twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖైదీ బట్టల్లో చూడలేవని కలర్ చీరలో వచ్చా.. అడ్డదారిలో జైలు నుంచి మోనిత బయటకు.. కార్తీక్‌కు షాక్

    |

    తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్న కార్తీకదీపం సీరియల్‌ను ఇంకా ట్విస్టులు ముంచెత్తుతున్నాయి. చీటింగ్ కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న డాక్టర్ మోనిత గుండెపోటు అనే కపట నాటకం ఆడి ఏకంగా కార్తీక్ హస్పిటల్‌లో ప్రత్యక్షమైంది. అయితే హాస్పిటల్‌లో తన కపటనాటకానికి పదును పెట్టి కార్తీక్ కుటుంబంలో మరో చిచ్చు పెట్టింది. అక్టోబర్ 6వ తేదీన ప్రసారమైన 1163 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

    కార్తీక్ కుటుంబంలో టెన్షన్

    కార్తీక్ కుటుంబంలో టెన్షన్

    నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అతడే అంటూ కార్తీక్‌తో తన బంధం గురించి పేపర్‌లో వచ్చిన వార్త ఇంటిలో అందర్నీ కలిచివేసింది. తండ్రి గురించి వచ్చిన వార్తను చూసి హిమ, శౌర్య ఆందోళనకు గురయ్యారు. అప్పటికే తన తండ్రి గురించి స్కూల్‌లో తన స్నేహితురాలి చేసిన కామెంట్‌తో మనస్తాపానికి గురైన పిల్లలు మరింత కంగారుపడిపోయారు. తండ్రి కార్తీక్‌తో మాట్లాడటం మానేయడంతో దీప ఆందోళనకు లోనైంది.

     దీప కంటతడి పెడుతూ..

    దీప కంటతడి పెడుతూ..

    కార్తీక్, పిల్లల వ్యవహారం, అలాగే మోనిత కుట్రల నేపథ్యంలో దీప, అత్త సౌందర్య మధ్య భావోద్వేగమైన సంభాషణ జరిగింది. కంటికి ఎదురుగా నీ బాధను, కన్నీళ్లను చూస్తూ ప్రేక్షకురాలిగా మిగిలిపోతున్నా అని సౌందర్య అంటే.. మీరు ఏమి చేయలేరా అని దీప అన్నారు. ఈ సమస్యకు సంబంధించి నిర్ణయం తీసుకొనే అధికారం నీ ఒక్కరికే ఉంది.

    పైనున్న దేవుడినే అడుగుతావో.. నీ పతిదేవుడిని నిలదీస్తావో నీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. నిన్ను చూసి కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప.. ఏమీ చేయలేని పరిస్థితి నాది. నీకు నచ్చిన నిర్ణయం నీవు తీసుకో అంటూ సౌందర్య చెప్పింది. అయితే తన తండ్రిని అపార్ధం చేసుకొన్నానని తెలిసి క్షమాపణ చెప్పడానికి హాస్పిటల్‌కు వెళ్లిన హిమకు తన తండ్రి కార్తీక్ క్యాబిన్‌లో మోనితను చూసి షాక్ తిన్నది.

    కార్తీక్ హాస్పిటల్‌లో మోనిత

    కార్తీక్ హాస్పిటల్‌లో మోనిత

    తన క్యాబిన్‌లో మోనితను చూసి కార్తీక్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. తనను చూసి నవ్వుతున్న మోనితను చూసి నువ్వా అంటూ కార్తీక్ అంటే.. నేనే.. ఏంటి కార్తీక్.. బక్క చిక్కావు.. నేను లేనని బెంగపడ్డావా?.. ఖైదీ చీరలో నీవు చూడలేవని.. కలర్ సారీలో వచ్చాను అంటూ మోనిత తనకు తాను మురిసిపోయింది. అయితే మోనితను అలా బయట చూసి కార్తీక్ జీర్ణించుకోలేకపోయాడు.

    నువ్వేంటి ఇక్కడా? ఎలా వచ్చావు అంటూ ప్రశ్నిస్తే.. ప్రేమ.. ప్రేమ ఎలాంటి పనినైనా చేయిస్తుంది. నిన్ను చూడక కొన్ని రోజులైనా యుగాలు అవుతుందనిపిస్తుంది అని మోనిత అంటే.. షటప్.. గెటవుట్ అంటూ కార్తీక్ కసురుకొన్నాడు.

     నా కడుపులో బిడ్డ పెరుగుతుందని..

    నా కడుపులో బిడ్డ పెరుగుతుందని..

    దాంతో కార్తీక్‌ను ఉడికిస్తూ.. నేను జైలుశిక్ష పడి.. లాకప్‌లో ఉన్నా.. కడుపులో బిడ్డను పెరుగుతున్నది. నీ కోసం కలర్ చీర కట్టుకొని వచ్చాను. అలాంటి దానిని పట్టుకొని ఎందుకు వచ్చావని అడుగుతున్నావా? నీకు న్యాయమైనా అంటూ మోనిత అంటే.. గెటవుట్ మోనిత అని కార్తీక్ ఫైర్ అయ్యాడు. అంతలోనే తండ్రి క్యాబిన్‌లోకి వచ్చిన హిమ వారిద్దరి చూసి షాక్ తిన్నది. హిమ రాకను చూసిన మోనిత రెచ్చిపోయి.. లక్ అంటే ఇలా ఉండాలి.. ఇప్పుడు చూపిస్తా నా ఫెర్ఫార్మెన్స్ అంటూ హిమ ముందు మోనిత నాటకం మొదలుపెట్టంది.

