Karthika Deepam వంటలక్కపై హత్యాయత్నం.. దీపను వెంటాడి కారుతో గుద్దేసి..
తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత టీఆర్పీ కలిగిన కార్తీకదీపం సీరియల్‌లో మరో భారీ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. మోనిత కుట్రలకు అతలాకుతలం అవుతున్న కార్తీక్ కుటుంబంలో మరో భారీ ప్రమాదం చోటుచేసుకొన్నది. ఈ సీరియల్‌లో అత్యంత కీలకమైన పాత్రతో ఆకట్టుకొంటున్న వంటలక్క, దీపకు యాక్సిండెట్ గురికావడం ఆసక్తికరమైన అంశంగా కనిపించింది. ఇక కార్తీక్, మోనిత బంధంపై పిల్లలు మనో వేధనకు గురికావడం ఇంటి సభ్యులను కుంగదీసింది. ఇంకా అక్టోబర్ 7వ తేదీన ప్రసారమైన 1164 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

డాడీ బ్యాడ్ బాయ్ అంటూ హిమ
కార్తీక్ క్యాబిన్‌లో మోనితను చూసిన కూతురు హిమ ఆవేదనకు గురైంది. మోనిత వార్నింగ్ ఇస్తుంటే కనీసం డాడీ మారు మాట్లాడకపోవడం చూస్తే నాన్న మంచివాడు కాదనే అభిప్రాయం కలుగుతున్నది. డాడీ చెప్పినవన్నీ అబద్దాలేనా? ఇంట్లో మమ్మీ, నాన్నమ్మ చెప్పిన విషయాలు కూడా అబద్దాలేనా.
ఇంట్లోవాళ్లు మాకు నిజాలు చెప్పడం లేదు. డాడీ బ్యాడ్ బాయ్ అంటూ హిమ ఆవేదన గురైంది. డాక్టర్ భారతీ కారులో వచ్చిన హిమ.. రోడ్డు పక్కన ఓ చోట కూర్చొని తండ్రి గురించిన ఆలోచనల్లో పడిపోయింది.

పిల్లలకు తెలిసిపోయిందంటూ సౌందర్య, దీప
నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అతడే అని మోనిత పేపర్లో రాయించిన కథనాన్ని పిల్లలు చూశారు అని సౌందర్యకు దీప చెప్పింది. దాంతో ఏదీ జరగకూడదని అనుకొన్నామో.. అదే జరిగిపోయింది. కార్తీక్ వల్ల మోనిత గర్బవతి కాలేదు. ఆమె కృత్రిమ గర్భం ద్వారా కడుపు తెచ్చుకొన్నది అని పిల్లలకు చెప్పలేం. కానీ మనం అబద్దాల కోరు అనే విషయాన్ని వారి మనసుల నుంచి తొలగించాలి అని సౌందర్య అభిప్రాయపడింది.
అయితే డాడీకి నీవంటే ఇష్టం లేదా అని శౌర్య నన్ను నిలదీసిందనే విషయాన్ని దీప చెప్పింది. ఏది నిజం అనేది తెలిసినా చెప్పడం లేదు. అలాగని ఎక్కువ రోజులు అబద్దాలు చెప్పలేం అని దీప ఆవేదన వ్యక్తం చేసింది.

మోనిత ఆనందంలో
ఇదిలా ఉంటే.. కార్తీక్‌ను కలిశాననే ఆనందంలో మోనిత మునిగిపోయింది. నా కార్తీక్‌ను కలిశాను. ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో. నా కార్తీక్‌ను చూశాను. ఆయనతో మాట్లాడాను. కలర్ సారీలో కలర్‌ఫుల్‌గా కలిశాను అంటూ నవ్వుల్లో మునిగిపోయింది. అయితే మోనిత ఆనందాన్ని చూసిన కానిస్టేబుల్ సోడా సుకన్య వచ్చి .. ఏమిటి చాలా ఆనందంగా కనిపిస్తున్నావు.
ఏంటి కారణం అంటే.. నా కార్తీక్‌ను కలిశాను.. నీకు డ్యూటీ పడకపోయినా.. నాతో వచ్చిన కానిస్టేబుల్ ఫుల్ సపోర్ట్ చేసింది అని మోనిత చెప్పింది. అయితే పార్టీ చేసుకోవాల్సిందే అంటే.. సోడా లేదా డ్రింక్స్‌తో చేసుకొందామా? అని వారిద్దరూ సోడాలతో పార్టీ చేసుకొన్నారు.

