ఫస్ట్ నైట్ రోజే టార్చర్.. భర్తపై కార్తీకదీపం నటి ఎమోషనల్ కామెంట్స్

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి సీతాలక్ష్మి. కార్తీక దీపం (Karthika Deepam)సీరియల్‌లో "సుమిత్ర" పాత్రతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే పలు సీరియల్స్, సినిమాల్లో నటించినప్పటికీ.. ఈ ఒక్క పాత్ర ఆమెకు విపరీతమైన అభిమానాన్ని తీసుకొచ్చింది. తెరపై ప్రశాంతంగా, బాధ్యతగల పాత్రల్లో కనిపించే సీత.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తాజాగా వెల్లడించారు.ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీతాలక్ష్మి తన వ్యక్తిగత జీవితంలోని అనేక తెలియని కోణాలను బయటపెట్టారు. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తాజాగా వెల్లడించారు.

సీతాలక్ష్మి ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలోని బాధాకర ఘట్టాలను ఎలాంటి దాచిపెట్టకుండా పంచుకున్నారు. ముఖ్యంగా తన మొదటి పెళ్లి గురించి, ఆ సంబంధం ఎందుకు విఫలమైందనే విషయాన్ని వివరంగా వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సీత మాట్లాడుతూ.. ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్లి, తొలిరాత్రి అనేవి మధుర క్షణాలుగా ఉండాలని ఆశపడుతుందని, కానీ తన జీవితంలో మాత్రం ఫస్ట్ నైట్ రోజే భయంకర అనుభవం ఎదురైందని చెప్పారు.

Karthika Deepam Actress Seetha Lakshmi Opens Up About First Night Trauma And Divorce Story

"అందరికీ హ్యాపీ నైట్.. నాకు మాత్రం సాడ్ నైట్" అంటూ ఆమె చెప్పిన మాటలు హృదయాన్ని కదిలించేలా ఉన్నాయి. మొదటి రోజు నుంచే భర్త ప్రవర్తన కఠినంగా ఉండటం, తిట్లు, కొట్టడం వంటి పరిస్థితులు ఎదురవ్వడంతో ఆ సంబంధంపై తనలో అనుమానాలు మొదలయ్యాయని తెలిపారు.

సీత వెల్లడించిన వివరాల ప్రకారం.. వివాహం తర్వాత డబ్బు, ఆస్తి విషయంలో విభేదాలు మొదలయ్యాయి. "ఆయన చెప్పింది తప్పు కాదు.. కానీ చెప్పిన విధానం తప్పు" అంటూ ఆమె స్పష్టం చేశారు. ప్రేమగా, అర్థం చేసుకునేలా మాట్లాడి ఉంటే పరిస్థితి మారేదని, కానీ మొదటి నుంచే ఒత్తిడి, కోపంతో వ్యవహరించడం వల్ల తనకు అతను డబ్బుకోసమే పెళ్లి చేసుకున్నాడనే భావన కలిగిందని తెలిపారు. తన సంపాదన మొత్తం తల్లి, కుటుంబానికి ఇచ్చేసిన విషయాన్ని కూడా సీత వెల్లడించారు. "నాకంటూ సొంత ఇల్లు కూడా లేదు.. సంపాదించింది అంతా ఇంటికే ఇచ్చా" అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

ఇక పెళ్లి సమయంలో కూడా ఇంటిని కుటుంబ సభ్యుల పేరుమీదే ఉంచుతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. అయితే ఆ నిర్ణయాల వల్ల తానే నష్టపోయానని అంగీకరించారు. సినిమాలు, సీరియల్స్‌లో పని చేస్తున్నప్పటికీ ఇండస్ట్రీలో రాజకీయాలు, ఈర్ష్యలు ఎదురయ్యాయని సీత తెలిపారు. "ముందు బాగానే మాట్లాడి వెనుక పుల్లలు పెడతారు.. నిజమైన ఫ్రెండ్ ఒక్కరూ లేరు" అంటూ ఇండస్ట్రీలోని వాస్తవాలను చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచే ఈ పరిస్థితులను ఎదుర్కొన్నానని వెల్లడించారు.

మొదటి వివాహం విఫలమైన తర్వాత సీత రెండోసారి పెళ్లి చేసుకున్నారు. తన స్కూల్‌మేట్‌తో మళ్లీ కలుసుకుని, వాట్సాప్ ద్వారా పరిచయం పెరిగి వివాహం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆ జీవితంలో ప్రశాంతంగా ఉన్నానని, పరస్పర అవగాహనతో జీవనం సాగుతోందని వెల్లడించారు. తన మాటల్లో ఎక్కడా ద్వేషం లేకుండా.. జరిగిన విషయాలను మాత్రమే చెబుతున్నానని సీత స్పష్టం చేశారు. "నేను తప్పు చేసి ఉండొచ్చు.. కానీ ఎవరిని మోసం చేయలేదు" అని పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త తరం సంబంధాల్లో అవగాహన, పరస్పర గౌరవం పెరిగిందని, అదే ఒక కుటుంబాన్ని నిలబెట్టే ప్రధాన అంశమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె చెప్పిన అనుభవాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: karthika deepam tollywood seetha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X