For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam.. కార్తీక్‌ను అలా టచ్ చేసి.. అడ్డంగా బుక్కైన మోనిత!

  |

  కార్తీకదీపం సీరియల్‌లో కార్తీక్ లాకప్ ప్రస్థానం సుదీర్ఘంగా సాగుతున్నది. దీపను చంపేందుకు ప్రయత్నిస్తున్న మోనిత తనకు తెలియకుండానే తప్పుల మీద తప్పులు చేస్తూ అడ్డంగా బుక్కవుతున్నది. ఇప్పటికే తాను బతికే ఉన్నాననే విషయం దీపకు తెలియగా.. తాజాగా కార్తీక్‌కు తెలిసిపోయింది. తాజా ఎపిసోడ్‌ 1128‌లో కార్తీక్, మోనిత, దీప మధ్య జరిగిన విషయాలు ఏమిటంటే..

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  పోలీస్ స్టేషన్‌లో మోనిత

  పోలీస్ స్టేషన్‌లో మోనిత

  కానిస్టేబుల్‌ రత్నసీతతో చేసిన ప్లాన్ ప్రకారం మోనిత పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న కార్తీక్‌ను కలిసేందుకు మోనిత మారువేషంలో వచ్చింది. లాకప్‌లో ఉన్న కార్తీక్‌ను చూసి మోనిత ఎమోషనల్ అయింది. తమ మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని చూసి భావోద్వేగానికి లోనైంది. గతంలో తనతో కార్తీక్ ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకొని ఇప్పుడున్న పరిస్థితిని చూసి కంగారు పడింది. కార్తీక్‌ గురించి ఆలోచిస్తున్న సమయంలోనే మోనితను తోసుకొంటూ దీప పోలీస్ స్టేషన్‌లోకి అడుగుపెట్టింది. దాంతో మోనిత కంగుతిని... నీ పతి భక్తి తగలేయ్య.. నీవు ఇప్పుడే రావాలా? అంటూ విసుక్కున్నది.

  మోనిత బతికే ఉందంటూ..

  మోనిత బతికే ఉందంటూ..

  టిఫిన్ బ్యాగ్‌తో లాకప్‌లో ఉన్న కార్తీక్ వద్దకు వెళ్లిన దీప.. నీవు హత్య చేయలేదనే చెప్పడానికి ఆధారం లభించింది. సోదెమ్మ వేషంలో మోనిత తనను చంపేందుకు ప్రయత్నించిన విషయాన్ని చెప్పింది. అయితే కార్తీక్ కాస్త షాకితిన్నా.. ఆ తర్వాత దీప మాటలను కొట్టిపడేశాడు. నన్ను విడిపించాలన్న ధ్యాసతోనే మోనితను అలా ఊహించుకొని ఉంటావు అని కార్తీక్ చెప్పారు. అయ్యో! అందరూ అదే అంటున్నారు అని దీప అంటే.. నీ మానసిక పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకో దీప.. అని కార్తీక్ అన్నాడు. దాంతో లేదు.. మోనిత రివాల్వర్‌తో వచ్చింది. అంటే నన్ను చంపాలని వచ్చింది. నేను దానిని వదలను. ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా.. వేటాడి.. వెంటాడి నిన్ను బయటకు తీసుకొస్తాను. ఇప్పుడు నీవు ఉన్న స్థానంలో దానిని నిలబెడుతా అంటూ దీప చెప్పింది.

