twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నోర్మూసుకో.. కార్తీక్‌కు ఏసీపీ సీరియస్ వార్నింగ్, డాక్టర్ బాబు ఇంట్లో అలా ఊహించని పరిస్థితి!

    |

    కార్తీకదీపం సీరియల్‌లో మోనిత హత్య కేసు వ్యవహారం ఎడతెగని సాగదీత కనిపిస్తున్నది. కానీ ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు సాగుతున్నది. కార్తీక్‌ను విడిపించేందుకు దీప ప్రయత్నాలు.. కార్తీక్‌తో నేరాన్ని ఒప్పించేలా ఏసీపీ ప్లాన్స్, అలాగే కార్తీక్ కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు, అలాగే తండ్రి లేడనే బాధతో శౌర్య ఆవేదన లాంటి విషయాలు సీరియల్‌లో హైలెట్‌గా మారాయి. ఇంకా తాజా ఎపిసోడ్ 1130లో ఇంకా ఏం జరిగాయంటే..

    Photo Courtesy: Star మా and Disney+Hotstar

    నాటకాలు మొదలుపెట్టావా?

    నాటకాలు మొదలుపెట్టావా?

    మోనిత హత్య కేసులో లాకప్‌లో ఉన్న కార్తీక్‌‌ను ఏసీపీ రోషిణి ఇంటరాగేషన్ మొదలుపెట్టింది. నేను ఇలా విచారిస్తానని తెలిసి ఇలా నాటకాలు మొదలుపెట్టారా? మీరంటే నాకు గౌరవం ఉంది. దీప అంటే సానుభూతి ఉంది. అందంతా పోయింది. మీరు డాక్టర్. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు. ఇలా అబద్దాలు చెప్పొద్దు డాక్టర్. మీరు జెంటిల్మన్ అయితే పదేళ్లు మీ భార్యను ఎందుకు అవమానించి దూరం పెడుతారు అని ఏసీపీ నిలదీస్తే.. ఆ మోనిత వల్లే.. ఆ మోనిత కారణంగానే అంటూ కార్తీక్ కుర్చీలోంచి కోపంగా లేచారు. మోనిత ఎలాంటిందో తెలియాలంటే.. మీరు స్వాధీనం చేసుకొన్న మొబైల్‌ను తీసుకురండి.. ఆ మోనిత నిజస్వరూపం కళ్లార చూపిస్తాను అంటూ కార్తీక్ ఆవేశంగా ఏదో చెప్పబోయాడు.

    శవం ఎక్కడ దాచిపెట్టావో చెప్పు

    శవం ఎక్కడ దాచిపెట్టావో చెప్పు

    అయితే కార్తీక్ మాటలకు అడ్డుపడుతూ.. ఆ వీడియో చూపిస్తారా? అంజికి గురిపెట్టి.. మోనిత తన స్వీయ చరిత్ర చెప్పిన విషయాన్ని చూపిస్తారా? అందంతా నాకు తెలియనిది కాదు. ఇప్పుడు మోనిత క్యారెక్టర్ గురించి కాదు.. కనపడకుండా పోయిన ఆమె శవం కావాలి. మోనిత క్రిమినలే కావొచ్చు. కానీ ఆమెను చంపే అధికారం నీకెవ్వరు ఇచ్చారు. మోనిత వీడియో చూసిన తర్వాతే ఆవేశంగా వెళ్లి చంపావు. అందుకు సాక్ష్యం భాగ్యం. మోనిత చేసిన కుట్రను భరించలేక ఆమెను కాల్చారు. బుల్లెట్స్ కూడా లభించాయి. మీ కారులో ఉన్న రక్త మరకలే సాక్షం అంటూ ఏసీపీ తనకు తెలిసిన విషయాలు వెల్లడించింది.

