ఆ టెలివిజన్ నటితో అలా బ్రేకప్.. లవ్ అఫైర్ గురించి విజయ్ కార్తీక్ ఎమోషనల్!
Vijay Karthik - Keerthi Bhat: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో మరోసారి సెలబ్రిటీ బ్రేకప్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కీర్తి భట్ - విజయ్ కార్తీక్ మధ్య జరిగిన బ్రేకప్ ఇప్పుడు సోషల్ మీడియా చర్చనీయంగా మారింది. ముఖ్యంగా ఈ వ్యవహారంపై విజయ్ కార్తీక్ విడుదల చేసిన ఎమోషనల్ వీడియో, పరిస్థితిని మరింత సెన్సిటివ్‌గా మార్చింది. కార్తీకదీపం సీరియల్‌తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న కీర్తి భట్, ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన బ్రేకప్ పోస్ట్‌తో అభిమానులకు షాక్ ఇచ్చింది. కార్తీక్‌తో తన రిలేషన్ ముగిసిందని, పరస్పర గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె తెలిపింది.
'అతన్ని నేను భర్తగా చూడలేకపోతున్నాను. రాజీ పడి బతకడం కన్నా నా ఆనందమే నాకు ముఖ్యం' అంటూ కీర్తి పెట్టిన పోస్ట్ నెటిజన్లను భావోద్వేగానికి గురి చేసింది. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ జరిగి, త్వరలో పెళ్లి జరుగుతుందని అనుకుంటున్న సమయంలో ఈ ప్రకటన రావడం షాక్ గురి చేసింది. వాస్తవానికి కీర్తి -కార్తీక్‌లు 2023 ఆగస్టులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ వేడుకకు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, టీవీ ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఎంగేజ్‌మెంట్ తర్వాత ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తూ, తమ ఇంటికి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందుకే రేపో మాపో పెళ్లి పీటలు ఎక్కుతారని అభిమానులు భావించారు. కానీ ఒక్కసారిగా బ్రేకప్ వార్త బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రధానంగా నటి కీర్తి పోస్ట్ తర్వాత విజయ్ కార్తీక్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె గత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేస్తూ, 'ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు' అంటూ పలువురు నెటిజన్లు కార్తీక్‌ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ కార్తీక్ ఓ వీడియో రిలీజ్ చేసి, బ్రేకప్ వెనుక అసలు నిజాలను వెల్లడించాడు.
ఈ తరుణంలో నటుడు విజయ్ కార్తీక్ మాట్లాడుతూ, 'ఈ వీడియో చేయాలని నేను అస్సలు అనుకోలేదు. కానీ కీర్తి గారు పోస్ట్ పెట్టిన తర్వాత నాకు వందలాది మెసేజ్‌లు, కాల్స్ వచ్చాయి. 'వదిలేయకండి... మాట్లాడుకోండి' అని చాలామంది అడుగుతున్నారు. కానీ నిజం ఏంటంటే... విడిపోవడం నా నిర్ణయం కాదు. ఆమెనే నన్ను వదిలేసింది' అని స్పష్టంగా చెప్పాడు.
తాను కీర్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలనే అనుకున్నానని, ఈ ఏడాదే పెళ్లి చేసుకోవాలని తన కుటుంబం కూడా కోరుకున్నదని కార్తీక్ వెల్లడించాడు. అయితే తాను ఫైనాన్షియల్‌గా ఇంకా స్టేబుల్ కాలేదనే కారణంతో కీర్తి ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాడు. 'డిసెంబర్‌లోనే ఆమె నాకు ఈ విషయం చెప్పింది. ఆమెకు ఇప్పటికే బెటర్ ఆప్షన్ దొరికిందని కూడా స్పష్టంగా చెప్పింది. నేను ఎంతగా కన్వెన్స్ చేయడానికి ప్రయత్నించినా ఆమె నిర్ణయం మారలేదు'అని వాపోయాడు.
'బలవంతంగా ప్రేమను నిలబెట్టుకోలేం. ఆమె చాలా స్ట్రాంగ్‌గా నిర్ణయం తీసుకుని నా దగ్గరకు వచ్చింది. ఆ సమయంలో ఆమెను ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఆమె హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను'అని కార్తీక్ భావోద్వేగంగా చెప్పాడు. తనకు ఇంకా ఆ బాధ తగ్గలేదని, అందుకే ఫొటోలు డిలీట్ చేయలేకపోతున్నానని కూడా వెల్లడించాడు. ఒకవైపు కీర్తి తన ఆనందానికి ప్రాధాన్యం ఇచ్చిన నిర్ణయంగా చెబుతుంటే, మరోవైపు కార్తీక్ మాత్రం తాను విడిపోవాలని ఎప్పుడూ కోరుకోలేదని అంటున్నాడు. ఇలా కీర్తి భట్ - విజయ్ కార్తీక్ బ్రేకప్ వ్యవహారం హాట్ టాపిక్ మారింది.


Click it and Unblock the Notifications











