కార్తీకదీపం సీరియల్ టీమ్‌లో కరోనా పాజిటివ్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వంటలక్క!

లాక్ డౌన్ ముగిసిన తరువాత టెలివిజన్ కి సంబంధించిన టీవీ సీరియల్స్ షూటింగ్స్ ఎప్పటిలానే మొదలయ్యాయి. అయితే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువవ్వడంతో కొంతమంది నటీనటులు కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. దీంతో కొందరు షూటింగ్స్ కి ఎండ్ కార్డ్ పెట్టగా మరికొందరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఇటీవల కార్తీక దీపం సిరియల్ టీమ్ లో కొంతమందికి కరోనా వచ్చిందని, వంటలక్కకి కూడా కోవిడ్-19 టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు కథనాలు రాగా ఈ విషయంపై ప్రేమీ విశ్వనాథ్ స్పందించారు.

Recommended Video

Karthika Deepam సీరియల్ వంటలక్కకి కోవిడ్-19 అన్న న్యూస్ పై Premi Viswanath స్పందన || Oneindia Telugu
కార్తీకదీపంలో కరోనా వైరస్..?

కార్తీకదీపంలో కరోనా వైరస్..?

కార్తీక దీపం సీరియల్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. దాదాపు అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకున్న ఈ సీరియల్ రేటింగ్స్ అందుకోవడంలో నిత్యం ఎదో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల ఆ సీరియల్ కి చెందిన కొంత మందికి కరోనా వచ్చిందని పలు వెబ్ సైట్లలో కథనాలు వెలువడ్డాయి. ఆ విషయంపై వంటలక్క (ప్రేమీ విశ్వనాథ్) తన యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా వివరణ ఇచ్చారు.

వంటలక్క ఆగ్రహం..

వంటలక్క ఆగ్రహం..

ఇటీవల వంటలక్క షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి కేరళకు వెళ్లింది. ఇక కార్తీక దీపం శనివారం ఎపిసోడ్ మిస్ అవ్వడంత కొంత అనుమానాలు రావడం వలన కరోనా వచ్చిందేమోనని అంతా అనుకున్నారు. నిజానికి స్టార్ మా సీరియల్స్ ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం మాత్రమే వస్తున్నాయి. ఇక ఆ రూమర్స్ పై స్పందించిన వంటలక్క అందులో ఎలాంటి నిజం లేదని అంటూ ఇలాంటి రూమర్స్ ఎలా క్రియేట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రేమీ విశ్వనాథ్ మాట్లాడుతూ..

ప్రేమీ విశ్వనాథ్ మాట్లాడుతూ..

నేను క్షేమంగా ఉన్నాను. షెడ్యూల్ ముగియడంతో నేను కేరళకు వచ్చేసాను. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ నన్ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తున్నారు. అయితే ఇటీవల నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. నేను ఇంట్లోనే క్షేమంగా ఉన్నాను.

అబద్దాలని నమ్మకండి..

అబద్దాలని నమ్మకండి..

నా షెడ్యూల్ అయిపోవడం వల్ల నేను ఇంటికి చేరుకున్నాను. అంతేగాని మరో కారణం వల్ల కాదు. ఇలాంటి తప్పుడు వార్తలు క్రియేట్ చేసే వారు ఇలాంటివి పక్కనపెట్టి కొంచెం మంచి వార్తలు పోస్ట్ చేయండి. నేను రెగ్యులర్ గా నా అభిమానులతో, స్నేహితులతో టచ్ లో ఉంటున్నాను. అబద్ధపు వార్తలను ఎవరు నమ్మవద్దని ప్రేమీ విశ్వనాథ్ వివరణ ఇచ్చారు. అదే విధంగా తన యూ ట్యూబ్ ఛానెల్ కి ప్రస్తుతం చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది అంటూ తన లైఫ్ కి సంబంధించిన రెగ్యులర్ విషయాలను ఇక నుంచి యూ ట్యూబ్ ద్వారా తెలియజేస్తాను అని వంటలక్క వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X