twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam శౌర్య ఎవరో కనిపెట్టిన సౌందర్య.. రెండు ప్రేమ జంటల జోరుతో..

    |

    ప్రేమ్ నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్ వద్ద స్వప్న, జ్వాలా అలియాస్ శౌర్యకు గొడవ జరగడం.. ఆ తర్వాత తన ఆటోను స్వప్న తగలపెట్టడంతో జ్వాలా బాధలో మునిగిపోయింది. అలా బాధలో ఉన్న జ్వాలా ఇంటి ముందు.. హిమ, డాక్టర్ నిరుపమ్ ఆటోలో వచ్చి.. హరన్ మోగించారు. ఆటలో వచ్చిన హిమను చూసి.. ఏంటి? నీకు ఆటో నడిపేంత ధైర్యం వచ్చిందా? ఏంటి డాక్టర్ సాబ్ ఉదయాన్ని ఆటోలో వచ్చారు అని అడిగితే.. ఆటోలో నుంచి హిమ దిగి నిరుపమ్ చేతిలో ఆటో తాళాలు పెట్టింది. దాంతో ఆ తాళాలను జ్వాలా చేతిలో నిరుపమ్ పెట్టడంతో ఎమోషనల్ అయింది. కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1330 లో ఇంకా ఏం జరిగిందంటే..

    శౌర్య కోసం కొత్త ఆటో..

    శౌర్య కోసం కొత్త ఆటో..

    జ్వాలాతో డాక్టర్ నిరుపమ్ మాట్లాడుతూ.. ఈ ఆటో నీకే జ్వాలా అనగానే మరింత ఎమోషనల్ అయింది. తాళాలను పరీశిస్తుండగా.. హిమ ఆనందంలో మునిగిపోయింది. ఈ ఆటో నాకా? అని జ్వాలా అడిగితే.. అవును నీ కోసం.. కొత్త ఆటో అని హిమ చెప్పింది. అయితే డాక్టర్ సాబ్ ఏంటి అంటే. అవును.. అమ్మ తొందరపడింది.. అందుకే కొత్త ఆటో నీ కోసం కొన్నాను అని అంటే.. ఏంటి డాక్టర్ సాబ్.. పెన్నో.. పిన్నిసో.. ఇస్తే థ్యాంక్స్ చెప్పేదానిని.

    ఇలా ఆటో కొనిస్తే.. నేను ఏం మాట్లాడాలి చెప్పు అని జ్వాలా అంది. ఆటో మీద వదిలేదేలే అని రాయడంతో ఆశ్చర్యపోయింది. కొత్త ఆటో కొనిచ్చినందుకు జ్వాలా పిన్ని, బాబాయ్ డాక్టర్ నిరుపమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.

    షరుతుల పెట్టిన జ్వాలా

    షరుతుల పెట్టిన జ్వాలా

    అయితే కొత్త ఆటో కొనివ్వడంపై జ్వాలా షాకింగ్ కామెంట్ చేసింది. ఆటోను ఊరికే తీసుకొను. కొంత డబ్బు నేను ఇస్తాను అంటే.. అది కాదు జ్వాలా అని అభ్యంతరం చెప్పడానికి ప్రయత్నిస్తే.. నీవు డబ్బు తీసుకొంటానంటే.. నేను ఆటో తీసుకొంటాను అని జ్వాలా చెప్పింది. దాంతో సరే అని డాక్టర్ నిరుపమ్ అన్నాడు. ఆ తర్వాత ఆటో కొని ఇచ్చినందుకు మీకు పెద్ద పార్టీ ఇస్తాను అంటూ జ్వాలా తీసుకెళ్లింది.

