కార్తీక దీపం ఫ్యాన్స్ శుభవార్త: తెలుగులో తొలిసారి.. వంటలక్కతో స్టార్ మా సరికొత్త ప్రయోగం.!

By Manoj Kumar P

తెలుగులో సీరియళ్లకు ఉన్న ఫాలోయింగే వేరు. ప్రతి ఇంట్లోని ఆడవాళ్లకు ఉదయం ఇంటి పనులు, మధ్యాహ్నం వంట పనులు చేయడం ఎంత ఇంపార్టెంటో... ప్రైమ్ టైమ్‌లో వచ్చే సీరియళ్లు చూడడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. మరీ ముఖ్యంగా వాళ్ల డైలీ టైమ్ టేబుల్‌లో సీరియల్ చూడడం కూడా ఒక భాగంగా పెట్టేసుకున్నారు. అందుకే ప్రతి ఛానెల్లో పోటా పోటీగా సీరియళ్లను ప్రారంభిస్తున్నారు. ఇలానే మొదలై భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సీరియల్స్ చాలానే ఉన్నాయి. వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కార్తీక దీపం' ఒకటి. తాజాగా ఈ సీరియల్ విషయంలో ఓ శుభవార్త చెప్పింది సదరు చానెల్. ఆ వివరాలు మీకోసం.!

Recommended Video

Karthika Deepam సీరియల్ వంటలక్కకి కోవిడ్-19 అన్న న్యూస్ పై Premi Viswanath స్పందన || Oneindia Telugu
 అప్పట్లో అవి... ఇప్పుడు మాత్రం కార్తీక దీపమే

అప్పట్లో అవి... ఇప్పుడు మాత్రం కార్తీక దీపమే

తెలుగు బుల్లితెరపై ఉన్న ఛానెళ్లన్నీ సరికొత్త సీరియల్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. అప్పట్లో ‘అంతరంగాలు', ‘ఎండమావులు' మొన్నామధ్య ‘చక్రవాకం', ‘మొగలిరేకులు' వంటి సీరియల్స్ చాలా కాలం పాటు విజయవంతంగా ప్రదర్శితమయ్యాయి. ఇప్పుడు అదే జాబితాలోకి వచ్చి చేరింది ‘కార్తీక దీపం'. స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌కు భారీ క్రేజ్ ఉంది.

కార్తీక దీపం నేపథ్యం ఇదే.. దానికి రీమేక్‌గా

కార్తీక దీపం నేపథ్యం ఇదే.. దానికి రీమేక్‌గా

2017 అక్టోబర్‌లో ప్రారంభం అయింది కార్తీక దీపం సీరియల్. ఈ సీరియల్ మలయాళంలో 2014లో ప్రసారమై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కరుతముత్తు'కు రీమేక్‌. ఇందులో హీరో అయిన డాక్టర్ బాబు.. దీప అలియాస్ వంటలక్కను వివాహం చేసుకుని అనుమానంతో వదిలేస్తాడు. ఆ తర్వాత ఆమెకు పుట్టిన కవలు పిల్లలు తల్లిదండ్రులను ఎలా కలిపారనేదే ఈ సీరియల్ కథ.

హీరోయిన్ మాత్రమే కాదు.. వాళ్ల ఆడపడుచు

హీరోయిన్ మాత్రమే కాదు.. వాళ్ల ఆడపడుచు

దాదాపు మూడేళ్లుగా స్టార్ మాలో ప్రసారం అవుతోంది ‘కార్తీక దీపం' సీరియల్. మొదటి నుంచీ ప్రేక్షకాదరణ పొందిన దీనికి భారీ స్థాయిలో రేటింగ్ వస్తోంది. ఇక, ఇందులో హీరోయిన్‌గా చేస్తున్న ప్రేమీ విశ్వనాథ్‌కు కూడా అదే స్థాయిలో పాపులారిటీ వచ్చింది. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ప్రతి ఒక్కరూ ఆమెను తమ ఆడపడుచుగా చేసేసుకున్నారు.

అన్నీ దిగదుడుపే.. దేశంలోనే తొలి సీరియల్

అన్నీ దిగదుడుపే.. దేశంలోనే తొలి సీరియల్

‘కార్తీక దీపం' ముందు బడా హీరోల సినిమాలు సైతం తట్టుకోలేకపోతున్నాయి. అంతేకాదు, ఎన్నో చానెళ్లలో వస్తున్న కామెడీ షోలు సైతం దీని ముందు దిగదుడుపే అన్నట్లుగా ఉంటున్నాయి. అంతలా రేటింగ్ సాధిస్తోందీ వంటలక్క సీరియల్. దాదాపు రెండున్నరేళ్లుగా ఇదే రేంజ్‌లో కొనసాగుతూ ఇండియాలోనే ఈ ఘనత సాధించిన మొదటి సీరియల్‌గా నిలుస్తోంది.

కార్తీక దీపం ఫ్యాన్స్‌కు స్టార్ మా గుడ్ న్యూస్

కార్తీక దీపం ఫ్యాన్స్‌కు స్టార్ మా గుడ్ న్యూస్

అప్రతిహాసంగా సాగిపోతోన్న ‘కార్తీక దీపం' రోజురోజుకూ మరింత క్రేజ్ పెంచుకుంటోంది. సీరియల్‌లో రసవత్తరమైన సన్నివేశాలు వస్తుండడంతో దీనికి ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. దీంతో టీఆర్పీ రేటింగ్ సైతం వారం వారం పైపైకి వెళుతోంది. దీంతో స్టార్ మా సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగానే ఈ సీరియల్ అభిమానులకు శుభవార్త చెప్పింది.

వంటలక్కతో స్టార్ మా సరికొత్త ప్రయోగం.!

విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఎన్నో రికార్డులను బద్దలు కొడుతోన్న ‘కార్తీక దీపం' సీరియల్‌ను ఈ వారం 45 నిమిషాల పాటు ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా ఛానెల్ అధికారికంగా ప్రకటించింది. అంటే ప్రతిరోజూ సాయంత్రం 7.30 గంటల నుంచి 8.15 గంటల వరకు ఇది వస్తుందన్న మాట. ఇది ఈ ఒక్క వారమే ఉంటుందా.? లేక పెంచుతారా అన్నది తెలియాల్సి ఉంది.

మరో సీరియల్ కూడా అదే సమయంతో

మరో సీరియల్ కూడా అదే సమయంతో

‘కార్తీక దీపం' తర్వాత ప్రసారమయ్య ‘ఇంటింటి గృహలక్ష్మి' కూడా 45 నిమిషాలు ప్రసారం కానుంది. ఈ సీరియల్ సాయంత్రం 8.15 గంటల నుంచి 9 గంటల వరకు వస్తుందని సదరు చానెల్ తెలిపింది. సీనియర్ సినీ హీరోయిన్ కస్తూరి లీడ్ రోల్ చేస్తున్న ఈ సీరియల్ కూడా మంచి టీఆర్పీ సాధిస్తోంది. అందుకే ఈ రెండు సీరియళ్ల రన్నింగ్ టైమ్ పెంచినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X