For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam.. కార్తీక్‌ను తాళ్లతో బంధించి.. బలవంతంగా ఇంజెక్షన్ వేసి.. మోనిత మరో కుట్ర

  |

  ప్రపంచంలో కార్తీక్‌పై నాకు ఉన్న ప్రేమను నువ్వు తప్ప మరొకరు అర్ధం చేసుకోలేరు. అందుకే ఎన్ని ఘోరాలు, నేరాలు చేసినా శిక్షించకుండా క్షమిస్తూనే నా కార్తీక్‌ను కలిపేందుకు ప్రయత్నిస్తున్నావనే కారణంతోనే నేను నీకు చేతులు జోడించి వేడుకొంటున్నాను. నా కార్తీక్‌ను నాకే దక్కేలా చేయ్. డాక్టర్‌గా నేను చేస్తున్నది తప్పే. కానీ ఓ ప్రేమికురాలిగా నేను చేయాల్సిందే చేస్తున్నాను. ఒకవేళ తప్పైతే నన్ను క్షమించు. కానీ కార్తీక్‌ను నా నుంచి దూరం చేయకు. తను లేకుండా నేను బతకలేను. నా బాధను అర్దం చేసుకో భగవంతుడా అంటూ సాయిబాబా ఫోటోకు మొక్కుతూ మోనిత చేతులు జోడించింది.

  హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...

  సాయిబాబా ముందు క్షమించమని మోనిత

  సాయిబాబా ముందు క్షమించమని మోనిత

  అలాగే తన గదిలో ఉన్న కార్తీక్‌ను చూస్తూ క్షమించి కార్తీక్. నిన్ను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నీ మీద ప్రేమతోనే నేను నిన్ను హింసించక తప్పడం లేదు. ఐయామ్ వెరీ వెరీ సారీ కార్తీక్ అంటూ మోనిత కంటతడి పెట్టుకొన్నది. ఆ తర్వాత మరో మారు వేషంలో వేటకు బయలుదేరింది. కార్తీక్‌ కోసం బయలు దేరిన మోనిత కారులో ఆలోచనల్లో పడింది. కార్తీక్ జీవితంలోకి దీప రాకపోయి ఉంటే నా జీవితం సాఫీగా సాగిపోయేది. ఇదంతా దీప వల్లనే. ఈ రాత్రికి కార్తీక్‌ను ఆమెకు దూరం చేస్తా. దాంతో దాని పీడ విరగడై పోతుంది. ఇక నిన్ను నన్ను ఎవరూ విడదీయలేరు. వస్తున్నా కార్తీక్ అంటూ మనసులో మోనిత అనుకొన్నది.

  Mega Star with Sport Stars.. చిరంజీవితో మీరెప్పుడూ చూడని లెజెండ్స్ ఫోటోలు!

  కడుపు నొప్పితో కార్తీక్ బాధపడుతుంటే

  కడుపు నొప్పితో కార్తీక్ బాధపడుతుంటే

  గతంలో ఛాయ్ అమ్మే వ్యక్తిగా లాకప్‌లో ఉన్న కార్తీక్‌కు ఛాయ్‌లో మందు కలిపి కుట్రకు పాల్పడింది. దాంతో లాకప్‌లో ఉన్న కార్తీక్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మోనిత చేసిన కుట్రలో భాగంగా సెల్‌లో కడుపు నొప్పితో బాధపడుతుంటే కానిస్టేబుల్ రత్నసీత ఆయనను హస్పిటల్‌కు తరలించేందుకు ప్రయత్నించింది. ఛాయ్‌లో మందు పెట్టవద్దని చెప్పినా మోనిత వినిపించుకోలేదు. ఈ విషయం ఏసీపీకి తెలిస్తే నా ఉద్యోగం పోవడం ఖాయమని అనుకొంటూనే మోనిత ప్లాన్‌లో భాగంగా ఎస్ఐ, మరో కానిస్టేబుల్‌తో కలిసి కార్తీక్‌ను హాస్పిటల్‌కు తరలించింది. అయితే కానిస్టేబుల్ ఒప్పుకోకపోవడంతో ఏసీపీ రోషిణి పర్మిషన్ తీసుకొని హాస్పిటల్‌కు తరలించింది.

  సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఆ స్మైల్ కు ఫిదా అవ్వాల్సిందే!

  నేను ఏమైనా రాక్షసినా?.. అంటూ మోనిత

  నేను ఏమైనా రాక్షసినా?.. అంటూ మోనిత

  కార్తీక్‌ను హాస్పిటల్ చేర్చిన తర్వాత కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతుంటే డాక్టర్‌ను తీసుకొస్తానని రత్న సీత డాక్టర్ వద్దకు వెళ్లింది. అక్కడ మోనితను చూసి రత్న సీత షాక్ తిన్నది. మీరు ఇక్కడ ఉంటే రిస్క్ కద.. అంటే నన్ను గుర్తుపడితే కదా అంటూ మోనిత చెప్పింది. మోనిత ఇంజెక్షన్ చేతిలో చూసిన రత్న సీత.. డాక్టర్ బాబును చంపేస్తావా అంటూ ప్రశ్నిస్తే.. నేను ఏమైనా రాక్షసినా? నా కార్తీక్‌ను, నా ప్రాణాన్ని నేనే చంపేసుకొంటానా అంటూ మోనిత అంది. అయితే వేరే డాక్టర్‌ను పిలిపిస్తే మంచిది మేడమ్ అంటే.. కార్తీక్‌ను నేను చూడకుండా ఆగిపోవాలా? ఎలా ఉంటాను అంటూ సిరంజితో కార్తీక్ వద్దకు వెళ్లింది.

  Shruti Hassan : పదిహేడేళ్ళప్పుడు ఎలా ఉందో చూశారా?

  బెడ్‌కు కట్టేసి.. మోనిత ఇంజెక్షన్..

  బెడ్‌కు కట్టేసి.. మోనిత ఇంజెక్షన్..

  బెడ్‌పై కార్తీక్ కడుపు నొప్పితో మెలికలు తిరుగుతూ.. ఇదేదో ఫుడ్ పాయిజన్‌లా ఉంది అంటే.. నాకు తెలుసు.. పోలీసులు చెప్పారు అని.. కార్తీక్ ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టింది. రెండు చేతులుపైకి పెట్టు.. ఆక్సిజన్ చక్కగా అందుతుంది. అని మోనిత చెప్పింది. ఈ సమయంలో కార్తీక్‌ విషయం తెలుసుకొని.. దీప హస్పిటల్‌కు వచ్చింది. దీపను చూసిన రత్నసీత కంగారు పడిపోయింది. తాను కార్తీక్ చేయాలని దీప మొండిగా వ్యవహరించింది. దాంతో దీప గారు.. నేను బాగా కోఆపరేట్ చేస్తున్నాను. మీరు హద్దు మీరకండి అంటూ కానిస్టేబుల్ రత్నసీత హెచ్చరించింది.

  నిన్ను కదలకుండా కట్టివేసింది నేనే అంటూ

  నిన్ను కదలకుండా కట్టివేసింది నేనే అంటూ

  ఇక బెడ్‌పై ఉన్న కార్తీక్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. తాళ్లతో కట్టివేసింది. తనను ఎవరు కట్టి పడేశారు అంటూ కార్తీక్ మత్తు నుంచి కోలుకొని అడగడంతో.. నిన్ను కదలకుండా కట్టి వేసింది నేనే.. అంటూ మోనిత డైరెక్ట్‌గా తన ముఖాన్ని చూపించింది. నేనే మోనిత కార్తీక్ అంటూ తన విశ్వరూపం చూపించింది. అయితే కట్టివేసి ఉన్న తన చేతులను కార్తీక్ విదిలించుకోవాలని ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. నన్ను చంపేయాలని అనిపిస్తుందా? చేతులు కట్టేశాను. అరిచి అందర్ని పిలువాలని ఉందా? మాట్లాడకుండా చేశాను అని మోనిత తనదైన శైలిలో డైలాగ్స్ కొట్టింది.

  English summary
  Karthika Deepam August 30th August's Episode preview. Latest episode of 1131 goes once again with emotional content. Monita started another cospiracy against Deepa.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X