    హిమను, కార్తీక్‌ను హాస్పిటల్ హిమ చూసి

    హిమను, కార్తీక్‌ను హాస్పిటల్ హిమ చూసి

    కార్తీక్ వద్దకు వెళ్లి నా మీదు ఎందుకు కోపం. నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అని మోనిత నాటక మొదలుపెట్టింది. అయితే మోనిత జైలులో ఉండాలి కదా.. డాడీ హాస్పిటల్‌కు ఎందుకు వచ్చింది అంటూ హిమ కంగారు పడింది. హిమ చూస్తుందని తెలుసుకొన్న తర్వాత కార్తీక్ వద్దకు వచ్చి కంటతడి పెడుతూ.. నన్ను పదే పదే ఎందుకు వెళ్లమంటున్నావు? నేనుచేసిన తప్పు ఏమిటి? ఆనాడు విజయనగరంలో ఉన్న హిమ ఆచూకీ తెలిస్తే పెళ్లి చేసుకొంటానని చెప్పావు కదా.. కార్తీక్.. నన్ను మోసం చేశావు.. ఇచ్చిన మాట తప్పావు కదా.. పెళ్లి చేసుకొంటానని చెప్పిన మాట తప్పావు.. హిమ అమ్మ ఏదని అడిగితే.. వేరే వాళ్ల ఫోటో చూపించి.. ఈవిడే అమ్మ అన్నావు.. అతి తప్పు కదా. పిల్లలకు అబద్ధం చెప్పవచ్చా? కార్తీక్ అంటూ మోనిత డైలాగ్స్ కొట్టింది. దాంతో హిమ కళ్లలో నీళ్లు తిరిగాయి.

    నీ మాదిరిగా పిల్లలకు అబద్ధం చెప్పలేను అంటూ

    నీ మాదిరిగా పిల్లలకు అబద్ధం చెప్పలేను అంటూ

    మోనిత మాటలకు అడ్డుపడుతూ.. నీవు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ కార్తీక్ అన్నాడు. దాంతో నీవు నీ పిల్లలకు అబద్ధం చెప్పావు. కానీ నేను నా బిడ్డకు అలా చెప్పలేను. నీ తండ్రి కార్తీక్ అని చెబుతాను. నీలా పిల్లలకు అబద్దం చెప్పలేను కార్తీక్. నా కడుపులోని బిడ్డకు తండ్రివి నీవే కదా కార్తీక్ అని మోనిత అంటే.. హిమ చూసి కంటతడి పెట్టి అక్కడి నుంచి బయటకు వెళ్లింది. అది చూసి మోనిత సంతోషంలో మునిగిపోయింది.

    కృత్రిమ గర్భధారణతో మోసం..

    కృత్రిమ గర్భధారణతో మోసం..

    నా కడుపులో ఉన్న బిడ్డకు నీవు తండ్రివి కాదా కార్తీక్ అంటే.. కాదు.. కాదు అంటూ కార్తీక్ గట్టిగా అరిచాడు. కృత్రిమ గర్భధారణతో నీవు కడుపు తెచ్చుకోవడం అనైతికం అంటూ కార్తీక్ మండిపడ్డాడు. అయితే కడుపులో పెరుగుతున్న బిడ్డ అనేది కాదనలేము. ఇదంతా ఎందు కోసం.. నీ మీద ప్రేమ వల్లనే కదా అని మోనిత అంటే.. గెటవుట్ అంటే.. ఏదో రోజు మీ జీవితంలోకి గెట్ ఇన్ అవుతాను అని మోనిత అంది. అంతలోనే కానిస్టేబుల్ వచ్చి.. మీకు స్వల్పంగా హార్ట్ ఎటాక్ వచ్చిందని రిజిస్టర్‌లో రాశాను. ఈ విషయం బయటకు తెలిస్తే.. ఉద్యోగం పోతుంది అంటూ కానిస్టేబుల్ కంగారు పడింది.

    Recommended Video

    Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
    నీ నోటితోనే ఆ మాట అనిపిస్తా

    నీ నోటితోనే ఆ మాట అనిపిస్తా

    మోనిత కపటనాటకం గురించి తెలుసుకొన్న కార్తీక్... తప్పుడు పనులు చేయడం బాగా అలవాటు అయింది. నీవు చేసే ఈ పనులకు మరింత జైలుశిక్ష వేయిస్తాను అని అంటే.. నీవు జైలు శిక్ష పెంచితే... నేను నీ మీద ప్రేమను పెంచుకొంటాను. కానీ ఏదో రోజు నీ నోటితోనే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నేనే అని నీ నోటితోనే అనిపిస్తాను అంటూ మోనిత శపథం చేసింది. దాంతో అది అసాధ్యం అంటూ కార్తీక్ హెచ్చరించాడు.

    English summary
    Karthika Deepam 6th October 1163 Episode preview. Monita gets out of jail on heart attack drama. And argued with Karthik in the hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X