For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam Episode 1125: నీ మృత్యువుని.. నీకు ఇక నరకమే.. దీపపై తూట పేల్చిన మోనిత

  |

  మోనిత హత్య కేసులో అరెస్టైన కార్తీక్‌కు మంచి జరగాలని భార్య దీప పూజకు సిద్ధమైంది. అలాగే దీపను చంపేసి తన ప్రేమకు, పెళ్లికి అడ్డు తొలగించుకోవాలనే కుట్రతో మోనిత పూజాస్థలానికి బయలుదేరింది. అయితే కార్తీక్ బయటకు రావాలంటే.. మోనిత చనిపోలేదని నిరూపించాలి? లేదా కార్తీక్ ఆమెను హత్య చేయలేదని సాక్ష్యాలు తీసుకురావాలి? కానీ పూజలు చేస్తే ఎలా కార్తీక్ బయటకు వస్తాడని కారు డ్రైవర్ వారణాసి ప్రశ్నించాడు. ఇలా ఎమోషనల్ సీన్ల మధ్య కార్తీకదీపం సీరియల్ 1125 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  దీపను ఎలాగైనా చంపాలి

  దీపను ఎలాగైనా చంపాలి

  దీపను ఎలాగైనా చంపాలి. అంజి లాంటి పనికిరాని డ్రైవర్‌తో కాకుండా మంచి డ్రైవర్‌తో లారీతో గుద్దించి చంపిస్తాను. దెబ్బకు హిమ మాదిరిగా చచ్చి ఊరుకొంటారు. ఎవరికి అనుమానం రాదు. కాబట్టి నా గర్బానికి కారణమైన కార్తీక్ చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకొంటాడు. అదే చేస్తాను అంటూ ఆనందపడిపోయింది. సోది చెప్పే అమ్మగా వేషం మార్చుకొని దీప వద్దకు బయలుదేరే ముందు.. బుట్టులో ఉన్న పిస్టల్‌ను చూసి.. నా పిచ్చిగానీ.. ఈ పిస్టల్ దగ్గర పెట్టుకొని.. దీపను ఎలా చంపాలని ఆలోచిస్తున్నాను. బతికి ఉండగానే చనిపోయేలా చేసిన వంటలక్క.. వస్తున్నా అంటూ మోనిత బయలుదేరింది.

  దీపను అడ్డు తొలగించుకొంటా

  దీపను అడ్డు తొలగించుకొంటా

  దీపను చంపేందుకు బయలుదేరిన మోనిత కారులో బయలు దేరి.. మనసులో దేవుడిని ప్రార్థించుకొన్నది. భగవంతుడా నా కార్తీక్‌ కోసం పడని కష్టం లేదు. ఈ సారి నేను కోరుకొన్నది జరిగేటట్టు చేయండి. దీప నా కంట పడేటట్టు చేయండి అంటూ మనసులో అనుకొంటూ మోనిత కారులో బయలు దేరింది. అదే సమయంలో దీప కూడా పూజా వేదిక వద్దకు వారణాసితో కలిసి బయలుదేరింది. మై డియర్ కార్తీక్ నన్నే షూట్ చేయాలని వచ్చావు. కానీ చేయలేదు. ఎందుకంటే.. నీ మనసు లోతుల్లో ఎక్కడో నేను ఉన్నాను. దీప అడ్డుగా ఉందని నీవు ఆలోచిస్తున్నావు. అందుకే దీపను షూట్ చేసి అడ్డుతొలగించుకొంటాను. అప్పుడు నీవు, నేను, మన పిల్లలు అంటూ మోనిత సంబరపడిపోయింది.

  మోనితపై మనసు పడ్డ రౌడీ దుర్గ

  మోనితపై మనసు పడ్డ రౌడీ దుర్గ

  అంజి, దుర్గ ఇద్దరు కలిసి కార్తీక్‌ను ఎలా విడుదల చేయించాలనే విషయంపై చర్చించుకొన్నారు. మోనితను నేను చంపాలనుకొన్నాను. కానీ ఆమె కుట్రలు కార్తీక్‌కు తెలిసిన తర్వాత చంపాలనుకొన్నాను అంజి చెబితే.. మోనిత కనిపిస్తే చంపకు బ్రదర్.. నాకు మోనిత అంటే లవ్ అని దుర్గ చెప్పాడు. అయితే దాన్ని కూడా ఈ ప్రపంచంలో లవ్ చేసే వాళ్లు ఉంటారా? అసలు నీ ఆడదానిలా కనిపించిందా? నీకు కలిసి వచ్చే కాలం వచ్చింది.. త్వరలోనే నడిచి వచ్చే కొడుకు పుడుతాడు అంటూ అంటూ అంజి ఈసడించుకొన్నాడు. మోనిత కనిపిస్తే వెంటనే రోషిణి వద్ద పడేయాలి. లవ్ లస్క్ అంటూ ఏమీ ఫీలింగ్స్ పెట్టుకోకు. ఈ జన్మకు ఇంతేనా అంటే.. వచ్చే జన్మకు దానిని ప్రేమించకు అని మాట్లాడుకొంటుండగా దీప అక్కడికి వచ్చింది.

