For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam Episode 1127: చేతికి మట్టి అంటకుండా కార్తీక్‌ను.. మరో కుట్రకు తెరలేపిన మోనిత

  |

  మోస్ట్ రేటేడ్ కార్తీకదీపం సీరియల్‌ అనేక మలుపులతో సుదీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నది. హత్య కేసు ఆరోపణలతో కార్తీక్ లాకప్‌లో ఉండటం, తన ప్రేమను దక్కించుకోవడానికి మోనిత మరో కుట్రకు తెర లేపడం తాజా ఎపిసోడ్‌లో ఆసక్తిగా మారింది. అలాగే తన తండ్రి నేరస్థుడు కాదు అంటూ తల్లి దీపను పిల్లలు శౌర్య, హిమ నిలదీయడం సెంటిమెంట్‌ను రాజేసింది. తాజా ఎపిసోడ్ 1127లో హైలెట్స్ ఏమిటంటే..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   దీపను దాటుకొని కార్తీక్‌తో..

  దీపను దాటుకొని కార్తీక్‌తో..

  సోదెమ్మ వేషంలో ఉన్న తనను దీప గుర్తు పట్డడంతో మోనిత కంగారు పడిపోయింది. తన గుట్టు బయటపడిందనే విషయంతో వణికిపోయింది. కార్తీక్‌ను తనవాడిలా చేసుకోవడం కష్టమేనా అనే ప్రశ్న మోనితలో తలెత్తింది. దీపకు నేను రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే కార్తీక్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై ఉండేది. దీపను దాటుకొని కార్తీక్‌ను కలుసుకోవడం కష్టంగానే కనిపిస్తున్నది. నా చేతికి మట్టి అంటకుండా కార్తీక్‌ను నావాడిని చేసుకోవాలి అంటూ మోనిత ఆందోళనకు గురైంది.

   ప్లాన్ బీ సిద్ధం చేసిన మోనిత

  ప్లాన్ బీ సిద్ధం చేసిన మోనిత

  దీపను చంపే విషయంలో తాను ఆవేశపడి నిర్ణయం తీసుకొంటే ఆమె చస్తుంది కానీ.. నేను చేసిన పొరపాటు వల్ల ఎక్కడో ఒక చోట నేను ఇరుక్కుపోతాను. నేను చేసే పొరపాటు నన్ను తప్పకుండా పట్టిస్తుంది. దాంతో నేను జైలుకు వెళ్తాను. కార్తీక్ బయటకు వస్తే నేను, ఆయన విడిగానే ఉండాల్సి వస్తుంది. అయితే ప్లాన్ ఏ ఫెయిల్ అయినా ప్లాన్ బీ వర్కవుట్ అయ్యేలా చేస్తాను. నా ప్లాన్‌‌ను రత్నసీతకు చెప్పాలని ఆమెకు ఫోన్ చేసింది. అయితే మోనిత ప్లాన్ విన్న కానిస్టేబుల్ చాలా రిస్క్ అవుతుందేమో మేడమ్ అంటూ రత్నసీత హెచ్చరించింది.

  ఐ లవ్ యూ కార్తీక్ అంటూ..

  ఐ లవ్ యూ కార్తీక్ అంటూ..

  అయితే నా కార్తీక్ కోసం ఎంత రిస్కైనా చేస్తా. నేను చస్తే వంటలక్క కార్తీక్‌తో కలిసి ఉంటుంది. కానీ దీప చస్తే నేను కార్తీక్‌తో కలిసి ఉంటాను. నేను చెప్పిన ప్లాన్‌ను అమలు చేసేందుకు రెడీగా ఉండు అంటూ మోనిత ఫోన్ పెట్టేసింది. తన ప్లాన్ అమలు కాబోతున్నదనే ఆనందంలో ఇంట్లో ఉన్న కార్తీక్ ఫోటోను చేతిలోకి తీసుకొని ముద్దాడింది. నేను ఏం చేసినా మనం కలిసి ఉండటానికే కార్తీక్.. ఐ లవ్ యూ అంటూ ఫోటోను హృదయానికి హత్తుకొంటూ మురిసిపోయింది.

