Karthika Deepam..వంటలక్క హత్యకు ప్లాన్ చేసిన మోనిత.. ఇక దండ వేయడమే అంటూ..

కార్తీకదీపం సీరియల్‌లో అజ్ఞాతంలో ఉన్న మోనిత సోది చెప్పే ఆవిడగా వేషం మార్చుకొన్నది. కానిస్టేబుల్ రత్నసీత ఇచ్చిన సమాచారం ఆధారంగా దీపను హత్య చేసేందుకు పిస్టల్ పట్టుకొని బయలు దేరింది. డ్రామా ఆర్టిస్టునని చెబుతూ తన వేట ప్రారంభించింది. గుడిలోకి వచ్చిన భాగ్యం దంపతులను టార్గెట్ చేసింది. అయితే మోనిత తన కుట్రలను ఎలా కొనసాగించాలనే విషయాన్ని తనలో తాను చెప్పుకొన్నది. తాజాగా ఎపిసోడ్ 1123 ఎపిసోడ్‌లో ఈ డ్రామా ఎలా కొనసాగిందంటే..

దీపకు ఇదే చివరి రోజు అంటూ

దీపకు ఇదే చివరి రోజు అంటూ

సోది చెప్పే ఆవిడగా వేషం మార్చుకొని, చేతిలో తుపాకితో కారులో ప్రయాణిస్తున్న మోనిత .. దీపను హత మార్చేందుకు ప్లాన్స్ వేసుకొంటున్నది. కానిస్టేబుల్ రత్నసీత చెప్పినట్టే దీప గుడికి వస్తే.. ఈ రోజే దానికి చివరి రోజు అవుతుంది అంటూ మోనిత మనసులో అనుకొన్నది. దాన్ని తలిస్తే తేళ్లు, జేర్లు పాకినట్టు అనిపిస్తుంది. దీప నేను వస్తున్నాను. చావడానికి రెడీగా ఉండు అంటూ మోనిత పిచ్చితనంతో ఊగిపోయింది. అప్పటికే గుడిలోకి దీప పిన్ని భాగ్యం, తండ్రి చేరుకొన్నారు. కారు దిగిన మోనిత సోది చెప్పే వేషంలో బుట్టతో గుడిలోకి చేరుకొన్నది.

దీప కోసం తల్లిదండ్రుల పూజలు

దీప కోసం తల్లిదండ్రుల పూజలు

గుడిలో పూజారితో తన బిడ్డ కష్టాలను దీప తల్లిదండ్రులు చెప్పుకొన్నారు. మాకు చేతనైన మేర మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కొంత దైవబలం కూడా తోడైతే బాగుంటుందని పూజ కోసం వచ్చానమిన వారు చెప్పారు. అయితే దీప గుడిలో లేకపోవడం చూసి మోనిత కంగారు పడుతూ కనిపించింది. ఈ క్రమంలో దేవుడిని నమ్మిన వారికి భగవంతుడు మేలే చేస్తారు అని పూజారి చెబుతూ మనోధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేశారు. దాంతో నా బిడ్డ దీపకు అంతా మంచే జరుగాలని దేవుడిని భాగ్య దంపతులు వేడుకొన్నారు.

దొంగచాటుగా మోనిత

దొంగచాటుగా మోనిత

గుడిలోకి ప్రవేశించిన మోనిత.. దీప కోసం వేట ప్రారంభించింది. భాగ్యం దంపతులు మాత్రం కనిపించడంతో దీప రాలేదా అనే అనుమానం మొదలైంది. అయితే పూజారితో భాగ్య దంపతులు మాట్లాడే మాటలు దొంగచాటుగా మోనిత విన్నది. అయితే పూజారి దీప ఈ రోజు రావాల్సిన అవసరం లేదు. రేపు ఉదయం 5 గంటల ప్రాంతంలో వస్తే దీప చేత అఖండ దీపం వెలిగించేలా చేస్తాను అని పూజారి చెప్పిన మాటలు విని.. రేపే దీప ప్రాణాలకు ముహుర్తం నిర్ణయిస్తాను అంటూ మోనిత కర్కశంగా అనుకొన్నది.

భాగ్యంను బుట్టలో పడేసుకొన్న మోనిత

భాగ్యంను బుట్టలో పడేసుకొన్న మోనిత

ఇక భాగ్యం దంపతులను ఆటాడుకొంటానని అంటూ మోనిత వారికి సోది చెప్పింది. మీ కూతురు జీవితం అంతా బాగాలేదు. మీ అల్లుడి కారణంగా కూతురు కష్టాలు పడుతున్నారు. సోది చెబుతానమ్మా.. సోది చెబుతాను.. జరిగేది చెబుతాను అంటూ భాగ్య దంపతులను మోనిత టార్గెట్ చేసింది. అయితే భాగ్యం సోది చెబుతాను మోనిత అంటే.. తన భార్తను ఒప్పించి మోనిత వద్దకు భాగ్యం వచ్చింది. దాంతో ఎవరికి తగలాలో వారికే తగిలింది. నా అంచనా కరెక్ట్ అయింది. భాగ్యం తన వద్దకు రప్పించుకోవాలన్న ప్లాన్ వర్కువట్ కావడంతో మోనిత ముఖంలో సంతోషం కనిపించింది.

మోనితపై దీప తండ్రి అనుమానంగా

మోనితపై దీప తండ్రి అనుమానంగా

మోనిత సోది చెప్పడం ప్రారంభించి.. అర్ధమైనాదే తల్లి.. మీకు వచ్చిన కష్టం పెద్దదే. నీ మాట కఠినమైనా.. మనసు చల్లనిదిని.. నీ పెద్ద కూతురు నీ కడుపులో పుట్టకపోయినా కన్న కూతురిలో చూసుకొంటున్నావు అంటూ మోనిత చెప్పగానే.. దీప తండ్రి అనుమానంగా చూశాడు. దాంతో అనుమానం వద్దు అంటూ మోనిత కవరింగ్ ఇచ్చింది. అలా మాట్లాడుతూనే.. దీపను కొండెక్కేలా చేస్తాను అంటూ మోనిత తనలో మాట చెప్పగానే భాగ్యం ఆందోళన చెందింది. దాంతో అదే దీప జీవితం బాగుపడేలా చేస్తాను అంటూ సర్దుకొన్నది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
దీపను చంపి దండ వేస్తాను అంటూ

దీపను చంపి దండ వేస్తాను అంటూ

నీ కూతురు జీవితం బాగుపడాలంటే.. రేపు బస్తీలో ఉన్న గుడి వద్దకు రమ్మని చెప్పు. అంతా మంచే జరిగిపోతుంది. పెట్ట (దీప)ను పంపించు. పుంజు (కార్తీక్) బయటకు వచ్చేలా చేస్తాను అంటూ సోది చెప్పగానే.. నేను, దీప వస్తాం అని భాగ్యం అన్నారు. దాంతో కష్టం ఆమెదే కాబట్టి.. పెట్ట మాత్రమే ఒంటరిగా రావాలి అంటూ మోనిత అంటే.. అలాగే అంటూ.. 500 చేతులో పెట్టి భాగ్యం వెళ్లిపోయింది. దాంతో భాగ్యం ఇచ్చిన డబ్బులు చూస్తూ. రేపు దీపను చంపి ఈ డబ్బుతోనే దండ వేస్తాను అంటూ మోనిత తన కుట్రను బయటపెట్టంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X