కార్తీక్ టెన్షన్‌లో
ఇక మోనిత హాస్పిటల్‌కు వచ్చిన విషయం గురించి చెప్పాలా? వద్దా అనే అంశంపై కార్తీక్ తర్జనభర్జన పడ్డారు. దీపకు చెప్పడం వల్ల ఇంకా ఆమెను టెన్షన్ పెట్టినట్టు అవుతుంది. మోనిత వచ్చి కలిసిన విషయం గురించి చెప్పకపోతేనే మంచిది అని కార్తీక్ నిర్ణయించుకొన్నాడు. అయితే డాక్టర్ భారతీకి ఫోన్ చేసి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నా క్యాబిన్‌కు వస్తారా అని కార్తీక్ చెప్పడంతో ఆమె అనుమానంగా ముఖంపెట్టింది.

తండ్రి గురించి హిమ, శౌర్య
జైల్లో ఉన్న మోనిత హాస్పిటల్‌లో డాడీని కలిసిన విషయాన్ని శౌర్యతో హిమ చెప్పింది. ఇప్పటి వరకు మనల్ని అబద్దాలు చెప్పి పెంచారు. మన జీవితమంతా అబద్దాలతోనే గడిచిపోయింది. డాడీ మంచి వాడు కాదు.. బ్యాడ్ బాయ్. విజయనగరంలో మనం ఉన్నప్పుడు మన గురించి చెబితే మోనితను పెళ్లి చేసుకొంటానని చెప్పాడని మోనిత చెప్పిన విషయాన్ని శౌర్యకు చెబితే.. మోనితను ఎలా పెళ్లి చేసుకొంటాడని శౌర్య ఆశ్చర్యపోయింది.
అయితే తాజా ప్రోమోలో కార్తీక్ బర్త్ డే రోజున కూడా విషెస్ చెప్పకుండా ఉంటే.. డాడీ బర్త్ డే అనే విషయాన్ని మరిచిపోయారా? నాపై కోపం పోలేదా అంటూ వారి వద్దకు వస్తే.. కార్తీక్‌ను పట్టించుకోకుండా హిమ లేచిపోవడంతో కార్తీక్ బాధపడ్డుతూ కనిపించారు.

కారుతో దీపను గుద్దించేసి..
ఇదిలా ఉండగా, రోడ్డుపై నడుస్తున్న దీపను ఓ వ్యాన్ వెంటాడి వెంటాడి గుద్దేయడం తాజా ప్రోమోలో భారీ ట్విస్ట్ కనిపించింది. దీపకు జరిగిందా యాక్సిడెంటా? లేదా ఎవరైనా కుట్రపన్నీ వాహనంతో గుద్దించారా? లేదా యాక్సిడెంట్‌కు గురైన దీపకు ఏమైంది లాంటి ప్రశ్నలు తాజా ప్రోమోలో లేవనెత్తాయి. దాంతో తదుపరి ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా మారింది.

39వ వారం రేటింగ్ ఇలా..
కార్తీకదీపం సీరియల్ కొద్ది వారాలుగా మరింత సాగదీస్తున్నారనే విమర్శలకు బలం చేకూరేలా టెలివిజన్ రేటింగ్ క్రమంగా క్షీణించింది. 38వ వారంలో అర్బన్ ప్రాంతంలో 16.31 రేటింగ్ సొంతం చేసుకొంటే.. 39వ వారంలో అర్బన్ ప్రాంతంలో 14.95 రేటింగ్ సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతంలో 38వ వారంలో 16.66 రేటింగ్ సాధించగా, 39వ వారంలో 16.08 రేటింగ్ నమోదు చేసుకోన్నది. గత కొద్దివారాలుగా క్రమేపీ క్షీణించడం కనిపిస్తున్నది.

39వ వారం కార్తీకదీపం రేటింగ్
కార్తీకదీపం సీరియల్ కొద్ది వారాలుగా మరింత సాగదీస్తున్నారనే విమర్శలకు బలం చేకూరేలా టెలివిజన్ రేటింగ్ క్రమంగా క్షీణించింది. 38వ వారంలో అర్బన్ ప్రాంతంలో 16.31 రేటింగ్ సొంతం చేసుకొంటే.. 39వ వారంలో అర్బన్ ప్రాంతంలో 14.95 రేటింగ్ సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతంలో 38వ వారంలో 16.66 రేటింగ్ సాధించగా, 39వ వారంలో 16.08 రేటింగ్ నమోదు చేసుకోన్నది. గత కొద్దివారాలుగా క్రమేపీ క్షీణించడం కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