    జ్వాలా, హిమ, నిరుపమ్ పార్టీ

    జ్వాలా, హిమ, నిరుపమ్ పార్టీ

    అయితే డాక్టర్ నిరుపమ్, డాక్టర్ హిమ కోసం ప్రేమ్ వెతుకుతూ కంగారు పడిపోయాడు. ఇద్దరు హాస్పిటల్‌లో లేరు.. కాల్ చేస్తే కలువదు అంటూ ప్రేమ్ అనుకొంటుండగా.. జ్వాలా ఫోన్ మోగింది. దాంతో పక్కకు తిరిగి చేసేసరికి.. పక్కనే జ్వాలా కనిపించింది. రౌడీ బేబీ ఇక్కడికి వచ్చిందేమిటి? కలిస్తే మళ్లీ ఏదో ఫిట్టింగ్ పెడుతుంది.. ఆమె గుర్తు పెట్టకుండా హెల్మెట్ పెట్టుకొందామని అనుకొంటుండగా.. ఆటలో నుంచి తన సోదరుడు నిరుపమ్, హిమ దిగి.. హోటల్‌లోకి వెళ్తుంటే.. ఏమిటి? నన్ను పిలువకుండా హోటల్‌కు వెళ్తారా అంటూ ప్రేమ్ చిరుకోపం ప్రదర్శించాడు.

    హోటల్‌లో రెండు జంటల లవ్ స్టోరి

    హోటల్‌లో రెండు జంటల లవ్ స్టోరి

    హోటల్‌లో తనదైన శైలిలో బేరసారాలు ఆడుతుంటే.. నిరుపమ్, హిమ నవ్వుకున్నారు. అంతలోనే.. ప్రేమ్ అక్కడికి రావడంతో.. ఇప్పటి వరకు ఏదో తగ్గిందని అనుకొంటున్నాను. ఇంతకు తగ్గింది నువ్వేనా.. రా అంటూ జ్వాలా ప్రేమ్‌ను పిలిచింది. అయితే హిమ, ప్రేమ్ ఒకరికళ్లలో ఒకరు చూసుకొంటుంటే.. జ్వాలా వారిని ఆటపట్టించింది. అలా హిమ, ప్రేమ్, జ్వాలా, నిరుపమ్ పార్టీని ఎంజాయ్ చేశారు.

    అయితే జ్వాలాతో మాట్లాడుతూ.. నీకు చెల్లెలు, అక్కలు ఎవరు లేరా ప్రేమ్ అంటే.. నాకు ఎవరు లేరు అని అనడంతో హిమ టెన్షన్‌గా ఫీలయ్యింది. అయినా నీకు చెల్లెలు ఉంటే.. పారిపోయేది అంటే.. ప్రేమ్‌పై కోపగించుకొన్నది. అయితే నిరుపమ్ మాట్లాడుతూ.. ఆమెను చేసుకొనే వాడు చాలా అదృష్టవంతుడు అంటూ అనగానే.. జ్వాలా ఆనందపడిపోయింది.

    Recommended Video

    KAKA TALKS: Frustrated Fans Over Beast Result నెల్సన్.. ది విలన్ | EP - 01 | Filmibeat Telugu
    శౌర్య అడ్రస్ తెలుసుకొన్న్ సౌందర్య

    శౌర్య అడ్రస్ తెలుసుకొన్న్ సౌందర్య

    ఇదిలా ఉండగా.. హిమ రూమ్‌లో లైట్లు వేసి ఉండటంతో.. నానమ్మ సౌందర్య అనుమానపడింది. హిమ గదిలోకి అడుగుపెట్టి.. ఎందుకు లైట్లు వేసి ఉన్నాయంటూ చూడగానే.. హిమ, జ్వాలా దిగిన ఫోటో సౌందర్య కంటపడింది. దాంతో ఆమె ముఖంలో చిరునవ్వు వెలిగింది. హిమ ఆనందం వెనుక జ్వాలా ఉందన్న మాట అంటూ సంతోషంలో మునిగిపోయింది. ఈ ట్విస్టుతో సీరియల్ ఆసక్తికరంగా ముగిసింది.

    English summary
    Big Twist in Karthika Deepam today's episode: Nirupam, Jwala, Hima, Prem love story goes feel good
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X