  కార్తీక్ కోసం ప్రాణాలు ఇస్తాం...

  కార్తీక్ కోసం ప్రాణాలు ఇస్తాం...

  దీపతో అంజి, దుర్గ మాట్లాడుతూ.. కార్తీక్‌ను నిర్ధోషి అని నిరూపించడానికి మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దంగా ఉన్నాం. కార్తీక్ గురించి పూజ చేయండి... ఆ దెయ్యాన్ని వెతికి పనిలో మేము ఉంటాం. నీతోపాటు మేము వస్తాం అని అంజి, దుర్గ అంటే...వద్దులే నేను ఒంటరిగానే వెళ్తాను. నన్ను ఒంటరిగానే రమ్మన్నారు అని దీప చెప్పింది. అయితే దీపమ్మను జాగ్రత్తగా చూసుకో అంటూ వారణాసికి అంజి, దుర్గ జాగ్రత్తలు చెప్పారు. దాంతో దీప పూజ జరిగే స్థలం వద్దకు వెళ్లింది.

  దీప.. నీకు ఇదే ఆఖరు ప్రయాణం

  దీప.. నీకు ఇదే ఆఖరు ప్రయాణం

  మోనిత, దీప ఇద్దరు పూజా స్థలం వద్దకు చేరుకొన్నారు. దీపను మోనిత వెంబడిస్తూ అదను కోసం ఎదురు చూసింది. దీప దిగిన కారును చూసి.. నేను కార్తీక్‌ కలిసి తిరిగిన కారులో దీప తిరుగుతుంది. నీకు ఎదే ఆఖరు ప్రయాణం అంటూ మోనిత కోపంతో ఊగిపోయింది. మోనిత పూజపై కూర్చోగానే మోనిత చెట్ల చాటున నక్కింది. పూజపై కూర్చొన్న దీపతో పూజారి మాట్లాడుతూ.. నీ కష్టాలు గట్టెక్కుతాయనుకొంటే.. పరీక్షలు పెడుతున్నాయి. గణపతి హోమం జరిపించింది... అఖండ దీపం వెలిగిస్తే.. నీ సమస్యలన్నీ దూరమవుతాయి. నీ ఆత్మబలంకు దైవబలం కూడా తోడవుతుంది అని అన్నారు.

  కార్తీక్‌ను నన్ను విడదీయలేవు

  కార్తీక్‌ను నన్ను విడదీయలేవు

  పూజారితో దీప మాట్లాడుతూ.. అఖండ దీపం వెలుగులో నాకు సమస్యలను పరిష్కరించుకొనేందుకు దారి కనిపించాలి అంటే.. ఆ వెలుగులో నీకు నరకం దారి కనిపిస్తుంది. ఈ హోమం, అఖండ జ్యోతులు నన్ను, కార్తీక్‌ను విడదీయలేవు. నీ ప్రాణాలు కూడా అవి కాపాడలేవు. ఈ లోకంలో కార్తీక్‌ను జైలుకు వెళ్లకుండా బయటకు తెచ్చే ప్రాణి మోనిత అంటూ అని మోనిత పైశాచికత్వం ప్రదర్శంచింది.. అయితే నాన్న గుడికి వచ్చిన సమయంలో ఓ సోదమ్మ కనిపించిందట.. ఆమెను కలుస్తాను అని దీప అంటే.. సోదమ్మ కాదు.. నీ మృత్యువు అంటూ మోనిత అనుకొంటూ దీపను కాల్చే ప్రయత్నం చేసింది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  దీపను గురిపెట్టి కాల్చిన మోనిత

  దీపను గురిపెట్టి కాల్చిన మోనిత

  పూజలో భాగంగా దీప అఖండ దీపం వెలిగిస్తుండగా.. నీ జీవితంలో ఇదే చివరి పూజ. పుణ్య లోకానికే వెళ్లేటట్టు ఉన్నావు అని మోనిత దీపకు పిస్టల్ గురిపెట్టింది. దీప పూజలో నిమగ్నమై ఉండగా.. మోనిత షూట్ చేయబోగా.. పూజారి, భక్తులు అడ్డు రావడంతో తన ప్రయత్నాన్ని కాసేపు ఆపుకొన్నది. ఆ తర్వాత అదను దొరకడంతో తుపాకి పేల్చింది. దాంతో దీప కిందపడిపోతూ కనిపించింది.

  English summary
  Karthika Deepam August 23rd August's Episode preview. Latest episode of 1125 goes once again with emotional content. Monita shoots Deepa at Akanda Pooja.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X