  వజ్రం ఎక్కుడున్నా వజ్రమే అంటూ

  వజ్రం ఎక్కుడున్నా వజ్రమే అంటూ

  లాకప్‌లో విచారంగా ఉన్న కార్తీక్‌ను చూసి కానిస్టేబుల్ రత్నసీత డాక్టర్ ఎలా ఉన్నారు అంటే.. మీ భర్త ఎలా ఉన్నాడు? నేను లాకప్‌లో ఉన్నానని ఆలోచించకు. నేను ఎలాంటి సహాయమైన చేస్తాను అంటే.. వజ్రం ఎక్కడున్నా వజ్రమే. ఇంత మంచి మనిషిని మోనిత ఏదో చేయడానికి ప్లాన్ చేస్తున్నది అంటూ రత్నసీత ఆందోళన పడింది. అయితే ఏం ఆలోచిస్తున్నావు అంటూ కార్తీక్ అడిగితే.. మేడమ్ మిమల్ని పిలుస్తుంది. ఇసారి ఇంటరాగేషన్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. థర్డ్ డిగ్రీ లాంటిది ఉండకపోవచ్చు. కానీ కానిస్టేబుల్ లాఠీలతో ఏదైనా చేస్తారు. కాబట్టి నిజం చెప్పండి అంటే.. నేను మోనితను చంపలేదు అంటూ కార్తీక్ అన్నాడు. మీకు టీ కొట్టు వద్ద ఛాయ్ చెప్పి వెళ్తాను. టీ కొట్టు కూతురు మూగమ్మాయి. టీ తెచ్చి ఇస్తుంది అంటూ కానిస్టేబుల్ చెప్పి వెళ్లింది.

  నా పాపాన్ని కడిగేసుకొంటా అంటూ

  నా పాపాన్ని కడిగేసుకొంటా అంటూ

  ఇదిలా ఉండగా, ఏసీపీ రోషిణి వద్దకు వచ్చి భాగ్యం ఆమె కాళ్లపై పడింది. కార్తీక్ హత్య చేయలేదు. నేను చూడలేదమ్మా.. దీప కాపురం బాగపడుతుందనుకొనే సమయంలోనే ఇలాంటి ఉపద్రవం వచ్చిపడింది. దానికి ఇద్దరు ఆడపిల్లలు. నాన్న అని రోజు కలవరిస్తున్నారు. ఇదంతా నా వల్లే జరిగింది. నా పాపానికి కడిగేసుకొనేందుకు వచ్చానమ్మా.. నా అల్లుడిని విడిపించండమ్మా.. అంటూ భాగ్యం ప్రాధేయపడితే. కానిస్టేబుల్ రత్నసీతను పిలిచి బయటకు పంపించండి అంటూ వార్నింగ్ ఇచ్చింది.

   పోలీసులు లాఠీలతో కొట్టరంటూ...

  పోలీసులు లాఠీలతో కొట్టరంటూ...

  కార్తీక్‌ లాకప్‌లోనే ఉండటంతో దీప తీవ్ర విచారంలో మునిగిపోయింది. అంతలోనే కార్తీక్ తండ్రి ఆనందరావు వచ్చి.. పిలిస్తే.. వినిపించుకొనే పరిస్థితి లేకపోవడంతో డాక్టర్ బాబు గురించి ఆలోచిస్తున్నావా అంటూ అవును అంటూ దీప చెప్పింది. అబద్ధాన్ని ఒప్పుకోమంటూ లాఠీలతో పోలీసులు కొడుతారేమో అంటే.. అలాంటి ఏమీ జరగదు. నీవు అనుకొన్నట్టు పోలీసులు అంతా కఠినంగా ఉండరు. నువ్వు అనుకొన్నట్టు కార్తీక్ హత్య చేసి ఉండడు. నీవు ఎలాగైతే మోనిత అబద్దాలు చెబుతున్నాయని నమ్మావో.. అవన్నీ నిజమయ్యాయి. ఇప్పుడు కార్తీక్ విషయంలో కూడా అదే జరుగుతుంది అంటూ దీపకు ధైర్యాన్ని ఇచ్చారు.

  English summary
  Karthika Deepam August 25th August's Episode preview. Latest episode of 1127 goes once again with emotional content. Monita started another cospiracy against Deepa.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X