    ఏసీపీని నిలదీసిన కార్తీక్

    ఏసీపీని నిలదీసిన కార్తీక్

    కార్తీక్‌ను మరింతగా నిలదీస్తూ.. మీరు మోనిత శవాన్ని ఏ కాలువలో పడేశారో.. ఏ అడవిలో కాల్చేశారో.. ఏ ఫామ్‌హౌస్‌లో పూడ్చిపెట్టారో.. నాకు ఆ విషయం తెలియాలి. చంపిన దానికి కారణం కాదు. మోనిత శవం కావాలి ఇప్పుడ అని ఏసీపీ అంటే.. మోనిత చనిపోయిందనడానికి కారణం కావాలి కద.. నేను హత్య చేయడం చూడలేదు. భాగ్యం విన్నదే చెప్పింది. అదే మీరు విన్నారు. మీకు బుల్లెట్ దొరికింది. అది మోనిత బాడీలో కాదు. ఇంట్లో దొరికింది. ఇన్ని సాక్ష్యాలు క్రియేట్ చేసిన మోనిత నా కారులో రక్త మరకలను క్రియేటర్ చేయడం ఆమెకు కష్టమా? అంటూ ఏసీపీ రోషిణిపై కార్తీక్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి బలహీనమైన సాక్ష్యాలను పట్టుకొని బలంగా ఎందుకు వాదిస్తున్నారు అంటూ కార్తీక్ గట్టిగా నిలదీశాడు.

    నువ్వే చంపావని అందరూ అంటున్నారు..

    నువ్వే చంపావని అందరూ అంటున్నారు..

    దాంతో నోర్మూసుకో అంటూ కార్తీక్‌కు ఏసీపీ వార్నింగ్ ఇచ్చింది. మోనిత హాస్పిటల్‌కు వెళితే అందరూ నువ్వే చంపావని అంటున్నారు. నీ భార్య తిట్టిందంట. మీ అమ్మ కొట్టిందంట, నువ్వు చంపేశావని అందరూ అనుకొంటున్నారు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నిజాన్ని ఒప్పుకో కార్తీక్ అంటే కార్తీక్ తనలో తాను నవ్వుకొన్నాడు. ఇది మీకు పరిహసంగా కాదు నవ్వంది. నేను ఎక్కడ ఉండే వాడిని. ఎక్కడికి వచ్చాను. తల్లి, తండ్రి, భార్యను వదులుకొని మోనిత మంచి స్నేహితురాలిని అనుకొన్నాను. కానీ ఆమె తన్నితే ఇక్కడికి వచ్చి పడ్డాను. అందుకే నా పరిస్థితిని చూసి నాకు నేను నవ్వుకొన్నాను అని ఏసీపీ ముందు నుంచి కార్తీక్ వెళ్లిపోయాడు.

    కార్తీక్ ఇంటిలో వాగ్వాదం

    కార్తీక్ ఇంటిలో వాగ్వాదం

    ఇక కార్తీక్‌ ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆదిత్యతో శ్రావ్య మాట్లాడుతూ.. మీ అన్నయ్యను ఒక్కసారి కూడా చూడటానికి వెళ్లలేదు. ఆయన నేరం చేశావని నమ్ముతున్నావా? కనీసం పరామర్శించకుండా నీ ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో మాట్లాడుకొంటున్నావు అని అంటే.. అన్నయ్యను ఏనాడైనా పట్టించుకొన్నామా? మోనితను తిట్టడమే పెట్టుకొన్నాం. మనమంత ఆయనను అదోలా చూశాం అని ఆదిత్య తనకు నచ్చినట్టు మాట్లాడాడు. అయితే ఆదిత్య మాటలపై తల్లిదండ్రులు సౌందర్య, ఆనందరావు కోపగించుకొన్నారు. అయితే తనను అనుమానించిన శ్రావ్యకు గట్టిగా సమాధానం చెబుతూ.. నా స్నేహితుడు సెంట్రల్ మినిస్టర్ కొడుకు. అన్నయ్యను విడిపించడానికే ఫోన్‌లో మాట్లాడుతున్నాను అంటూ అన్నారు.

    Recommended Video

    Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
    తీవ్ర జ్వరంతో శౌర్య అలా..

    తీవ్ర జ్వరంతో శౌర్య అలా..

    ఇదిలా ఉండగా, తండ్రి పోలీస్ స్టేషన్‌లో దారుణమైన పరిస్థితుల్లో ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన శౌర్య అనారోగ్యానికి గురైంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటే సౌందర్య హాస్పిటల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే తాను నాన్న వచ్చేంత వరకు ఎక్కడికి రాను అంటూ మొండికేసింది. అమ్మ కంటే నాన్నే ఇష్టం. అమ్మ వల్లే ఇలాంటి పరిస్థితి అనే విధంగా మాట్లాడింది. నేను ఇలా ఉంటేనే నాన్నను రిలీజ్ చేస్తారని చెప్పడం కనిపించింది. ఇలా భావోద్వేగాలతో తాజా ఎపిసోడ్ ముగిసింది.

    English summary
    Karthika Deepam August 28th August's Episode preview. Latest episode of 1130 goes once again with emotional content. Monita started another cospiracy against Deepa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X