For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam.. కార్తీక్, దీపకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మోనిత.. ఎలా తప్పించుకొన్నదంటే?

  |

  దీపను షూట్ చేయాలని గుడికి వచ్చిన మోనిత తన ప్రయత్నాలు భారీగానే చేసింది. ఆలయంలో ఎక్కువగా సందడి ఉండటంతో తన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే పట్టు వదలకుండా దీపను టార్గెట్ చేసేందుకు మోనిత మరో ప్లాన్ చేసింది. ఇలాంటి ప్రయత్నాల మధ్య దీపకు మోనిత రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. అయితే తృటిలో చాకచక్యంగా మోనిత తప్పించుకోవడంతో దీప కంగారు పడిపోయింది. అయితే అంజి, దుర్గతో సహా కార్తీక్ కుటుంబ సభ్యులు మోనిత బతికే ఉందనే విషయాన్ని నమ్మలేకపోయారు. కార్తీక దీపం సీరియల్‌లోని 1126 ఎపిసోడ్‌లో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకొన్నాయంటే..

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   నీ మృత్యువును వెతుక్కొంటూ

  నీ మృత్యువును వెతుక్కొంటూ

  దీప అఖండ దీపం వెలిగించే పనుల్లో ఉంటే.. మోనిత పిస్టల్ తీసి కాల్చేందుకు ప్లాన్ చేసింది. అయితే భక్తుల హడావిడి ఎక్కువగా ఉండటంతో గురి చూసి కాల్చలేకపోయింది. దాంతో నీ మృత్యువును నీవే వెతుక్కొంటూ వస్తావు. అప్పుడు నిన్ను పాయింట్ రేంజ్‌లో గన్ పెట్టి కాల్చుతా అంటూ తన ప్రయత్నాన్ని విరమించుకొన్నది. ఆ తర్వాత పూజ ముగించుకొని వచ్చి సోదమ్మ వేషంలో ఉన్న మోనిత కోసం వెతకడం ప్రయత్నించింది.

  నీ అర్ధాయుష్పువును నేనే రాస్తా

  నీ అర్ధాయుష్పువును నేనే రాస్తా

  ఆలయం ఎదుట సోది చెప్పుకొంటూ మోనిత కనిపించడంతో ఆమె వద్దకు దీప వెళ్లింది. మారుతల్లి వచ్చిపోయింది.. కన్నతండ్రి కలిసి పోమ్మన్నాడు. కూర్చో తల్లి అంటూ దీపను ముందు కూర్చోపెట్టి సోది చెప్పడం ప్రారంభించింది. అయితే మోనిత చూడగానే దీపకు ఏదో అనుమానాలు కలిగాయి. దాంతో నీకు అర్ధాయుష్షును నేనే రాస్తున్నాను. కొద్దిసేపట్లో నీ ప్రాణాలు గాలిలో కలిసి పోతాయి అంటూ ముసుగులో ఉన్న మోనిత.. దీప చంపేందుకు మనసులో ప్లాన్ చేసింది. నీ పెనిమిటి నీకు దక్కాలంటే.. దుర్గమ్మ గుడికి కారులో కాకుండా కాలినడకన వెళ్లాలి అంటూ మోనిత చెప్పింది. మొక్కు తీర్చుకొంటే.. ఆ అమ్మ దిక్కు అవుతుంది అని మోనిత అంటే.. తప్పుకుండా నీవు అనుకొన్నది జరుగుతుంది అంటూ మోనిత చెప్పింది.

  దీప తలకు గురి పిస్టల్ గురిపెట్టి

  దీప తలకు గురి పిస్టల్ గురిపెట్టి

  ఇక దీపను షూట్ చేసేందుకు మోనిత సిద్ధమైంది. బుట్టలో నుంచి పిస్టల్ తీసే ముందు కళ్లు మూసుకొని తాను చెప్పేంత వరకు కళ్లు తెరవకూడదు అంటూ చెప్పింది. దీప కళ్లు మూయగానే పిస్టల్ తీసి తలకు గురిపెట్టింది. అంతలోనే గుడిలో గాలి బాగా వీయడంతో ముందు ఉన్న కుంకుమ గాలిలోకి లేచి ముక్కులోకి వెళ్లడంతో మోనిత గట్టిగా తుమ్మి.. ఎక్స్‌క్యూజ్ మీ అని అనగానే.. దీప తన ఎదురుగా ఉన్నది మోనిత అని గ్రహించింది.