  కార్తీక్ నిన్ను నిర్దోషిగా రుజువు చేస్తా

  కార్తీక్ నిన్ను నిర్దోషిగా రుజువు చేస్తా

  దీపను సముదాయిస్తూ.. నా కోసం ఇప్పటికే చాలా సాహసాలు చేశావు. నా కోసం సూర్యాపేట వరకు వెళ్లి వచ్చావు. మోనిత అంజికే తుపాకి గురిపెట్టిందంటే.. నిన్ను ఏమైనా చేయడానికి వెనుకాడదు. నీవు ఇలా అయితే పిల్లలు ఏమైపోతారు.. కొన్నాళ్లు నాన్న లేకుండా.. కొన్ని రోజులు తల్లి లేకుండా బతికారు. ఇప్పుడు ఇద్దరం లేకపోతే వాళ్ల పరిస్థితి ఏమిటో ఆలోచించుకో అని కార్తీక్ అంటే.. ఏది ఏమైనా మిమ్నల్ని నిర్ధోషిగా బయటకు తీసుకువస్తాను అంటూ దీప శపథం చేసింది. అయితే దీప, కార్తీక్ మాటలు చాటుగా విన్న మోనిత.. జైలులో కార్తీక్‌కు నా గురించి అసలు విషయం బోధపడింది. సమాజం దృష్టిలో మోనిత చచ్చిపోయింది. ఇక నీవేమి వెంటాడతావు.. పదేళ్ల క్రితం పెళ్లి చేసుకొన్న నీకే అంత ఉంటే.. 16 ఏళ్లుగా ప్రేమిస్తున్న నాకు ఎంత ఉండాలి అంటూ మోనిత కామెంట్ చేసింది.

  అబ్బా అంటూ అరిచిన మోనిత

  అబ్బా అంటూ అరిచిన మోనిత

  కార్తీక్, దీప ఇద్దరు ఇలా ఎమోషనల్‌గా మాట్లాడుతుండగా వారి మధ్యకు మోనిత ఛాయ్ అమ్మే బసవయ్య కూతురిగా వచ్చింది. ఛాయ్ ఇస్తుండగా హెడ్ కానిస్టేబుల్ వచ్చి ఎవరు నీవు.. అంటూ ప్రశ్నిస్తే... బసవయ్య కూతురు.. మూగ అమ్మాయి అంటూ కార్తీక్ చెబితే.. నీకెలా తెలుసు అని హెడ్ కానిస్టేబుల్ ప్రశ్నించాడు. దాంతో రత్నసీత చెప్పిందంటే.. ఆమెకు ఏమీ పనిలేదు. లాకప్‌లో ఉండే వాళ్లకు సేవ చేయడం తప్పా అని కానిస్టేబుల్ విసుగుకొన్నాడు. ఆ తర్వాత ఛాయ్ ఇస్తూ కార్తీక్‌ చేతిని సుతారంగా తాకింది. ఆ తర్వాత వెళ్లిపోతూ ఉంటే పగిలిన గ్లాస్‌ను ఎవరు తీస్తారని కానిస్టేబుల్ గట్టిగా మందలించాడు. దాంతో డస్ట్ బీన్‌లో గాజు పెంకులు వేసి వెళ్తుంటే.. మోనిత కాలికి గాజు పెంక గుచ్చుకోవడంతో అబ్బా అంటూ మోనిత అరిచింది. దాంతో అయ్యో పాపం అంటూ కార్తీక్ అనడం. ఆ తర్వాత మోనిత అక్కడి నుంచి గబగబా వెళ్లిపోయింది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  మోనిత బతికే ఉందంటూ గుర్తించిన కార్తీక్

  మోనిత బతికే ఉందంటూ గుర్తించిన కార్తీక్

  అయితే పోలీస్ స్టేషన్ నుంచి మోనిత వెళ్లిన తర్వాత కార్తీక్‌కు అనుమానం వచ్చింది. బసవయ్య కూతురు మూగ పిల్ల అని రత్నసీత చెప్పింది. అయితే గాజు పెంక గుచ్చుకోవడంతో అబ్బా అని అరిచింది. మూగ పిల్ల నోటి నుంచి అబ్బా అని రావడం విన్నావా అని అడిగితే.. దీప లేదు అంటూ సమాధానం చెప్పింది. అయితే వెంటనే తన చేతి వేళ్లను తాకిన స్పర్శ, వెళ్లుండగా వెనుక నుంచి శరీరాన్ని చూసిన తీరును బట్టి వచ్చింది మోనితే అని కార్తీక్ కన్ఫార్మ్ చేసుకొన్నాడు. ఇలా ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు అంటూ అడిగితే ఏమీ లేదని సమాధానం చెప్పాడు. ఇప్పుడు మోనిత విషయం గురించి చెబితే.. దీప ఇప్పుడే వెంటాడుతుంది. ఆమె ప్రాణాలకే ముప్పు రావొచ్చు. ఈ విషయం ఏసీపీ రోషిణికి చెబుతాను అంటూ కార్తీక్ మనసులో అనుకొన్నాడు.

  English summary
  Karthika Deepam August 26th August's Episode preview. Latest episode of 1128 goes once again with emotional content. Karthik Identifies Monita is alive
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X