ్డదా అంటే.. ఆమె విషయం నీకు ఎందుకు అంటూ దీప కోపగించుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X