  మోనిత బతికే ఉందని దీపకు

  మోనిత బతికే ఉందని దీపకు

  తన ఎదురుగా ఉన్నది మోనిత అనే అనుమానం కలుగడంతో ఎవరు నువ్వు అంటూ కంగారు పడిపోయింది. అంతలోనే దుర్గ అక్కడికి రావడంతో వీడు ఇక్కెడికి ఎందుకు వచ్చాడు అంటూ మోనిత కంగారు పడిపోయింది. దుర్గను చూసి అక్కడి నుంచి పారిపోయింది. దుర్గ తన వద్దకు రావడంతో మోనిత ఇక్కడికి వచ్చింది. నిన్ను చూసి పారిపోయింది అని దీప అంటే.. మోనిత బతికి ఉంటే నిన్ను ఎందుకు కలువాలని అనుకొంటుంది. మీరు ఇంటికి వెళ్లండి అంటూ దీపను దుర్గ, అంజి అక్కడికి పంపించారు.

  దీప మానసిక పరిస్థితి బాగాలేదని

  దీప మానసిక పరిస్థితి బాగాలేదని

  అయితే దీప మానసిక పరిస్థితే అందుకు కారణం. తుఫాను వరదలో కొట్టుకుపోయే వారికి గడ్డి పొరక కూడా ఆధారంగా నిలస్తుందనే విషయాన్ని సౌందర్య చెప్పింది. మోనిత చనిపోలేదనే విషయానికి ఆధారం దొరికిందనే విషయాన్ని చెప్పింది. మోనిత గురించి దీప గుడిలో జరిగిన విషయాలు అన్నీ చెప్పింది. అయితే సౌందర్య నమ్మకుండా ఎగాదిగా చూసింది. పూజ ముగిసిన తర్వాత పూజారి చెప్పడంతో సోదమ్మను కలిశాను. ఆ తర్వాత జరిగినదంతా చెబితే ఇంటి సభ్యులు దీప మానసిక పరిస్థితి సరిగా లేదనే నిర్ణయానికి వచ్చారు. అయితే మోనిత బతికి ఉందనే విషయాన్ని నమ్మలేదు.అయితే తన మాటలు నమ్మకపోవడంతో దీప తనపైనే అనుమానం పెంచుకొన్నది.

   దేవుడిని నమ్ముకో.. ప్రశాంతంగా ఉంటావు

  దేవుడిని నమ్ముకో.. ప్రశాంతంగా ఉంటావు

  అయితే తాను చెప్పిన విషయాలు నమ్మక పోవడంతో ఇంటి సభ్యులను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే దీప తండ్రి మాట్లాడుతూ.. సోదమ్మతో మేము మాట్లాడాం. మాకు కనిపించని మోనిత నీకు సోదెమ్మలో ఎలా కనిపించింది? అంటే.. నీ తల్లిదండ్రులు గుర్తు పట్టలేదు. నీవు ఎలా గుర్తు పట్టావు అని సౌందర్య అడిగింది. అయితే కార్తీక్‌ను విడిపించడానికి చేసే ప్రయత్నంలో సోదెమ్మలో మోనితను చూశావు. నీ ప్రయత్నాల్లో సాధ్యసాధ్యాలు మరిచిపోతున్నావు అంటూ దీపను తప్పుపట్టారు. సోదెమ్మను కాకుండా దేవుడిని నమ్ము.. మనసు ప్రశాంతంగా ఉంటుందంటూ సౌందర్య సలహా ఇచ్చింది. దాంతో తనలో తాను మాట్లాడుకొంటూ దీప వెళ్లడంతో అందరూ ఆమె మానసిక పరిస్థితి బాగాలేదనే నిర్ణయానికి వచ్చారు.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  మోనితను గుర్తించిన కార్తీక్

  మోనితను గుర్తించిన కార్తీక్

  ఇది ఇలా ఉండగా, లాకప్‌లో ఉన్న కార్తీక్‌ను కలువడానికి దీప వెళ్లింది. కార్తీక్‌తో మోనిత విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో మోనిత ముసుగులో వేసుకొని పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. చాయ్ అమ్మే వేషంలో వచ్చి టీ ఇస్తూ కార్తీక్‌ను టచ్ చేసింది. దాంతో మోనిత స్పర్శ అంటూ కార్తీక్ గుర్తించాడు. ఇలా మోనిత బతికి ఉందనే విషయం కార్తీక్ కూడా తెలిసిపోయింది. తాజా ప్రోమో ప్రస్తుతం సీరియల్‌లోని తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచింది.

  English summary
  Karthika Deepam August 24th August's Episode preview. Latest episode of 1126 goes once again with emotional content. Monita captured red handedly to Karthik and DeepaKarthika Deepam August 24th episode preview: Monita captured red handedly to Karthik and Deepa
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X